Monday, December 10, 2012

Where from those worms?-ఆ పురుగులు ఎక్కడివి?


ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...


ప్రశ్న: చిక్కుడు లాంటి కొన్ని కూరగాయలను వలిచినప్పుడు లోపల పొడవైన ఆకుపచ్చ పురుగులు కనిపిస్తాయి. అవి అక్కడకి ఎలా వెళ్లాయి?

జవాబు: పురుగులు కనిపించిన కాయగూరల పైభాగాన్ని నిశితంగా పరిశీలిస్తే కనీసం ఆవగింజంత రంధ్రాలైనా కనిపిస్తాయి.అలా ఏమాత్రం రంధ్రాల్లేని కాయలు, పండ్లలో పురుగులు ఉండవనే చెప్పవచ్చు. ఈ పురుగులు బయటి నుంచి లోపలికి ఈమధ్య వెళ్లినవి కావు. తల్లి పురుగు తన గుడ్లను ఆ కాయ మెత్తని ప్రదేశాల్లో, దాగుడు (hidden) ప్రాంతాల్లో పెడుతుంది. ఆ గుడ్లలోంచి వచ్చే పిల్లడింభకం(larva) మొదట్లో కొన్ని మిల్లీమీటర్ల పరిమాణంలోనే ఉంటుంది. అది తన వాడి పెదవులు(madibles)తో ఆ కాయకు రంధ్రం చేసి లోపలికి వెళ్లి అక్కడ సుష్టుగా భోంచేస్తూ శరీరాన్ని పెంచుకుంటుంది. ఆ చిన్న దారిలోంచి తన శ్వాసకు కావలసిన గాలి అందుతుంది. అక్కడే ప్యూపా దశ దాటుకుని కీటకంగా మారి బయటకి పోతుంది.

  • - ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక

  • ======================
 visit My website > Dr.Seshagirirao - MBBS.-

No comments:

Post a Comment

your comment is important to improve this blog...