- ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...ర్
జ : ఆయుర్వే ఔషదులలో పంచగవ్యలను విరివిగా ఉపయోగిస్తారు . పంచ అనగా ఐదు (5)
1.పాలు ,
2.పెరుగు,
3.నెయ్యి ,
4.గోవు మూత్రము ,
5.గోవు పేడ ,
భారతీయులు గోవును మాతృభావము తో " గోమాత" గా ఆరాధిస్తారు. గోవు నుండి వచ్చే ఈ 5 ను ఆయుర్వేద గ్రంధాలు .. " చరక సంహిత " , " సుశ్రుత సంహిత " , "వాగ్బట సంహిత " లలో కొన్ని చర్మ వ్యాధులు , బొల్లి , మూత్రవ్యాధులు , కీళ్ళవ్యాధులు , కడుపు మంట వంటి పలురకాల వ్యాధుల నివారణకు పంచగవ్య చికిత్స గా చెప్పబడి ఉంది. నవీన వైద్యులు , శాస్త్రజ్ఞులు దీనిని అంతగా నమ్మరు.
- ==================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...