- ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
ప్రశ్న: ఒక వస్తువు కింద పడినప్పుడు మామూలు గదిలో కన్నా, ఖాళీ గదిలో ఎక్కువ శబ్దం వస్తుంది. ఎందుకని?
జవాబు: శబ్దం గాలిలో తరంగాల రూపంలో వ్యాపిస్తుంది. గాలిలో పీడనం, ఉష్ణోగ్రత లాంటి ఎన్నో అంశాలపై శబ్దాల తీవ్రత, వేగం ఆధారపడి ఉంటాయి. గాలిలో అణువులు కదలడం వల్ల ఏర్పడే పీడన సాంద్రతలు (dense zones), విరళీకరణలు (rarifications) క్రమపద్ధతిలో తరంగ రూపాల్లో శబ్దం ప్రయాణిస్తుంది. ఖాళీ గదిలో ఏర్పడే శబ్ద తరంగాలు అన్ని వైపులకు విస్తరించి గోడలు, పైకప్పు లాంటి అవరోధాలను తాకి తిరిగి పరావర్తనం చెంది ప్రతిధ్వనిగా గదిలో పదే పదే తరంగాలను ఏర్పరుస్తాయి. అందువల్ల శబ్దం స్పష్టంగా, తీవ్రంగా వినిపిస్తుంది. అదే మంచాలు, కుర్చీలు లాంటి సామగ్రితో నిండి ఉంటే అవి గదిలో ఏర్పడిన శబ్ద తరంగాలను శోషించుకుంటాయి. కాబట్టి ప్రతిధ్వని రాదు. పైగా సామగ్రి ఉపరితలాలు వంకరటింకరగా ఉండడం వల్ల వాటిని తాకి పరావర్తనం చెందే శబ్ద తరంగాలు చెల్లాచెదరైపోతాయి. అందువల్ల శబ్దం అస్పస్టంగా ఉంటుంది.
-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్,-వరంగల్; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
- =======================
visit My website > Dr.Seshagirirao - MBBS.-
No comments:
Post a Comment
your comment is important to improve this blog...