ప్రశ్న: అల్యూమినియం గిన్నెలో వేడి నీళ్లు కాస్తుంటే కొన్నాళ్లకు గిన్నె అడుగు భాగంలో తెల్లగా గారలాగే ఏర్పడేది ఏమిటి? అది పోవాలంటే ఏం చేయాలి?
జవాబు: అల్యూమినియం గిన్నెల్లోనే కాకుండా స్టీలు గిన్నెల్లో నీళ్లను కాచినా ఇలాగే జరుగుతుంది. నీళ్లలో కాల్షియం, లవణాలు అధికంగా ఉన్నప్పుడు ఇలాంటి గార ఏర్పడుతుంది. సాధారణంగా చల్లని నీళ్లలో కన్నా వేడి నీళ్లలోనే లవణాల ద్రావణీయత (solubility) ఎక్కువ. కానీ చల్లని నీటిలో కూడా కాల్షియం సల్ఫేటు, కాల్షియం కార్బొనేటులాంటి లవణాలు ఉంటాయి. అయితే తక్కువ ద్రావణీయత వల్ల అరకొరగా కరిగి ఉండే ఇవి నీళ్లను వేడి చేసినప్పుడు బయటపడి పాత్రల అడుగున పేరుకుపోతాయి. వీటినే స్కేళ్లు (scales)అంటారు. కఠినత్వం (hardness)లేని మంచి నీటినే పాత్రలలో వాడడం వల్ల గార ఏర్పడడాన్ని నివారించవచ్చు. గార కట్టిన పాత్రల్లో నిమ్మరసం పిండినా, Hclఆమ్లాన్ని పోసినా అది తొలగిపోతుంది.
-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్, వరంగల్; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞాన వేదిక@Eenadu hai bujji.
- =========================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...