Friday, June 22, 2012

ఇంద్రధనుస్సు ఎలా ఏర్పడుతుంది?,How do rainbow form?



ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...


ప్రశ్న: ఇంద్రధనుస్సు ఎలా ఏర్పడుతుంది? దాని వల్ల లాభాలు, నష్టాలు ఏమైనా ఉన్నాయా?

జవాబు: వాతావరణంలో మిగిలిన కాలాల కన్నా వర్షాకాలంలో నీటి ఆవిరి పెద్ద పెద్ద బిందువుల రూపంలో ఉంటుంది. సూర్యుని నుంచి వెలువడే ధవళకాంతి ఆ నీటి బిందువుల గుండా వెళ్లేప్పుడు గాలిని, నీటిపొరను వేరుచేసే అంతరోపరితలం(interface) వద్ద వక్రీభవనం (refraction)చెందుతుంది. ఇలా వక్రీభవనం చెందే కోణాలు వివిధ తరంగదైర్ఘ్యాల (wavelengths)కు వేర్వేరుగా ఉండడం వల్ల ధవళకాంతిలోని వివిధ కాంతి తరంగాలు ఏడు రంగులుగా విడిపోతాయి. ఇలా విసిన కర్రలాగా విస్తరించుకున్న సప్తవర్ణాలు, ఆ బిందువు అవతలివైపున ఉండే అంతరోపరితలం వద్ద అంతర్గత సంపూర్ణ పరావర్తనం (Total Internal Reflection) చెంది మన కంటిని చేరుతాయి. కాబట్టి ఇంద్రధనుస్సు మన కంటిలోనే ఏర్పడుతుంది కానీ, ఆకాశంలో కాదు. అందుకే హరివిల్లనేది మిధ్యాబింబం(virtual image). దాని వల్ల లాభనష్టాల సమస్య లేదు. కాబట్టి ప్రకృతి కల్పించే ఆ అందమైన దృశ్యాన్ని ఆనందంగా చూడ్డమే.


-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
  • ===========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

No comments:

Post a Comment

your comment is important to improve this blog...