పశ్న: అమావాస్య, పున్నమి రోజులకి, సముద్రంలో ఆటుపోటులకు సంబంధం ఏమిటి?
జవాబు: సముద్రంలోని ఆటుపోటులకు కారణం చంద్రుడే. సృష్టిలోని వస్తువులన్నీ ఒకదాని కొకటి ఆకర్షించుకుంటూనే ఉంటాయి. సూర్యుడి ఆకర్షణ శక్తి వల్ల భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటే, భూమి ఆకర్షణ శక్తి వల్ల చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడు. భూమితో పోల్చుకుంటే చంద్రుని పరిమాణం చిన్నదైనా దాని ఆకర్షణ శక్తి భూమి మీద ప్రభావం చూపుతుంది. అలా చంద్రుడు కలిగించే గురుత్వాకర్షణ శక్తికి ఉదాహరణే సముద్రంలో ఏర్పడే ఆటుపోటులు.
సముద్రతీరంలో ఉన్న వాళ్లకు ఒక రోజులో రెండు సార్లు ఆటు (Low Tide), రెండు సార్లు పోటు (High Tide) వస్తుందని తెలుస్తుంది. సముద్రపు నీరు నెమ్మదిగా ఆరు గంటల సేపు పైకి దూసుకు రావడమే 'పోటు'. తర్వాత ఆరుగంటల పాటు ఆ నీరంతా వెనక్కి తగ్గడమే 'ఆటు'. భూమిపై సూర్యచంద్రుల ఆకర్షణలు రెండూ పని చేస్తున్నప్పటికీ, భూమికి దగ్గరగా ఉన్న చంద్రుని ప్రభావమే ఎక్కువ. పౌర్ణమికి, అమావాస్యకు ఈ పరిమాణం మరింత తీవ్రంగా ఉంటుంది. ఎందుకంటే ఆ సమయాల్లో సూర్యుడు, భూమి, చంద్రుడు ఓకే సరళరేఖలోకి వస్తారు. అందువల్ల సూర్యచంద్రుల గురుత్వాకర్షణ బలాలు రెండూ కలిసి భూమిపై పని చేస్తాయి. అప్పుడు మామూలు రోజుల కన్నా పోటు ఉధృతంగా ఉంటుంది.
- ప్రొ||ఈ.వి. సుబ్బారావు,-హైదరాబాద్@Eenadu hai bujji.
- =======================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...