ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...్
ప్ర : స్వెట్టర్ వేసుకుంటే వెచ్చగా ఉంటుందెందుకు?
జ : స్వెట్టర్ ని జంతురోమాలతో చేస్తారు . ఆ రోమాలలో ఉండేది ' కెరోటిన్ ' అనే ప్రోటీన్ . ఈ ప్రోటీన్ ఉష్ణోగ్రతను నిలిపి ఉంచే గుణము కలిగిఉంటుంది . ఫలితముగా శరీర ఉష్ణోగ్రత బయట ఉన్న చల్ల గాలితో కలిసి పోకుండా అక్కడే నిలిపిఉంచి వెచ్చదనము కలిగిస్తుంది . కెరోటిన్ పోగులు మెలికలు తిరిగి ఉంటాయి. . . ఆ మెలికలు మధ్య గాలి నిలిచి ఉండి ఉష్ణోగ్రతను అటునుంది ఇటు ... ఇటునుండి అటు పోనివ్వక వెచ్చదనాన్ని అలాగే నిలిచి ఉంచుతుంది .
- ============================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...