Tuesday, January 24, 2012

How to prevent loss of shining of gold ornaments?,బంగారు ఆభరణాలు మెరుపు పోకుండా ఏవిధముగా జాగ్రత్త పడాలి ?




ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

  • Q : బంగారు ఆభరణాలు మెరుపు పోకుండా ఏవిధముగా జాగ్రత్త పడాలి ?
A : లోషన్లు , పౌడర్లు , మురికి వంటి వాటికారణముగా బంగారు ఆభరణాల పై నెమ్మదిగా పల్చని పొరలాంటిది ఏర్పడి మెరుపు తగ్గిపోతూ ఉంటుంది . తగిన జాగ్రత్తలు ద్వారా మెరుపును తిరిగి తీసుకురావచ్చును .
  • ఒక పాత్రలో సగం దాకా గోరువెచ్చని నీరు పోసి రెండు టేబుల్ స్పూన్లు వాషింగ్ లిక్విడ్ కలిపి ఆభరణాలను 30 నిముషాల సేపు నానబెట్టి టూత్ బ్రెష్ తో సున్నితముగా బ్రెష్ చేయాలి . గోరువెచ్చని నీటిలో కడిగి మెత్తని కాటన్‌ గుడ్డ తో తుడవాలి. ఇలా నెలకొకసారి చేస్తే సరిపోతుంది .
  • అమ్మోనియా + నీరు సమపాళ్ళలో తీసుకుని ఆభరణాలను 20 నిమిషాలు నానబెట్టి టూత్ బ్రెష్ తో స్క్రబ్ చేయాలి. ట్యాప్ కింద కడిగి వస్త్రము తో తుడవాలి.
  • స్కికా ఉండే టూత్ పేస్ట్ తో ఆభరణాలు క్లీన్‌ చేయకూడదు . సిలికా వల్ల మెరుపునిచ్చే ఫినిషింగ్ దెబ్బతింటుంది . కొంతకాలానికి బంగారు ఆభరణల వన్నె తగ్గిపోయి పేలవం గా కనిపిస్తాయి.
  • చింత పండు రసములో బంగారు ఆబరణాలు 30 నిమిషాలు నానబెట్టి ... టూత్ బ్రెష తో క్లీన్‌ చేసి మెత్తటి గుడ్డ తో తుడిస్తే దగదగ మెరుస్తా్యి . దీనిలో ఉన్న సిట్రిక్ యాసిడ్ వలన మురికి పోయి బంగారము మెరుస్తాయి .
  • =============================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

No comments:

Post a Comment

your comment is important to improve this blog...