- image : courtesy with google.com
ప్ర : పశువులు బురదను ఎందుకు పూసుకుంటాయి?
జ :
గేదెలు బురదనీరు కనబడగానే గబగబా దిగి తలపైకి పెట్టి కుర్చుంటాయి . అటుఇటు దొర్లి బురదను ఒళ్ళంతా పట్టించుకుటాయి. మనకది అంతగా ఇష్టపడకపోయినా వర్మ ఆరోగ్యము కోసము గేదెలు చేసే పని ఇది . చర్మము మీదనున్న సూక్ష్మజీవులు , పేలు , గోమారులు వంటి కీటకాలను వదిలించుకునేందుకు నీటిలో ముణుగుతాయి. దాంతో ఆ జీవులు వదిలిపోతాయి. ఈ విదంగా ఒంటికి బురద పట్టించుకోవడము ద్వారా కుట్టే కీటకానుండి రక్షణ పొందుతాయి. అడుసు తొక్కనేల కాలు కడగనేల.అనే సామెత వాటికి తెలీదు ... పాపం ఇంటికి చేరిన గేదెలను యజమాని కడిగి వాటిని చర్మాన్ని శుబ్రము చేస్తాడు . మనలో ఉండే లోపాల్నే మనం ఇతరుల్లో గమనిస్తాము. మన చుట్టూ బురద కనిపిస్తూంది, అంటే అది మనలోనే ఎక్కడో ఉందన్న మాట.
- ================================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...