ప్రశ్న: గుర్రంలాగా గాడిద ఎందుకు పరిగెత్తదు?
జవాబు: వివిధ జంతువులకు వివిధ రకాలైన శారీరక నిర్మాణం ఉంది. గుర్రానికి, గాడిదకు కొన్ని పోలికలు ఉన్నా శరీర నిర్మాణం ఒకేలా ఉండదు. గాడిదకు, గుర్రానికి ఉన్న జన్యు సారూప్యత (genetic proximity) కన్నా, జీబ్రాకు, గుర్రానికి మధ్య ఎక్కువ జన్యు సారూప్యత ఉంది. గుర్రం దేహంలో వేగంగా పరిగెత్తడానికి వీలైన బాహ్య, అంతర వ్యవస్థలు ఉన్నాయి. దాని కాలి కండరాల దృఢత్వం ఎక్కువ. ఆ కాళ్లను, మడమలను నియంత్రించే మెదడు భాగానికి, దాని కండరాలకు మధ్య ఉన్న నాడీసంధానం గాడిదకు లేదు. గుర్రం కాళ్లు పొడవుగా ఉండడం, మెడ భాగం దృఢంగా ఉండడం వల్ల పరిగెత్తేప్పుడు అది తన శరీరాన్ని బాగా నియంత్రించుకోగలదు. పరిగెత్తడంలో గుర్రం తోక పాత్ర కూడా ఎక్కువ.ఇలాంటి శారీరక అనుకూలతలే జంతువుల పరుగు సామర్థ్యాలను నిర్ణయిస్తాయి.
-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్, వరంగల్; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
- =======================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...