జవాబు: రెఫ్రిజరేటర్‌ను, ఏదైనా కారణాల వల్ల స్విచ్ ఆఫ్ చేస్తే వెనువెంటనే మళ్లీ స్విచ్ ఆన్ చేయకూడదు. అలా చేయడం వల్ల ఫ్రిజ్‌లో కీలక పరికరమైన సంపీడకం (కంప్రెషర్) పాడయ్యే అవకాశం ఉంటుంది. ఇదెలాగో తెలియాలంటే ఫ్రిజ్ పనితీరును కూడా అర్థం చేసుకోవాలి. ఫ్రిజ్‌లో చల్లదనాన్ని కలుగజేసే రిఫ్రిజరెంట్ ఉంటుంది. స్విచ్ ఆఫ్ చేయక ముందు ఎక్కువ పీడనంలో ఉండే దీన్ని తక్కువ పీడనంలోకి తెచ్చే వ్యాకోచ సాధనం ఉంటుంది. దీని ద్వారా రెఫ్రిజిరెంట్ నెమ్మదిగా దానిని ఆవిరిగా మార్చే భాష్పకారిణి (ఎవాపరేటర్)లోకి ప్రవహిస్తుంది. ఈ నేపథ్యంలో ఫ్రిజ్‌ను స్విచాఫ్ చేసినప్పుడు కంప్రెషర్ పనిచేయడం ఆగిపోతుంది. అప్పుడు రెఫ్రిజరెంట్ పూర్తిగా భాష్పకారిణిలోకి చేరుకుంటుంది. ఈ పరిస్థితిలో తిరిగి స్విచ్ ఆన్ చేస్తే, కంప్రెషర్‌లో ఎలాంటి రెఫ్రిజరెంట్ ఏమాత్రం లేని స్థితి కలుగుతుంది. దీనిని 'నో లోడ్ కండిషన్' అంటారు. దాని మూలంగా కంప్రెషర్ పాడవుతుంది. ఇలాంటి పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఫ్రిజ్ తయారీదారులు తక్కువ సామర్థ్యం గల మోటార్లతో కూడిన కంప్రెషర్లను అమరుస్తారు. దీని వల్ల ఫ్రిజ్ ధరలో కూడా కొంత ఆదా అవుతుంది. no load condition ద్వారా ఫ్రిజ్ పాడవకుండా ఉండటానికి, ఫ్రిజ్‌ను 'ఆఫ్' చేసిన వెంటనే 'ఆన్' చేయకుండా కొన్ని సెకండ్లు వేచి ఉండటం మంచిది.
- ప్రొ|| ఈ.వి.సుబ్బారావు,--హైదరాబాద్
- ========================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...