జవాబు: మందుల దుకాణం వాళ్లు కల్తీ, నకిలీ మందులు అమ్మనంత వరకు వారిచ్చే మాత్రల్ని నమ్మవచ్చు. సాధారణంగా విటమిను మాత్రలు బహుళ విటమిను మాత్రల రూపంలో దొరుకుతాయి. ఒక్కోసారి అవసరంలేని విటమిను సంఘటనం కూడా ఆ మాత్రల్లో ఉండగలదు. గర్భిణిలు, పథ్యం లేదా నిర్ణీత ఆహార నియమాలు పాటించేవారు, వృద్ధులు, తల్లిపాలు లభించని శిశువులు మొదలయిన వారికి ప్రత్యేకంగా విటమిను సరఫరా అవసరం. అయితే మందుల రూపంలో కాకుండా శరీరంలో సహజంగానే ఉత్పత్తి అయ్యే 'డి' విటమిను వంటి వాటిని అనవసరంగా కొని డబ్బు వృథా చేసుకోనవసరం లేదు. తగిన మోతాదులో కూరగాయలు, ఆకు కూరలు, మాంసకృత్తులు నిండిన సమతలాహారం, పండ్లు తీసుకుంటే విటమిన్ల మాత్రలు కొనవలసిన అవసరం ఉండదు.
- ప్రొ.ఎ.రామచంద్రయ్య, నిట్, వరంగల్, కన్వీనర్,--శాస్త్రప్రచార విభాగం, జనవిజ్ఞానవేదిక (తెలంగాణ)
- =======================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...