Tuesday, May 08, 2012

Why do we call the education as SARASWATI YAAGAM, చదువుని సరస్వతీ యాగముం అంటారెందుకు?



ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్ర : చదువుని సరస్వతీ యాగముం అంటారెందుకు?

జ : సరస్వతీదేవి వెనక లక్ష్మీదేవి రావచ్చునేమో కాని లక్ష్మి వెనక సరస్వతి రావడము అరుదుగా జరుగుతుంద ... అని అంటారు . ఒక పూట అన్నం పెడితే ఆకలి తీరుతుంది . బట్టలిస్తే ఒళ్ళు కప్పుకోవచ్చు , అదే విద్యాదానము చేస్తే పదితరాలకు ఆ కుటుంబలోని అందరూ విద్యావంతులవుతారు . అన్నిదానాల్లో విద్యాదానము ఉత్తమోత్తమైనది . అందుకే గురువు తల్లిదండ్రులతో సమానము .

ఈ నాడు అన్ని వస్తువులాగానే విద్యకూడా ఖరీదైపోయింది. ప్లేస్కూల్ నుండి కాలేజీ చదువుల దాకా ఫీజులు చుక్కల్ని చూపిస్తున్నాయి. తమ పిల్లలు చదుకుని మంది స్థితికి రావాలని బీదా బిక్కీ నుంచి సంపన్నుల వరకూ అందరూ ఆశపడుతున్నారు . రిక్షాలాగే వాడి కొడుకు ఎమ్‌.ఎ చదవడం , కండక్టర్ కొడుకు కలెక్టర్ , కానిస్టేబుల్ కొడుకు డిస్టిక్ జడ్జి అవడం వంటి తీపి / చేదు వార్తలు వింటున్నాము . ప్రభుతం కూడా " సరస్వతీ నిధి " అన్న పథకాన్ని ప్రారంభంచింది . పేద పిల్లలకు చదివించేందుకు ఈ నిధి ని వాడుతున్నారు .

మనదేశము లో నిరక్షరాస్యత , పేదరికము తగ్గించండానికి అందరూ అలోచించి ఆచరణలో పెట్టడాన్నే " సరస్వతీ యజ్ఞం లేదా సరస్వతీ యాగం " అని అంటారు . మీరూ విద్యాదానము చేసి సరస్వతీ యాగము లో పాలు పంచుకోంది .
  • =======================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

No comments:

Post a Comment

your comment is important to improve this blog...