ప్ర : కథా రచయిత తమ రచనలమీద పేటెంట్ రైట్స్ పొందాలంటే ఏం చెయ్యాలి ? ఆన్‌లైన్ మీద ఈ పద్దతి అనుసరించవచ్చా? .పేటెంట్ రైట్స్ పొందడం అంటే ఏమిటి? .
జ : కథలు , నవలలు , కవిత్వము -- ఈ సాహిత్యానికి కాపీ రైట్ ఉంటుంది కాని పేటెంట్-రైట్స్ ఉండవు . రచయితకి నూరేళ్ళపాటు బ్రతికినంతకాలమూ తన రచనలమీద సర్వహక్కులూ ఉంటాయి. ఆ తరువాత అది ప్రజలకి చెందుతుంది. రామాయణ , భారతాలు ... ఇవి అందరూ ప్రచురించుకొని అమ్ముకోవచ్చు .
ఠాగూర్ , శరత్ , గురజాడ , వీరేశలింగం వంటివారి రచనలు ఎవరైనా ప్రచురించుకోవచ్చు . సాహిత్యాన్ని కాపీ కొట్టడాన్ని " ప్లాగరిజమ్ " అంటారు . రచనలో కొంతభాగము యధాతధంగా కాపీచేసి అది స్వంతరచన అని ప్రకటించి నప్పుడు అది కాపీరైట్ యాక్ట్ కింద వస్తుంది . రచనలకి పేటెంట్ రైట్స్ అన్నమాట వాడరు . ట్రేడ్ మార్క్ లకీ , మందులకు , కొత్తగా కనిపెట్టిన వస్తువు పేటెంట్ రైట్స్ కింద వస్తాయి.
సినిమాలని , పుత్సకాలని మక్కికిమక్కి కాపీచెయ్యడం చాలాచోట్ల ఉన్నది . కోటుకెళ్ళిన ఉదంతాలూ ఉన్నాయి. ఆన్‌లైన్ లో ఈ పనులు జరుగవు . కష్టము .
- =====================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...