ప్రశ్న:అంబులెన్స్ వాహనం ముందు భాగంలో AMBULANCEఅక్షరాలను తిరగేసి రాస్తారేం?
జవాబు: అంబులెన్స్ వాహనం ప్రమాద స్థితిలో ఉన్న రోగిని ఆసుపత్రికి తీసుకెళ్లే వాహనం. రోగిని ఎంత తొందరగా వీలయితే అంత తొందరగా ఆసుపత్రికి తీసుకెళ్లగలిగితే ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుంది. ఈ వాహనానికి ట్రాఫిక్ అవాంతరాలు ఏర్పడకుండా రోడ్డు మీద అందరినీ అప్రమత్తం చేయడానికి మూడు విధానాలు పాటిస్తారు. ఒకటి: ప్రత్యేకంగా శబ్దం వచ్చే సైరన్ మోగించడం. రెండు: రాత్రయినా, పగలైనా బాగా కనిపించేలా ప్రత్యేకమైన ఎరుపు, నీలం రంగుల్లో తిరిగే లైటును వాహనం పైన ఏర్పాటు చేస్తారు. మూడు: అంబులెన్స్ వాహనం మీద అక్షరాలను దానికి ముందున్న వాహనదారులు గుర్తించేలా రాయడం. రోడ్డు మీద వాహనాల డ్రైవర్లందరూ తమ వెనుక ఏయే వాహనాలు వస్తున్నాయో తెలుసుకోడానికి 'రియర్ వ్యూ మిర్రర్' అనే చిన్న అద్దమొకటి ఉపయోగపడుతుంది. దీని ద్వారా చూసినప్పుడు అంబులెన్స్ వాహనం మీద రాసిన అక్షరాలు సరిగా కనబడాలంటే వాటిని తిరగేసి రాయాలి. అందుకే అలా రాస్తారు.
- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్, వరంగల్; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
- ===================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...