ప్రశ్న: తీపి పదార్థం ఉన్న చోటికి చీమలు కొన్ని క్షణాల్లో వచ్చి చేరుతాయి. వాటికి అంత గ్రహణ శక్తి ఎలా వచ్చింది?
జవాబు: చీమల తలపై ఎంటెన్నాల లాంటి రెండు అతి చిన్న వెంట్రుకలను గమనించే ఉంటారు. అవే చీమలకు ఆహారాన్ని వెదకడంలో సాయపడతాయి. వేర్వేరు పదార్థాలలో ఉండే రసాయనికాల రుచిని, వాసనను ఈ వెంట్రుకలు గ్రహించగలవు. వీటికి అనుసంధానించి ఉండే జ్ఞానేంద్రియ కణాల ద్వారా ఆ సమాచారం చీమ మెదడుకు చేరుతుంది. పదార్థాలు ఎక్కడో ఉన్నప్పటికీ గాలిలో వ్యాపించే వాటి వాసనను గ్రహించడానికి చీమలు ఈ వెంట్రుకలను అటూ ఇటూ కదిలిస్తూ దారి తెలుసుకుంటాయి. వీటిని చీమ తల నుంచి తొలగిస్తే అవి దూరంగా ఉండే పదార్థాల వాసనను పసిగట్టే శక్తిని కోల్పోతాయి.
-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్
- ====================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...