ప్రశ్న: హోటల్స్‌లో చేతులు తుడుచుకోడానికి మెత్తని కాగితాన్ని ఇస్తారు. దాని ప్రత్యేకత ఏంటి? అది నీటిని తొందరగా ఎలా పీల్చుకుంటుంది?
జవాబు: ఇలాంటి కాగితాన్ని టిష్యూ పేపర్ (tisssue paper) అని, కాగిత రుమాలు (paper napkin) అనీ అంటారు. కాగితాలను సెల్యులోజ్ పదార్థంతో చేస్తారని తెలుసుగా? మామూలు కాగితంలో ఈ పదార్థపు పోగులు దట్టంగా అల్లుకుని ఉంటాయి. పైగా అధిక ఉష్ణోగ్రత వద్ద రోలర్ల సాయంతో నొక్కుతూ తయారు చేయడం వల్ల సెల్యులోజ్ పోగుల్ని పిండిపదార్థం జిగురులాగా అతుక్కుని ఉంచుతుంది. అందువల్ల సాధారణ కాగితం గట్టిగా, నీరు తొందరగా ఇంకని విధంగా తయారవుతుంది. అయితే టిష్యూ పేపర్‌లో సెల్యులోజ్ పోగుల్ని చాలా వదులుగా ఉండేలా తయారు చేస్తారు. వీటిని కలిపి ఉంచడానికి పిండిపదార్థపు జిగురును వాడరు. అందువల్ల పొరకు, పొరకు మధ్య చాలా ఖాళీలు ఎక్కువగా సూక్ష్మస్థాయిలో ఉంటాయి. ఈ కారణంగా ఇవి తడిని ఎక్కువగా పీల్చుకోగలుగుతాయి.
- -ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్,వరంగల్; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
- visit My website > Dr.Seshagirirao - MBBS.
No comments:
Post a Comment
your comment is important to improve this blog...