Saturday, February 20, 2010

వంతెన పై వెళ్ళేటపుడు రైలు ఎందుకు ఎక్కువ శబ్దము చేస్తుంది ?,Train makes more sound on a bridge-why?




ప్ర : రైలు వంతెన మీద వెళుతున్నప్పుడు శబ్దము అధికంగా వినపడడానికి కారణము ఏమిటి?.

జ : రైలు పట్టలకు చక్రాలకు మధ్య ఏర్పడే ఘర్షణ , రైలుపట్టాలను పట్టి ఉంచే స్లీపర్స్ కింది భాగం గాలితో నిండి ఉండటమే కారణము . దీనివల్ల శబ్ద కంపనాల పరిమాణం పెరిగి శబ్దతీవ్రత అధికం గా వినిపిస్తుంది.
పైగా వంతెన కింద ఉన్న నీరు , నేల ఆ ధ్వనిని ప్రతిద్వనింప చేస్తాయి . కాబట్టి శబ్దాల స్థాయి మరింత తీవ్రం గా ఉంటుంది . రైలు వెళుతుంటే బ్రిడ్జి మీద కంపించే వస్తువుల స్వభావ మార్పుల వలన ఈ ధ్వని తీవ్రత , ధ్వని విధానము మారుతూ ఉంటుంది . అందుకే అంత శబ్దము వస్తుంది .


  • =========================

visit My website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

your comment is important to improve this blog...