ప్రశ్న: విషపూరితమైన పాము కాటేస్తే వేరే పాము చనిపోతుందా?
జవాబు: విషపూరితమైన పాము కోరలకు అనుసంధానంగా విషగ్రంథులు ఉంటాయి. పాము కాటేసినప్పుడు ఆ గ్రంథులలో ద్రవరూపంలో ఉండే విషం, కోరల గుండా ప్రవహించి బయటకి వస్తుంది. కోరలు చేసిన గాయం ద్వారా కాటుకు గురైన జీవి దేహంలోకి ప్రవేశిస్తుంది. ఆ విషం ఆ జీవి రక్తంలో కలిస్తే అది చనిపోయే అవకాశం ఉంటుంది. అది మరో పామైనా సరే. చనిపోవడం అనేది విషం మోతాదుపై ఆధారపడి ఉంటుంది. కొన్ని వ్యాధుల నివారణకు పాము విషాన్ని మందుగా వాడతారు. అప్పుడు ఆ విషం వ్యక్తి రక్తంలో కలవకుండా జీర్ణవ్యవస్థలో జీర్ణమవడంతో హాని జరగదు. కాటు వేసిన పాముకి కూడా ప్రమాదం వాటిల్లే పరిస్థితులు ఉంటాయి. పొటాషియం సైనైడ్ లాంటి విషపదార్థాలను సేవించి చనిపోయిన వ్యక్తి దేహాన్ని పాము కాటు వేస్తే దాని కోరల గుండా ఆ విషం దాని రక్తంలోకి ప్రవేశించి పాము చనిపోయే అవకాశం ఉంది. అలాగే డ్రగ్స్, మాదక ద్రవ్యాలను చాలా కాలంగా వాడే వ్యక్తి రక్తం కూడా విషపూరితమవుతుంది. అతడిని కాటేసినా పాముకే ప్రమాదం.
- ============================================================
visit My website > Dr.Seshagirirao - MBBS.
No comments:
Post a Comment
your comment is important to improve this blog...