Wednesday, February 17, 2010

కరగడంలో తేడాలేల? ,ice melting differences ?






ప్రశ్న:
అరచేతిలో ఐసుగడ్డ తొందరగా కరగదు. అదే నీటిలో వేస్తే తొందరగా కరుగుతుంది. ఎందుకు?

జవాబు:
ఐసుగడ్డ ద్రవీభవించాలంటే దానికి తగిన ఉష్ణం చేరాలి. దాన్ని అరచేతిలో ఉంచుకున్నప్పుడు చాలా భాగానికి గాలితో స్పర్శ ఉంటుంది. కానీ గాలిలో ఉష్ణ ప్రవాహత (thermal conductivity) తక్కువ. కొంత మేరకు అరచేతితో స్పర్శ ఉన్నా అది లెక్కలోకి రాదు. అదే ఐసుగడ్డను నీటిలో వేసినప్పుడు అది కొంత మేరకు తేలినా, అధిక భాగం నీటికి తాకి ఉంటుంది. గాలి కన్నా నీటి ఉష్ణవాహకత్వం ఎక్కువ. కాబట్టి సరిపడినంత ఉష్ణం తొందరగా ఐసుగడ్డను చేరడం వల్ల అది తొందరగా కరిగిపోతుంది.

  • ================================================

visit My website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

your comment is important to improve this blog...