Thursday, March 03, 2011

పసుపు కలిపిన అక్షింతలు వేసి ఆశీర్వదించమంటారు ...ఎందుకు?,Turmeric mixed rice is used to bless couple-Why?



ప్ర : పసుపు కలిపిన అక్షింతలు వేసి ఆశీర్వదించమంటారు ...ఎందుకు?,Why do we use Turmeric mixed rice is to bless couple?

జ : జ్యోతిష్ శాస్త్రము ప్రకారము ... బియ్యము చంద్రునికి చెందిన ధాన్యము . మన: కారకుడైన చంద్రుడి ప్రభావం బియ్యం పై ఉంటుంది. మానవుని దేహం ఓ విద్యుత్ వలయము . ఆశీర్వదించేవారు చేతిలోకి బియ్యం తీసుకోగానే వారిలోని విద్యుత్ బియ్యానికి అందుతుంది . అలాగే ఆశీర్వదించే వారికి చర్మవ్యాధులు ఉంటే ఆ ప్రభావము కూడా ఆశీర్వాదం తీసుకునేవారిపై పడుతుంది .

అందుకే క్రిమి సంహారకమైన పసుపుని కలిపి , కేవవలం విధుత్ మాత్రమె స్వీకరించేలా చేసేందుకు పసుపు కలిపిన బియ్యాన్ని అనగా అక్షింతలను ఇచ్చి ఆశీర్వదించమంటారు . పసుపు లేదా కుంకుమ గానీ కలపని అంక్షింతల్ని పూజాకార్యక్రిమాల్లో గాని , శుభకార్యాల్లో గాని వాడరు .


  • ===========================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Monday, February 28, 2011

టమాటా సాస్‌ సీసా నుంచి సులభంగా బయటకు రాదెందుకని?,Tomato juice is not coming out easily Why?




ప్రశ్న: టమాటా సాస్‌ సీసా నుంచి సులభంగా బయటకు రాదెందుకని?

-కె. నటరాజన్‌, ఇంటర్‌, తిరుపతి

జవాబు: టమాటా సాస్‌ అనేది టమాటాలు, సుగంధ ద్రవ్యాలు, కొన్ని మసాలా దినుసులు కలిపి తయారు చేసిన చిక్కని పదార్థం. దీనికి స్నిగ్ధత (viscosity) ఎక్కువగా ఉంటుంది. అదే నిండుగా నీరున్న సీసా నుంచి నీటిని పోయడం సులభం. ఎందుకంటే సీసాలోని నీరు కొంత వెలుపలకు రాగానే, దాని అడుగున ఏర్పడిన ఖాళీ ప్రదేశాన్ని ఆక్రమించడానికి బయట ఉండే గాలి సీసా మూతి గుండా నీటిలోకి ప్రవేశించి ప్రయాణిస్తుంది. కానీ టమాటా సాస్‌ స్నిగ్ధత ఎక్కువ కావడం వల్ల గాలి బుడగలు దాని గుండా సులభంగా ప్రవేశించలేవు. అందువల్ల సీసా అడుగు భాగాన శూన్య ప్రదేశం ఏర్పడుతుంది. తద్వారా పీడనాల తేడా ఏర్పడి, ఆ ప్రభావం గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా పని చేస్తుంది. దాంతో సాస్‌ బయటకు రాకపోగా సీసా అడుగు వైపునకు లాగబడుతుంది. అందువల్లనే సాస్‌ను బయటకి రప్పించడానికి సీసా అడుగుభాగాన్ని తట్టడమో, సీసాను విదిలించడమో చేయాల్సివస్తుంది. అదే ప్లాస్టిక్‌ సీసా అయితే దాని పక్క భాగాలను నొక్కి ఒత్తిడి కలిగించడం చేయవచ్చు. అలాగు సీసాలోకి ఒక స్ట్రాను నిదానంగా అడుగుభాగం వరకు గుచ్చితే, దాని గుండా బయటి గాలి అక్కడకి చేరుకుని సాస్‌ సులువుగా బయటకి వస్తుంది.

-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌


  • ======================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

రధసప్తమి రోజున జిల్లేడు ఆకులను తలపై పెట్టుకొని స్నానం చేస్తారు ఎందుకు?,Why do we take bath Gigantea leaves on head on Sun birthday?



ప్ర : రధసప్తమి రోజున జిల్లేడు ఆకులను తలపై పెట్టుకొని స్నానం చేస్తారు ఎందుకు?
జ: జిల్లేడు ఆకులకు సూర్యరశ్మి తగలడం వల్ల ఓ అద్భుత శక్తి జనిస్తుంది . అందుకే రధసప్తమి నాడు ఏడు జిల్లేడు ఆకులను తలపై పెట్టుకొని సూర్యదేవుని నమస్కారము చేసి మూడు సార్లు నదిలో మునిగి స్నానము చేయమని చెప్తారు . ఈ విధంగా చేయడం వల్ల శిరస్సు నుంచి శరీరానికి నూతన శక్తి ఆవహించి శరీర దోషాలనీ మటుమాయమవుతాయని నమ్మకం . ఈ స్నానము ప్రతిరోజూ చేయవచ్చును ... అలా చేయడం అందరికీ అవవు ... అందునా విసుగు పుడుతుందని సంవత్సరానికి ఒకసారైనా అదే హిందువుల పండగ రోజు అయిన రధసప్తమి నాడు ఆ నియమాన్ని పెట్టారు .

  • ===============================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

మొబులా రే సంగతేమిటి ? , What about Mobula Ray ?





చాపలా వెడల్పుగా పరుచుకున్న శరీరం, సన్నని తోకతో గాలిపటంలా కనిపిస్తోంది కదూ! ఈ మొబులా రే. సముద్రంలో అంత ఎత్తున ఎగిరి మళ్లీ కిందకి దుమికే దీనికి ఎంతో ప్రత్యేకత ఉంది తెలుసా? ఇది ఎగిరినప్పుడు కొంత దూరం నుంచి చూస్తే చిన్న విమానం దూసుకెళ్తున్నట్టు ఉంటుంది. ఆకారం కూడా విమానాన్ని పోలినట్టే ఉంటుంది. ఈ మొబులా రేలు ఎక్కువగా మెక్సికో, కాలిఫోర్నియా తీరాల్లో కనిపిస్తాయి. వీటిని చూడటానికి బోలెడు మంది పర్యాటకులు ఈ తీరప్రాంతాల్లో గుమిగూడతారు. అవి గాలిలో ఎగురుతుంటే ఫోటోలు తీసుకుని మురిసిపోతారు.

ఎగరడం అంటే పక్షుల్లా వేల కిలోమీటర్లు ఎగిరేస్తాయనుకోవద్దు. గెంతడమన్న మాట. ఇవి ఒక్కసారిగా పైకెగిరి సుమారు రెండు మీటర్ల ఎత్తుకు వెళ్లి తిరిగి సముద్రంలో దబ్బున పడతాయి. ఆ సమయంలో వాటి రెక్కల్లాంటి మొప్పల్ని దగ్గరగా తీసుకుని అచ్చు పక్షిలాగా కనిపిస్తాయి. కాస్త తీరిక దొరికితే చాలు ఇవి ఇలా ఎగురుతూనే ఉంటాయి. అసలివి మాటిమాటికీ ఎందుకు ఎగురుతున్నాయో మాత్రం ఇంత వరకు తెలియలేదు. కొందరు శాస్త్రవేత్తలు అవి ఆనందం వేసినప్పుడు అలా ఆడుకుంటున్నాయని భావిస్తే, మరికొందరు ఆహారం పట్టుకోవడంలో అదో ప్రక్రియని చెపుతున్నారు. అలా ఎగిరినప్పుడు ఒంటిపై ఉన్న వివిధ పారాసైట్‌లను కిందకి రాలిపోతాయని, అవి తినడానికి వచ్చిన చేపల్ని పట్టి తింటాయని భావిస్తున్నారు. తీర ప్రాంతాల్లోని నీటిలో ఒకే దగ్గర గుంపులుగుంపులుగా ఉంటాయివి. అప్పుడు చూస్తే ఆ ప్రదేశమంతా నీలం దుప్పటి కప్పినట్టుగా కనిపిస్తుంది.

ఈ మొబులా రేలు పదడుగుల పొడవు, 17 అడుగుల వెడల్పున ఉంటాయి. బరువు ఒక టన్ను వరకు పెరుగుతాయి. రేల కుటుంబంలో మాంటారేల తరువాత ఇవే అతి పెద్ద రే జాతి. పరిమాణంలో పెద్దవే అయినా తినేవి మాత్రం రొయ్యల్లా కనిపించే క్రస్టసీన్స్‌, క్రిల్స్‌ చేపల్నే. వీటి సంఖ్య ఇప్పుడు ప్రమాదంలో పడింది. తీర ప్రాంతాల్లో ఇవి గుంపుగా ఉన్నప్పుడు జాలరులు వలలేసి పట్టేస్తున్నారు. అందుకే మెక్సికన్‌ ప్రభుత్వం వీటిని చంపితే పదివేల డాలర్ల జరిమానా విధిస్తోంది.

  • =============================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Saturday, February 26, 2011

సీతారామ కళ్యాణము అనంతరము విశ్వామితృడేమయ్యాడు? , What happen to Viswamitra after Sitarama marriage?



ఫ్ర : సీతాకళ్యాణము తర్వాత బ్రహ్మర్షి విశ్వామితృడు ఏమయ్యాడు ?.
జ : రామాయణము లో విశ్వామిత్ర పాత్ర తక్కువే అయినప్పటికీ కీలకమైనది . సీతారాముల కళ్యాణానికి దారితీసిన ముఖ్యమైన ఘట్టము . రామాయణం లో ఆయన పాత్రకు అదే ప్రయోజనము ఆ తరువాత ఆయన కధ రామాయణ కవి కి అంతగా అవసరము లేదు ... రాలేదు . అలానే కొన్ని మిగిలిన పాత్రలు కూడా .

  • =======================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Why women kept outside seperatly during monthly period?,ఆడువారు నెలసరి లో ఇంటబయట ఉంటారెందుకు ?



ఫ్ర : మన ఆడువారు నెలసరి అయిన 3 రోజులు ఇంటి లో సెపరేట్ గా ఉంటారెందుకు ?
జ : స్త్రీలు నెలకు మూడురోజులు ఇంట్లో కాలుపెట్టకుండా ' బైట' ఉంటారు . ఇది ఒక ఆచారము గా వస్తుంది . మన సమాజం ఎలా మారిందంటే ఏ ఆచారము ఎందుకు ? ఏ కాలములో ఏర్పడింది ? ఎవరూ ఎరుగరు . పూర్వకాలము లో ఎక్కువగా ఉమ్మడి కుటుంబాలు వ్యవస్థ లో ఇంట ఆడువారికి రోజంతా ఇంటి పని దండి గా ఉండేది . విశ్రాంతి ఉండేది కాదు . స్త్రీలు బహిస్ట అయిన 3-4 రోజులు వరకూ బ్లీడింగ్ మూలాన నీరసం గా ఉండేవారు ... తగిన నివారణ మందులూ దొరికేవి కావు . రోజువారీ పని చేయలేని స్థితిలో ఉండేవారు . అందువలన మూడు రోజులు పూర్తి విశ్రాంతినిచ్చుటకై ముట్టు / అంటు అనే ఆచారము తో విశ్రాంతిని కలుగజేసేవారు . ఇది ఆరోగ్యానికి సంబంధించిన విషయం . అంతే తప్ప కొంపలు మునిగేది కాదు . నేటి మహిళలు హాయిగా స్నానము చేసి చిన్న చిన్న పనులు చేసుకోవడానికి అభ్యంతరము లేదు . అది పాపము కాదు , నరకమూ కాదు .. ప్రకృతి సహజము . ..అంతే .

  • =======================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Thursday, February 24, 2011

శత్రువుల బారి నుంచి తేనెటీగలు ఎలా కాపాడుకుంటాయి?,How honey bee protect from others?




ప్రశ్న: శత్రువుల బారి నుంచి తేనెటీగలు తమను తాము ఎలా రక్షించుకుంటాయి?

-బి. సరోజిని, 9వ తరగతి, ఏలూరు

జవాబు: తేనెటీగ ఏ జీవినైనా కుడితే దాని కొండె ఆ జీవి దేహంలో చిక్కుకుపోతుంది. దానిని వదిలించుకునే ప్రయాసలో తేనెటీగ చనిపోతుంది. అందువల్ల శత్రువుల బారి నుంచి తప్పించుకోడానికి తేనెటీగలు మరో విచిత్రమైన పద్ధతిని అవలంబిస్తాయి. ఉష్ణశక్తిని ఉత్పన్నం చేసే ఈ ప్రక్రియను 'థెర్మో బాలింగ్‌' అంటారు. తేనెటీగలు 50 డిగ్రీల సెంటిగ్రేడ్‌ ఉష్ణోగ్రత వద్ద కూడా సురక్షితంగా ఉండగలవు. అదే వాటి శత్రువులైన కందిరీగలాంటి కీటకాలు అంతటి వేడిమిని తట్టుకోలేవు. అందువల్ల శత్రువులు వచ్చినప్పుడు తేనెటీగలు అత్యంత వేగంగా తమ రెక్కలను, కండరాలను కంపింపచేయడం మొదలెడతాయి. తద్వారా వాటి పరిసరాల్లో ఉష్ణోగ్రత దాదాపు 47 డిగ్రీల సెంటిగ్రేడు వరకు పెరిగిపోతుంది. ఆ వేడిని తట్టుకోలేని కీటకాలు మరణిస్తాయి. ఈ విద్యతో తేనెటీగలు తమ పట్టుపై ఫంగస్‌ లాంటి సూక్ష్మజీవులు పెరగకుండా కూడా చేస్తాయి.

-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌



  • =========================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Monday, February 21, 2011

మనుషులే వివాహము చేసుకుంటారెందుకు?, Why do human only get married?





ఈ విశ్వములో కోటానుకోట్ల జీవులు నివశిస్తూ ఉన్నాయి. డార్విన్‌ జీవపరిణామక్రమము చూసినా , వేదవ్యాసుని ఆద్యాత్మిక జీవపరిణామ క్రమము చదివినా ఒకజీవి మరియొక జీవినుండి పరివర్తనము చెంది ఉద్భవించినదని విశిదమవుతుంది . అందుకు పునరుత్పత్తి అవసరము , ఆ దిశగా ప్రకృతి లో జీవరాశి మార్పులు చెందుతూ ఆడ మగ అనే రెండు తరగతులు గా మార్పు చెందాయి. ఈ మార్పు మానవులలో స్పస్టముగా కనబడుతుంది . అన్ని జీవులలోకి మానవజీవి తెలివైనదిగాను , అర్ధము చేసుకునే జ్ఞానము కలిగేదిగాను , జంతులకు భిన్నముగాను పునరుప్తత్తి విషయములో నియమ నిబంధనలతో వాయ , వరస నైతిక విలువలు పాటిస్తూ వస్తుంది . ఈ పక్రియలోని నియమాలే రకరకాల వివాహ విధానాలు ... వివాహ వ్యవస్థ . మానవజాతి ముందు జీవరాశికి విచక్షణా జ్ఞానము లేదు కాబట్టి అనుకూల సీజన్లలో అందుకు తగ్గట్టుగా తమ పునరుత్పత్తిని సాగిస్తూ ఉన్నాయి. ప్రకృతిలో జరుగవలసినది జరుగుతూ ఉంటుంది . ఆపడం అవదుకాని మార్పులు చేసేందుకు మానవులు ప్రయత్నిస్తూ ప్రియోగాలు చేస్తూఉన్నారు .

మతమేదయినా వివాహ ధర్మమొకటే ' సహజీవన సౌందర్యం ' . పాశ్చాత్య నాగరికతా మోజులో పడి భారత యువత ఎంతగా భ్ర ష్టుపట్టిపోతుందో మనకి తెలియంది కాదు. ప్రేమ పేరుతో వంచనలు, దురాగతాలు అంతు లేకుండా పోతున్నాయి. భాధ్యతగల్లిన పౌరులే కాదు సమాజంలో హోదా,పరువు వున్నవారు కూడా ఈనాడు వివాహేతర సంబంధాలతో విచ్చలవిడి శృంగారాన్నిఇపుడు ఒక స్టేటస్ గా భావిస్తున్నారు. సర్వత్రా నైతిక విలువలు లోపిస్తున్నాయి.

యావత్ ప్రపంచం లోనే అత్యధిక యవశక్తి ఉన్నదేశం మన భారతదేశం. యువత సన్మార్గం లో నడుచుకుంటే భారతదేశాన్ని మించిన మరొ దేశం ఈ ప్రపంచం లో ఉండదంటే అతిశయోక్తి కాదు.

సంఘమ్లో సదాచారాలను, సాంఘిక న్యాయాన్ని విశ్వజనీనంగా ఏర్పాటుచేసి సువ్యవస్థను రూపొందిచిన వారు మన పూర్వీకులు. ప్రపంచం లో ఎక్కడా లేని వివాహ సంస్కృతి మనది. భిన్న కుటుంబం లో పుట్టి, భిన్న వాతావరణం లో పెరిగి, భిన్న అలవాట్లను, అభిప్రాయాలను కలిగి ఉన్న ఇద్దరు మనుషులను ఒక పసుపు తాడు ప్రేమానురాగాలతో ఆ జన్మాంతం కట్టిపడేసే పటిష్టమైన వివాహ బంధం మనది. మన పూర్వీకులు మనకందించిన ఈ సంస్కృతీ సంప్రదాయాలను మన ముందుతరాలకు అందిచాల్సిన బాధ్యత మనందరిది. భారతీయ వివాహ పధ్ధతి యందలి పవిత్రత, గౌరవం , ఆశయం, ఆదర్శం ప్రపంచమందలి మరి ఏ యితర దేశమందుగాని, మతమునందుగాని గానజాలము.

  • ===================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

పెళ్ళిలో ఎవరు ముందు జీలకర్ర బెల్లము పెడతారో వారిమాటే చెల్లుతుందా?, Cummin seeds and jagary importence in hindu marriage



జీలకర్ర, బెల్లము :
శుభముహూర్త సమయమున వధూవరుల మధ్య తెరతొలగిస్తారు. ఒకరినొకరు చూసుకున్న తరువాత జీలకర్ర , బెల్లము కలిపిన ముద్దను ఒకరి తలపై ఒకరు నిలిపి చేతితో తాకుతారు. పూర్వకాలములో పదార్ధ విజ్ఞాన శాస్త్రవేత్తలు (Material Scientists) జీలకర్ర బెల్లము కలిపి నూరినా, నలిపినా ధన సంజ్ఞక విద్యుత్తు (Positive electric charge) ఉత్పత్తి అగునని వర్ణించారు. మనుష్యుల శరీరములొ విద్యుత్ దాగిఉంటుంది . అదే జీవశక్తి వివాహ సమయం లో ఎవరు ముందుగా జీలకత్త బెల్లము తలపై పెడతారో వారి శక్తి అవతల శక్తిపై పడుతుంది . ఆ ప్రవాహశక్తి జీవితాంతం పనిచేస్తుంది అని , ఎవరు ముందుగా జీలకర్ర బెల్లము పెడతారో మారిమాటే చెల్లుబాటు అవుతుందని నమ్మకం .జీలకర్ర బెల్లముతో ఘర్షణ చేస్తే అలాగే జరుగునని నిరూపించ బడింది. వేద కల్పము తెలిసిన పెద్దలు దీనిని గ్రహించి వధూవరుల పరస్పర జీవశక్తుల ఆకర్షణకు తోడ్పడునట్లుగా జీలకర్ర బెల్లము తాకుట ఒక ఆచారముగా చేసారు. దీనివలన దృష్టి కలుపుట, మనస్సు సంకల్పించుట సంభవించునని నమ్మకము. సాంప్రదాయము గా అయితే పెళ్ళి కూతురు తో ముందు పెట్టిస్తారు .

మన సనాతన ధర్మంలో, వైదిక సాంప్రదాయంలో వివాహం చాల ప్రధానమైన అంశము. కానీ, మనలాంటి చాలామందికి, వివాహ సమయంలో చెసే చాలా క్రతువుల వైశిష్ట్యం తెలియదు (ఉదాహరణకు: స్నాతకం, గౌరీ పూజ, తలంబ్రాలు, జీలకర్ర-బెల్లం పెట్టడం, అప్పగింతలు మొదలైనవి...). వివాహం చేసుకునేవాళ్ళు మరియు వివాహం చేసే పెద్దలు వాటి అర్ధము మరియు ప్రాముఖ్యత తెలుసుకోవడంవల్ల మరింత ఎక్కువ ప్రయోజనాన్ని పొందగలము.

వేద మంత్రములతో, మంగళ వాయిద్యములు మారుమ్రోగగా ముత్తయిదువులు మంగళ గీతములు ఆలాపన చేయగా వధువు, వరుని నెత్తిపై జీలకర్ర, బెల్లం ముద్దగా చేసినది పెడుతాడు. అట్లే వధువు నెత్తిన జిలకర్ర, బెల్లం ముద్దగా చేసి బ్రహ్మరంధ్రం వద్ద ఉంచుతారు. ఈ సందర్భంలో పెళ్లికుమారుడు ఈ మంత్రాన్ని చెబుతాడు.

అబ్రత్రుఘ్నీం వరుణ అపరిఘ్నీం బృహస్పతే ఇంద్రపుత్రఘ్నీం లక్ష్మీం తామస్యై సవితంస్స :

ఓ వరుణదేవా! సవిత వలన ఈమెకు కలిగిన లక్ష్మీసోదరులకు అభివృద్ధిని కలిగించాలి. నీ దయవల్ల ఓ బృహస్పతీ ఈమె భర్తకు అభివృద్ధిని కలిగించేది కావాలి. ఇంద్రా! ఈమె పుత్రసంతానం పొందునట్లు అనుగ్రహించు.



  • ======================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Sunday, February 20, 2011

What is the history of visiting card, విజిటింగ్ కార్డ్ చరిత్ర ఏమిటి?



ఎవరినైనా కలవడానికి ఆఫీసుల్లోకి వెళ్ళగానే గుమ్మం దగ్గరుండే వ్యక్తి వేసే ప్రశ్న ' మీ విజిటింగ్ కార్డ్ ' ఇవ్వండి అని . తన పేరు , హోదా , అడ్రసు వగైరాలు రాసి ఉండే ఆ కార్డ్ చేతిలో ఇమిడేటంత చిన్నదే అయినా విజిటింగ్ కార్డ్ కి ఉన్న ఆ శక్తి మాత్రము ప్రత్యేకమైనది .

ఈ విజిటింగ్ కార్డ్ సంప్రదాయము 15 వ శతాబ్దములో మొదలైంది అని చరిత్ర చెపుతోంది . ఆ రోజుల్లో జమిందారులు , రాజవంశస్థులు తాము ఒక ప్రదేశానికి వెళ్ళే ముందు తమ పేరు , హోదా , అడ్రసు వగైరాలు వ్రాసి ఉన్న పత్రం ఒకటి అక్కడకి దూతకిచ్చి పంపేవారు . అది చూసి అవతలివారు ... వస్తున్న వారి హోదాకి తగిన స్వాగత సత్కారాలు ఏర్పాటు చేయాల్సి ఉండేది . . . అంటే ఉన్నత హోదాలో ఉన్నవారు తమ కింద స్థాయి వారికి తమ రాకగురించి తెలియజెప్పేందుకు పుట్టిందీ కార్డ్ . ఎవరైతే వస్తున్నారో వారి సమాచారము తెచ్చేకార్డ్ కాబట్టే దాన్ని విజిటింగ్ కార్డ్ అన్నారు . తరువాత విజిటింగ్ కార్డ్ అందరికీ సంబంధించిన అవసర వస్తువుగా మారింది . అయితే దీనిని పెద్దలు చిన్నవారికి పంపడం ఆగిపోయి , కిందిస్థాయి వారు పైస్థాయి వారికి తాము వచ్చిన విషయం తెలియజెప్పే సందేశ సమాచార పత్రం గా మారింది . ప్రస్తుతం విజిటింగ్ కార్డ్ చిన్నాలేదు .. పెద్దాలేదు ... ఎవరిని ఎవరు సందర్శించినా ఇచ్చి పుచ్చుకునే కాగితం ముక్క అయిపోయినది . అడ్రస్ ను పోన్‌ నెంబర్ ను ఇచ్చిపుచ్చుకునే కార్డ్ ముక్క అయిపోయినది ... ఒక ఫ్యాషన్‌ గా మారిపోయినది .
విజిటింగ్ కార్డ్ లక్షణాలు :

రూపము : సాధారణము గా కార్డ్ లు దీర్ఘచతురస్రాకారము లో ఉంటాయి. ప్రత్యేకమైన రూపము అంటూ ఏమీ లేదు . ఎవరికి నచ్చిన ఆకారము లో వారు ప్రింట్ చేసుకోవచ్చును . అయితే అందరికీ అమోదయోగ్యమైన రూపముంటే బాగుంటుంది. కొంతమంచి అండాకారము , గుండ్రము గా ఉన్నవి ఇస్టపడతారు మనిషికో బుద్ధి .

పరిమాణము : చేతిలో ఇమిడి ఉండే సైజు లో ఉంటే మనసుకి ఇంపుగా ఉంటుంది . అందరూ అమోదించే సైజు 3'' * 2'' లేదా 3 1/2'' * 2 1/2'' . కార్డ్ పైన ఉండే సమాచారము క్లుప్తము గా (simple ) ఉంటే బాగుంటుంది .

రంగు : ఏ రంగు కార్డ్ స్పస్టము గా అందరినీ ఆకర్షిస్తుందో చెప్పడం కస్టము . అందుకే యూనివర్సల్ రంగైన తెలుపు ను ఎక్కువ మంది వాడుతారు .

ముద్రణ : బడ్జెట్ కి తగ్గట్టు గా అక్షరాలు పలు రకాల మెటీరియల్ తోను , డిజైన్‌ లతోను , విభిన్న మందాలతోను ముద్రించవచ్చును . ఇప్పుడిప్పుడు క్లాత్ మీద , టిన్‌ మీద ముద్రించిన కార్డులు కూడా వాడుతున్నరు . అక్షరాలు గజి బిజి గా అర్ధం కాని విదంగా ఉండకూడదు .

సమాచారము : కార్డ్ చూడగానే ఒక అంచనా ఇచ్చేది గా ఉండాలి కార్డ్ మీద సమాచారము . ఆ సమాచారము స్పస్టము గా , క్లుప్తం గా ఉండాలి . చాట భారతం అంత మేటరు ఉంటే చదివేందుకు విసుగు వస్తుంది . ఉన్నా పోన్‌ నెంబర్లూ ముద్రించకుండా ముఖ్యమైన ఒక నెంబర్ ఉంటే బాగుంతుంది . పేరు , హోదా, కంపెనీ పేరు అడ్రస్ , పోన్‌, వెబ్ సైట్ , ఇమెయిల్ ఉండాలి .

కంపెనీ చిహ్నము - ఫొటో : తక్షణ గుర్తింపుకోసం కంపెనీ లోగో , తన ఫొటో సింపుల్ గా ఉంటే ... ఎంతో బాగుంటుంది .

భాష : విజిటింగ్ కార్డులు ఫలానా భాషలో ఉండలనేదేమీ లేదు . సాదారణం గా అందిరికీ అమోదయోగ్యం , ఎక్కడికెళ్ళినా ఉపయోగపడేదిగా ఉండేందుకు ఇంగ్లిష్ లో ఉంటే బాగుంటుంది .


  • =====================================
visit My website > Dr.Seshagirirao - MBBS.