జ : తల్లి గర్భములోనే శిశువుని అబార్షన్ చేయడము ద్వారా అంతము చేయడాన్ని " భ్రూణ హత్యలు " అంటాము . ఆ శిశువు ఆడ పిల్ల అయితే " స్త్రీ శిశు భ్రూణ హత్యలు " అంటాము . ప్రతి తల్లి దండ్రులు .. మగపిల్లవాడినే కోరుకుంటారు. ఈ కోరికకు అంతూ .. అపూ లేకపోతే ... ఆడ : మగ నిష్పత్తి లో తేడావచ్చి కొంతకాలానికి ఆడపిల్లల కొరత ఏర్పడుతుంది. దానిని నివారించేందుకు ఆయా దేశ ప్రభుత్వాలు ఈ భ్రూణ హత్యలు నివారించే చట్టాలు , జాగ్రత్తలు , నివారణ మార్గాలు ప్రవేశపెడుతూనే ఉంటాయి.
భారతదేశములో ప్రతి 100 మంది మగపిల్లకు 103 మంది ఆడ పిల్లలు పుడుతున్నారు.కాని మగపిల్ల కంటే ఎక్కువ సంఖ్యలో ఆడ పిల్లలు చనిపోతున్నారు. 0-5 వయసున్న పిల్లల్లో మగపిల్లల సంఖ్యకంటే ఆడపిల్లల సంఖ్య చాలా తక్కువగా ఉందని జబాభా లెక్కలు చెబుతున్నాయి. పెద్దయిన తర్వాత కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది.
ఇలా జరగడానికి కారణాలు :
- మగపిల్లవాడే కావాలని తల్లిదండ్రులు కోరుకోవడము .
- పుత్రుడు పుట్టాలనే కోరికతో తల్లిదండ్రులు ముందుగానే లింగ నిర్ధారణ పరీక్షలు చేయింది . గర్భములో ఉన్నది ఏ శిశువో తెలుసుకొని ఆడ బిడ్డ అయితే భ్రూణ-హత్యకు పాల్పడుతున్నారు.
- అనేక కుటుంబాలు ఆడపిల్లలను భారముగా భావించి ఈ ధారుణానికి పాల్పడుతున్నారు.
- వరకట్నం వేధింపులకు కొందరు ఆడపడుచులు ప్రాణాలు కోల్పోతున్నారు.
- మగపిల్లలకు ఇస్తున్న ప్రాధాన్యం ఆడపిల్లలకు ఇవ్వకపోవడము వల్ల కూడా ఆడపిల్లల మరణము పెరుగుతుంది.
- వైద్యము విషయములోనూ స్త్రీ . పురుష వివక్ష - స్త్రీ మరణానికి దారితీస్తుంది. మగపిల్లలకు ఇచ్చే సంరక్షణ , శ్రద్దలతో పోలిస్తే ఆడ పిల్లల ఆరోగ్యం ,జబ్బుల గురించి పట్టించుకోకపోవడము అనే "నిశ్శబ్ద హింస " వల్ల కూడా స్త్రీ జనాభా తరుగుతోంది.
- మన చట్టాలలో ఉన్న" స్త్రీ-పురుష సమానహక్కు" సరిగా అవలు కాకపోడము కూడా స్త్రీలు... సమాజము లో చిన్నచూపుకి (down thinking) గురిఅవుతున్నారు. . . . అణగదొక్కపడుతున్నారు. హత్యలకు , మానభంగాలకు, అత్తమామల వేధింపులకు గురి అవుతున్నారు. అలా స్త్రీ జనాభా తరిగిపోతుంది . పుట్టుకకు స్త్రీలు ముందంజగానే ఉన్నా ... పెద్ద అయ్యేసరికి కారణాలు ఏమైనా వెనకంజ పడుతున్నారు.
- ========================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...