- ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
ప్రశ్న: మన శరీరం మీద నూనె, నెయ్యి తదితర తైల పదార్థాలు పడితే జిడ్డు అంటుకుని సబ్బుతో కడిగితే కానీ పోదు. కానీ మనం నూనె వస్తువులను ఎప్పుడు తిన్నా నాలుక మీద జిడ్డు అంటదు. ఎందుకని?
జవాబు: మన శరీరంలో చర్మపు ఉపరితలం సేంద్రియ (ఆర్గానిక్) పదార్థాలతో నిర్మితమై ఉంటుంది. నూనె, నెయ్యి లాంటి తైలాలు కూడా సేంద్రియ ద్రవాలే. కాబట్టి చర్మం మీద నూనెలు పడితే వాటి మధ్య తేలికపాటి రసాయనిక బంధాలు ఏర్పడి చర్మానికి అంటుకుంటాయి. సబ్బుతో కడిగితే కానీ పోవు. కానీ నాలుక ఎపుడూ తడిగా ఉంటుంది. ఉపరితలం అంతా లాలాజలంతో కప్పుకుని ఉంటుంది. అంటే ఒక విధంగా నాలుక ఉపరితలం నిరింద్రియ (ఇన్‌ఆర్గానిక్) పదార్థమయం. నూనెలకు, నీటికి పడదు. కాబట్టి నూనెల్ని జలవిరోధ (hydrophobic) పదార్థాలు అంటాము. నూనెలు కలిసిన ఆహార పదార్థాలను నమిలినప్పుడు నోటిలో ఎక్కడ చూసినా లాలాజలపు చెమ్మ ఉండడం వల్ల ఆ నూనెలు నాలుకకు అంటుకోవు.
-ప్రొ.ఎ. రామచంద్రయ్య, నిట్,-వరంగల్; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
- =====================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...