- ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
జ : -ఆలుమగలు ఎలాంటి అరమరికలు, అపార్థాలు లేకుండా అన్యోన్యంగా జీవించే ఇల్లు భూతల స్వర్గంగా ఉంటుంది. అయితే ఆలుమగలు ఎంత అనురాగంతో ఉన్న ఏదో ఒక సందర్భంలో కలతలు మూమూలుగానే వస్తుంటాయి. అలాంటి సందర్భాల్లోనే భార్యాభర్తలు తెలివిగా మసలుకోవాలి, ప్రేమలు రెట్టింపు కావడానికి, మనస్పర్థలు పెరిగిపోవడానికి అవే మూలం. మనస్పర్థలు, భేదాలు వచ్చినపుడే కొంచెం సేపు లేదా కొన్ని గంటలు ఎడమొఖం పెడముఖంగా ఉన్నా, ముందు ఉక్రోషాన్ని, ఆవేశాన్ని అదుపులో ఉంచుకుని తప్పెవరిదో కూల్‌గా ఆలోచించుకోవాలి. తప్పెవరిదైనా ఎవరో ఒకరు పట్టుదల సడలించుకుని రాజీకి ప్రయత్నించాలి. ఎవరెక్కడ పుట్టిపెరిగినా గతంలో పరిస్థితులు ఎటువంటివైనా ఆలుమగలుగా సంసారం మొదలుపెట్టిన తరువాత ఇద్దరూ వేరు కాదనే నిజాన్ని అన్ని కోణాలనుంచి అర్థం చేసుకోవాలి. భార్యదగ్గర భర్తకు, భర్తదగ్గర భార్యకు భేషజం అనేది ఉండకూడదు. ఎవరెంత ఆత్మాభిమానం కలవారైనా ఆలుమగలు ఒకరిదగ్గర మరొకరు ఆత్మాభిమానం ప్రదర్శించుకోవడం అర్థం లేనిపని, అందుకే అభిప్రాయ బేధాలు వచ్చినప్పుడే రాజీకి చొరవతీసుకుంటే అదేదో లొంగిపోయినట్టు, ఆత్మాభిమానాన్ని తాకట్టుపెట్టినట్టుకాదు. రాజీకి చొరవ తీసుకుని పట్టు వీడి ఆనంద సామ్రాజ్యంలో మునిగి తేలుతున్నవేళ అవసరమనుకుంటే అప్పుడే తమ ఉక్రోషాన్ని, దు:ఖాన్ని బయట పెట్టుకోవచ్చు.ఇలా చేయడం వలన కోపతాపాలు పోయి అభిమానం రెండింతలవుతుంది. అలా కాకుండా అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడే ఎవరికివారే తమ వాదాన్ని బలపరుచుకుని ఆత్మాభిమానంతో మొండిగా కూర్చుంటే ఆ పట్టుదలలు పెరిగి, స్పర్థలు అధికమై పరిస్థితి తీవ్ర పరిణామాలకు దారి తీస్తుంది.
ఆలు మగల మధ్య ఏర్పడే అభిప్రాయ బేధాలు వినేవారికి, చూసేవారికి చాలా చిన్నవిగా ఉంటాయి. కానీ ఇవి భార్యాభర్తలకు అగ్నిపర్వతాల్లా అనిపిస్తాయి.చివరికి అగ్ని పర్వతం బద్దలైనట్టు అవుతుంది. ముఖ్యమైన విషయమేమిటంటే ఆలుమగల సంబంధాలు ఒక్క గొడవ మూలంగానో, ఒక్క కారణం చేతనో దెబ్బతినవు. కాబట్టి తరచూ ఏర్పడే గొడవలకు ఇద్దరూ కారణమవుతారు. మనస్పర్థలు ఏర్పడిన ఆలు మగలు ఒకరిపై ఒకరు చేసుకొనే ప్రధాన ఫిర్యాదు ”అస్సలు మాట వినిపించుకోరని”. ఈ సమస్యకు పరిష్కారం చాలా తేలిక. ఒక మాట చెప్పినపుడు వినిపించుకోనప్పుడు కోపం తెచ్చుకోకుండా సరైన సందర్భం చూసుకుని అలవోకగా అదే మాట చెప్తే పాజిటివ్ రిజల్ట్ వస్తుంది. ఈ సైకాలజీని ఆలుమగలు గ్రహించాలి. స్త్రీ, పురుష అహంకారాలు, పుట్టింటి వారి ఆర్థిక బేదాలు, శరీర రంగులు తేడాలు, ఇతర హోదాలు అలుమగలు పోల్చుకోవటమంత బుద్ది తక్కువ తనం మరొకటి ఉండదు. స్వీట్ హోంలా పోల్చదగ్గ కాపురంలో వాటికి తావుండకూడదు. ఏదో ఒక సందర్భంలో భార్యను భర్త విసుక్కున్నా, భర్తని భార్య విసుక్కున్నా ఆ సందర్భాన్ని అర్థం చేసుకుని, మనస్సు కష్టపెట్టుకోకుండా సరిపెట్టుకోవాలి. అవసరమైతే సహకరించడానికి ప్రయత్నం చేయాలి. అలా చేస్తే కష్టపెట్టినందుకు తమకు తామే ఎంతో నొచ్చుకుని మరింత దగ్గరవుతారు. అలానూ గాకుండా ప్రతిమాట పట్టించుకుని పంతం ప్రదర్శించే వారైతే ఆ చిన్న సమస్య పెరిగి పెద్దదవుతుంది. ఆలుమగలు పరస్పర భావోద్రేకాలను, శారీరక మానసిక అవసరాలను గురించి అవగాహన గలిగినప్పుడే ఆ సంసారంలో అనురాగమే తప్ప, అపార్థానికి తావుండదు. ఏమైనా చిన్న చిన్న చికాకులు ఏర్పడినా వాటంతటవే సర్దుకుపోతాయి. ప్రేమ సామ్రాజ్యంలో లొంగిపోవటమే గొప్ప తప్ప, ఆధిక్యత ప్రదర్శించటం ఏమాత్రం గొప్పకాదనేది ప్రాథమిక సూత్రం. ఈ సూత్రాన్ని పాటించిన ప్రతి ఇల్లూ స్వీట్ హోమ్ అవుతుంది. అటువంటి అభిప్రాయం ఒకరికి ఉండి మరొకరిని మార్చటం సాధ్యం కానప్పుడు, ఆ విషయం బయట పెట్టకుండా ఒక మంచి సందర్భం చూసుకుని, ఇరువురూ చర్చించుకుని కౌన్సిలింగ్‌లో సలహా తీసుకోవచ్చు. ఇలాంటి కౌన్సిలింగ్ ఏమాత్రం తప్పుకాదు. ఆలుమగలు madhya అనురాగానికి, ఆగ్రహానికి తేడా చాలా తక్కువ . ఆలుమగల మధ్య ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ అనే ప్రసక్తి ఉండకూడదని గ్రహించిన నాడే అది తప్పక స్వీట్ హోమ్ అవుతుంది. జీవపరిణామ క్రమములో మగవాడు ముందు ... తరువాత ఆడుది పుట్టినవి అయినందున మూర్ఖత్వము కొన్ని జంతులక్షణాలు మగవారికే ఉంటాయి. కావున స్త్రిలే సర్దుకు పొవాలి. భర్తకు ఇత్ష్టము లేనిది భార్యకు ఎంత ఎష్టమైనా వదుకోవడమే ఉత్తమము మరియు అలా గ్రహించిన నాడే అది తప్పక స్వీట్ హోమ్ అవుతుంది.
ఫలప్రదమైన అనుబంధాలు చాలా వరకు అర్థవంతమైన సంభాషణల మీదే ఆధారపడి ఉంటాయి. అయితే సంభాషణలు సహజంగా, దాపరికం లేకుండా సాగాలి. అలా చర్చించుకోవలసినవి.
-కెరీర్ : దంపతులు ఇరువురూ ఉద్యోగాలు చేస్తున్నా, కొంతమంది జీవిత భాగస్వామికి తమ సమస్యేమిటో చెప్పే ప్రయత్నమే చేయరు. నిజానికి సంస్థలు వేరు వేరయినా, చాలా సార్లు ఆ సమస్యలు ఒకేలా ఉంటాయి. అందుకే జీవిత భాగస్వామి నుంచే ఒక గొప్ప పరిష్కార మార్గం లభిస్తుందనే విషయాన్ని ఎప్పుడూ మరిచిపోకూడదు.
-ఆర్థిక విషయాలు : కుటుంబ ఆర్థిక విషయాల గురించి ఉమ్మడిగా చర్చించుకోవడం ద్వారా, ఎన్నో సమస్యలకు ఆదిలోనే అడ్డుకట్ట వేయవచ్చు. కుటుంబానికి సంబంధించి, అప్పులు, ఆదాయాలు ఇలా అన్ని విషయాలూ ఇద్దరికీ పూర్తిగా తెలిసి ఉండడం వల్ల, ఏదైనా సమస్య వచ్చినప్పుడు కూడా వాటిని అధిగమించడం సులువవుతుంది.
-కుటుంబ బంధాలు : దంపతులిద్దరూ పరస్పరం రెండు కుటుంబాల విషయాల్లో బా«ధ్యతగానే ఉండాలి. ఇది దంపతుల మధ్య ఒకరి పట్ల మరొకరికి గౌరవ భావం పెరిగేందుకు కూడా తోడ్పడుతుంది.
-హాబీలూ ముఖ్యమే : ఎంతసేపూ కుటుంబ నిర్వహణ విషయాలకే పరిమితం కాకుండా, తమ తమ హాబీల విషయంలోనూ పరస్పరం చర్చించుకోవడం ఎంతో మేలు. దీనివల్ల ఒకరి పురోగతికి మరొకరు తోడ్పాటును, ప్రోత్సాహాన్నీ అందించినట్లు అవుతుంది.
-భవిష్యత్తు పై ఒక భరోసా : కొందరిని భవిష్యత్తు గురించిన ఒక అభద్రతా భావం కుదిపేస్తూ ఉంటుంది. ఒక పక్కా ప్రణాళిక ఏదీ లేకపోవడమే దీనికి కారణం. అందుకే,భవిష్యత్తు గురించిన ఒక నిశ్చింత ఏర్పడే ఆలోచనా క్రమం నిరంతరం సాగాలి. అందుకే భవిష్యత్తు విషయాలపై కూడా దృష్టి నిలపడం ఏ జంటకైనా ఎంతో ముఖ్యం.
- =======================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...