ప్రశ్న: సెల్‌ఫోన్లకు సంబంధించి తరచు ఎమ్.ఎమ్.ఎస్. అనే మాటను వింటాము. ఏమిటి దానర్థం?
-అను, రేపల్లె (గుంటూరు)
జవాబు : సెల్‌ఫోన్ ద్వారా సమాచారాన్ని క్లుప్తంగా పంపే విధానాన్ని ఎస్.ఎమ్.ఎస్. అంటారు. అంటే షార్ట్ మెస్సేజ్ సర్వీస్ అని అర్థం. కేవలం టెక్ట్స్ సమాచారమే కాకుండా బొమ్మలు, ఫొటోలు, పాటల్ని, వీడియోలతో కలిపేలా సందేశాన్ని పంపడాన్నే ఎమ్.ఎమ్.ఎస్. అంటారు. కంప్యూటర్ పరిభాషలో దీన్ని మల్టీమీడియా మెస్సేజ్ సర్వీస్ అంటారు. అయితే ఎమెమ్మెస్ పంపాలంటే సెల్‌ఫోన్లలో ప్రత్యేక సదుపాయం ఉండాలి. ఇలాంటి సందేశాలను పంపినందుకు సెల్‌ఫోన్ కంపెనీలు కొంత రుసుమును వసూలు చేస్తాయి. ఎసెమ్మెస్, ఎమెమ్మెస్‌ల పేర్లలోనే కాకుండా సెల్‌ఫోన్లలో సమాచారం సంకేతాలుగా మారే ప్రక్రియలో కూడా తేడా ఉంటుంది.
-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్,-వరంగల్; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక.
- ==================================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...