ప్రశ్న:అయస్కాంత ఫ్లక్స్ అంటే ఏమిటి?,
- సిహెచ్. సాయికుమార్
జవాబు: ఒక వస్తువును మరో వస్తువు ప్రభావితం చేసేందుకు రెండే పద్ధతులు ఉన్నాయి. ఒకటి ప్రత్యక్షంగా యాంత్రిక బంధాన్ని ఏర్పరుచుకోవడం. రెండు అవి ప్రదర్శించే క్షేత్ర ఫలితాల (field effects) ద్వారా ప్రభావితం కావడం. మనం సైకిల్ తొక్కినా, కలం పట్టుకుని రాసినా అది యాంత్రిక బంధమే అవుతుంది. కానీ ఎక్కడో 15 కోట్ల కిలోమీటర్లకు పైగా దూరంలో ఉండే సూర్యుడు తన చుట్టూ భూమిని తిప్పుకునేలా ప్రభావం కలిగించడం యాంత్రిక బంధం కాదు. అది గురుత్వ క్షేత్ర ఫలితం. అలాగే ఒక అయస్కాంతం మరో అయస్కాంతాలన్ని తాకకుండానే ప్రభావం చూపగలదు. ఇది అయస్కాంత క్షేత్ర బలం. యాంత్రిక బంధం లేకుండా ఒక వస్తువు మరో దానిపై ప్రభావం చూపుతోందంటే గురుత్వ, అయస్కాంత, విద్యుత్ క్షేత్రాల ప్రభావం ఉన్నట్టే. క్షేత్ర తీవ్రతను బలరేఖల (lines of force) ద్వారా పరిగణిస్తారు. నిర్ణీత వైశాల్యం నుంచి నిర్దిష్ట దిశలో ప్రసరించే క్షేత్ర బలరేఖల సంఖ్యను ఆ క్షేత్రపు ఫ్లక్స్ (flux) అంటారు.
- ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్, వరంగల్; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
- ====================================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...