Saturday, January 26, 2013

House wife home needs ?,ఇల్లాలి హోమ్‌ నీడ్స్ అంటే ఏమిటి ? అవి ఏవి ?

  •  

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్ర : ఇల్లాలి హోమ్‌ నీడ్స్ అంటే ఏమిటి ? అవి ఏవి ? 

జ : వంటగది లో అవసరమైన వస్తువులు అందుబాటులో లేకపోతే ఆ ఇంటి ఇల్లాలు యుద్ధభూమిలో ఆయుధాలు లేని యోధురాలు వంటిదైపోతుంది. ఆ వస్తువులనే "ఇల్లాలి  హోమ్‌ నీడ్స్ " అంటాము అని అనుకుంటాను. . అవి ->
  1. రెఫ్రిజిరేటరు , 
  2. వాషింగ్ మిషన్‌,
  3. మైక్రోవేవ్ ఒవెన్‌, 
  4. వ్యాక్యూమ్‌ క్లీనర్ , 
  5. గీజర్ , 
  6. వాటర్ ప్యూరిఫైయర్ , 
  7. జ్యూస్  - మిక్షర్ - గ్రైండర్ , 
  8. ఫుడ్ ప్రొసెసర్ , 
  9. ఓవెన్‌-టోస్టర్ -గ్రిల్లర్ , 
  10. కాఫీ మేకర్ , 
  11. డిస్ వాసర్ , 
  12. ఎయిర్ కండిషనర్ ,
  • =========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

How long can we withhold breath?,మనుషులు ఊపిరిని ఎంత సమయము బిగబట్టగలౌ ?

  •  

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

 ప్ర : మనుషులు ఊపిరిని ఎంత సమయము బిగబట్టగలౌ ?

జ : ఎంతో సాధన చేసినా మనిషి రెండు నిమిషాల కన్నా ఊపిరి బిగబట్టలేడు  . ప్రతిక్షణము ఊపిరిసాగితేనే మనిషి జీవిస్తాడు . సాధారణముగా 30 సెకెండ్లు ఊపిరి ఆపుకోగలం . అది దాటిందా మెదడు స్పందించడం మొదలు పెడ్తుంది. , కళ్ళు తిరిగి నట్లు అవుతాయి.  నీటమునిగి ఈత కొట్టేవారు సాధన ద్వారా కొంచం ఎక్కువసేపు ఊపిరి బిగపట్టి ఉండగలరు .

ఊపిరి బిగపట్టడము మంచిది కాదు ... మెదడుకి రక్తం సరఫరా తగ్గి దెబ్బతింటుంది.
  • =========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Tuesday, January 22, 2013

What are the five items of meal?-పంచభక్ష్య భోజనము అంటే ఏమిటి?

  •  
  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

 ప్ర : పంచభక్ష్య భోజనము అంటే ఏమిటి?

జ : 1.భక్ష్యము , 2.భోజ్యము ,3.చోష్యము, 4.లేహ్యము , 5.పానీయము ...ఈ 5 విధాలైన పదార్ధాలతో కూడిన భోజనమే " పంచభక్ష్యభోజనము " . అంటే 

  • 1.భక్ష్యము = నమిలి తినేది,
  • 2.భోజ్యము = చప్పరిస్తే కరిగిపోయేది,
  • 3.చోష్యము = పీల్చుకునేది/జుర్రుకునేది,
  • 4.లేహ్యము = నాక్కుంటూ తినదగినది,
  • 5.పానీయము = త్రాగేది,
  • ======================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Friday, January 11, 2013

Sunrise & Sunset is reddish why?,ఉదయపు సాయంత్రపు సూర్యకాంతి ఎరుపేల?

  •  
  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: సూర్యుడు ఉదయం సాయంత్రం ఎర్రగా కనిపించడానికి కారణం ఏమిటి?

జవాబు : భూమ్మీద ఒకచోట సూర్యోదయం జరుగుతున్న సందర్భంలో మరోచోట అది మధ్యాహ్నం కావచ్చు, ఇంకో చోట అస్తమయం, వేరోచోట అర్థరాత్రి కూడా కావచ్చు. కానీ ఆయా ప్రాంతాల్లో ఉదయం, సాయంత్రం సమయాల్లో సూర్యబింబం ఎర్రగా లేదా నారింజ రంగులో కనిపించడానికి ప్రధాన కారణం భూ వాతావరణమే. చంద్రుడి మీద నిలబడి సూర్యాస్తమయం, సూర్యోదయం, మధ్యాహ్నం ఎప్పుడైనా ఒకే విధంగా (దాదాపు తెల్లగా) కనిపిస్తుంది.ఉదయం సాయంత్రం సమయాల్లో భూ వాతావరణంలో ఎక్కువ దూరం సూర్యకాంతి ప్రసరించి మనల్ని చేరుతుంది. మధ్యాహ్నం సమయంలో తక్కువ దూరం ప్రసరిస్తుంది. దీనికి కారణం భూమి, దాని వాతావరణం, గోళాకృతి (spherical shape) లో ఉండడమే. కాంతి తరంగాలు పదార్థాలగుండా ప్రయాణించే క్రమంలో కొంత మేరకు పరిక్షేపణం (scattering)కావడం ఒక ధర్మం. ఈ పరిక్షేపణం తక్కువ తరంగ ధైర్ఘ్యం (wavelength)ఉన్న ఊదా, నీలం, ఆకుపచ్చ రంగులకు ఎక్కువగాను తరంగదైర్ఘ్యం ఎక్కువగానున్న ఎరుపు, నారింజ రంగులకు తక్కువగా ఉంటుంది. అందువల్ల సౌరకాంతి వాతావరణంలో దూసుకెళుతున్న సందర్భంలో ఎరుపు, నారింజ రంగులు తక్కువే పరిక్షేపణం చెందడం వల్ల ఎక్కువ దూరం వరకు కొంతలో కొంత చేరగలవు. కానీ తక్కువ తరంగదైర్ఘ్యం గల కాంతిలో మార్గమధ్యంలోనే పరిక్షేపణం బాగా చెంది మనల్ని చేరేలోగానే అంతరించిపోతాయి. ఈ ఘటన తక్కువ దూరమే ప్రయాణించే పరిస్థితి ఉన్నా మధ్యాహ్నం తటస్థపడదు. అందువల్ల అన్ని రంగులూ, వెరసి తెల్లని కాంతిగల సూర్యుణ్ని మధ్యాహ్నం పూట, కేవలం ఎరుపు, నారింజ రంగులే అధికంగా గల సూర్యకాంతిని ఉదయం, సాయంత్రం చూస్తాము.

- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
  • ==========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Tuesday, January 08, 2013

Roten egg floats on water why?,కుళ్ళిన కోడి గుడ్డు నీటిలో ఎందుకు తేలుతుంది ?

  •  

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్ర: కుళ్ళిన కోడి గుడ్డు నీటిలో ఎందుకు తేలుతుంది ?

జ : పాడైన గుడ్లు మాత్రమే కాదు , ఉడకబెట్టిన గుడ్లు కూడా నీటి్లో తేలుతాయి. ఒక మామూలు గుడ్డుకి , కుళ్ళిపోయిన గుడ్డుకి సాంద్రతలో తేడా రావడమే దానికి ప్రధాన కారణము . సాధారణముగా ఒక మంచి కోడిగుడ్డు సాంద్రత నీటి సాంద్రత కన్నా ఎక్కువగా వుంటుంది . ఈ కారణముగా అది నీటిలో మునుగుతుంది . కుళ్ళిపోయిన గుడ్డుకూడా అదే పరిమాణములో ఉన్నప్పటికీ దానిలో నుండి కొన్ని  బిందువులు గుడ్డు పెంకుకి ఉండే సూక్ష్మమైన రంధ్రాల గుండా బయటకి వెళ్ళిపోతాయి. దాంతో గుడ్డు ద్రవ్యరాశి తగ్గిపోతుంది.

ఎదైనా ఒక వస్తువు యొక్క ఘన పరిమాణము తగ్గకుండా , దాని ద్రవ్యరాశి మాత్రం  తగ్గిందీ అంటే దానర్ధము ఆ వస్తువు సాంద్రత తగ్గిపోయిందనే . ఉదాహరణము .. ఒక లీటరు పాలు పట్టే పాత్రలో ఓ పదికోట్ల గాలి కణాలు బందించామనుకుందాం . అప్పుడు  ఆ పాత్ర సాంద్రత కేవలము 5-6 కోట్ల గాలి కణాలను మాత్రమే బందించామనుకుందాం . పాత్ర అలాగే ఉన్నప్పటికీ , లోపలి గాలి తీసేస్తే .. ద్రవ్యరాశి తగ్గిపోవడం వల్ల పాత్ర సాంద్రత ఆ మేరకు తగ్గిపోతుంది. కుళ్ళిన గుడ్డు విషయములోనూ ఇలాగే జరుగుతుంది . కుళ్ళిన గుడ్డుసాంద్రత నీటి సాంద్రత కన్న తక్కువగా వుండటం వల్ల అది నీటిలోతేలుగుంది. . ఈ సందర్భముగా మనము మరొక ముఖ్యమైన విషయాన్ని కూడా గుర్తించాలి .ఒకవేళ కోడిగుడ్డుని చిక్కని ఉప్పునీటిలో వేసినట్లైతే గుడ్డు కన్నా ఉప్పు నీటి సాంద్రత ఎక్కువగా వుండె కారణముగా మనము నీటిలో వేసిన గుడ్డు మంచిదైనా , పాడైనదైనా అది ఉప్పునీటిలో తేలుగుంది.

  • ======================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Saturday, January 05, 2013

Who was Joseph Pulitzer?-జోసెఫ్ పులిట్జర్ ఎవరు ?

  •  
  •  

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

 ప్ర : పత్రికారంగములొ ఒకవ్యక్తి  ప్రజల్ని ఉత్తేజితులను చేసిన మహానుభావుడు " పులిట్జర్ " ఆయన గురించి తెలియజేయ ప్రార్ధం!

జ : జోసెఫ్ పులిట్జర్ అమెరికన్‌ . ఇతని తండ్రి ధాన్యము , గోధుమల వర్తకము చేసేవాడు . పులిట్జర్ హంగేరిలో జన్మించి అమెరికాలోని పత్రికా ప్రపంచం  లో ప్రత్యేక స్థానము పొందాడు . దిన , వార పత్రిక అని ప్రచురించిన ఖ్యాతి ఈయనకి దక్కింది. తన దిన పత్రికలో అవినీతి గురించి చాలా ఘాటుగా విమర్శించి అక్షరయుద్ధం చేసిన మహనీయుడు .

పత్రికల్లో కాస్తంత హాస్యము , పాఠకులలో కుతూహలమురేపే  విషయాలు , సెన్సేషనల్ న్యూస్ - ఇలా దిన పత్రికలలో కొత్త వరవడికి శ్రీకారము చుట్టిన వ్యక్తి . పులిట్జర్ పత్రికలతో మమేకమై , పత్రికా వృత్తిని విపరీతముగా ప్రేమించాడు . నోబుల్ ప్రైజ్ కి ధీటుగా పులిట్జర్ ప్రైజ్ ఏర్పాటుచేసాడు.  పత్రికా సంపాదకునికో , సాహసవంతమైన విలేఖరుకో , ఏటా పులిట్జర్ ప్రైజ్ ఇస్తూ ఉంటారు. నోబుల్ పైజ్ కు ఉన్నంత ఖ్యాతి , గౌరవం , విలువ ఈ పులిట్జర్ ప్రైజ్ కీ ఉన్నది.
  • 'పులిట్జర్' పురస్కారం
అమెరికాకు చెందిన ప్రచురణ కర్త జోసెఫ్ పులిట్జర్... పులిట్జర్ బహుమతిని నెలకొల్పాడు 'పులిట్జర్' బహుమానం అనేది ఒక అమెరికా పురస్కారం. ఈ పురష్కారాన్ని వార్తాపత్రికలు మరియు ఆన్‌లైను పత్రికారచన, సాహిత్యం మరియు సంగీత స్వర రచన రంగాలలో విశేష కృషి చేసినవారికి ప్రధానం చేస్తారు. అమెరికాలో ప్రతిఏటా ప్రింట్ జర్నలిజం, సంగీతం, సాహిత్య రంగాల్లో నిష్ణాతులకు పులిట్జర్ బహుమతి ప్రకటిస్తారు. జోసెఫ్ పులిట్జర్ అనే ఒక ప్రచురణకర్త పేరు మీద న్యూ యార్క్ లోని కొలంబియా విశ్వ విద్యాలయం ప్రతి ఏటా ఈ బహుమతిని ఆయా రంగాల్లో ఉన్నత విలువలు సాధించిన వారికి ప్రకటిస్తారు.
  • ========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Tuesday, December 25, 2012

What is Entaming and Grooming?,ఎంబామింగ్ మరియు గ్రూమింగ్ అంటే ఏమిటి ?

  •  

  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

అందము గా లేని వారు అందమైన అలంకరణలు చేసుకోవడం, ఆకర్షణీయం గా కనిపించడం కోసము చేసే పక్రియలనే ఎంటామింగ్ మరియు గ్రూమింగ్ అంటారు . ఇదే పక్రయని  చనిపోయినవారి విషములో కడసారి చూపుకోసము మృతదేహానికి సజీవముగా కనిపించేందుకు చేసే మెరుగులు. ఎఫైర్ లలో పడ్డవారు , లేదా పెట్టుకుంటున్న వారు , తమ స్వంత  వేష  ధారణా , వ్యక్తిగత గ్రూమింగ్ అంటే పోషణా , అందం, ఆకర్షణా , ఇట్లాంటి విషయాల మీద , మునుపెన్నడూ లేని శ్రద్ధ  చూపుతారు. లేటెస్టు హెయిర్ స్టయిల్ లు చేయించుకోవడం, జిమ్  కు వెళ్ళడం ,మంచి ఖరీదైన బట్టలు వేసుకోవడానికి ఉత్సాహం చూపడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు.

వైద్యరంగము లో

ఎంబామింగ్ అంటే? కొన్ని సందర్భాల్లో మృతదేహాన్ని చాలా రోజులపాటు అంత్యక్రియలు నిర్వహించకుండా ఉంచాల్సి ఉంటుంది. అప్పుడు మృతదేహం కుళ్లిపోకుండా చూడాలి. శరీరం కొంతకాలంపాటు దెబ్బతినకుండా ఉండేందుకు ఎంబామింగ్ నిర్వహిస్తారు. ఈ ప్రక్రియలో కొన్ని రసాయనాలను ధమనుల ద్వారా శరీరంలోకి ఎక్కిస్తారు. ఈ ద్రావకాలనే 'ఎంబామింగ్ ఫ్లూయిడ్స్' అని పిలుస్తారు. ఫార్మాల్డిహైడ్, మెథనాల్, ఇథనాల్‌తోపాటు మరికొన్ని రకాల రసాయనాలను ఈ ప్రక్రియలో వాడతారు. అమెరికాలో ఏటా 2 కోట్ల టన్నుల ఎంబామింగ్ ద్రావకాలు వినియోగిస్తారని అంచనా.  అమెరికాలో ఇప్పుడు ఎంబామింగ్ పద్ధతిలో ఆత్మీయుల మృతదేహాలను వెనువెంటనే కుళ్లిపోకుండా చేయడంలో ముందంజవేశారు. అక్కడ ఏటా 2కోట్ల టన్నుల ఎంబామింగ్ ప్లూయిడ్స్, కెమికల్స్ అమ్ముడవుతున్నాయంటే, ఈ ప్రకియ అవసరం ఎంతగా గుర్తించారో అర్థంచేసుకోవచ్చు. ఎంబామింగ్ ప్లూయిడ్స్ ని ఎక్కించడం వల్ల బాక్టీరియా వంటి సూక్ష్మజీవులు చచ్చిపోతాయి. అంటే, ఈ ఫ్లూయిడ్ ఏరకంగానూ బాక్టీరియాకు న్యూట్రియంట్ ఫ్లూయిడ్స్ గా పనిచేయవు.

గ్రూమింగ్ అంటే...
తమ ఆత్మీయులు మరణించినప్పుడు వారి మృతదేహాన్ని కడసారి చూసిన రూపం చిరకాలం గుర్తుండిపోతుంది. ఆ 'తుది జ్ఞాపకం' ఇబ్బందికరంగా కాకుండా, ఎప్పట్లా ఆత్మీయంగానే  ఉండాలని చాలామంది కోరుకుంటారు. ఈ కోరికను బాడీ గ్రూమింగ్ తీరుస్తోంది. ఇది కూడా ఎంబామింగ్‌లో భాగమే. ఈ ప్రక్రియలో మరణించిన వ్యక్తి అంతకుముందు మంచి ఆరోగ్యంతో ఉన్నప్పుడు తీసిన ఫొటోను ఉపయోగిస్తారు. జననం ఎంత సహజమో, మరణం అంతే సహజం. కానీ ఈ రెంటినీ ఒకే మోస్తరుగా జీర్ణించుకోలేకపోవడమే సామాన్యుల నైజం. ఇంతకాలం తమమధ్యనే ఉంటూ తమకు వెన్నుదండుగా ఉండే ప్రియతమ వ్యక్తులు ఉన్నట్టుండి హఠాత్తుగా కనుమరుగైనప్పుడు వారి రూపాన్ని మనసులోనేకాకుండా, కళ్లెదుట కూడా ప్రశాంత
వదనంతో కనిపించాలని కోరుకోవడం తప్పేమీకాదు. ఈ తరహా మనోభావాలకు రూపకల్పం ఇస్తున్న `ఎంబామింగ్' ప్రక్రియ నిజంగానే ఓ ఊరట అనే చెప్పాలి

ఎంబామింగ్ నిపుణుడు ఈ ఫొటో ఆధారంగా మృతదేహానికి సాధ్యమైనంతగా మునుపటి రూపాన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తారు. బుగ్గలు బాగా లోపలికి వెళ్తే.. మైనపు పూతపూసి ఉబ్బినట్లు చేస్తారు. చాలారోజులపాటు అస్వస్థతకు గురైనవారి కనుగుడ్లు పీక్కుపోయి ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో ప్లాస్టిక్ కనుగుడ్లను సహజంగా అమర్చుతారు. శరీరంపై పడిన  ముడతలను తొలగిస్తారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత... మృతదేహానికి 'సజీవ' రూపం వస్తుంది. దీనినే 'ఫేస్ లిఫ్టింగ్' అని కూడా పిలుస్తారు. అమెరికాలాంటి దేశాల్లో మరణించిన భారతీయుల మృతదేహాలను స్వస్థలాలకు తీసుకు వచ్చేందుకు చాలా రోజులు పడుతుంది. ఈలోపు శరీరాలు కుళ్లిపోకుండా ఉండటంతోపాటు, ఆత్మీయుల బాధను కాసింతైనా తగ్గించేందుకు అమెరికా అధికారులు ఎంబామింగ్, గ్రూమింగ్ చేసిన తర్వాతే మృత దేహాలను తరలిస్తుంటారు.

అమెరికాలాంటి దేశాల్లో దీనికి ప్రత్యేకమైన కోర్సు ఉంది. మన దేశంలో అతి కొద్ది మంది ప్రముఖుల విషయంలో మాత్రమే ఇవి చేస్తున్నారు. మరణానంతరం కూడా సత్యసాయి భక్తులకు  ప్రశాంత చిత్తంతో దర్శనమిస్తున్నారంటే, అందుకు ఈ ప్రక్రియలే కారణం!

  • =============================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Tears flow in coryza why?-జలువు చేస్తే కన్నీళ్ళెందుకు కారతాయి?

  •  
  •  
  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
 ప్ర : జలువు చేస్తే కన్నీళ్ళెందుకు కారతాయి?

జ : కంటిలో తేమను కాపాడేందుకు కంటిలో నీరు ఎల్లప్పుడూ ఉతపత్తి అవుతూ ఉంటాయి. ఆ నీరు అధికము గా ఉత్పత్తి అయితే ''లాక్రిమల్ డక్ట్ ''ద్వారా ముక్కులోనికి చేరుతుంది .అక్కడ తేమలో కలుస్తుంది . జలుబు చేసినప్పుడు ముక్కులోని సూక్ష్మరంధ్రాలు మూసుకుపోయి ఆ కన్నీరును ముక్కులోనికి రానీయవు . ఫలితము గా అదనము గా ఉప్తత్తి అయిన కన్నీరు కంటినుండి బయటకి వస్తుంది ... అదే కంటివెంట నీరు కారడము .
  • ========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Wednesday, December 19, 2012

Do have not camel thirsy?-ఒంటెలకు దాహమేయదా?

  •  
  • ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: ఒంటెలు ఎడారులలో చాలా కాలం నీరు తాగకుండా ఎలా ఉండగలుగుతాయి?

జవాబు: ఒంటెలు తమ వీపుపై ఉండే మూపురాల్లో నీటిని నిల్వ చేసుకుంటాయని చాలా మంది భావిస్తుంటారు. కానీ అది తప్పు. వాటి మూపురాల్లో ఉండేది కొవ్వు పదార్థమే. మండుటెండల్లో ఏమాత్రం తడిలేని ఎడారుల్లో కూడా ఒంటెలు అలసట లేకుండా ఎక్కువ దూరం ప్రయాణించగలవు. అందుకు తగిన శక్తిసామర్థ్యాలను అవి తమ మూపురాల్లో ఉండే కొవ్వు ద్వారానే పొందుతాయి. ఎక్కువ దూరం ప్రయాణించే ఒంటెల మూపురాలలో కొవ్వు కొంత కరిగిపోయి వదులవడానికి కారణం ఇదే. మొత్తం మీద ఒంటెలు ఎడారుల్లో నీరు తాగకుండా రెండు మూడు వారాల వరకు ప్రయాణించగలవు. వాటి ముక్కుల్లో ఉండే సన్నని వెంట్రుకల సాయంతో అవి గాలిలో ఉండే తేమను గ్రహిస్తూ, శరీరం నుంచి చెమట రూపంలో కోల్పోయే నీటిని భర్తీ చేసుకోగలవు. అలా ఒంటెలు తమ శరీర ఉష్ణోగ్రతను పది డిగ్రీల సెంటిగ్రేడు వరకు తగ్గించుకోగలవు. నీరు లభించినప్పుడు ఒంటెలు కేవలం కొన్ని నిముషాల్లోనే దాదాపు 100 లీటర్లు తాగగలవు. ఒంటెల రక్తంలోని ఎర్ర రక్తకణాలు గోళాకారంలో ఉండడం వల్ల ఎంత నీరు తాగినా ఆ నీరు విచ్ఛిన్నమయే ప్రమాదం లేదు. అందువల్ల వాటికి ఏ హానీ జరగదు.

- ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌

  • ====================
 visit My website > Dr.Seshagirirao - MBBS.-

Grow more if remove gray or white hair?-తెల్ల వెంట్రుకల్ని తీసేస్తే మరింత ఎక్కువగా వస్తాయా?

  •  
  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: తెల్ల వెంట్రుకల్ని తీసేస్తే మరింత ఎక్కువగా వస్తాయంటారు. నిజమేనా?

జవాబు: ఈ అభిప్రాయంలో నిజం లేదనే చెప్పుకోవాలి. తెల్ల వెంట్రుకలకు, నల్ల వెంట్రుకలకు ఉన్న తేడా కేవలం వాటిలో ఉన్న మెలనిన్‌ అనే వర్ణరేణువుల శాతంలో తేడానే. తెల్ల వెంట్రుకలలో మెలనిన్‌ రేణువులు దాదాపు ఉండవనే చెప్పవచ్చు. గోధుమ రంగు వెంట్రుకల్లో ఇవి ఓ మోస్తరుగా ఉంటాయి. వెంట్రుకలు మన చర్మం కింద ఉండే రోమ కుదుళ్ల నుంచి మొలుస్తాయి. ఈ కుదుళ్లు ఉపరితల చర్మం (epidermis) కింద ఉన్న అంతశ్చర్మం (dermis)లో ఉంటాయి. అక్కడే మెలనిన్‌ రేణువులు ఉత్పత్తి అవుతూ వెంట్రుక అనే ప్రొటీన్‌ గొట్టంలో దట్టంగా పేరుకుంటూ వస్తాయి. తెల్లని వెంట్రుకలు వచ్చే కుదుళ్ల దగ్గర మెలనిన్‌ రేణువుల ఉత్పత్తి లేకపోవడం కానీ లేదా వృద్ధాప్యం వల్ల మందగించడం కానీ జరుగుతుంది. ఆ తెల్ల వెంట్రుకల్ని పదే పదే తీసేసినప్పుడు అవి మాత్రమే పెరిగేలా ఆ కుదుళ్లు ఉత్తేజం పొంది, తెల్ల వెంట్రుకల ఉత్పత్తి జోరుగా సాగవచ్చునన్నది ఓ సమాధానం. కానీ దీనికి ఉన్న సంభావ్యత తక్కువ.

-ప్రొ||ఎ. రామచంద్రయ్య, -నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక.
  • ====================
visit My website > Dr.Seshagirirao - MBBS.-