ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
ప్ర : పత్రికారంగములొ ఒకవ్యక్తి ప్రజల్ని ఉత్తేజితులను చేసిన మహానుభావుడు " పులిట్జర్ " ఆయన గురించి తెలియజేయ ప్రార్ధం!
జ : జోసెఫ్ పులిట్జర్ అమెరికన్ . ఇతని తండ్రి ధాన్యము , గోధుమల వర్తకము చేసేవాడు . పులిట్జర్ హంగేరిలో జన్మించి అమెరికాలోని పత్రికా ప్రపంచం లో ప్రత్యేక స్థానము పొందాడు . దిన , వార పత్రిక అని ప్రచురించిన ఖ్యాతి ఈయనకి దక్కింది. తన దిన పత్రికలో అవినీతి గురించి చాలా ఘాటుగా విమర్శించి అక్షరయుద్ధం చేసిన మహనీయుడు .
పత్రికల్లో కాస్తంత హాస్యము , పాఠకులలో కుతూహలమురేపే విషయాలు , సెన్సేషనల్ న్యూస్ - ఇలా దిన పత్రికలలో కొత్త వరవడికి శ్రీకారము చుట్టిన వ్యక్తి . పులిట్జర్ పత్రికలతో మమేకమై , పత్రికా వృత్తిని విపరీతముగా ప్రేమించాడు . నోబుల్ ప్రైజ్ కి ధీటుగా పులిట్జర్ ప్రైజ్ ఏర్పాటుచేసాడు. పత్రికా సంపాదకునికో , సాహసవంతమైన విలేఖరుకో , ఏటా పులిట్జర్ ప్రైజ్ ఇస్తూ ఉంటారు. నోబుల్ పైజ్ కు ఉన్నంత ఖ్యాతి , గౌరవం , విలువ ఈ పులిట్జర్ ప్రైజ్ కీ ఉన్నది.
- 'పులిట్జర్' పురస్కారం
- ========================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...