Tuesday, October 21, 2014

Why do we tumbling in sleep?,మనుషులు నిద్రలో దొర్లుతారెందుకు ?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

 ప్ర : మనుషులు నిద్రలో దొర్లుతారెందుకు ?

జ : ఎంత మొద్దు నిద్రలో అయినా ఒకే భంగిమలో రాత్రంతా నిద్రపోగలిగిన వారు ఉండరు. ప్రతి ఒక్కరు రాత్రి నిద్రలో నిష్టముగా 20 సార్లు గరిష్టము గా 40 సార్లు అటు - ఇటు కదులుతారు. . ఆ కదలిక  అరనిమిషము మించకపోవచ్చు . పడక గది వాతావరణము , నిద్ర ముందు తిన్న ఆహారము , అలసట అనే అంశాలమీద ఆధారపడి ఎన్నిసార్లు దొర్లుతామనేది మారుతుంది. ఒక భంగిమలో పడుకుంటే ఆ వైపు రక్త ప్రసరణలో వచ్చే మార్పుఇబ్బంది నుండి బయట పడేందుకు భంగిమ మార్చమని మెదడ సంకేతమిస్తుంది ... అప్పుడే మనం దొర్లుతాము.
  • ===========================

Monday, October 20, 2014

Blood is red why?,రక్తం ఎర్రగా ఎందుకుంటుంది?

  •  

  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

 ప్ర : రక్తం ఎర్రగా ఎందుకుంటుంది?

జ : రక్తము ద్రరూపములో ఉండే కణజాలముల సమూహము . అందులో ప్లాస్మా , ఇతర అనేకరకాల కణాలు ఉంటాయి. తెల్లరక్త కణాలు , ఎర్రరక్తకణాలు , ప్లేట్లెట్స్  అనేవి ముఖ్యమైనవి. వీటిలో ఎర్రరంగులో ఉండే రక్తకణాలు మానవ రక్తం లో ప్రతి చుక్క లో 30 కోట్ల వరకూ ఉంటాయి. ఆ రక్త కణాలలో " హీమోగ్లోబిన్‌ " అనే వర్ణక పదార్ధమువలన రక్తానికి ఎర్ర రంగు వస్తుంది. మనము పీల్చిన గాలిలోని ఆక్సిజన్‌ ని తమలో నింపుకొని శరీర భాగాలకు అందించేవి ఎర్రరక్తకణాలు , అయితే ఇదే రక్తము వెన్నెముకలేని జీవులలో మనలో లా ఎర్రగా ఉండదు. నీలి , తెలుపు రంగులో ఉంటుంది. రక్తము రంగులో తేడా ఆ జీవుల రక్తములోని పదార్ధము వల్లనే వస్తుంది. హీమోగ్లోబిన్‌ ఉన్నరక్తమే ఎర్రగా ఉంటుంది.

  • ============================

Friday, October 17, 2014

Dals kept in water gives badsmell why?,పప్పుల్ని నానబెడితే వాసనేల?

  •  

  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: పప్పుల్ని నీళ్లలో నానబెడితే ఒక రకమైన వాసన వస్తాయి. ఎందుకు?

జవాబు: పప్పు దినుసుల్ని, తదితర పోషక విలువలున్న ఇతర ధాన్యపు గింజల్ని నీళ్లలో నానబెట్టిన చాలా సేపటికి గమనిస్తే ఒక రకమైన చెడు వాసన వస్తుంది. కారణం ఆయా ఆహార విలువలున్న ధాన్యపు గింజలు, పప్పు గింజలు కుళ్లిపోవడమే.

భూమ్మీద ఉన్న జీవుల మనుగడకు శక్తి కావాలి. ఆ శక్తి వాటికి, మనకు ఆహార పదార్థాల్లోని పిండి పదార్థాల నుంచి, కొవ్వు పదార్థాల నుంచి వస్తుంది. మాంసకృత్తుల్ని ఆయా జీవులు తమ శరీర నిర్మాణానికి, జీవన కార్య కలాపాలకు అవసరమైన ఎంజైముల్ని, ప్రోటీన్లను తయారుచేసు కునేందుకు వాడుకుంటాయి.

ఇలాంటి ఎన్నో దైనందిన జీవన కార్య కలాపాలకు నీరు ఓ వేదిక లేదా మాపకం లాగా పనిచేస్తుంది. అందుకే మనలాంటి ఎన్నో జీవుల్లో 70శాతం వరకు నీరే ఉంటుంది. కుళ్లిపోవడం లేదా పులియటం అనే విధానానికి కారణం వాతావరణం, నీరు వంటి పలు ప్రదేశాల్లో ఎపుడూ అవకాశం కోసం చూస్తున్న బ్యాక్టీరియాలే. ఇందులో ఈస్ట్‌ అనే బ్యాక్టీరియా ప్రధానమైంది. ఈ కార్యకలాపాలకు కూడా నీరు అవసరం. మామూలు ఎండు ధాన్యాలు, పప్పు దినుసుల్లో నీటి శాతం బాగా తక్కువగా ఉండడం వల్ల బాక్టీరియాలు నీటిని ఆశించినా వాటిపై ప్రభావం ఉండదు. మరో మాటలో చెప్పాలంటే నీటి శాతం అల్పంగా ఉన్న పప్పు గింజల దగ్గర బ్యాక్టీరియాల పప్పులుడకవు. కానీ నానేసిన పప్పు ధాన్యాల్లో చెమ్మదనం నీటి అవకాశం బాగా ఉండడం వల్ల బ్యాక్టీరియా దాడి అధికం అవుతుంది. అవి పోషక విలువల్ని స్వాహా చేసే ప్రక్రియల్లో విడుదల చేసే గంధక తత్వం, భాస్వర లక్షణం ఉన్న పదార్థాల నుంచే ఈ దుర్గంధం వస్తుంది.

  • -ప్రొ|| ఎ. రామచంద్రయ్య,-నిట్‌, వరంగల్‌; కన్వీనర్‌, శాస్త్రప్రచార విభాగం, జనవిజ్ఞానవేదిక (తెలంగాణ)
  • =======================================

Sun rays harm to body?,సూర్యరశ్మి దేహానికి హాని కలిగిస్తుందా?

  •  

  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: సూర్యరశ్మి దేహానికి హాని కలిగిస్తుందా?

జవాబు: సూర్యకాంతిలోని నులివెచ్చని కిరణాలు ముఖ్యంగా ఉదయం, సాయంత్రపు వేళల్లో మన దేహానికి 'డి' విటమిన్‌ అందించినా, ఆహ్లాదం కలిగించినా, సూర్యరశ్మికి మరీ ఎక్కువగా ప్రభావితమైతే, కొన్నిసార్లు హాని జరిగే ప్రమాదం కూడా లేకపోలేదు. అలాంటి ప్రమాదాలే శరీర చర్మంపై కమిలిన మరకలుగా (Sun burns) ఏర్పడుతాయి. అవే కాలం గడిచే కొద్దీ చర్మ సంబంధిత క్యాన్సర్‌గా పరిణామం చెందే ప్రమాదం ఉంది. వీటికి కారణం సూర్యరశ్మి నుంచి వెలువడే అత్యంత శక్తిమంతమైన అతి నీలలోహిత కిరణాలు. ఈ కిరణాలు మన దేహానికి సోకకుండా ఆకాశానికి భూమికి మధ్య ఓజోన్‌ పొర పరచుకొని ఉంటుంది. కానీ, ఇటీవల కాలంలో ఈ ఓజోన్‌ పొర గాఢత చాలా వరకు తగ్గింది. ముఖ్యంగా ధ్రువ ప్రాంతాలపైన. దీనికి కారణం శీతలీకరణకు వాడే రిఫ్రిజిరేటర్లు, ఏసీలు. వాహనాలను నడపడానికి ఉపయోగించే పెట్రోలు, డీజిల్‌ లాంటి ఇంధనాల కాలుష్యాలు. అవి వెలువరించే క్లోరో ఫ్లోరో కార్బన్లు (సీఎఫ్‌సీఎస్‌). వీటి ప్రభా వాన్ని అరికట్టినా, ఆకాశంలోని ఓజోన్‌ పొర మునుపటి పరిమాణాన్ని, సాంద్రతను అందుకుంటుందనే విషయంలో శాస్త్రజ్ఞులు కచ్చితమైన అభిప్రాయానికి రాలేకపోతున్నారు. ఇప్పటికే ఎంతో నష్టం జరిగిపోయింది. ఇకనైనా ఆ ఓజోన్‌ పొర మరీ బలహీన పడకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది.

  • - ప్రొ|| ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌
  • ============================

Smoke lines behind planes?,ఆకాశంలో కొన్ని విమానాల వెనుక పొగ చారలు ఎలా ఏర్పడతాయి?

  •  

  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: ఆకాశంలో కొన్ని విమానాల వెనుక దట్టమైన పొగ చార కనిపిస్తుంది. ఎందుకని?

జవాబు: విమానం వెనుక ఆకాశంలో పొగ చార కనిపిస్తే అది జెట్‌ విమానమే. విమానం వెనుక భాగం నుంచి అత్యంత వేగంతో బయటకు వచ్చే పొగనే జెట్‌ అంటారు. ఈ విమానం భూమి నుంచి మామూలు విమానాల కన్నా చాలా ఎక్కువ ఎత్తులో ఎక్కువ వేగంతో పయనిస్తుంది. ఆ విమానానికి అంత వేగం రావడానికి కారణం దాని వెనుక నుంచి దూసుకువచ్చే జెట్‌.

ఇదెలా జరుగుతుందంటే న్యూటన్‌ మూడవ గమన సూత్రం ప్రకారం ప్రతి 'చర్య'కూ, దానికి సమానమైన ప్రతిచర్య వ్యతిరేకదిశలో ఉంటుంది. ఒక రబ్బరు బెలూన్‌ను బాగా వూది ఒక్కసారిగా వదిలేస్తే అందులోని గాలి వేగంగా బయటకు దూసుకు రావడం దానికి వ్యతిరేక దిశలో ఆ బుడగ దూసుకుపోవడాన్ని మనం చూస్తుంటాం. ఈ సూత్రం ఆధారంగానే జెట్‌ విమానాలు, రాకెట్లు పనిచేస్తాయి.

జెట్‌ విమానం వెనుక భాగంలో ఉండే ఒక పెద్ద అరలోకి వాతావరణంలోని గాలిని పీల్చుకునే ఏర్పాటు ఉంటుంది. అలా చేరిన గాలిపై ఆ అరలో అత్యధిక పీడనాన్ని కలిగిస్తారు. దాంతో ఆ గాలి ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఆ వేడిగాలి ఉన్న అరలో పెట్రోలు, డీజిల్‌ లాంటి ఇంధనాన్ని మండిస్తారు. అలా మండిన ఇంధనం వాయుధార రూపంలో విమానం వెనుక నుంచి అత్యంత వేగంతో, వూదిన బెలూన్‌ నుంచి గాలి వచ్చినట్టుగా, బయటకు దూసుకొని వస్తుంది. వాయువు వేగం వల్ల ఏర్పడే ప్రతిచర్య వల్ల, జెట్‌ విమానం ముందుకు పయనిస్తుంది. జెట్‌ విమానం ప్రయాణించే ఎత్తులో ఉండే వాతావరణంలోని గాలి తీవ్రత తక్కువగా ఉండటం వల్ల విమానం నుంచి వచ్చే జెట్‌ చిందర వందరగా చెదిరిపోదు అందుకనే విమానం వెళ్లిన తర్వాత కూడా ఆ వాయుధార కనబడుతుంది. ఆ పొగ వల్ల కాలుష్యం ఏర్పడదు.

  • - ప్రొ|| ఈ.వి.సుబ్బారావు,-హైదరాబాద్‌
  • ============================

Sun flower turns to Sun Why?-పొద్దుతిరుగుడు పువ్వు సూర్యునివైపే తిరగడానికి కారణమేమిటి?

  •  

  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: పొద్దుతిరుగుడు పువ్వు ఎప్పుడూ సూర్యునివైపే తిరగడానికి కారణం ఏమిటి?

జవాబు: పొద్దు తిరుగుడు పువ్వు (దీనిని సూర్యకాంత పుష్పం Sun flower) అని కూడా అంటారు. సూర్యుడు తూర్పున ఉదయించింది మొదలు సాయంత్రం పడమరలో అస్తమించే వరకు అది సూర్యుని వంకే చూస్తున్నట్లుగా తిరుగుతూ ఉంటుంది.

ఈ పువ్వు ఇలా తిరగడానికి కారణం ఈ మొక్కలో ఉండే ఫొటోట్రాపిజం అనే లక్షణమే. ఫొటోట్రాపిజం అంటే, కంటికి కనిపించే సూర్యరశ్మి వలన మొక్క పెరుగుదలతోపాటు కలిగే ప్రతిస్పందన అని చెప్పుకోవచ్చు. పొద్దుతిరుగుడు మొక్క కాండంలో ఉండే 'ఆక్సిన్‌' అనే హార్మోన్‌ ఈ స్పందనను ప్రేరేపిస్తుంది. ఈ హార్మోన్‌ మొక్కలు పొడవుగా, ఏపుగా పెరగడానికి దోహదపడుతుంది. మొక్కల్లో ఉన్న ఎమినో ఆసిడ్‌ (amino acid) వల్లగాని, కార్బోహైడ్రేటులో విచ్ఛిన్నం కావడం వల్ల గాని ఈ హార్మోన్‌ ఏర్పడుతుంది. ఈ హార్మోన్‌ మొక్కలో ఉన్న కణాల గోడలపై ఉన్న కార్బోహైడ్రేటుల బంధాలపై పనిచేస్తాయి. తద్వారా మొక్కల పెరుగుదలకు ఉపయోగపడతాయి.

'ఫొటోట్రాపిజం' ధర్మం ఉన్న పొద్దుతిరుగుడు మొక్కపై సూర్యరశ్మి నేరుగా పడినపుడు ఆ మొక్క వెనుక భాగంలో అంటే పువ్వు వెనుక ఉన్న కాండంపై నీడ ఉంటుంది. సూర్యరశ్మి నేరుగా సోకని ఆ చీకటి భాగాలలో 'ఆక్సిన్‌' హార్మోన్‌ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. అందువల్ల ఆ భాగం వేగంగా పెరుగుతుంది. అందువల్ల ఆ దిశలో మొక్క, దానితోపాటు పొద్దుతిరుగుడు పువ్వు కదులుతాయి. నీడలో ఉండే కాండం పెరిగే కొద్దీ, ఆ పెరుగుదల మొక్కను నీడనుంచి సూర్యరశ్మి పడే దిశలోకి కదిలిస్తుంది. ఫలితంగా పొద్దుతిరుగుడు పువ్వు ఎప్పుడూ సూర్యుణ్ని చూస్తూ ఆనందపడుతుంది.

  • - ప్రొ|| ఈ.వి. సుబ్బారావు,-హైదరాబాద్‌
==========================

జంతువులకు శుభ్రత అవసరం లేదా?,మట్టిలో ఉన్న ఆహార పదార్థాల్ని తింటున్నజంతువులకు జబ్బులేమీ రావా?

  •  
  •  

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: మనం భోజనం చేసే ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవాలని చెబుతారు కదా! కానీ జంతువులు మాత్రం నేల మీద మురికిలోను, మట్టిలో ఉన్న ఆహార పదార్థాల్ని తింటుంటాయి. మరి వాటికేం కాదా?

జవాబు: ఈ భూమి ఏర్పడ్డ కొన్ని కోట్ల సంవత్సరాలకు భూమి మీద జీవ లక్షణాలున్న కణాలు ఏర్పడ్డాయి. అవే వైరస్‌లు, బ్యాక్టీరియాలుగా రూపొందాయి. జీవ కణం ఆధారం లేకుంటే వైరస్‌లు ఏమీ వృద్ధి చెందలేవు కాబట్టి అవి బ్యాక్టీరియా కణాల్ని కూడా కబళిస్తాయి. ఈ విధంగా ప్రపంచంలో వైరస్‌లు లేని ప్రాణి లేదు. వైరస్‌లు, బ్యాక్టీరియాలతో పాటు మన పరిసరాలలో మనకు వ్యాధుల్ని కలిగించే ఏకకణ జీవులు, బహుకణ జీవులు చాలానే ఉన్నాయి. ఇందులో ప్రధాన సమస్య బ్యాక్టీరియాలే.

భూమ్మీద ప్రతీ గ్రాము మట్టిలో సగటున నాలుగు కోట్ల బ్యాక్టీరియాలు, శుభ్రమైన తాగే నీటిలో ప్రతి పది మిల్లీ లీటర్లకు కోటి చొప్పున బ్యాక్టీరియాలు ఉన్నాయి. మొత్తం ప్రపంచంలో ఉన్న అన్ని రకాల జంతు, వృక్షజాతుల జనాభాకన్నా బ్యాక్టీరియాలే అధికం. ప్రతీ మనిషిలోనూ సుమారు 10లక్షల కోట్ల మానవజీవ కణాలు ఉండగా, ప్రతి వ్యక్తి శరీరంమీద ఉండే బ్యాక్టీరియాల సంఖ్య వాటికి పదిరెట్లు ఎక్కువ. ఇందులో కొన్ని మనకు సహకరించేవి. మరికొన్ని హాని కలిగించేవి. హాని కలిగించేవి కొన్ని లక్షల కోట్లు ఉంటాయి. మనం బతికున్నంత కాలం శరీరంలో ఉన్న రక్షణ వ్యవస్థ వీటిమీద సైన్యంలా దాడిచేస్తూ మనల్ని కాపాడుతుంది. బ్యాక్టీరియాల సంఖ్య ఈ మోతాదుకు మించితే అనారోగ్యం కలుగుతుంది.

మనం చేతులు కడుక్కోవడం అంటే బయటి బ్యాక్టీరియాను తొలగించుకోవడమే. జంతువుల్లో కూడా వాటివాటి రక్షణ వ్యవస్థ ఉంటుంది. అవి మురికిలోనూ మలిన ప్రాంతాల్లోనూ బతికే పరిస్థితి సహజంగా ఉండడం వలన పరిణామ క్రమంలో వాటికున్న రక్షణ వ్యవస్థ మనకన్నా సమర్థంగా ఉంటుంది. పైగా వాటి శరీర నిర్మాణంలో ఉన్న తేడాలు కూడా జంతువులకు అదనపు రక్షణ వ్యవస్థను సమకూరుస్తాయి. అయితే మురికి, మలినాలు ఎక్కువైతే జంతువులు కూడా రోగాల బారిన పడక తప్పదు.

  • - ప్రొ|| ఎ. రామచంద్రయ్య, -నిట్‌, వరంగల్‌; కన్వీనర్‌, శాస్త్రప్రచార విభాగం, జనవిజ్ఞానవేదిక (తెలంగాణ)
  • =================================

Sunday, October 05, 2014

మంట ఎలా మండుతుంది?

  •  

  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

 ప్రశ్న: మంట ఎలా మండుతుంది?

జవాబు: మంట లేక అగ్నిజ్వాల అంటే పదార్థాల కలయిక వల్ల జరిగే రసాయనిక, భౌతిక మార్పులు. ఈ ప్రక్రియలో పదార్థాలు ఉష్ణ, కాంతి శక్తులతోపాటు పొగ, బూడిదలు కూడా విడుదలవుతాయి. విద్యుత్‌ తీగలపై ఉండే ప్లాస్టిక్‌ తొడుగులో ఉత్పన్నమయ్యే మంటలోనైనా, నూనె లాంటి పదార్థాల్లో ఏర్పడే మంటలోనైనా, మామూలుగా ఇంట్లోని పొయ్యిలో కట్టెలు, బొగ్గులతో ఏర్పడే మంటలోనయినా వాటికి కావలసిన ముఖ్యమైన అంశాలు మండే స్వభావం గల పదార్థం, ఆక్సిజన్‌, ఉష్ణాన్ని ఉత్పన్నం చేసే మీట. వీటిలో ఏ అంశం లేక పోయినా మంట ఏర్పడదు. ఈ సూత్రం పైనే మంటలు మండకుండా ఆర్పుతారు. మంటలార్పాలంటే వాటికి అందే ఆక్సిజన్‌ను తీసివేయాలి. మండే స్వభావం గల పదార్థాన్ని తొలగించాలి.

మండే పదార్థాలు ఘన, ద్రవ, వాయు రూపాలలో ఏ రూపంలోనైనా ఉండవచ్చు. ఉదాహరణకు కొయ్య, ప్లాస్టిక్‌(ఘన), నూనె(ద్రవ), హైడ్రొజన్లు(వాయు), ఉష్ణోగ్రతల విలువలు అత్యధికంగా ఉంటే, ఇనుములాంటి లోహాలు కూడా మండుతాయి. మంటకు కావలసిన ఆక్సిజన్‌ వాతావరణంలోని గాలి అందిస్తుంది. మంటను రాజేయడానికి కావలసిన శక్తి పదార్థాల మధ్య ఘర్షణ వల్ల ఉత్పన్నమయ్యే నిప్పు కణాల నుంచి, మెరుపుల నుంచి అందించవచ్చు.

  • - ప్రొ|| ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌
  • ===========================

Thursday, October 02, 2014

భూమధ్య రేఖ వద్ద ఇతర భూ ప్రాంతాలలో ఉన్నట్లు రుతువులు ఉంటాయా?

  •  

  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

 ప్రశ్న: భూమధ్య రేఖ వద్ద ఇతర భూ ప్రాంతాలలో ఉన్నట్లు రుతువులు ఉంటాయా?

జవాబు: భూమధ్య రేఖ అంటే భూమి ఉపరితలంపై దాని మధ్య భాగం చుట్టూ 40,075 కిలోమీటర్ల పొడవున ఉండే ఒక వూహారేఖ. ఈ ప్రాంతంలో రుతువుల మధ్య తేడాలు చాలా స్వల్పంగా ఉంటాయి. భూమి తన చుట్టూ తాను తిరిగే అక్షం కొంచెం వంగి ఉన్నా దాని ప్రభావం భూమధ్య రేఖ ప్రాంతంలో అంతగా ఉండదు. భూమిపై ఇతర ప్రాంతాల్లో రుతువులు ఏర్పడడానికి కారణం భూ కక్ష్య కొంచెంగా వంగి ఉండడమే. భూమధ్య రేఖ దరిదాపుల్లో, ఆరేఖ నుంచి దూరంగా పోయేకొలదీ ఉష్ణోగ్రత, వర్షపాతాల్లో మాత్రమే కొంచెం తేడా ఉంటుంది.

సూర్యుని నుంచి వెలువడే వికిరణశక్తి (radiation)భూమధ్య రేఖ ఉండే ప్రాంతంలో ఎక్కువ పరిమాణంలో చేరడం వల్ల అక్కడ ఉష్ణోగ్రతలు, సంవత్సరమంతా ఎక్కువగా ఉంటాయి. వేడిగా ఉండే ప్రదేశాల్లో వాతావరణ పీడనం (ఒత్తిడి) తక్కువగా ఉంటుంది కాబట్టి తక్కువ పీడనం ఉండే భూమధ్యరేఖ ప్రదేశాల్లో మధ్నాహ్న వేళల్లో ఉరుములతో కూడిన తుపానులు సంభవిస్తూ ఉంటాయి. భూమి ఉత్తరార్థ భాగంలో భూద్రవ్యరాశి ఎక్కువగా కేంద్రీకృతమై ఉండడంతో ఆ భాగంలో దక్షిణార్థ భాగంలో కన్నా ఉష్ణతీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఆ విధంగా భూమద్యరేఖ ప్రాంతంలో రుతువులు అంటూ ఏమీ ఉండవు.

  • - ప్రొ|| ఈ.వి.సుబ్బారావు, హైదరాబాద్‌

  • ===========================

భూమ్యాకర్షణ శక్తి భూమి నుంచి ఎంత ఎత్తు వరకు ఉంటుంది?

  •  

  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: భూమ్యాకర్షణ శక్తి భూమి నుంచి ఎంత ఎత్తు వరకు ఉంటుంది?

జవాబు: వైజ్ఞానిక పరిభాషలో బలానికి, శక్తికి తేడా ఉంది. బలమున్నా శక్తి ప్రమేయంలేని సంఘటనలూ ఉన్నాయి. కానీ బలం లేకుండా శక్తి ప్రమేయం లేదు. కాబట్టి భూమ్యాకర్షణ శక్తి అనడం కన్నా భూమ్యాకర్షణ బలం భూమి నుంచి ఎంత ఎత్తు వరకు ఉంటుందనే విధంగానే మనం చెప్పుకోవాలి. భూమ్యాకర్షణ బలం భూమి నుంచి అనంత దూరం వరకు విస్తరించి ఉంటుంది. శాస్త్రీయంగా అది అనంత దూరం దగ్గర శూన్యం అవుతుంది. భూమ్యాకర్షణ ప్రభావాన్ని మరో ఇతర వస్తువు మీద బలం రూపేణా చూడాలి. ఆ బలాన్ని గెలీలియన్‌ గురుత్వ బలంగా పరిగణిస్తారు. ఈ బలపు విలువ భూమికి ఆయా వస్తువుకు ఉన్న దూరపు వర్గానికి విలోమాను పాతం గానూ, ఆయా వస్తువుకున్న ద్రవ్యరాశికి అనులోమాను పాతంగానూ ఉంటుంది. సుమారు లక్షన్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రుణ్ణి కూడా తన చుట్టూ తిప్పుకోగలిగినంత బలాన్ని ఇదే భూమి ఉపయోగిస్తుండగా, కొన్ని వేల కిలోమీటర్లు దాటిన వెంటనే వ్యోమశకటంలో ఉన్న వ్యోమగాములు గురుత్వ బలం సరిగా లేక శకటంలో దూదిపింజల్లా వేలాడుతుండటం చూస్తుంటాం. ఈ వైవిధ్యానికి కారణం చంద్రుడి విషయంలో దూరం కన్నా చంద్రుడి ద్రవ్యరాశి ప్రభావం అధికం కావడము, వ్యోమగాముల విషయంలో వారి దూరం కన్నా వారికున్న ద్రవ్యరాశి ప్రభావం తక్కువగా ఉండడం. భూమి లాంటి గ్రహం అయినా, సూర్యుడి లాంటి నక్షత్రం అయినా, చంద్రుడి లాంటి ఉపగ్రహం అయినా లేదా మరేదైనా చిన్నా చితకా ఖగోళ వస్తువు అయినా అది ఇతర వస్తువు మీద కలిగించే బలాన్ని ఆయా ఖగోళ వస్తువుకున్న గురుత్వ త్వరణం ద్వారా ఆరా తీయగలం. ఈ విలువ ఆయా ఖగోళ వస్తువు నుంచి దూరపు వర్గానికి విలోమంగా ఉంటుంది. దూరం రెట్టింపయితే బలం నాలుగురెట్లు తగ్గుతుంది. అందుకే బలాల్ని ఆయా ఖగోళ వస్తువుల ఉపరితలం మీద ఎంత ఉందన్నదే ప్రామాణికంగా చూపుతారు.

  • -ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌;--కన్వీనర్‌, శాస్త్రప్రచార విభాగం, జనవిజ్ఞానవేదిక (తెలంగాణ)

  •  ===============================