Saturday, July 12, 2014

తీరాల్లోనే ఇంధనాలు ఎక్కువేల ?

  •  
  •  

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: Fuel available more on costal area Why?ఇంధనాలు సముద్ర తీరాల్లోనే ఎక్కువగా ఎందుకు లభిస్తాయి?

జవాబు: సముద్రాలు చాలా లోతుగానే ఉన్నా సముద్రపు అడుగు నేల మీద, ఆ నీళ్లలోను చాలా వృక్ష జాతులు నివసిస్తూ ఉంటాయి. అనేక జాతుల జల చరాలు అందులో జీవిస్తాయి. ఈ వృక్ష, జంతు జలచరాలు చనిపోయాక వాటి అవశేషాలు భూమ్యాకర్షణ వల్ల నేల అడుక్కు చేరతాయి. దాని వల్ల, సముద్రపు నీటి ఒత్తిడి వల్ల, ఆయా శరీరాలు చిన్నాభిన్నమై సన్నని ముక్కలుగా మారతాయి.అవి సముద్రపు అడుగు నుంచి తీరం వైపు ఉన్న నేల చరియల ద్వారా తీర ప్రాంతాలకు చేరుకుంటాయి. అక్కడున్న భూగర్భంలో రసాయనిక విఘటనం చెంది పెట్రోలియం ద్రవంగా, సహజ వాయువుగా మారతాయి. ఇందువల్లే సముద్ర తీరాల్లో, ముఖ్యంగా నదులు సముద్రాల్లో కలిసే తీర ప్రాంతాల్లో పెట్రోలియం ఉత్పత్తుల నిల్వలు బాగా విస్తారంగా ఉంటాయి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సముద్ర తీరంలో కృష్ణా, గోదావరి నదులు బంగాళాఖాతంలో కలిసే భాగంలో చాలా నిక్షేపాలున్నాయి.

-ప్రొ|| ఎ.రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
  • ===========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Living possible on Mars?,అంగారకుడిపై ఆవాసం సాధ్యమేనా?

  •  

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: అంగారక గ్రహంపై ఇప్పుడు పరిశోధనలు జరుగుతున్నాయి కదా! అక్కడ భవిష్యత్తులో మనుషుల ఆవాసానికి ఏర్పరచుకోవడానికి వీలుందా?

జవాబు: అంగారకుడు (మార్స్‌) భూమికి దగ్గరగా ఉన్న ఓ గ్రహం. సూర్యునివైపు శుక్రగ్రహం, సూర్యునికి వ్యతిరేక దిశలో మార్స్‌ మన భూమికి సమీప గ్రహాలు. ఘనపరిమాణంలోనూ, ద్రవ్యరాశిపరంగానూ మన భూమిలో దాదాపు ఎనిమిదవ వంతు ఉన్న గ్రహం ఇది. ఆ గ్రహపు ఉపరితల పరిశోధనలలో అక్కడ గతంలో నదులు ఉన్న ఆనవాళ్లు కనబడ్డాయి. 1970 సంవత్సరంలో వైకింగ్‌, 2001లో ఆపర్ట్యూనిటీ రోవర్‌, 2012 క్యూరియాసిటీ రోవర్‌లతో ఎన్నో పరిశోధనలు చేశారు. మన ఇస్రో వారు కూడా 2013లో మంగళ్‌యాన్‌ పేరుతో MOM (mars orbiter mission)శకటాన్ని పంపి ఉన్నారు.

మార్స్‌ పరిభ్రమణ కాలం దాదాపు రెండు సంవత్సరాలు. దాని భ్రమణ కాలం దాదాపు 25 గంటలు. దాని వాతావరణంలో 96 శాతం కార్బన్‌డై ఆక్సైడ్‌ ఉన్నా, కొద్ది మోతాదులో నైట్రోజన్‌, ఆక్సిజన్లు ఉన్నాయి.

అంగారక గ్రహానికి రెండు ఉపగ్రహాలు (చంద్రుళ్లు) ఉన్నాయి. భూ వాతావరణానికి, భూగమన రాశులకు ఉష్ణోగ్రత స్థితులు అంగారక గ్రహంకన్నా దగ్గరగా మరే గ్రహానికి లేవు. కాబట్టి సౌరకుటుంబంలో గతంలోగానీ, భవిష్యత్తులోగానీ జీవానికి అనువైన గ్రహంగా ఏమాత్రం అవకాశం ఉన్నా అది అంగారకుడిపైనేనని శాస్త్రవేత్తల అభిప్రాయం.

  • - ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్‌,--వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
  • ==========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Who comes under youth?,యువత అంటే ఎవరు?

  •  

  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్ర : Who comes under youth?,యువత అంటే ఎవరు?

జ : యువత అంటే -- 15 నుండి 24 ఏళ్ల మధ్యవారిని యువతగా పేర్కొంది ఐక్య రాజ్య సమితి. యువత వయస్సుని ఒక్కో ప్రాంతం ఒక్కోలాగా పేర్కొంది. మన దేశంలో15 - 35 ఏళ్ల లోపు వారిని మన రాజ్యాంగం యువతగా చెపుతోంది. భారత జనాభాలో దాదాపు 60 శాతం ఆ వయస్సులో వారే. 2020 నాటికి 64% యువత కానుంది. అంటే ప్రతి ముగ్గురిలో ఒకరు యువతే. మన దేశం ప్రపంచంలోనే యువత అధికంగా ఉన్న దేశంగా మారుతుంది .

  • ======================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Wednesday, July 09, 2014

What are the six-tastes in food?,షడ్రుచులు అంటే ఏమిటి?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

 Q : What are the six-tastes in food?,షడ్రుచులు అంటే ఏమిటి?

Ans : తినడానికి బతకకూడదు ... బతకడానికి తినాలి... అని పూర్వము ఒక నానుడి. ఆహారము తినడము జీవించడానికి ఒక ఇంధనము అంటారు. . . ఆధునికులు . జీవించడానికే కాదు వ్యాధి రాకుండా ఉండడానికి ఆహారము అవసరము కనుక దానిని బ్రహ్మపదార్ధము తో సంధానించి " అన్నం పరబ్రహ్మం" అన్నారు పెద్దలు. ఆహారమునుండే ఆరోగ్యము , అనారోగ్యము పుడుతుంటాయి అని వైద్యులు అంటారు . జీవరాసులన్నింటికీ ఏదోవిధమైన ఆహారము వాటి జీవనానికి అవసరము .. ఈ ఆహారము లో ఆరు రుచులు అని ఆయుర్వేదము చెపుతుంది. నిజానికి రుచులు అనేక రకాలు. జీవి-జీవికీ రుచి గ్రహణలో తేడాలు ఉంటాయి.

    షడ్రుచులు ,Six-tastes

  •     తీపి-------Sweet. ఉదా: పంచదార , తేనె ,
  •     పులుపు---Sour. ఉదా : నారింజ , నిమ్మకాయ ,
  •     చేదు------Bitterness. ఉదా : వేప , పసుపు , మెంతులు ,
  •     కారం-----Recompence(chili). ఉదా : మిరప , మిరియాలు ,
  •     వగరు-----Acrid. ఉదా : చిక్కుడు , కాలీఫ్లవర్ , మినప పప్పు ,
  •     ఉప్పు-----Salt. ఉదా : సముద్రపు నీరు , సైందవ లవణము ,
      
  • ==========================
 visit My website > Dr.Seshagirirao - MBBS.-

Friday, July 04, 2014

అష్ట సిద్ధులు అంటే ఏమిటో తెలపండి?

  •  
  •  

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్ర : అష్ట సిద్ధులు అంటే ఏమిటో తెలపండి?
జ : యోగసాస్త్రంలో ఎనిమిది సంఖ్యను ‘ మాయ ‘ కు సంకేతంగా చెబుతారు. తొమ్మిది సంఖ్యను పరమాత్మకు ప్రతీకక్గా చెబుతారు. భగవద్గీతలో  అష్టవిధమాయల ప్రస్తావన కనిపిస్తుంది. పంచభూతాలు, మనసు, బుద్ధి, అహంకారం కలిస్తే ఎనిమిది అవుతాయి. పంచభూతాలకు పంచేంద్రియాలు ప్రతీక  గనుక మన శరీరమే ఒక  ‘ మాయామహలు ‘ గా గ్రహించాలి.

అష్టమాయల వల్లనే అష్టకష్టాలు సంప్రాప్తిస్తాయి.  అష్టమాయల్ని  జయించాలంటే – ” ఓం నమోనారాయణాయ” అనే అష్టాక్షరీ మంత్రాన్ని ఆశ్రయించాలని పెద్దల మాట.  అలా ఆశ్రయించిన ప్రహ్లాదుడు, ద్రువుడు, గజేంద్రుడు, అంబరీషుడు, ద్రౌపతి, అర్జునుడు – ఇలా ఎందరో భక్తులు సదా గట్టేక్కారు.

శ్రీదత్తాత్రేయ మహాగురువులు అష్టసిద్ధుల్ని తమ బిడ్డలుగా చెప్పారు. తమ భక్తులకు వారి అనుగ్రహం ఉంటుందన్నారు.

“విభూతిర్భూతి  హేతుత్వాద్భసితం తత్త్వ భాస్యత్”  – అష్ట ఐశ్వర్యాలుగా చెప్పే అష్టసిద్ధుల్ని విభూతులని కూడా అంటారు. ఇంతకీ ఏమిటీ అష్టసిద్ధులు?

అణిమ, మహిమ, గరిమ, లషిమ, ప్రాప్తి, ప్రాకమ్యం, ఈశిత్వం , వశిత్వం – అనే ఎనిమిదీ అష్టసిద్ధులు.

మోక్షమార్గాన ప్రయాణించే సాధకుణ్ని ప్రలోభ పెట్టి, పక్కదోవపట్టించి, ఒక్కోసారి పతనావస్థకు గురి చేసే ప్రమాదకర శక్తులే అష్టసిద్ధులని కొందరు మహాయోగులు చెబుతారు.

సిద్ధులు లభించగానే బుద్ధులు మారిపోతాయి. అహంకారం ఆవహిస్తుంది. విచక్షణ నశిస్తుంది. నిగ్రహం నీరుకారిపోతుంది. ఇలాంటి దుస్థితి కలగరాదని కోరుకునే వారు అష్టసిద్ధుల్ని తిరస్కరిస్తారు. లేదా వాటిని కేవలం సిద్ధులకోసమే యోగం అభ్యసిస్తారు. వాటిని ప్రదర్శిస్తూ ప్రజల్ని మభ్యపెడుతుంటారు. ఇవన్నీ మొక్షప్రాప్తికి ఆటంకాలే!

దేవభూమిగా వినుతించే హిమలయాల్లో అక్కడ క్కడ మంచు గుహల్లో తపస్సులో నిమగ్నులైన ఋషులు కనిపిస్తుంటారు. ఒక గుహలో జీవానందుడు, సత్యానందుడనే ఇద్దరు ఋషులు బహుకాలం తప్పస్సు చెయ్యగా, అప్రయత్నంగా ఇద్దరికీ అష్టసిద్ధులు లభించాయి. జీవానందుడు  తనకు లభించిన సిద్ధులతో తబ్బిబ్బై, వాటిని ప్రదర్శించాడానికి జనసీమల్లోకి వెళ్ళాడు. సత్యానందుడు తన సిద్ధుల్ని శివార్పణంచేసి తన తపస్సు కొనసాగించాడు.

జీవానందుడు అష్టసిద్ధుల ప్రదర్శనతో ప్రజలచేత బ్రహ్మరథం పట్టించుకున్నాడు. ఒక పెద్ద ఆశ్రమం, అనేకమంది శిష్యులతో ఆడంబర జీవితం గడపసాగాడు. అతని దగ్గరకు రాజు, రాజోద్యోగులు, రాణి, ఆమె సఖులు ఇట్లా ఉన్నత వర్గాలవారు వస్తూపోతుండటంతో జీవానందుడు తనను తానే భగవత్స్వరూపుడిగా  ప్రకటించుకుని అనేక పూజలు, సేవా సపర్యలు సాగించుకుంటూ విలాసమయ జీవితానికి అలవాటుపడ్డాడు. ఇలా ఉండగా మహారాణి వచ్చిన సమయంలో జీవానండుడి శిష్యవర్గం లోని ఒక పూర్వాశ్రమ చోరుడు, ఆమె మెడలోని విలువైన హారం దొంగిలించాడు. ఇంకేముంది? గందరగోళం, రాజభటులు తనిఖీలు చేయ్యటం, ఆభరణం ఆశ్రమంలోనే దొరకడంతో, జీవానందుడి సహితంగా అందరికీ కారాగా శిక్షపడింది. జీవానందుడి ఆశ్రమం మూతపడింది. శిక్ష పూర్తిచేసుకున్న జీవానందుడు నేరుగా హిమలయాల్లో ఉన్న తన గుహకుచేరుకున్నాడు. అక్కడ సత్యానందుడు దివ్యతేజస్సుతో వెలిగిపోతున్నాడు. అతని సమీపంలో ఒక సహజ హిమలింగం కనిపించింది. గుహనిండా పరిమళాలు గుబాళిస్తున్నాయి. జీవానందుడు తన అనుభవాలు చెప్పి, సత్యానందుడి అనుభవాలు అడిగాడు.

“నేను నాకు లభించిన అష్టసిద్ధుల్ని ఈశ్వరార్పణ చేశాను. నా తపస్సు కొనసాగించాను. ఇదుగో ఈ శివలింగం ఉన్నచోటనే పరమశివుడు ప్రత్యక్షమై సాయుజ్యభక్తిని ప్రసాదించాడు. నేనిప్పుడు కనులు తెరిచినా, మూసినా, సర్వత్రా శివరూపాన్నే చూస్తున్నాను” అన్నాడు సత్యానందుడు.

జీవానందుడు పశ్చాత్తాపపడి, సత్యానందుణ్ని తన గురువుగా స్వీకరించి, తానుకూడా ఈశ్వర సాక్షాత్కారం కోసం తీవ్రంగా తపస్సు చెయ్యసాగాడు. మరెన్నడూ అష్టసిద్ధుల ప్రలోభాలకు జీవానందుడు లోనుకాలేదు.

- by నాగవరపు రవీంద్ర@http://sampradayam.wordpress.com/
  •  ==========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Wednesday, July 02, 2014

నూనె మీద కాలు వేస్తే జారుతుందెందుకు ?.

  •  

  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్ర : నూనె మీద కాలు వేస్తే  జారుతుందెందుకు ?.
జ : ఇంట్లో పొరపాటున నూనె ఒలికితే . . అది తుడిచి శుభ్రం చేసేవరకు పిల్లలను అటు రానివ్వరు. కారణము నూనెలో కాలు వేస్తే జారి పడతారు. దీనికి కారణము నూనెలోని మూలకాల నిర్మాణము . వీటి వలన అది పడిన నేలమీద ఒక తేలియాడే పొరలా ఏర్పడతాయి.  మనము నడెచేటప్పుడు మన పాదము నేలకు అంటిపెట్టుకుంటుంది. ఇంట్లో గచ్చు లేదా ఫ్లోర్ టైల్స్ ఏదైనా .. కంటికి కనిపించేంత నున్నగా ఉండవు. సూక్ష్మఎత్తుపల్లాలు ఉంటాయి. అవి మన పాదంలోని ముడతలలో ఇమిడి నడిచేటప్పుడు పట్టునిస్తాయి. అ లాంటి ఫ్లోరింగ్ మీద నూనెపడి ఆ గతుకులను ఆక్రమించుకోవడము వల్ల పాదము పట్టు కోల్పోయి జారేలా చేస్తాయి. జెడ్డు తనము కాలును జారేటట్లు చేస్తుంది.
  • ======================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Sunday, June 29, 2014

Dove don't stay on tree why?, పావురము చెట్టుమీద వాలదా?

  •  

  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

 ప్ర : పావురము చెట్టుమీద వాలదా?
జ :పక్షి అంటేనే చెట్లపై నివసిస్తుందని నమ్మకము ... అభిప్రాయము . అయితే పావురము చెట్టుమీదే కాదు మిగిలిన పక్షుల లాగా కరంటు తీగలమీద , వైర్లు మీద వాలదు . గోడలమీద , బిల్డింగ్ ల మీద మాత్రమే వాలుతుంది.  అందుకు కారణము వాటి కాళ్ళ నిర్మాణము . మిగతా పక్షులకు కొమ్మలను ,తీగలను పట్టుమునేందు వీలుగా కాలు వేళ్ళు వంగుతాయి. ఆ పట్టువల్ల ఎంత గాలివీచినా కింద పడిపోవు . . . అటువంటి పట్టుకునే నిర్మాణము పావురానికి లేదు . నేలమీద , ఎత్తుపళ్ళాలు లేని రాళ్ళమీద నడిచేటటువంటి పాదాల నిర్మాణము పావురాలము లేదు. అందుకే పావురాలు చెట్టు కొమ్మలమీద కనిపించవు .
  • =========================
 visit My website > Dr.Seshagirirao - MBBS.-

Monday, June 23, 2014

భూమి మీద అన్నిప్రాంతాలలో వేడి ఒకేలా ఉండదెందుకు?

  •  

  •  

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

Click here for details : భూమి మీద అన్నిప్రాంతాలలో వేడి ఒకేలా ఉండదెందుకు?

  • ======================
 visit My website > Dr.Seshagirirao - MBBS.-

Monday, June 02, 2014

దోమ కుట్టి రక్తమెలా పీల్చుతుంది ?

  •  

  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
 Q : దోమ కుట్టి రక్తమెలా పీల్చుతుంది ?

జవాబు : దోమ చూసేందుకు చాలా చిన్నదే అయినా మనిషిని పరోక్షముగా చంపలలిగిన శక్తి కలిగిఉన్నది . మానవ రక్తాన్ని ఆహారముగా తీసుకుంటూ మలేరియా , ఫైలేరియా , డెంగూ ,  ఎల్లో ఫీవర్ , చికెన్‌గున్యా  వంటి ప్రాణాంతక వ్యాధులను తెచ్చే పరాన్నజీవులను మానవ రక్తములో ప్రవేశ పెడతాయి. అందుకు అనుకుణముగా దోమ నోటి భాగాలు మారి వుంటాయి.

డాక్టర్  ఇంజక్షన్‌ చేసిన రీతిలోనే దోమ తన నోటిభాగాలను శరీరము లోకి బలంగా గుచ్చి రక్తం పీలుస్తుంది. రంపపు పళ్ళ వంటి భాగాలతో శరీరం లో రంధ్రం చేస్తే సిరంజి వంటి మెడ కండరాలతో స్ట్రా లా  డ్రింక్ తాగిన రీతిలో రక్తం పీల్చుతుంది. తాగే రక్తము గడ్డకట్టకుంటా ఉండేందుకు ఒక రకమైన రసాయనాన్ని వదులుతుంది.
  • ===============================
 visit My website > Dr.Seshagirirao - MBBS.-

Saturday, May 24, 2014

What is Computer UPS?,కంప్యూటర్‌ (UPS‌) యుపిఎస్‌ అంటే ఏమిటి?.

  •  

  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

 Q : What is Computer UPS?,కంప్యూటర్‌ (UPS‌) యుపిఎస్‌ అంటే ఏమిటి?.

Ans : కంప్యూటర్‌ కరెంట్‌పై ఆధారపడి పనిచేసే పరికరం. కరెంట్‌ లేకపోతే కంప్యూటర్‌ పనిచేయదు. కరెంట్‌ సప్లైలోని హెచ్చు తగ్గులు సిస్టమ్‌ యూనిట్‌పై ప్రభావం చూపి మానిటర్‌లో పిక్చర్‌ట్యూబ్‌ పోవటమో, మదర్‌బోర్డు పాడవటమా, హార్డ్‌డిస్క్‌ క్రాష్‌ అవడమో జరిగిపోయే ప్రమాదముంది. మరీ ఇంతటి ప్రమాదాలు గురించి ఎందుకు? ఒక ఫైల్‌ మీద పని చేస్తున్నపుడు సడెన్‌గా కరెంట్‌పోతే ఆఫైల్‌లో ఇంకా సేవ్‌ చేయని భాగం తూడిచి పెట్టు కుపోవచ్చు. లేదంటే ఆ ఫైలే కరఫ్ట్‌ అయిపోవచ్చు.ఇటువంటి సమస్యలను నివారించడానికి తయారుచేయబడినదే యుపిఎస్‌. - అన్‌ ఇంట్రప్టెడ్ పవర్ సప్లై - పేరులోనే ఈ పరికరం ఉపయోగం చెప్పబడింది. అడ్డంకులు లేకుండా కరెంట్‌ను సప్లై చేస్తుంది అని అర్థం. అంటే ఓల్టేజి హెచ్చు తగ్గులను ముందుగానే తాను గ్రహించి కావల్సినంత కరెంట్‌ను కంప్యూటర్‌కు అందిస్తుంది. బ్యాటరీ సహాయంతో కరెంట్‌పోయినా కొంతసేపు అంటే పనిచేస్తున్న ఫైల్‌ను సేవ్‌ చేసుకుని కంప్యూటర్‌ను షట్‌డౌన్‌ చేసేంత వరకూ కావల్సిన కరెంట్‌ సప్లై ఇస్తుంది.

యుపిఎస్‌లో ముఖ్యమైన భాగం బ్యాటరీ, ఇంకా ఎలక్ట్రానిక్‌ సర్క్యూటీ, పవర్‌ సప్లై యూనిట్‌ ఉంటాయి. కరెంట్‌ సప్లైలోని హెచ్చు తగ్గుల్ని భాగం బ్యాటరీ - ఇంకా ఎలక్ట్రానిక్‌ సర్క్యూట్రీ ది. పవర్‌ సప్లై యూనిట్‌ ఎసి కరెంట్‌ను బ్యాటరీ శక్తిగా (డిసి కరెంట్‌) మార్చు కుని బ్యాటరీలో నిల్వ చేస్తుంది.

కంప్యూటర్‌ ఏ కరెంట్‌తో పని చేస్తుంది? కంప్యూటర్‌ డిసి కరెంట్‌తో పని చేస్తుంది. కాబట్టి మెయిన్‌ లైన్‌ నుండీ వచ్చే కరెంట్‌ను సిపియులోని పవర్‌ సప్లై బాక్స్‌ తీసుకుని డిసి గా మార్చి కంప్యూటర్‌ భాగాలకు అందిస్తుంది. మధ్యలో యుపిఎస్‌ ఉంటే అది ముందుగా మెయిన్‌ లైన్‌ నుండీ కరెంట్‌ను స్వీకరించి కంప్యూటర్‌కు అవసరమైనంత ఓల్టేజిలో పవర్‌  సప్లై బాక్స్‌కు కరెంట్‌ను అందిస్తుంది.

యుపిఎస్‌ల్లోనూ రకాలున్నాయి.

1. ఆఫ్‌లైన్‌ యుపిఎస్‌, 2. హైబ్రిడ్‌ యుపిఎస్‌, 3. ఆన్‌లైన్‌ యుపిఎస్‌

ఆఫ్‌లైన్‌ యుపిఎస్‌ కరెంట్‌లో వచ్చే హెచ్చుతగ్గుల్ని నియంత్రించి కంప్యూ టర్‌కు నేరుగా కరెంట్‌ను అందిస్తుంది. కరెంట్‌ పోయినపుడు బ్యాటరీ ద్వారా కరెంట్‌ను అందిస్తుంది.

ఆన్‌లైన్‌ యుపి ఎస్‌ కరెంట్‌ను నేరుగా బ్యాటరీకి తీసు కుని కరెంట్‌ ఉన్నా లేకున్నా బ్యాటరీ నుండే కంప్యూటర్‌కు అందిస్తుంది.

హైబ్రిడ్‌ యుపిఎస్‌ లేదా లైన్‌ ఇంట రాక్టివ్‌ యుపిఎస్‌పై రెండింటి పనుల్నీ ఏ సమయంలో ఏది అవసరమో దాని ఆధారంగా చేస్తుంది. యుపిఎస్‌ కంప్యూటర్‌లో భాగం కాదు.కంప్యూ టర్‌కు ఒక అదనపు అవసరం. యుపిఎస్‌ లేకున్నా కంప్యూటర్‌ పని చేస్తుంది. అయితే యుపిఎస్‌ లేని కంప్యూటర్‌ ఓల్టేజి హెచ్చుతగ్గులకు గురయ్యి త్వరగా పాడయ్యే అవకాశం ఉంటుంది.
  • ==========================
 visit My website > Dr.Seshagirirao - MBBS.-