Sunday, July 26, 2009

ఎనిమిది ఆత్మ గుణాలు అంటారు అవి ఏవి ? ,What are the eight Soul characters?


==================================
ఆత్మ, శరీరము (Psyco Somatic) ల తో కూడుకున్నది మానవ జీవితం . ఆత్మ కు చావులేదు ... శరీరము ముసలి తనము లో పంచ భుతాలలో కలిసిపోతుంది . ఆత్మ , శరీరాన్ని అదుపు చేస్తుంది ... మనసు ఆరోగ్యం గా ఉంటే నే శరీరము ఆరోగ్యం గా ఉంటుంది. మనసు మంచి దైతే మనుగడ మచిదే అవుతుంది ... ఈ మనుగడ మనసు గుణగణాల పై ఆధారపడి ఉంటుంది. అవే మంచి ఆత్మ గుణాలు :
  • 1.దయ ,
  • 2.క్ష మ ,
  • 3.అనసూయ ( అసూయా లేకుండా వుండడం ) ,
  • 4.శౌచం ,(పరిశుభ్రత),
  • 5.మొండితనం లేకపోవడం ,
  • 6.మధుర స్వభావము ,
  • 7.అత్యాస లేకపోవడం ,
  • 8.నిస్కామము (కమగ్ని లేకుండా ఉండడం),
ఈ ఎనిమిది ఆత్మ గుణాలు ను సామాన్య ధర్మాలంటారు .

Friday, July 17, 2009

గబ్బిలాలు తలకిందులుగా వేలడుతాయి ఎందుకు ?,Why Bats hang head down?


=======================================

పిల్లల్ని కనే క్షేరద విబాగానికి చెందినా గబ్బిలం , పక్షిలా ఎగరగాలిగినా పక్షి రెక్కలకున్న బలం దీనికి లేదు . అందుకే అది నేల మీద నుండి పైకి ఎగరలేదు .

ఒక నిర్దిష్టమైన ఎత్తుకు చేరి అక్కడ నుండి రెక్కలు విసురుతూ ఎగరగలదు . అందుకే అది ఎగిరేందుకు సిద్ధము గా ఉండే పధ్ధతి లో కాళ్ళతో కొమ్మలను పట్టుకుని కిందికి వేళ్ళాడుతుంది . దీని గోళ్ళు బలం గా ఉంటాయి . ఆ కాలూ పట్టు వదల గానే రెక్కలు విదిలించగలదు . ఇలా కిందికి వేలాడే అలవాటు వల్ల చేట్టుకోమ్మల మీద స్థానం కోసం పక్షుల తో పోటీ ఎదుర్కోవలసిన పరిస్థితి గబ్బిలాలకు ఉండదు .

సప్త ఋషులు అంటే ఎవరు?, Who were the seven sages?

హిందూ పురాణాలలో ఋషుల ప్రాధాన్యత ఎక్కువగానే ఉంటుంది . ఋషులు లేనిదే పురాణాలు ,ఇతిహాసాలు ,రామాయణం , మహాభారతాలు లేవనే చెప్పాలి . అన్నీ వారు వ్రాసినవే .

సప్త అంటే ఏడు ... ఆ సంఖ్యలోగల మహర్షులనే సప్తఋషులు అని అంటారు . వారు ..

  • 1. కశ్యపుడు ,
  • 2. అత్రి ,
  • 3. అంగీరసుడు ,
  • 4. కౌశికుడు ,
  • 5. వసిష్టుడు ,
  • 6. భ్రుగువు ,
  • 7. అగస్యుడు ,

అగస్య ముని

.

కశ్యప ముని ,


Friday, July 10, 2009

అష్టవిధ చిరంజీవులు అంటే ఎవరు ? Who were deathless personas in Epics?







=====================================================================================

భారతీయ
పురాణాలలో ఎనమండుగురు వ్యక్తుల్ని చిరంజీవులు గా పేర్కొన్నారు . చిరంజీవి అంటే చనిపోయినా బ్రతికున్నట్లు భావన . మ్రుతన్జీవి అంటే బ్రతికున్నా చనిపోయినా వాని కింద లెక్క .
పురాణ చిరంజీవులు :
  • 1. అశ్వద్ధామ ,
  • 2. బలిచక్రవర్తి ,
  • 3. వ్యాసమహర్షి ,
  • 4. హనుమంతుడు ,
  • 5. విభీషణుడు ,
  • 6. కృపాచార్యుడు ,
  • 7 . పరశురాముడు ,
  • 8. మార్కండేయ ,

Wednesday, July 08, 2009

పక్షులకు దిక్కులు ఎలా తెలుస్తాయి ? , How birds recognize directions?


==================

నగరాలలోకి వెళితే మనకు దారి తెలియక ఇబ్బంది పడతాం . ఇక ఆకాశం లో ఎ దారి గుర్తులు ఉండని చోట పక్షులు అన్ని వందల మైళ్ళు ఎలా ఎగురు తాయి ?.
  • పక్షులకు దిక్కుల పరిజ్ఞాము ఎక్కువే . అవి ఆకాశంలో ఉన్నా నక్షత్రాలు , సూర్యుడు ,చంద్రుడు , ఆధారము గా గుర్తులు పెట్టుకుంటాయి . వాటిని చూస్తూ తగిన కోణం లో ప్రయాణ మార్గం నిర్దేశించుకుని ముందుకు కదులుతాయి . అందుకే పక్షులకు దరితప్పడం అనేది జరుగదు .

Saturday, June 27, 2009

నాణెము నీళ్ళలో వేస్తె పెద్దదవుతుందా?,Coin appears bigger in water why?




నీళ్ళలో పూర్తీ గా మునిగి ఉన్న రూపాయి నాణెము పెద్దది గా మారినట్లు కనిపిస్తుంది . దీనికి కారణము నాణెము పెద్దది గా కనిపించేలా చేస్తున్న కాంతికిరణం , గాలిలో నుండి నీటిలోకి వెళ్ళినప్పుడు కాంతి వేగం తగ్గి వక్రీభావనానికి గురికవటమే . ఈ వక్రీభవనం వల్ల పాత్ర అడుగున ఉన్న నాణెం కొంచెం పెద్దది గా కనిపిస్తుంది ... అంతే కాని వాస్తవానికి నాణెం తడిసి పెద్దది గా మారటం ఎమాత్రం జరుగదు .

source : స్వాతి వారపత్రిక 03-07-2009

Wednesday, June 24, 2009

పోలిష్ చేస్తే షూ(బూట్) మెరుస్తాదేందుకు ?,


పొలిశ్ చేసిన షూ .-------------------------------- పొలిశ్ చెయ్యని షూ
---------------------------------------------------------------------------------------------------------------
పొలిశ్ చేసిన తర్వాత వేసుకునే షూ , పోలోష్ చెయ్యని షూ కి ఉన్నా తేడా స్కూల్ పిల్ల లందరికి తెలిసినదే .

షూ కి పొలిశ్ తో వచ్చే మెరుపు ఆ షూ నునుపుదనం మీద ఆధారపడుతుంది . షూ తయారీకి వాడేది చర్మ అయినా , ఇతర పదార్దమైనా దాని నిండా చిన్న చిన్న గుంటలు ఉండి గరుకుగా ఉంటుంది . అందువల్ల షూ "డల్ " గా కనిపిస్తుంది .
పొలిశ్ చేసినపుడు మనం వాడే పొలిశ్ పదార్ధం ఆ గుంటలను నింపటం వల్ల చర్మం నునుపుగా తయారై వెలుతురు పడినప్పుడు మెరుస్తూ ఎంతో ఆకర్షణీయం గా కనిపిస్తుంది .

Saturday, June 06, 2009

Butterfly has no skeletal system ?







  • సీతాకోక చిలుకకి అస్థిపంజరం వుండదా ?
అందమైన సీతాకికచిలుకలు మరణించినా వాటి శరీరం , రెక్కలు నిలిచి వుండటం కనిపిస్తుంది . దానికి ప్రధాన కారణం ఆ జీవుల అస్తిపంజరమే . ఎముకలు ఏమాత్రం లేని ఆ జీవుల రూపం బాహ్యం గా ఉండే ఖైటిన్ పొర ద్వార వస్తుంది . ఈ పొర ద్వారానే ఆ జీవులు శ్వాసక్రియ , విసర్జన క్రియ జరిపేందుకు వీలైన రంధ్రాలు ఉంటాయి . ఈ ఖైటిన్ పొర సీతాకోక చిలుక మాదిరిగానే రొయ్యలకు , పీతలకు పెంకుపై వుండి వాటికి రక్షణ కల్పిస్తుంది .

  • ==============================

Friday, May 15, 2009

రబ్బరు అక్షరాలను ఎలా తుడిపేస్తుంది ?



How do rabber erase pencil letters on a paper ?






  • pencil తో రాసేటప్పుడు తప్పు వస్తే వెంటనే రబ్బరు తీసుకుని తుడిసేస్తాం . మనం రాసే pencil ముళ్ళు లెడ్ తో తయారవుతుందని చెప్పినా నిజానికి అది మెత్తని " గ్రాఫైట్"


  • కాగితం మీద pencil తో గీసినపుడు ఈ గ్రాఫైట్ కాగితం పోగులకు పై పై నే అంటుకుంటుంది , కాగితం లోపలి రంద్రాల లోకి రబ్బరు తీసుకొని తుడవ గానే పైన వున్నా గ్రాఫైట్ సులభం గా పోగులనుండి విడిపోతుంది . రబ్బరు తో తుడిసిన తర్వాత paper ని దులిపితే పొడి రాలిపోయి ఆ ప్రాంతమంతా తెల్లగా అవుతుంది .

Friday, May 01, 2009

కొన్ని మందులు రంగు సీసాలలో ఇస్తారెందుకు ?




మనం కొనే టానిక్ లు , సిరప్ లు వంటివి గోధుమరంగు సీసాల్లోనే ఇస్తారు ,కొన్ని రకాల మాత్రలను రంగు సీసాల్లోనే వుంచుతారు ... అంతేకాదు మందులు , మందు సీసాల ను చీకటిగా చల్లగా వుండే ప్రదేశాలలో ఉంచమని సూచిస్తారు ... ఏమని ?
రోగికి , రోగానికి వాడే మందులు రసాయనాల తో తయారవుతాయి , ఆ రసాయనాలు సూర్య కాంతి లోని వేడి , అతినీలలోహిత తరంగాల ప్రభావానికి మార్పూ చెంది ఔసధగుణాన్ని పూర్తిగా కోల్పోతాయి . కొన్ని medicines చల్లని ప్రదేశం (ఫ్రిజ్) లోనే ఉంచాలి. అందుచేతనే కొన్ని మందులు గోధుమ రంగు సీసాలలో , కొన్ని మందులు ఫ్రిజ్ నుండి తీసి ఇస్తారు . అలాన్తపుడే అవి తమ ఔషధ గుణాన్ని సంపూర్ణము గా కలిగి ఉంటాయి.

/// డా. శేషగిరిరావు-యం.బి.బి.యస్. ///