Friday, September 05, 2014

Penguin feet not sticking to ice why?-పెంగ్విన్‌ పాదాలు మంచు గడ్డలకు అంటుకోవేం?

  •  

  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...



ప్రశ్న: మంచు ప్రదేశాల్లో నివసించే పెంగ్విన్‌ పక్షుల పాదాలు అక్కడి మంచు గడ్డలకు ఎందుకు అంటుకోవు?

జవాబు:
మంచు గడ్డలు పరుచుకొని ఉండే ప్రదేశంపై మనం నడిస్తే ఒత్తిడి వల్ల, మన దేహ ఉష్ణోగ్రత వల్ల మన కాళ్ల కింద మంచుగడ్డ కరుగుతుంది. ఆ ఒత్తిడిని కొంత సడలించగానే కరిగిన ఆ మంచు మరల గడ్డకట్టడంతో మన పాదాలు మంచు గడ్డకు అంటుకుంటాయి. కానీ పెంగ్విన్‌ పక్షుల విషయంలో అలా జరగదు. పెంగ్విన్ల దేహ ఉష్ణోగ్రత 39 డిగ్రీల సెల్సియస్‌ వరకు ఉన్నా, వాటి కాళ్లు ఎప్పుడూ చల్లగానే ఉంటాయి. అవి మంచుగడ్డపై కలిగించే ఒత్తిడి తక్కువే. అందువల్ల అవి మంచు గడ్డలున్న ప్రదేశాలల్లో ఉన్నా వాటి పాదాలకు మంచుగడ్డల మధ్య మంచు కరిగిన నీరు ఏర్పడదు. ఆ పాదాలు మంచుగడ్డలకు అంటుకోవు. పెంగ్విన్ల పాదాలు ఎల్లవేళలా చల్లగా ఉండడానికి కారణం వాటి కాళ్లలో ప్రవహించే రక్తం నియంత్రించబడి ఉండడమే. వాటి కాళ్లలో ఉండే రక్తనాళాలు, ధమనుల చుట్టూ ఉండే కండరాల అమరిక వల్ల వాటి పాదాల ఉష్ణోగ్రత 0 డిగ్రీల సెల్సియస్‌ కన్నా కొంచెం ఎక్కువగా మాత్రమే ఉండేటట్టు రక్తం అతి తక్కువగా ప్రవహిస్తుంది. ఇలా జరగడం వల్ల చల్లబడిన రక్తం మరలా దేహంలోకి తిరిగి వచ్చి అక్కడ ఉండే అనేక వెచ్చని రక్తనాళాలు, ధమనుల గుండా ప్రవహించి వేడెక్కుతుంది. అంటే తిరిగి తొలి ఉష్ణోగ్రతను చేరుకుంటుంది. ఆ విధంగా పెంగ్విన్‌ పాదాలు మంచుగడ్డలకు అంటుకోవు.

- ప్రొ|| ఈ.వి. సుబ్బారావు,-హైదరాబాద్‌
  • = ===========================
 visit My website > Dr.Seshagirirao - MBBS.-

No comments:

Post a Comment

your comment is important to improve this blog...