Thursday, June 30, 2011

పతివ్రతము అంటే ఏమిటి?, What is ment by worshiping husband?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.
ప్ర : మన పురాణాలలో పతివ్రతులు అని అంటారు కదా! పతివ్రతం అంటే ఏమిటి ? ఎలా చేయాలి?.
జ : పతి అంటే భర్త , సతి అంటే భార్య . పతివ్రతం అంటే భర్తపూజ .

‘‘పతివ్రతము’’ అనే పేరుతో స్ర్తి ధర్మాలలో శిఖరాయమాణమైన ధర్మంగా, శాస్త్రాలలో ఏది ఉద్ఘోషింపబడి వుందో, అది స్త్రీ చే ఆచరించబడి గడిపే జీవితమే పతివ్రతము . ఇక్కడ వ్రతము అంటే పూజ / నోమూ కాదు . భర్త కి అనుకూలము గా , అవసరాలు తీరుస్తూ, చేదోడువాదోడు గా, అడుగుజాడలలో నడుచుకుంటూ గడిపే భార్య నే పతివ్రత అంటారు . ఆ జీవితాన్నే ఒక వ్రతము గా పూర్వము మునులు , ఋషులు అభివర్ణించారు . ఆటు వంటి స్త్రీలకు దేవతల అనుగ్ర హము ఉంటుంది. వారు దేవతలతో సమానము .

ఆర్తార్తే ముదితే హృష్టా
ప్రోష్తి మలినా కృశా
మృతే మ్రియేత యా నారీ
సా స్ర్తి జ్ఞేయా పతివ్రతా॥

(తా॥ భర్త బాధపడుతుంటే తనూ బాధపడుతుంది. అతను సంతోషంగా వుంటే తనూ సంతోషంగా వుంటుంది. అతను ఊళ్లో లేకపోతే కళతప్పి చిక్కిపోతుంది. అతను మరణిస్తే తనూ మరణిస్తుంది. అలా వుండే స్ర్తియే పతివ్రత).

-- కుప్పా వేంకట కృష్ణమూర్తి (దత్త జననం -167)
  • ===================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Tuesday, June 28, 2011

సన్యాసుల చేతిలో కర్ర ఎందుకు?,Why do Rishis have stick in their hands?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.

ప్ర : సన్యాసుల చేతిలో కర్ర ఎందుకు?,

జ : జీయర్ స్వాములు మరికొందరు స్వాముల చేతిలో పొడవాటి కర్రలు ఉంటాయి గమనించారా? ఎళ్లవేళలా అవి వారి చేతిలో ఉంటాయి. ఊతకోసమా అంటేకాదు. మరి వాటిని ఎప్పుడు చేత పట్టుకోవడానికి గల కారణం గురించి తెలుసుకుందాం. వైరాగ్యానికి, తాత్వికతకు, ద్వైత, అద్వైత భావానికి గుర్తుగా ఈ పొడవైన కర్ర పట్టుకుంటారు సన్యాసులు .

ఈ కర్రలు వివిధ ఆకారాలలో ఉంటాయి. ప్రతీదానికి ఓ అర్ధం ఉంది. ' Y' ఆకారంగల యోగదండాన్ని, కమడలాన్ని పట్టుకొని ఉండేవారిని 'తాపసులు' లేదా 'ఋషులు' అని అంటారు. గాలి,నీరు, భూమి, అగ్ని, ఆకాశం అనే పంచభూతాల సమ్మేళనమే మనిషి కాబట్టి ఐదడుగుల కర్రను కూడా ధరిస్తారు. ఇందులో ఏకదండి, ద్విదండి, త్రిదండి అనే మూడు విధాలు ఉన్నాయి.

ఒకే ఒక కర్రను ధరించి ఉండేవారు అద్వైత సిద్ధాంతాన్ని నమ్మేవారు, బోధించేవారు. అద్వైతం అనగా జీవుడు, దేవుడు ఒక్కటేననే సిద్ధాంతం (శ్రీ శంకరాచార్య మతం) మనిషిలోనే దేవుడిని చూడమని. స్వర్గం, నరకం రెండూ ఇక్కడే ఉన్నాయి. అంతరాత్మకు విరుద్ధంగా అక్రమ మార్గాన, అన్యాయంగా సంచరించినా, ప్రవర్తించినా ఆ పాపఫలితాన్ని ఏదో ఒక రూపంలో ఇక్కడే తప్పకుండా అనుభవించక తప్పదు. ఈ అద్వైత సిద్దాంతాన్ని బోధించేవారి చేతిలో జ్ఞానానికి సంకేతమైన రావిచెట్టునుండి సేకరించిన ఒకే కర్ర ఉంటుంది.

రెండు కర్రలు కలిపి ఒక్కటిగాకట్టి ధరించి బోధనలు చేసేవారు ద్వైత సిద్ధాంతం కలవారు. వీరిని 'ద్విదండి ' స్వాములు అంటారు. వీరు జీవుడు, దేవుడు వేర్వేరు (రామానుజాచార్యుల మతం) అని బోధిస్తారు ద్వైత సిద్ధాంతానికి ఉన్న ప్రాచుర్యం అద్వైతానికి లేదు. ఈ మతానికి చెందినవారిని 'జీయరు'లని అంటారు.

మూడు కర్రలను ఒకే కట్టగా కట్టి భుజాన పెట్టుకునేవారు కూడా ఉన్నారు. వాళ్లు జీవాత్మ, పరమాత్మ, ప్రకృతి ఒకటే అనే నారాయణ తత్వాన్ని బోధిస్తూ ఉంతారు. వీరిది విశిస్టాద్వైతము . పొడవైన ఈ దండాలతో దుష్టప్రాణులనుండి రక్షణ కొరకు, ఫలఫుష్పాల సేకరణ చేసుకుంటూ భగవధ్యానం చేసుకుంటారు.

ఋషుల చేతిలో ఉండే 18 అంగులాల యోగదండం జపం చేయదానికి, ఆత్మరక్షణకు ఉపయోగపడుతుంది. యోగులు రుద్రాక్షమాల నేలపైబడకుండా 'Y' ఆకారంలో ఉన్న యోగదండంపై చేతినిపెట్టి జపమాల తిప్పుతుంటారు..
  • ===================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Saturday, June 25, 2011

మూడు రంగుల దారాన్ని ఉపయోగించి దీపాన్ని వెలిగించేది ఎందుకు ?, Three colored wicks using in oil lamps Why?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.
ప్ర : మూడు రంగుల దారాన్ని ఉపయోగించి దీపాన్ని వెలిగించేది ఎందుకు ?

జ : ఇది ఒక ఆద్యాత్మిక నమ్మకం. మన పూర్వీకులు ఏ మతానికి చెందిన వారైనా కొన్ని ఆచారాలు ఎందుకు పాటించారో ఇప్పటికీ అంతుపట్టడం లేదు . పుట్టే బిడ్డకు అమ్మ పైన నమ్మకం ... అంతా తనకోసం మంచే సేస్తుందని . అంతే నమ్మకం తో మనము దేవుని కొలుస్తాము ... నమ్ముతాము అంతా మనకోసం మేలే చేస్తాడని . మూడురంగుల దారాల ఒత్తిని ఉపయోగించి దీపాన్ని వెలిగించడం పురాతనమైన సంప్రదాయము . దీనిలో తమ వారంటే తమకున్న ప్రేమను తెలియజెప్పే చర్య ఉన్నది . ఇంట్లో యజమానికి జబ్బుచేస్తే మూడురంగుల దారాలతో ఏడు పేటల వత్తి చేసి నెయ్యి లేదా ..నూనె లేదా .. ఆముదం మట్టి ప్రమిదలలో ఈ రంగుల వత్తి వేసి పూజా గదిలో వెలిగిస్తారు .

ఏమి జరుగుతుందో తెలియదు కాని ఒకరి నమ్మకాన్ని వమ్ము చేయకూడదు . నమ్మకము మనసు కి బలమైన శక్తిని , ప్రశాంతిని ఇస్తుంది . ఆ నమ్మకం తోనే వారిని అలా ఉండనివ్వండి . నమ్మకాలు ఎప్పుడూ మూడనమ్మకాలు కాకూడదు ... మూడనమ్మకాలు అనర్ధాలకు దారితీస్తాయి.
  • ===============================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Thursday, June 23, 2011

ఎలర్జీ ఎందుకు వస్తుంది ? , Why do we get Allergy?

  • [Allergic+reaction+-+boy-2.jpg]

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.

ప్ర : ఎలర్జీ కొందరికి ఎందుకు వస్తుంది ?

జ : ఉన్నట్లుండి గొంతు గరమంతుంది , మరుసటి రోజు ముక్కునుండి నీరు రావటం ప్రారంభమై జలుబు చేస్తుంది . మరొ కరికి హఠాత్తుగా కళ్లు ఎర్రబడి నీరుకారడం ప్రారంభమవుతుంది . మరొకరికి కారణం లేకుండా ఒళ్ళు వెచ్చబడి ఆయాసంగా ఉంటుంది . శ్వాస వదిలేటప్పుడు పిల్లికూతలవంటి శబ్దం వస్తూ ఉంటుంది . ఇంకొకరి హఠాత్తుగా కాళ్ళు , చేతులు వేళ్ళ మధ్య దురద ప్రారంభమవుతుంది . ఇవన్నీ ఒకే కారణం వల్ల వస్తాయి ... అదే అలర్జీ (allergy) అంటారు. . ఏ మనిషిలోనైన అలర్జీ కలిగించే పదార్థాలను అలర్జెన్స్‌(Allergen) అంటారు.

మన చుట్టూ ఎన్నోరకాల సూక్ష్మజీవులున్నాయి. ఈ సూక్ష్మ పదార్ధాలు , రసాయనాలు , పుప్పొడిరేణువులు , ధూలి, దుమ్మి వంటివి ......... గాలి , నీరు , బట్టలు , ఆహారపదార్ధములు ద్వారా వచ్చి మనకు చేరుతాయి లేదా తాకుతాయి . వీటన్నిటిమీద తగిన చర్య చూపుతూ శరీరము , వ్యాధినిరోధక వ్యవస్థ తనను తాను రక్షించుకుంటుంది . అయితే వీటిలో కొన్నింటిమీద కొందరి శరీరాలు చూపే ప్రతిచర్యలు తీవ్రముగా ఉంటాయి . అదే ఎలర్జీ. ఇవి అందరిలో ఒకేలా ప్రభావము చూపవు . ఒక్కొక్కరికి ఒక్కో పదార్ధము పడకపోవచ్చును . శరీరము ఎలర్జెన్‌ లకు స్పందించినప్పుడు " హిస్టమిన్‌" అనే పదార్ధము పుడుతుంది . దీని ప్రభావము వల్ల చర్మము మీద మంట , దురద , దద్దుర్లు , శ్వాస సరిగా ఆడకపోవడం వంటి ఇబ్బందులు కలుగుతాయి.
  • =====================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Wednesday, June 22, 2011

చదువుతుంటే నిద్రొస్తుందేమి?, Why do we get sleep while reading?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.

ప్ర : చదువుకుంటున్నప్పుడు మనలో చాలా మందికి నిద్ర వస్తుంది . ఎందుకని?.

రాము . . దేశిల్ల వీధి -శ్రీకాకుళం టౌన్‌.

జ : చదివేటపుడు నిద్ర రావడమనేది మనము ఏ భంగిమలో ఉన్నాము ... ఎంతసేపు ఉన్నాము అనే దానిమీద ఆధారపడి ఉంటుంది . చదివేటప్పుడు శరీర కదలికలు తక్కువగా ఉండటం వలన కండరాలకు ప్రవహించే రక్తము తగ్గుతుంది . దాని ములాన కండరాలలోని జీవకణాలలో దహనచర్య (combustion) మందగించి " లాక్టిక్ యాసిడ్ " అనే ఆమ్లము తయారవుతుంది . ఈ ఆమ్లము ప్రాణవాయువైన ఆక్షిజన్‌ ను అతిగా గ్రహిస్తుంది . . దాంతో దేహములోని రక్తానికి కావలసిన ఆక్షిజన్‌ లో కొంత తగ్గుదల వస్తుంది . ఆక్షిజన్‌ తగినంతగా లేని రక్తం మెదడులోకి ప్రవహించడం వల్ల మగతగా , నిద్ర వస్తున్నట్లుగా ఉంటుంది . అందుకే చదివేటపుడు ఒకే భంగిమలో ఉండిపోకుండా అప్పుడప్పుడు అటు ఇటూ కదలడం , ఏకుబికిన చదవకుండా మధ్యలో కాస్త విరామము ఇవ్వడం చేస్తే నిద్ర రాదు .

  • ============================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

విమానాలు ఆకాశంలో వెళ్లేప్పుడు పగటి పూట వినిపించేంత శబ్దం, రాత్రి వేళల్లో వినిపించదేం?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.

ప్రశ్న: విమానాలు ఆకాశంలో వెళ్లేప్పుడు పగటి పూట వినిపించేంత శబ్దం, రాత్రి వేళల్లో వినిపించదేం?

జవాబు: పగటి పూట రణగొణ ధ్వనుల మధ్య కూడా వినిపించే విమాన శబ్దం, రాత్రి నిశ్శబ్దంలో మరింత ఎక్కువగా వినిపించాలి కదాని అనిపిస్తుంది కానీ అలా జరగదు. దీనికి కారణం గాలిలో ధ్వని ప్రయాణించే తీరుతెన్నులే. గాలి వేగం, సాంద్రతలను బట్టి శబ్ద తరంగాల ప్రయాణం ఆధారపడి ఉంటుంది. పగటి కన్నా రాత్రి పూట వాతావరణ ఉష్ణోగ్రత తక్కువనే సంగతి తెలిసిందే. గాలి వేగం తక్కువ ఉష్టోగ్రత దగ్గర తక్కువగాను, ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద ఎక్కువగాను ఉంటుంది. గాలి వేగం తక్కువగా ఉన్నప్పుడు శబ్ద తరంగాలు మనకు చేరే లోపలే గాలి అణువుల తాడనాల్లో క్షయం (dissipate) అవుతాయి. అలాగే గాలి సాంద్రత (density) ఎక్కువగా ఉంటే ధ్వని వేగం తగ్గుతుంది. గాలి సాంద్రత తగ్గితే ధ్వని వేగం పెరుగుతుంది. పగటి కన్నా రాత్రే గాలి సాంద్రత ఎక్కువ. నిజానికి వేగం కన్నా ధ్వని తీవ్రతే (sound intensity) మన వినికిడిలో స్పష్టతను నిర్ధరిస్తుంది. ఈ విలువ కూడా రాత్రి పూట తక్కువ. ధ్వని తీవ్రతను నిర్దేశించే 'అకౌస్టిక్‌ ఇంపెడెన్స్‌' లక్షణం గాలికి రాత్రివేళల్లో ఎక్కువగా ఉంటుంది. ఈ కారణాలన్నింటి ఫలితంగా రాత్రి వేళల్లో విమానాల మోత మనకు తక్కువగా వినిపిస్తుంది.

-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞాన వేదిక

  • =========================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Tuesday, June 21, 2011

ఉగాది నాడు చేసే దశవిధ కృత్యాలు వివరాలు ఏమిటి ? ,What are Ten types human duties on UGADI .

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.

ఉగాది పండుగ నాడు దశవిధ కృత్యాలు ను ఆచరించాలి . అవి -->
  1. ప్రతిగృహధ్వజారోహణము--కేవలం మహారాస్త్రం లోనే చూడగలము .,
  2. తైలాభ్యంగము - నూనె శరీరాని పట్టించి స్నానము చేయడం --అరోగ్యసూత్రాలలో ఒకటి ,
  3. చత్రచామర స్వీకారము -- ముంబై ,కలకత్తా ప్రాంతీయులు కొత్త గొడుగు , విసనకర్ర కొంటారు .,
  4. దమనేన బ్రహ్మపూజ్యము -సువాసనాబరితమైన పత్రాలతో పదిమంది దేవతా మూర్తులను పదిరోజులు పూజిస్తారు .,
  5. సర్వా పచ్చాంతికర మహాశాంతి--విఘ్నేశ్వరుని , నవగ్రహాలు ను పూజిస్తారు . ,
  6. నింభపుష్ప (వేపపువ్వు ) భక్షణం --వేప పచ్చడిని తినడం ,
  7. పంచాంగపూజ -శ్రవణము - - పంచాంగ శ్రవణము ... మంచి చెడులను తెలుకోవడం ,
  8. ప్రపాదాన ప్రారంభం -- చలివేంద్రాలను ప్రారంభించి దాహార్తులకు మంచినీటిని దానము చేయడం.,
  9. రాజస్నేహ దర్శనము -- ఈ కాలము లో రాజులేరు అందువల రాజకీయ నాయకులను , స్నేహుతల దర్శనము చేయడం .,
  10. వాసంత నవరాత్ర కలశ పూజ - భగవంతుని -- మన ఇస్టదైవాన్ని పూజించడం ,
ఈ పది ఉగాది విధి-విధాయక కృత్యాలు -- ఇవన్నీ నమ్మకాలే . మన పూర్వీకులు చేసేవారు ... మనమూ చేస్తున్నాము . కొనీ కాలగర్భము లో కలిసిపోయాయి. కొన్ని పనులు మాత్రము అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నాయి . ఏది చేసినా ఎక్కడ చేసినా మనిషి సుఖజీవనానికి అవసరమైం ధనము కావాలి . వస్తుమార్పిడి విధానము పోయి ... ధనమార్పిడి విధానము లో దబ్బు కీలక పాత్ర పోషిస్తూఉన్నది . ఈ పూజలన్ని దానికోసమే . అందుకే అన్నారు ' ధనమేరా అన్నిటికీ మూలము ' ఒక మహానుభావుడు .
  • ==========================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

దశవిధ పాపములు అంటే ఏమిటి ?, What are ten sins in Hindu epics?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.
ప్ర : దశవిధ పాపములు అంటే ఏమిటి ?, What are ten sins in Hindu epics?
జ:
1. ఒకరి వస్తువు వారికివ్వకుండా తీసుకోవడం,
2. శాస్త్రము ఒప్పని హింసను చేయడం,
3. పర స్త్రీని కలవడం - ఇవి మూడు శరీరం తో చేసేవి.
4. పరుషము(కోపము ),
5. అసత్యము(అబద్దము ),
6. కొండెములు(చాడీలు చెప్పుట),
7. అసంబద్దమైన మాటలు - ఇవి నాలుగూ మాట ద్వారా చేసేవి.
8. ఇతరుల ధనములందు కోరిక,
9. ఇతరులకు ఇష్టముకాని విషయములు చేయతలచడము,
10. వ్యర్ధమైన అహంకారము - ఇవి మూడూ మానసికంగా చేసేవి................ఇవే పదిరకాలైన పాపాలు.

ఈ పదిరకాలైన పాపాలూ చేయని మనిషి ఉంటాడా? అని ఆలోచించనక్కర్లేదు. ఏదో ఒక సమయాన ఏదో ఒక పాపం యెంత మంచి వ్యక్తీ అని పేరు పొందిన వారైనా సరే చేసి ఉండక తప్పదు. తప్పులు చేయడం. వాటిని గురించి ఆలోచించక పోవడం. తానూ చేసినవి తప్పులే కావు అనుకోవడం ఈ పది పాపాలకు మించిన పాపం.
ఏది ఏమైనా మనం మంచి అదృష్టవంతులం, మనం చేసిన తప్పులూ వలన వచ్చే పాపాలూ కడిగేసుకునే ఉపాయాలు మన శాస్త్రాలు, మన పెద్దలూ, మనకు ముందే చెప్పారు.
  • ========================================
visit My website > Dr.Seshagirirao -

Thursday, June 16, 2011

గరాటుతో ఒక సీసాను నీటితో నింపేప్పుడు తరచూ గరాటును కొంచెం పైకి ఎత్తవలసి వస్తుంది. ఎందుకు?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.

ప్రశ్న: గరాటుతో ఒక సీసాను నీటితో నింపేప్పుడు తరచూ గరాటును కొంచెం పైకి ఎత్తవలసి వస్తుంది. ఎందుకు?

-కె. అశోక్‌, సింగరాయకొండ (ప్రకాశం)

జవాబు: గాలి, నీరు ఎక్కువ పీడనం ఉన్న ప్రదేశం నుంచి తక్కువ పీడనం ఉండే ప్రదేశంలోకి ప్రవహిస్తాయి. సీసా మూతిపై గరాటును పెట్టి నీరు పోసినప్పుడు కొంత నీరు సీసాలోకి పడుతుంది. అంతవరకు అక్కడున్న గాలి సీసాలోంచి తప్పించుకుపోడానికి గరాటు అడ్డంగా ఉండడంతో నీటిలో కలిసిపోతుంది. అలా నీరు పోసేకొలదీ, సీసాలోని గాలి నీటిలో కలిసిపోతుండంతో ఒక దశలో సీసా బయట ఉండే గాలి పీడనం కన్నా, సీసాలోని పీడనం ఎక్కువవుతుంది. అందువల్ల ఆపై గరాటులో పోసే నీరు లోపలికి దిగకుండా ఈ పీడనం నిరోధిస్తుంది. అప్పుడు గరాటును కొంచెం పైకి ఎత్తితే సీసాలోని గాలి కొంత బయటకు తప్పించుకుపోతుంది. అప్పుడు సీసాలోపలి పీడనం బయటి పీడనం కన్నా తక్కువ అయి నీరు సాఫీగా దిగుతుంది.

-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌

  • ==========================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Tuesday, June 14, 2011

కరెంటు తీగ తెగి సముద్రంలొ పడితె సముద్రం మొత్తం షాక్ వస్తుందా?,Do sea give shock if a electric wire falls in it?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.

ప్ర : అత్యదిక విద్యుత్తు ప్రవహిస్తున్న కరెంటు తీగ అనుకొకండా తెగి సముద్రంలొ పడితె సముద్రం మొత్తం షాక్ వస్తుందా?

జ : ఎంత విద్యుత్తు అయినా,ఎక్కడి విద్యుత్తైనా చివరికి ప్రవహించెది భూమిలొకె.విద్యుత్పత్తి కెంద్రాల్లొ.జనరెటర్ల లొ ఉత్పత్తి అయ్యె విద్యుత్ ఫెజ్ ,న్యుట్రల్ అనె రెండు తీగల గుండా వెళ్తుంది.వీటిలొ ఫెజ్ లొ మత్రామె విద్యుత్తు ఉంటుంది.న్యూట్రల్ అంటె విద్యుత్ వలయాన్ని పూర్తి చెయాడానికి వాడె సింక్ లాంటిదన్నమాట ఈ న్యుట్రల్ అంటె భూమె!భూమిలొ అత్యదిక బాగాన్ని అక్రమించి ఉన్న సముద్రంలొకి అదిక విద్యుత్తు ఉన్న తీగ తెగిపడినా ఆ విద్యుత్తు మొత్తం సముద్రంలొకి ఇంకిపొతుంది.సముద్రానికి కాని సముద్ర జల చరాలకు కాని ఎ మాత్రం షాక్ కొట్టదు.సముద్రం మొత్తం భూమికి అంటుకొకుండా విడిగా ఉన్నట్లైతె అప్పుడు మనం ఒక చెయ్యి సముద్రంలొను,మరొ చెయి భూమి మీద పెడితె మనకు షాక్ కొడుతుంది.కాని సముద్రాన్ని భూమి నుమ్చి విడదీయలెం కదా!

  • ========================================
visit My website > Dr.Seshagirirao -

పాంచజన్యము అంటే ఏమిటి? , What is panchajanya in hindu epics?

  • https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjJ_XzR0Jiz2G7-0wewQSQcpqFWSytuANOXrGCgNxV0bUe8-gF4cCFuRhXN8UZB29p4zLPgfnnkiNeD07oaQ9_V4y3z2X1YnhuF23JzWZu08wGi532F6z_DaBTUxA2XaQh0MVx_j0dhmbyw/s1600/Conch_drawing.jpg

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.

పాంచజన్యము శ్రీకృష్ణుని శంఖము పేరు . ధర్మరాజు పాండవులలో అగ్రజుడు , ధర్మపుత్రుడు . యుధిస్ఠిరుడు అని ఆయనకు నామాంతరములు . ఆయన చేతిలోని శంఖమునకు " అనంత విజయ" అని పేరు . అంటే అంతులేని భటులను జయించేదని అర్ధము . అర్జునిని చేతిలోఉన్న శంఖమునకు " దేవదత్తము అని పేరు . భీముని శంఖము " పౌండ్రము " నకులుని శంఖము " సుఘోషము " అని పేరు .సహదేవుని శంఖము పేరు " మణి పుష్పకము " అని పేరు . కురుక్షేత్ర యుద్ధము లో అందరూ తమతమ శంఖములను పూరించినారు . ఐదుగురి చేతులలో ఐదు శంఖాలు . శ్రీకృష్ణ పరమాత్మ ఆరవవాడు ... ఆయన శంఖము పాంచజన్యము . . . ఈ ఐదుగురి శంఖములతో సమానము పాంచజన్యము .

చేపలవలె నీటిలో ఉండే ప్రాణి శంఖము ఆ ప్రాణి శంఖము లో ఉన్నపుడు కదులుతూ ఉంటుంది . మనకు పైన చర్మము లోన మాంసము , ఎముకలూ ఉండగా శంఖమునకు బయట అస్థి లోపల మాంసము ఉంటుంది . సముద్రములో ఉన్న ' పంచజనమనే ' శంఖమును బయటికి తెచ్చి భగవంతుడు తన యుద్ధ ఘోషకు ఉపయోగించాడు . పంచజనునకు సబంధించీంది కనుక దానికి " పాంచజన్యము " అని పేరు . అందరూ వారి వారి శంఖములను యూద్ధప్రారంభ సూచకముగా ఆనాడు పూరించేవారు .
  • ======================================
visit My website > Dr.Seshagirirao -

Sunday, June 12, 2011

అణుబాంబు పరీక్షల విషయంలో భూగర్భ శాస్త్రవేత్తలు ఎంతో ఆసక్తి చూపిస్తారెందుకు?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.

ప్రశ్న: అణుబాంబు పరీక్షల విషయంలో భూగర్భ శాస్త్రవేత్తలు ఎంతో ఆసక్తి చూపిస్తారెందుకు?

-కె. వైకుంఠం, ఇంటర్‌, అనంతపురం

జవాబు: ప్రపంచంలోని వివిధ దేశాలు 1945 నంచి అణుబాంబు పరీక్షలు చేయడంలోని ఉద్దేశం, ఎక్కువ శక్తిమంతమైనవాటిని రూపొందించాలనే. కానీ ఈ పరీక్షలు భూమి యొక్క నిర్మాణ క్రమాన్ని కూడా వివరంగా తెలుపుతాయి. ఎందుకంటే అణుబాంబుల విస్ఫోటనం, భూకంపంలాగానే భూమిని కంపింపజేస్తుంది. భూకంపం వల్ల ఉత్పన్నమయ్యే సీస్మిక్‌ తరంగాలు భూమి అంతర్భాగాల్లోకి చొచ్చుకుపోయి, అక్కడ పరావర్తనం (Reflection), విక్షేపణం (Dispension) చెందడంతో వాటిని బట్టి భూగర్భ లోతుల్లోని నిర్మాణం ఎలా ఉందో తెలుసుకోవచ్చు. కానీ ఆ విధంగా అధ్యయనం చేయడానికి శాస్త్రవేత్తలకు భూకంపాలు ఎప్పుడు సంభవిస్తాయో కచ్చితంగా తెలియదు. అదే అణుబాంబు విస్ఫోటన సమయం ముందుగానే తెలుస్తుంది కాబట్టి, భూగర్భ శాస్త్రవేత్తలు ఆయా పరికరాలను అమర్చుకుని సీస్మిక్‌ తరంగాలను అధ్యయనం చేస్తారు.

-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌

  • ===================================
visit My website > Dr.Seshagirirao -

Friday, June 10, 2011

అయస్కాంతాలు ఇనుమును మాత్రమే ఆకర్షిస్తాయెందుకు?, Why do Magnets attracts iron only?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.

ప్రశ్న: అయస్కాంతాలు ఇనుమును మాత్రమే ఆకర్షిస్తాయెందుకు?, Why do Magnets attracts iron only?

-జి.ఆర్‌. వాసవి, రొద్దం (అనంతపురం)

జవాబు: బాహ్య అయస్కాంతాల పట్ల ప్రవర్తించే తీరును బట్టి పదార్థాలను మూడు తరగతులుగా విభిజిస్తారు.
అవి 1. డయాస్కాంత(dia-magnetic), 2. పరాయాస్కాంత (paramagnetic), 3. ఫెర్రో అయస్కాంత పదార్థాలు. డయాస్కాంత పదార్థాలను బాహ్య అయస్కాంతం వికర్షిస్తుంది. అయితే ఈ వికర్షణ బలం చాలా స్వల్పం కాబట్టి మనం గుర్తించలేక ఆకర్షించడం లేదనే భావిస్తాము. నీరు, రబ్బరు, చక్కెర, ఉప్పు వంటివి ఇందుకు ఉదాహరణలు. ఇక పరాయాస్కాంత పదార్థాలను బాహ్య అయస్కాంతం స్వల్పంగా ఆకర్షిస్తుంది. అయితే ఈ ఆకర్షణ బలం కూడా అతి స్వల్పంగా ఉండడంతో మనం వాటిని కూడా అయస్కాంతం ఆకర్షించదనే అనుకుంటాము. ఇందుకు ఉదాహరణ రక్తం, మైలతుత్తం, కొబాల్టు క్లోరైడు, ఆక్సిజన్‌, మాంగనీస్‌ సల్ఫేటు మొదలైనవి. ఇక మూడో రకమైన ఫెర్రో అయస్కాంత పదార్థాలను మాత్రమే అయస్కాంతం బలీయంగా ఆకర్షిస్తుంది. వీటిలో కేవలం ఇనుమే కాదు, క్రోమియం ఆక్సైడు, క్రోమియం, నికెల్‌ లోహాలు కూడా ఉన్నాయి. పదార్థాలలో ఒంటరి ఎలక్ట్రాన్లు ఏమాత్రం లేకుండా అన్నీ జతలుగా ఉంటే అవి డయాస్కాంత ధర్మాలను ప్రదర్శిస్తాయి. అణువుకో, పరమాణువుకో ఒకటో, రెండో జతకూడని ఒంటరి ఎలక్ట్రాన్లు ఉన్న పదార్థాలు పరాయాస్కాంత ధర్మాలను ప్రదర్శిస్తాయి. చాలా ఎక్కువ సంఖ్యలో ఒంటరి ఎలక్ట్రాన్లు ఉండడమే కాకుండా అవన్నీ కవాతు చేసే సైనికుల్లా ఒకే దిశలోకి మళ్లగలిగే పదార్థాలు ఫెర్రో అయస్కాంత పదార్థాలు అవుతాయి.

-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక

  • =================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ పూర్తయిన తర్వాత అలా ఉంచేస్తే ఏమవుతుంది?,What happen to cellphone if continue pluged-in after charging?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.

ప్రశ్న:సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ పూర్తయిన తర్వాత కూడా ప్లగ్‌లోంచి తీయకుండా అలాగే ఉంచేస్తే ఏమవుతుంది?

-పి. జాన్‌ ప్రశాంత్‌సాగర్‌, హైదరాబాద్‌

జవాబు: సెల్‌ఫోన్లలో వాడే బ్యాటరీని రీఛార్జబుల్‌ బ్యాటరీ అంటారు. అందులో సాధారణంగా లిథియంను వాడతారు. ఛార్జింగ్‌ అయిపోయిన తర్వాత కూడా అలాగే ఉంచేస్తే పెద్దగా ప్రమాదం ఉండకపోయినా, బ్యాటరీ వేడెక్కి తన జీవితకాలాన్ని కోల్పోతుంది. కొన్ని నాసిరకం బ్యాటరీలైతే ప్రమాదం జరిగే అవకాశం లేకపోలేదు. కాబట్టి సెల్‌ఫోన్‌కు రాత్రిళ్లు ఛార్జింగ్‌ పెట్టి నిద్రలోకి జారిపోవడం మంచిది కాదు. ఛార్జింగ్‌ అయిపోగానే ఛార్జర్‌ నుంచి సెల్‌ను, ప్లగ్‌ నుంచి ఛార్జర్‌ పిన్నును కూడా తొలగించడం మంచిది. కొన్ని కొత్త మొబైల్స్‌లో ఛార్జింగ్‌ అయిపోగానే సర్క్యూట్‌ బ్రేక్‌ అయ్యే సదుపాయం ఉంది.

- ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
  • =============================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Wednesday, June 08, 2011

సముద్రపు గాలి మన శరీరానికి మంచిదేనా?, Is Sea breeze good for human body?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.

ప్రశ్న: సముద్రపు గాలి మన శరీరానికి మంచిదేనా?,

-కె. రంగారావు, 7వ తరగతి, చిన్నగంజాం (ప్రకాశం)

జవాబు: సముద్రపు గాలి మన శరీరానికి మంచిదే. సముద్ర తీరపు వాతావరణం మన శరీరంలోని శ్వాసావయవాలకు, చర్మానికి మేలు చేస్తుంది. రక్త ప్రసరణాన్ని అభివృద్ధి పరచడమే కాకుండా, దేహానికి కావలసిన రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. ఆస్తమా, చర్మ సంబంధిత అలర్జీలు, సమస్యలు ఉన్న వారికి సముద్రపుగాలి సోకాలని వైద్యులు సలహా ఇస్తారు. వేసవిలో వీచే సముద్రపు గాలిలో నీటి ఆవిరి శాతం ఎక్కువగా ఉండడంతో శరీరంపై చెమట పోసి అసౌకర్యానికి గురి చేసినా, ఆ గాలుల్లో కాలుష్యం లేనందున మిగతా కాలాల్లో శ్వాసకోశ వ్యాధులున్న వారికి అనుకూలంగా ఉంటాయి. ఆ గాలుల్లో ఉప్పుతో కూడిన అతి చిన్న సముద్రపు నీటి కణాలు, అయోడిన్‌, మెగ్నీషియంలాంటి మూలకాలు ఉండడం వల్ల ఇవి మన శ్వాస సంబంధిత మార్గాల్లో శ్లేష్మం చేరకుండా ఉంచుతుంది. జనావాసాలకు దూరంగా ఉండే సముద్రపు గాలుల్లో వాహనాలు, పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్యం కూడా కలవకపోవడంతో అది మరింత ఆరోగ్యకరం.

-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌

  • ================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Monday, June 06, 2011

కుంకుమ తయారీ ఎలా?, How do kumkum prepare?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.

ప్రశ్న: పసుపును పసుపుకొమ్ముల నుంచి చేస్తారు కదా, మరి కుంకుమను ఎలా చేస్తారు?

-ఎ. గిరిజీప్రీతి, మహబూబ్‌నగర్.

: కుంకుమ. ... కుంకుమపువ్వు ఒకటికావు . కుంకుమపువ్వు ఒక సుగందద్రవ్యము . కుంకుమ... బొట్తుపెట్టుకోవడానికి వాడే రంగు పదార్ధము . కుంకుమ (Kumkum) హిందువులకు చాలా పవిత్రమైనది. స్వచ్ఛమైన కుంకుమను తయారుచేయడానికి పసుపు, పటిక మరియు నిమ్మరసం వాడతారు. హిందువులలో పెళ్ళి జరిగిన తర్వాత ఆడవారు నుదురు మీద కుంకుమ బొట్టు పెట్టుకుంటారు.

ఆ కుంకుమ తయారి గురించి .

కావలిసిన సామానులు :
10 కిలోలు , పసుపుకొమ్ములు ,
1 కిలో పటిక ,
1 కిలో ఎలిగారం ,
400 నిమ్మకాయలు ,
1/2 కిలో నువ్వుల నూనె .

ముందుగా నిమ్మకాయలను రసము తీసుకొని , ప్లాస్టిక్ బకెట్ లో పోసుకోవాలి . పటిక , ఎలిగారం ను కచ్చాపచ్చాగా దంచి , ఆ రసములో ,కరిగి పోయేటట్లుగా కలపాలి . తరువాత పసుపు కొమ్ములు వేసి బాగాకలిపి ఒక రోజు వుంచాలి . మరునాడు వాటిని , ఇంకో ప్లాస్టిక్ బకెట్లోకి పూర్తిగా వంచేయాలి . ఆ విధముగా , నిమ్మరసము , పసుపు కొమ్ములకు పూర్తిగా పట్టేవరకు ,ప్రతిరోజూ ఒక బకెట్ లో నుండి , ఇంకో బకెట్ లో కి గుమ్మరించాలి .. ఇలా మార్చటము వలన పసుపు కొమ్ములకు నిమ్మరసము చక్కగా అంటుతుందన్నమాట. పసుపుకొమ్ములకు నిమ్మరసము పూర్తిగా పట్టిన తరువాత , అంటే ,ఈ సారి బకెట్ వంచుతే ,ఒక్క చుక్క కూడ నిమ్మరసము , పడకూడదన్నమాట , ఎవరూ తిరగని చోట , దుమ్మూ ధూళీ పడని చోట , నీడలో నేల శుభ్రముగా తుడిచి , చాప వేసి , దానిమీద , శుబ్రమైన బట్టను పరిచి , ఈ పసుపు కొమ్ములను ఎండపెట్టాలి . నీడలోనే సుమా ! అవి పూర్తిగా ఎండిన తరువాత , రోటిలో వేసి దంచాలి . ఆ పొడిని , తెల్లటి , పలచటి బట్టలో వేసి , జల్లించాలి . తరువాత ఆ పొడిలో కొద్ది కొద్దిగా నూనె వేస్తూ కలపాలి . నూనె తో కలపటము వలన , కుంకుమ నుదుటి మీద నిలుస్తుంది . లేకపోతే పెట్టుకోగానే రాలిపోతుంది . సరిపడా నూనె కలిపాక , సువాసన కొరకు ,కొద్దిగా రోజ్ వాటర్ కాని , ఉడుకులోన్ కాని కలపాలి . ఈ కుంకుమ మంచి ఎరుపురంగు లో వుంటుంది . ( సింధూరం రంగు కాదు , ఎరుపు ) .

ఎవరైనా ప్రయత్నము చేయాలంటే 100 గ్రాముల పసుపు కొమ్ములతో , మిగితావి ఆ కొలతకు సరిపడా తీసుకొని చేసుకోవచ్చు. పటిక , ఎలిగారము , కిరాణాదుకాణాలలో దొరుకుతాయి . చక్కని సువాసన తో ఈ కుంకుమ చాలా బాగుంటుంది .

పసుపు కొమ్ములలో , కుంకుమ రాళ్ళు వేసి , దంచి , తెల్లనిబట్టతో జల్లించి , నూనె కలుపుకొని , తోపురంగు కుంకుమ ( మెరూన్ కలర్ ) తయారు చేసుకోవచ్చు . కుంకుమరాళ్ళు , పటికలాగా వుంటాయి . తొందరగానే నలుగుతాయి .కుంకుమ రాళ్ళు కూడా కిరాణా దుకాణాలలో దొరుకుతాయి . బజారులో దొరికే కుంకుమ ఇదే .

  • మూలము : భవాని మల్లాది-తెలుగింటి ఆడపడుచు.

  • =======================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Saturday, June 04, 2011

వాటికి పసుపు రంగు ఇష్టమా?, Do they like yellow color?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.

ప్రశ్న: పసుపు రంగు గాజు పెట్టెలు బొద్దింకలకు బోనుల్లాగా పనిచేస్తాయి. ఎందుకు?

-పి. సుందరి, 8వ తరగతి, అరకులోయ (విశాఖ)

జవాబు: మనం చూడగలిగినట్టు ప్రాణులన్నీ వివిధ రంగులను చూడలేవు. బొద్దింకలు (కాక్రోచ్‌) పసుపు రంగును చూడలేవు. ఎందుకంటే వాటి కళ్లలో ఆ రంగు పౌనఃపున్యానికి స్పందించే కణాలు ఉండవు. అందువల్ల వాటికి పసుపు రంగు నలుపుగా కనిపిస్తుంది. అందువల్లనే పసుపు రంగు గాజు పెట్టెను అవి చీకటి ప్రాంతంగా భ్రమించి అక్కడ క్షేమంగా దాక్కోవచ్చనే భావనతో అందులోకి చేరుకుంటాయి. అందుకనే ఆ రకమైన పెట్టెలను వాటికి బోను (trap)ల్లాగా ఉపయోగించి వాటి బెడదను వదిలించుకుంటారు.

-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌

  • ===============================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

నీళ్లలో తేడాలేంటి?, Why is there difference in waters?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.

ప్రశ్న: మామూలు నీటికి, మినరల్‌ వాటర్‌కి తేడా ఏమిటి? మినరల్‌ వాటర్‌ ఎందుకంత రుచిగా ఉంటుంది?

-కొత్తూరి రాజు, చిట్యాల (వరంగల్‌)

జవాబు: మామూలుగా మనం తాగే మంచినీటికి, మినరల్‌ వాటర్‌కీ తేడా ఉండకూడదు. కానీ మున్సిపాలిటీ నుంచి మనకు సరఫరా అయ్యే నీరు ఒకోసారి వివిధ కారణాల వల్ల తాగడానికి పూర్తిగా అనువుగా ఉండక పోవచ్చు. చెరువులు, ఆనకట్టలు, నదుల్లోంచి సేకరించి శుద్ధి చేసే ప్రక్రియలోనో, ఆ నీటిని సరఫరా చేసే క్రమంలోనో అది కలుషితమయ్యే అవకాశం ఉండవచ్చు. అలాంటప్పుడు ఆ నీటిని కాచి వడపోసుకుని తాగితే సరిపోతుంది. ఇక మినరల్‌ వాటర్‌ని సాధారణంగా బోరు బావుల్నుంచి సేకరించి అందులోని అదనపు లవణాలను రివర్స్‌ ఆస్మాసిస్‌ అనే ప్రక్రియ ద్వారా తొలగించి, ఆపై అవసరమైన లవణాలను కలుపుతారు. తగుపాళ్లలో అన్ని పదార్థాలూ ఉండడం వల్ల మినరల్‌ వాటర్‌కి ప్రత్యేక రుచి చేకూరుతుంది. మినరల్‌ అంటే లవణ పదార్థమని అర్థం.

-ప్రొ||ఎ. రామచంద్రయ్య,-నిట్‌, వరంగల్‌; రాష్ట్ర కమిటీ, జనవిజ్ఞానవేదిక

  • ==================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

నీళ్లలో తేడాలేంటి?, Why is there difference in waters?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !

ప్రశ్న: మామూలు నీటికి, మినరల్‌ వాటర్‌కి తేడా ఏమిటి? మినరల్‌ వాటర్‌ ఎందుకంత రుచిగా ఉంటుంది?

-కొత్తూరి రాజు, చిట్యాల (వరంగల్‌)

జవాబు: మామూలుగా మనం తాగే మంచినీటికి, మినరల్‌ వాటర్‌కీ తేడా ఉండకూడదు. కానీ మున్సిపాలిటీ నుంచి మనకు సరఫరా అయ్యే నీరు ఒకోసారి వివిధ కారణాల వల్ల తాగడానికి పూర్తిగా అనువుగా ఉండక పోవచ్చు. చెరువులు, ఆనకట్టలు, నదుల్లోంచి సేకరించి శుద్ధి చేసే ప్రక్రియలోనో, ఆ నీటిని సరఫరా చేసే క్రమంలోనో అది కలుషితమయ్యే అవకాశం ఉండవచ్చు. అలాంటప్పుడు ఆ నీటిని కాచి వడపోసుకుని తాగితే సరిపోతుంది. ఇక మినరల్‌ వాటర్‌ని సాధారణంగా బోరు బావుల్నుంచి సేకరించి అందులోని అదనపు లవణాలను రివర్స్‌ ఆస్మాసిస్‌ అనే ప్రక్రియ ద్వారా తొలగించి, ఆపై అవసరమైన లవణాలను కలుపుతారు. తగుపాళ్లలో అన్ని పదార్థాలూ ఉండడం వల్ల మినరల్‌ వాటర్‌కి ప్రత్యేక రుచి చేకూరుతుంది. మినరల్‌ అంటే లవణ పదార్థమని అర్థం.

-ప్రొ||ఎ. రామచంద్రయ్య,-నిట్‌, వరంగల్‌; రాష్ట్ర కమిటీ, జనవిజ్ఞానవేదిక

  • ======================================

.visit My website > Dr.Seshagirirao - MBBS.

మొక్కల నుంచి మందులను ఎలా తయారు చేస్తారు?,How do medicines prepare from Plants?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.

ప్రశ్న: మొక్కల నుంచి మందులను ఎలా తయారు చేస్తారు?,How do medicines prepare from Plants?.

-ఎమ్‌. చెంగల్రాయన్‌, ఇంటర్‌, మదనపల్లి (చిత్తూరు).

జవాబు:
మందుల తయారీలో మొక్కలు ప్రాచీన కాలం నుంచీ ప్రధాన పాత్ర వహిస్తున్నాయి. ముఖ్యంగా ఆయుర్వేద వైద్య విధానంలో జన్యుశాస్త్రం అభివృద్ధి చెందిన తర్వాత మందుల తయారీలో మొక్కల ఉపయోగం మరీ ఎక్కువైంది. మొక్కల్లో ప్రత్యేకమైన జన్యువులను ప్రవేశ పెట్టడం ద్వారా టీకాలు, రోగనిరోధక యాంటీ బాడీస్‌, హార్మ్లోన్లు, ప్రోటీన్లను తయారు చేస్తున్నారు. వీటిని జంతువుల కణాల నుంచి కాకుండా మొక్కల ద్వారా ఉత్పన్నం చేయడం సులువే కాకుండా, చవక కూడా. జీన్‌గన్‌ అనే యంత్రం ద్వారా కావలసిన జన్యువులను మొక్కల కణాలలోకి ప్రవేశపెట్టే ప్రక్రియ ప్రాచుర్యంలో ఉంది. మరో పద్ధతి ద్వారా సూక్ష్మక్రిములను ఉపయోగించి రకరకాల జన్యువులను మొక్కల్లోకి ప్రవేశపెడతారు. మానవ శరీరానికి ఉపయోగపడే హార్లోన్లను ఉత్పత్తి చేసే ఫార్మాస్యూటికల్‌ పొగాకును తొలిసారిగా 1986లో తయారు చేశారు. ప్రస్తుతం వివిధ జన్యువుల ద్వారా పరివర్తన చెంది, మందుల తయారీలో ఉపయోగపడే 80 జాతుల మొక్కలు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్నాయి.

-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌

  • ============================================
visit My website > Dr.Seshagirirao - MBBS.