Saturday, September 28, 2013

Why do Eyelids blink?,కనురెప్పలు ఎందుకు కదులుతాయి ?

 •  ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
 ప్ర : కనురెప్పలు ఎందుకు కదులుతాయి ?

జ : మనిషి కనురెప్పలు కనుగుడ్డును రక్షించేందుకు ఏర్పడినవి. ప్రతి ఆరు సెకన్లకు ఒకసారి ఆ కనురెప్పలు కొట్టుకుంటాయి. కనుర్ప్పలు కొట్టుకున్నప్పుడల్లా కంటిచివర ఉండే కన్నీటి గ్రండి నుండి నీరు వస్తుంది. ఆనీరు కనుగుడ్డును కడిగినట్టు చేసి తేమగా ఉంచుతుంది. కనుగుడ్డు ఎండిపోతే కంటిచూపు సమస్యలు వస్తాయి. కన్ను ఆరోగ్యముగా పనిచేయడానికి కనురెప్పలు పైకి కిందికి కదలడమే కారణం .
కంటి రెప్పలు రెపరెపలాడడం కంటిని కాపాడడం కోసమే. కంటి రెప్పలను ఆర్పడం అనేది ఒక విధంగా మన ప్రమేయం లేకుండా అసంకల్పితంగా జరిగే ప్రక్రియ. మన
అవయవాల్లో కన్ను చాలా ప్రధానమైంది. సున్నితమైంది. కంటిరెప్పలు రెపరెపలాడడం వల్ల వాతావరణంలోని దుమ్ము, ధూళి, సూక్ష్మక్రిములు కంటిలో పడకుండా రక్షణ కలుగుతుంది. కంటిరెప్ప పడినపుడల్లా సన్నటి నీటి తెర కనుగుడ్డును శుభ్రపరుస్తుంది. కంటిలోపల ఉండే చిన్న గ్రంథిలో నుంచి స్రవించే ఈ నీటినే మనం 'కన్నీరు' అంటాం. ఈ నీటి తెర దుమ్ము, ధూళి కణాలను బయటకు నెట్టివేస్తుంది. అవి ముందు కంటి కొలికిలోకి చేరే విధంగా రెప్పల చివర ఉన్న వెంట్రుకలు సహకరిస్తాయి. రెప్పలు ఆర్పకుండా ఎక్కువ సేపు చూడడానికి ప్రయత్నిస్తే రెప్పలలోని కండరాలు ఒత్తిడికి గురవుతాయి. దాన్ని అధిగమించడానికి రెప్పలు అసంకల్పితంగా రెపరెపలాడతాయి.
 • ======================
 visit My website > Dr.Seshagirirao - MBBS.-

Thursday, September 26, 2013

Moon apper on oneside from Earth Why?,భూమి నుంచి మనకు చంద్రుడు ఎప్పుడూ ఒకేవైపు కనిపిస్తాడు ఎందుకు?

 •  

 •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: భూమి నుంచి మనకు చంద్రుడు ఎప్పుడూ ఒకేవైపు కనిపిస్తాడు ఎందుకు?

జవాబు: చంద్రుడు భూమి చుట్టూ ఒకసారి తిరిగే కాలం, అలా తిరుగుతూనే దాని అక్షం ఆధారంగా తన చుట్టూ తాను తిరగడానికి పట్టే పరిభ్రమణ కాలం సమానంగా ఉండడం వల్ల ఎల్లప్పుడూ చంద్రుని ఒక వైపు ఉపరితలమే మనకు కనిపిస్తుంది. చంద్రుని కక్ష్యకు ఉండే ఈ ధర్మాన్ని ఏక కాలిక భ్రమణం (Synchronous Rotation) అంటారు. చంద్రుడు ఇలా తిరగడానికి కారణం చంద్రునిపై భూమి ప్రయోగించే ఆటుపోట్ల ప్రభావం. చంద్రునిపై ఎలాంటి సముద్రాలు లేకపోవడంతో అక్కడ ఆటుపోట్లకు గురై పొంగిపొరలే నీరు లేనందున, భూమి గురుత్వాకర్షణ బలం చంద్రుని తలంపైనే పనిచేస్తుంది. ఆ ప్రభావం చంద్రుని తలాన్ని పైకి కిందకీ ఊగేటట్లు చేస్తుంది. అందువల్ల చంద్రుడు తన చుట్టూ తాను తిరిగే పరిభ్రమణ వేగం క్రమేపీ తగ్గుతూ, అది చంద్రుడు భూమి చుట్టూ ఒకసారి తిరిగే ప్రదక్షిణ కాలానికి సమానమైంది. అందువల్లే మనం ఎల్లప్పుడూ చంద్రుని ఒకవైపు ఉండే గోతులను (Craters) ఎత్తు పల్లాలను చూస్తున్నాం. అదే కాకుండా చంద్రుడు భూమి చుట్టూ తిరిగే కక్ష్య దీర్ఘవృత్తాకారంలో ఉండడంతో చంద్రుడు ఉపరితలంలో సగం కన్నా ఎక్కువగా, 59 శాతం మేర చూడగలుగుతున్నాం. మానవుడు ప్రయోగించిన అంతరిక్ష నౌకలు చంద్రుని అవతలి వైపునకు వెళ్లి అక్కడి ఛాయాచిత్రాలను భూమికి పంపే వరకు అది ఎలా ఉంటుందనే సంగతి మనకు తెలియలేదు.

- ప్రొ|| ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌
 • ====================
 visit My website > Dr.Seshagirirao - MBBS.-

Wednesday, September 25, 2013

Some persons float on water How?,కొంత మంది నీటిపై తేలియాడుతారు. అదెలా సాద్యం?

 •  

 •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: కొంత మంది నీటిపై వెల్లకిలా పద్మాసనం వేసి గంటలతరబడి తేలియాడుతారు. అదెలా సాద్యం?

జవాబు: ఇలా చేయడం మానవాతీత శక్తుల వల్ల కానీ, మంత్ర తంత్రాల వల్ల కానీ కాదు. దీన్ని సాధారణ భౌతిక శాస్త్ర నియమాల ద్వారా వివరించగలము. ప్లవన సూత్రాల (laws of floatations) ప్రకారం ఏదైనా వస్తువు సాంద్రత (density)నీటి సాంద్రత కన్నా ఎక్కువైతే నీటిలో మునుగుతుందని, తక్కువైతే తేలుతుందని చదువుకుని ఉంటారు. సాధారణ మానవుడి శరీర సాంద్రత నీటి సాంద్రత కన్నా కొంచమే ఎక్కువ కావడం వల్ల ఈతకొట్టకపోతే మనిషి మునుగుతాడు. ఈత రాక మరణిస్తే శవమై తేలడానికి కారణం చనిపోయిన వ్యక్తి దేహపు సాంద్రత నీటి సాంద్రతకన్నా తక్కువ కావడమే. ప్రాణంతో ఉన్న వ్యక్తి ఓ పద్ధతి ప్రకారం నీటిలోకి దిగి పద్మాసనం వేసుకొనే సందర్భంలో వీపు కింద ఖాళీ ఏర్పడి అక్కడ గాలి బుడగలు ఏర్పడేలా నేర్పరితనంతో కూర్చుంటాడు. అందువల్ల ఎంత సేపైనా తేలియాడుతూ ఉండగలడు.

- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌, రాష్ట్రకమిటి, జనవిజ్ఞానవేదిక
 • ====================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Where is Ozone layer.Can we see it?, ఓజోన్‌ పొర ఎక్కడుంటుంది? మన కంటికి కనపడదా?

 •  
 •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

రశ్న: ఓజోన్‌ పొర ఎక్కడుంటుంది? మన కంటికి కనపడదా?

జవాబు: ఓజోన్‌ అనేది మూడు పరమాణువులతో కూడిన ఆక్సిజన్‌ అణువు (triatomic oxygen molucule). ఇందులో ఉన్న అన్ని ఆక్సిజన్‌ పరమాణువులు రసాయనికంగా ఒకే లక్షణం ఉన్నవి కావు. కానీ మనం శ్వాసక్రియలో పీల్చే సాధారణ ద్విపరమాణుక ఆక్సిజన్‌ అణువులో (diatomic oxygen molucule) మాత్రం రెండు పరమాణువులూ ఒకే విధమైనవి. తద్వారా సాధారణ ఆక్సిజన్‌ అణువుల్లాగా ఓజోన్‌ స్థిరమైన వాయువు (stable gas) కాదు. భూవాతావరణాన్ని నేల మీద నుంచి పైకి వెళ్లే కొలదీ అక్కడున్న ప్రధాన రసాయనిక భౌతిక ధర్మాల ఆధారంగా కొన్ని పొరలుగా విభజించారు. నేలకు దగ్గరగా 20 కి.మీ.లోపే ఉన్న పొరను ట్రోపోస్ఫియర్‌ అనీ, 20 నుంచి 50 కి.మీ మధ్యలో ఉన్న పొరను స్ట్రాటోస్ఫియర్‌ అనీ, ఆ తర్వాత మీసో స్ఫియర్‌, థర్మోస్ఫియర్‌, ఎక్సోస్ఫియర్‌ అనే పొరలు సుమారు 500 కి.మీ. వరకు వివిధ దూరాల్లో విస్తరించి ఉన్నాయి. మన సాధారణ ఆక్సిజన్‌ అణువులు స్ట్రాటో స్ఫియర్‌లో ఓజోన్‌ అణువులుగా మారతాయి. మూడు అణువుల సాధారణ ఆక్సిజన్‌ వాయువు రెండు అణువుల ఓజోన్‌గా ఇక్కడ రూపొందుతుంది. ఇందు కోసం ఆక్సిజన్‌ అణువులు చాలా శక్తిమంతమైన అతినీలలోహిత కాంతి ( 150to 215 nm తరంగదైర్ఘ్యం)ని వాడుకుంటాయి. అపుడు ఏర్పడ్డ ఓజోన్‌ కూడా చాలా కాలం ఉండలేదు. ఇది రసాయనికంగా స్థిరంలేనిది కాబట్టి త్వరగా తిరిగి ఆక్సిజన్‌గా మారుతుంది. క్రమంలో అది 215 నుంచి 315 nm తరంగధైర్ఘ్యం ఉన్న సౌరకాంతిలోని అతినీల లోహిత కిరణాల్ని వాడుకుంటుంది. అందుకే ఓజోన్‌ పొరను ప్రమాదకర అతినీలలోహిత కాంతి నుంచి భూమిని కాపాడే గొడుగు అంటాము. ఓజోన్‌ అణువు చాలా చిన్నది కావడం వల్ల, అది వాయురూపంలో ఉండటం వల్ల దానిని మనం చూడలేం. ఇది దాదాపు పారదర్శకంగా ఉంటుంది.

- ప్రొ|| ఎ.రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌, రాష్ట్రకమిటీ, జనవిజ్ఞాన వేదిక
 • ===================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Tuesday, September 24, 2013

What are the 16 Grats?,షోడశ దానాలు అంటే ఏవి ?

 •  

 •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
 ప్ర : షోడశ దానాలు అంటే ఏవి ? వాటి పేర్లు తెలపండి.

జ : దానము అంటే ఉదారము గా ఇచ్చేది అని అర్ధము . కాని ఇందులో కూడా స్వార్ధము ఉంది. దానము చేస్తే పుణ్యము వస్తుందని .. మళ్ళీ జన్మలో మంచిజరుగుతుందని చాలా మంది దానము చేస్తారు. ఈలోకములొగాని , పరలోకములోగాని .. ఏమీ ఆశించకుండా ఉదారముగా ఇవ్వడాన్నే దానము అనాలి.
16 దానాల పేర్లు :
 1. గావ (ఆవులు) దానము , 
 2. సువర్ణ (బంగారము ) దానము , 
 3. రజిత (వెండి)దానము , 
 4. రత్నాని (నవరత్నాలలో ఏదోఒకటి లేదా అన్నీ)దానము , 
 5. సరస్వతీ(పుస్తకం)దానము , 
 6. ధాన్యము (ఏ ధాన్యమైనా సరే)దారము , 
 7. పయస్వినీం(పాలిచ్చే శక్తి ఉన్న ఈనని గోవు) దానము ,
 8. చత్రము (గొడుగు) దానము ,
 9. గృహము (ఇల్లు ) దానము ,
 10. తిలా(నువ్వులు)దానము , 
 11. కన్య(అల్లునికి వివాహంలో కూతురు)దానము ,
 12. గజ (ఏనుగు)దానము ,
 13. అశ్వ(గుర్రము)దానము ,
 14. శయ్యా(మంచం , దుప్పటి , దిండు)దానము ,
 15. వస్త్రము (బట్టలు)దానము , 
 16. మహి(భూమి)దానము , 

 • ======================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

changes in current usage with voltage?,ఓల్టేజితో కరెంటువాడకములో మార్పులేల?

 •  

 •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: ఓల్టేజి విలువలు తక్కువైనపుడు, విద్యుత్‌ పరికరాల్లో కరెంటు ఎక్కువగా ప్రవహిస్తుంది. ఎందుకు?

జవాబు: మనం ఇళ్లలో వాడే విద్యుత్‌ పరికరాలను రెండు రకాలుగా విభజింపవచ్చు. ఒక రకం విద్యుచ్ఛక్తిని ఉష్ణశక్తిగా మార్చే ఎలక్ట్రిక్‌ ఐరన్‌, ఎలక్ట్రికల్‌ హీటర్‌. ఎలక్ట్రిక్‌ బల్బులయితే, మరోరకం విద్యుత్‌ శక్తిని యాంత్రిక శక్తిగా మార్చే ఎలక్ట్రిక్‌ మోటార్లు లాంటివి.

మొదటి రకం పరికరాల్లో వాటి గుండా ప్రవహించే విద్యుత్‌ ప్రవాహం (ఎలక్ట్రిక్‌ కరెంటు) ఓల్టేజి వర్గమూలానికి (square root) అనులోమానుపాతంలో ఉంటుంది. అందువల్ల సప్లయి అయ్యే విద్యుత్‌ ఓల్టేజి తక్కువగా ఉంటే, కరెంటు విలువలు కూడా తక్కువగా ఉంటాయి.

రెండవ రకం ఎలక్ట్రిక్‌ మోటార్ల విషయంలో అవి పనిచేయడానికి కావలసిన విద్యుత్‌ సామర్థ్యం (ఎలక్ట్రిక్‌ పవర్‌) ఆ పరికరాలపై, (మామూలుగా వాటు (watts)లేక కిలోవాట్ల (kw)లో) బిగించబడిన ప్లేట్లపై మార్కు చేసి ఉంటుంది. అలాంటి పరికరాల్లో ప్రవహించే ఎలక్ట్రిక్‌ కరెంటు, వాటికి అప్లయి చేసిన ఓల్టేజికి విలోమానుపాతంలో ఉంటుంది. అంటే, అప్లయి చేసిన ఓల్టేజి విలువలు తక్కువగా ఉంటే వాటిపై పనిచేసే ఎలక్ట్రిక్‌ మోటార్లు చెడిపోతాయి. కారణం, అవి ఎక్కువ ఎలక్ట్రిక్‌ కరెంటును రాబట్టడంతో వాటిలో ఉండే విద్యుత్‌ ప్రవహించే తీగ చుట్టలు అతిగా వేడెక్కి కాలిపోతాయి.

- ప్రొ|| ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌
 • =====================
 visit My website > Dr.Seshagirirao - MBBS.-

Is Lightening danger to eyes?,మెరుపుల్ని చూస్తే అపాయమా?

 •  

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: మెరుపుల్ని చూస్తే కళ్లు పోతాయా?

జవాబు: మెరుపులు వర్షాకాలంలో మేఘాలలో కలిగే విద్యుదుత్సర్గాలు (electrical discharges). మెరుపులు వెడలే ప్రాంతంలో ఉష్ణోగ్రత సూర్యోపరితల ఉష్ణోగ్రతకన్నా చాలా రెట్లు ఎక్కువగా ఉంటుంది. కాంతి తీవ్రత (intensity) కూడా ఆ ప్రాంతంలో చాలానే ఉంటుంది. న్యూటన్‌ సూత్రాల ప్రకారం కాంతి తీవ్రత, ధ్వని తీవ్రత దూరం పోయేకొలదీ గణనీయంగా తగ్గుతాయి. మెరుపు కాంతి మేఘాల దగ్గర తీవ్రంగానే ఉన్నా అక్కడి నుంచి మనల్ని చేరేసరికల్లా బాగా తగ్గిపోతుంది. పైగా మెరుపు ఉండేది క్షణికమే. అది కంటిని ప్రభావితం చేసేలోపే మాయమవుతుంది. కాబట్టి మెరుపుల్ని చూడటం వల్ల కళ్లు పోతాయనడంలో నిజం లేదు. కానీ ఒక్కోసారి విపత్కర స్థితుల్లో తీవ్రతరమైన మెరుపులు వస్తాయి. పనికట్టుకుని వాటిని చూసి ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దు. సూర్య కాంతి ప్రమాదకరం. దాన్ని తదేకంగా చూస్తే దృష్టిలోపాలు వస్తాయి.

- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్‌,-వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
 • =================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Day and night hours not equal why?, ఒక రోజులో పగలు ,రాత్రి గంటలు సమముగా ఉండవు ఎందుకు ?

 •  

 •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్ర : ఒక రోజులో పగలు ,రాత్రి గంటలు సమముగా ఉండవు  ఎందుకు ?

జ : రోజుకు 24 గంటలు . రోజులో పగలు , రాత్రి ఉన్నా అవిరెండూ పన్నెండు గంటలుగా విభజించబడిఉండవు .ఋతువునుబట్టి పగటి పొద్దు లేదా రాత్రి పొద్దు అధికముగా ఉంటాయి.కాని సంవత్సరములో 2 రోజులు మాత్రమే పగలు రేయి సమానముగా ఉంటాయి. అది జూన్‌ 21 , సెప్టెంబర్ 21. ఆ రెండురోజుల్లో్ భూమద్యరేఖమీద లంబం గా సూర్యకిరణాలు పడతాయి. అందువల్ల ఆ రెండురోజులు పగలు రాత్రి సమము గా ఉంటాయి. ఆరోజులనే " విషువత్తులు(Equinoxes) " అంటారు .

 • =============================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Monday, September 23, 2013

How can we hear in cardles phones?,మాటలు ఎలా వినిపిస్తాయి?

 •  

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: వైర్‌ లెస్‌ ఫోన్లు, మైక్రోఫోన్లలో మనం మాట్లాడితే ఎలా వినిపిస్తుంది?

జవాబు: వైర్‌లెస్‌ ఫోన్లను కార్డ్‌లెస్‌ ఫోన్లు అని కూడా అంటారు. వింటూ, మాట్లాడే హేండ్‌సెట్‌కు మనం నంబరు డయల్‌ చేసే బేస్‌సెట్‌కు మధ్య విద్యుత్‌ తీగ ( wire or cord) ఉంటే అది మామూలు ఫోను. ఈ రెండు సాధనాల మధ్య తీగలేవీ లేకుండా బేస్‌సెట్‌నుంచి దూరంగా హేండ్‌సెట్‌ను పట్టుకుని గదిలో మనం అటూ ఇటూ తిరుగుతూ మాట్లాడగలిగితే ఆ వ్యవస్థను కార్డ్‌లెస్‌ ఫోను అంటారు. ఇందులో హేండ్‌సెట్‌కు, బేస్‌సెట్‌కు మధ్య రేడియో తరంగాల ద్వారాగానీ, సూక్ష్మతరంగాల ద్వారాగానీ సమాచార రవాణా డిజిటల్‌ పద్ధతి అనే ఎలక్ట్రానిక్‌ ప్రక్రియ ద్వారా వీలవుతుంది. అందుకే హేండ్‌సెట్‌లోను, బేస్‌సెట్‌లోను రెంటిలో విద్యుచ్ఛక్తిని ఇచ్చే బ్యాటరీ ఉండాలి. సాధారణంగా బేస్‌సెట్‌ను ఏదైనా అడాప్టర్‌ (adopter)ద్వారా ఇంట్లో స్విచ్‌ బోర్డు ద్వారా ప్రత్యక్ష విద్యుత్తు (dc)ని అందిస్తారు. హేండ్‌సెట్‌లో రీఛార్జబుల్‌ బ్యాటరీలు ఉంటాయి. ఇందులోని బ్యాటరీలలో విద్యుత్‌ శక్తి తగ్గినపుడు తిరిగి రీఛార్జి చేసుకోవచ్చు. బేస్‌సెట్‌కే సెల్‌ఫోన్‌ వైరును కలపడం వల్ల అక్కడ్నించి మనం మాట్లాడే మాటలు తిరిగి విద్యుత్తు ప్రవాహ సంకేతాలుగా మారి అవతలి వ్యక్తికి చేరతాయి.
మైక్రోఫోను అనే మైకును వైర్లు ఉన్నా లేకున్నా మైక్రోఫోను అనే అంటారు. కార్డ్‌లెస్‌ ఫోను పద్ధతిలోనే మైక్రో ఫోనును ఉపయోగించగలిగితే అపుడు దాన్ని కార్డ్‌లెస్‌ మైక్రోఫోను లేదా కార్డ్‌లెస్‌ అనడం కద్దు. మనం మాట్లాడిన మాటలు తొలుత విద్యుత్తు ప్రవాహ సంకేతాలుగా మారతాయి. ఆ తర్వాత అవి రేడియో తరంగాలు లేదా మైక్రోవేవ్‌ తరంగాలుగా మారి స్పీకర్లకు అందించే ఆంప్లిఫియర్‌ దగ్గర ఉన్న బేస్‌ స్టేషను అనే ఎలక్ట్రానిక్‌ పరికరాన్ని చేరతాయి. అక్కడ అవి తిరిగి విద్యుత్తు ప్రవాహ సంకేతాలుగా మారి స్పీకర్లలో అధిక స్థాయిలో శబ్దాన్ని ఇస్తాయి.

- ప్రొ|| ఎ.రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
 • =====================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Sunday, September 22, 2013

Medicine inside capules comesout how?,గొట్టం మాత్రల లోపల మందు కడుపులో బయటెకెలా వస్తుంది?

 •  

 •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న:
గొట్టం మాత్రల లోపల మందు ఉంటుంది. దాన్ని మింగితే లోపలున్న మందు ఎలా బయటకొస్తుంది? పైన క్యాప్య్సూల్‌ను ఎలా తయారుచేస్తారు?

జవాబు:
మందులు బాగా చేదుగా ఉన్నా, అభ్యంతరకర రసాయనిక లక్షణాలతో ఉన్నా వాటిని బుల్లి గొట్టంలాంటి దాంట్లో అమరుస్తారు. వీటినే క్యాప్స్యూల్స్‌ అంటారు. పరిశీలించి చూస్తే ఇది రెండు సగాలను కలిపినదని అర్థం అవుతుంది. ఈ గొట్టాల్ని లోహంతోనో, మరేదైనా ప్లాస్టిక్‌ పదార్థాలతోనో చేయరు. అలా చేస్తే గొట్టం విడివడి మందు బయటపడదు. వీటిని సాధారణంగా గ్త్లెనో ప్రోటీన్లు అనే అపాయం లేని సేంద్రీయ పదార్థాలతో తయారుచేస్తారు. మింగిన తరువాత వీటి పైపొరంతా పొట్టలో జీర్ణం అవుతుంది. పొర లోపల ఉంచిన మందు విడుదలై వ్యాధి నివారణ ప్రక్రియలో పాల్గొంటుంది.

- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
 • ======================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Writing with chalk on blackboard gives sound why?,సుద్దముక్కతో నల్లబల్లపై రాస్తుంటే 'కీచు కీచు'మనే శబ్దం వస్తుంది. ఎందుకు?

 •  

 •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
 ప్రశ్న: సుద్దముక్కతో నల్లబల్లపై రాస్తుంటే 'కీచు కీచు'మనే శబ్దం వస్తుంది. ఎందుకు?

జవాబు: నల్లబల్ల (బ్లాక్‌బోర్డ్‌)పై రాసేప్పుడు సుద్దముక్క (చాక్‌పీస్‌)ను గట్టిగా అదిమి పట్టుకుంటాం. అప్పుడది నల్లబల్ల ఉపరితలానికి సమాంతరంగా అడ్డంగా కదులుతూ ఉంటుంది. నల్లబల్లకు, సుద్దముక్కకు మధ్య ఏర్పడిన ఘర్షణ వల్ల సుద్దముక్క నుంచి వెలువడిన కణాలు (పొడి) బోర్డును అంటుకుంటాయి. రాసే సమయంలో ఘర్షణ తక్కువగా ఉంటే చాక్‌పీస్‌ జారుతూ వెంటవెంటనే బోర్డుపై అనేక చోట్ల అనేకసార్లు తాకుతుంది. అందువల్లనే మనకు 'కీచు కీచు'మనే శబ్దం వినిపిస్తుంది. ఈ ఘర్షణ బలం ముఖ్యంగా సుద్దముక్క, నల్లబల్లతో చేసే ఏటవాలు (inclination) కోణం మీద, అది నల్లబల్లను తాకే వైశాల్యం మీద ఆధారపడి ఉంటుంది. ఈ ఘర్షణ బలం తగ్గినప్పుడల్లా శబ్దాలు వస్తాయి.

- ప్రొ|| ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌
 • ===================
 visit My website > Dr.Seshagirirao - MBBS.-

Saturday, September 14, 2013

Upanayanam,ఉపనయనం

 •  

 •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
ప్ర : 
 ఉపనయనం అంటే ఏమిటి?
జ : 
ఉపనయనం జరిగిన రోజున బాలుని తండ్రి బాలునికి చెవిలో గాయత్రీ మంత్రం ఉపదేశిస్తాడు. ఉపనయనం జరిగిన నాటి నుండి వటువు ప్రతి నిత్యం గాయత్రిని పూజిస్తూ బ్రహ్మచర్యం పాటించాలి. వేదాభ్యాసానికి ముందు తప్పనిసరిగా ఉపనయనం చేయవలెను. వివాహానికి ముందు బ్రహ్మచర్యాన్ని స్నాతక ప్రక్రియ ద్వారా వదిలి, గృహస్థాశ్రమంలోనికి ప్రవేశిస్తాడు వరుడు.ఉపనయనము ఉత్తరాయణ కాలంలో మాత్రమే చేయవలెను. ఉపనయన ముహూర్తము తండ్రి జన్మ నక్షత్రం మరియు బాలుని జన్మ నక్షత్రంపై ఆధారపడుతుంది.

ఉపనయనము హిందువులలో అబ్బాయిల వేదాభ్యాసానికి ముందుగా చేసే ప్రక్రియ. ఉపనయనాన్ని ఒడుగు అని కూడా అంటారు. ఇది అధికంగా పురుషులకు చేస్తారు. బాల్యావస్థ నుండి బ్రహ్మచర్యావస్థకు మారే సమయాన ఇది చేయడం ఆనవాయితీ. అప్పటి వరకు నియమ నిష్ఠ లతో పనిలేకుండా సంచరించే బాలుడు నియమ నిష్ఠలతోకూడిన జీవితంలో ప్రవేశించడానికి చేసే శాస్త్రీయమైన ప్రక్రియ ఇది. ఉపనయనానికి ముందు ఒక జన్మ తరువాత ఒక జన్మగా కూడా వ్యవహరించడం వలన ఉపనయనానికి అధిక ప్రాముఖ్యతను ఇచ్చే బ్రాహ్మణుని సమాజంలో ద్విజుడు అని నామాంతరంతో వ్యవహరిస్తుంటారు.

క్షత్రియులు, వైశ్యులు ఇప్పటికీ దీనిని ఆచరిస్తున్నా, అధిక ప్రాముఖ్యతతో నిర్దిష్ట విధులతో బ్రాహ్మణులు దీనిని అధికంగా ఆచరిస్తున్నారు. మిగిలినవారిలో ఇది ఒక ఆనవాయితీగా మారింది. వివాహపూర్వం ఒక తంతుగా మాత్రం దీనిని ఇప్పుడు ఆచరిస్తున్నారు. పూర్వకాలం గురుకులాభ్యాసం చేసే అలవాటు ఉన్న కారణంగా ఉపనయనం చేసి గురుకులానికి బాలురను పంపేవారు. అక్కడవారు విద్యను నేర్చుకుని తిరిగి స్వగృహానికి వచ్చి గృహస్థాశ్రమంలో ప్రవేశించేవారు.

ఉపనయనము అయ్యేవరకు పురుషుడు స్వయంగా ఎటువంటి ధర్మకార్యం నెరవేర్చటానికి అర్హుడుకాడు. యజ్ఞయాగాది క్రతువులు నెరవేర్చటానికి ఉపనయనము చేసుకున్న తరువాతే అర్హత వస్తుంది. క్షత్రియులకు ధర్మశాస్త్రాలభ్యసించడం అత్యవసరం కనుక ఉపనయన క్రతువు జరిపించి, విద్యాభ్యాసం ఆరంభించేవారు. పితరులకు కర్మకాండ, తర్పణం లాంటి కార్యాలు చేయడానికి ఉపనయనం అత్యవసరం. కొన్ని సందర్భాలాలో తల్లి తండ్రులు మరణావస్థలో ఉన్న సమయాలలో అత్యవసరంగా ఉపనయనం జరిపించి, కర్మకాండ జరిపించే అర్హతనిస్తారు. సన్యసించడానికి ఉపనయనం ప్రధానమే. కనుక హిందూ ధర్మంలో ఉపనయనం అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న ఒక ప్రక్రియ. హిందూ ధర్మంలో ఇది బ్రాహ్మణులకు, క్షత్రియులకు, వైశ్యులకు తప్పక నిర్వహించవలసిన బాధ్యత.
 • =========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

What are comets?,తోకచుక్కలు అంటే ఏమిటి?
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

తోకచుక్కలు అంటే ఏమిటి?, comet-a celestial body generally with a tail?

తోకచుక్కలు నవగ్రహాలు మాదిరిగానే సూర్యునిచుట్టూ ప్రదక్షిణలు చేసే ఖగోళ వస్తువులు. అండ, వృత్తాకార కక్ష్యలో ఇవి తిరుగుతుంటాయి. సూర్యునిచుట్టూ తిరగడానికి కొన్నిటికి దశాబ్దాలు పడితే, మరి కొన్నింటికి అనేక శతాబ్దాలు కూడా పడుతుంది.తోకచుక్కలు తిరిగే కక్ష్యలు బహుదీర్ఘమైన అండవృత్తాలు కాబట్టి సూర్యుని నుంచి వాటి దూరం హెచ్చుగా, తగ్గుతూ ఉంటుంది. సూర్యునికి దూరంగా వెళ్ళినప్పుడు ఇవి ఫ్లూటో కక్ష్యని దాటిపోవచ్చు. దగ్గరగా వచ్చినప్పుడు బుధగ్రహం కన్నా దగ్గరగా రావచ్చు.

తోకచుక్క సూర్యునికి బహుదూరంగా ఉన్నప్పుడు కనిపించీ కనిపించనంత చిన్న కాంతిబిందువులాగ ఉంటుంది. అప్పుడు దానికి తోక ఉండదు. తలమాత్రమే ఉంటుంది.ఆ తల భూమి కన్నా పెద్ద సైజులో అనేక వేల మైళ్ళ వ్యాసం కలిగి ఉంటుంది. అందులో రకరకాల సైజులలో రాళ్లూ, రప్పలు, దుమ్ము, ధూళీ వివిధ వాయువులుఉంటాయి. అవి భూమిలాగ దగ్గరగా, దట్టంగా నొక్కుకుని గాక, వదులుగా పలుచగా విస్తరించి ఉంటాయి. దాని మొత్తం బరువులో వెయ్యో వంతు లేక అంతకన్నా తక్కువగా ఉంటుంది. అండ, వృత్త కక్ష్యలో ప్రయాణం చేస్తున్న తోకచుక్క క్రమక్రమంగా సూర్యునికి దగ్గరగా వచ్చినప్పుడు సూర్య తేజస్సు తాకిడికి తోకచుక్కలో వదులువదులుగా ఉన్న పదార్థాలు దూరంగా తోసివేయబడి, చిన్నతోకలాగ ఏర్పడుతుంది. బరువైన పెద్దపెద్దరాళ్ళు, కొండలు మాత్రం దూరంగా పోక గుండ్రని తలకాయలాగ ఏర్పడతాయి. సూర్యుడిని సమీపిస్తున్న కొద్దీ దాని తోక అంతకంతకూ పొడవు అవుతూ ఉంటుంది. తోక పొడవు ఒక్కొక్క తోకచుక్కకి ఒకలా ఉంటుంది . అయితే ఇవి ఎలా పుట్టాయి , ఎందుకు పుట్టాయి అనేది ఇంకా స్పస్టము గా తెలియదు .

 • =======================

 visit My website > Dr.Seshagirirao - MBBS.- 

Wednesday, September 11, 2013

Life time of Camera Battery smart phone Telivison?,కెమేరా-బ్యాటరీ-స్మార్ట్ ఫోన్‌-టెలివిజన్‌ వాడకకాలము ఎంతఉంటుంది?

 •  

 •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

Life time of Camera , Battery ,smart phone , Telivison?

ప్ర : కెమేరా ,బ్యాటరీ ,స్మార్ట్ ఫోన్‌, టెలివిజన్‌ వాడకకాలము ఎంతఉంటుంది?

జ : కెమేరా,బ్యాటరీ,స్మార్ట్ ఫోన్‌, టెలివిజన్‌ మన్నిక వాడకాన్ని అనుసరించి ఉంటుంది. వాటిగురించి అవగాహన ఉన్నప్పుడు లైఫ్-స్పాన్‌ ఏవిమముా ఉంటుందో అర్ధముకాగలదు .

కెమెరా : దీని లైఫ్-స్పాన్‌ క్లిక్స్ లేదా షట్టర్ లైఫ్ అంచనాల్ని బట్తి ఉంటుంది. చాలాభాగము నాణ్యమైన కెమెరాల జీవితలaము 50,000 క్లిక్స్ ఉంటుంది .మరింత మంచిదైతే 1,00,000 క్లిక్స్ దాకా ఉండొచ్చు.ఎంత ఎక్కువ వాడినా 5 ఏళ్ళు పాటు మన్నికగా ఉంటాయి.

బ్యాటరీ : ఏ పరికరానికైనా బ్యాటరీ గుండెకాయ వంటిది . అయితే అవి కొన్ని సంఖ్యల డిశ్చార్జి సైకిల్స్ కు పరిమితము అవుతాయి. కొన్ని నిర్ధిస్టమైన సైకిల తర్వాత ఈ బ్యాటరీలు పూర్తిష్థాయి లో పనిచేయవు . చాలా కంపెనీల బ్యాటరీలకు 5,000 (ఐదు వేలు ) ఉంటుంటాయి.  అయితే ఓవర్ చార్జింగ్ చేయడము లేదా అవడము వలన వాటి జీవితకాలము తగ్గిపోతుంది. అందుకే కొన్ని బ్యాటరీలకు ఆటోకట్ రీచార్జ్ ఫెసిలిటీ ఉంటుంది.  ఎప్పుడూ కూడా పూర్తిగా డిశ్చార్జి అయ్యేదాకా వేచి చూడక ముందే చార్జ్ చేసుకోవాలి . 100% చార్జ్ అయ్యేక రీచార్జర్ డిస్ కనెక్ట్ చేసెయ్యాలి.

స్మార్ట్ ఫోన్‌ : సర్వేల ప్రకారము అమెరికాలో ఫోన్‌ జీవితకాలము 21 నెలలు . మనదేశములో దుమ్ము , ధూళి దృష్ట్యా అది 18 నెలలు గా నిర్ధారించబడినది. అయితే ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీ వస్తున్నందున చాలామంది ఫోన్లు పూర్తికాలము వాడడములేదు. ప్రొటెక్టివ్ కవర్లు వాడుతుంటే దుమ్ము నించి కాపాడుకోవచ్చు.

టివీలు : ఎల్.సి.డి , ఎల్.ఇ.డి , ప్లస్మా టెలివిజన్ల జీవితకాలము వాటి ప్యానెల్ ఎన్ని గంటలు పనిచేస్తుందన్న దానిపై ఆధారపడి ఉంటుంది . సాధారణము గా కంపెనీలు తమ ఉత్పత్తులు 30,000 గంటలు నుండి 1,00,000 గంటలదాకా పనిచేసేలా యేర్పాటు  చేస్తారు. అయితే దీనర్ధము ఆ తరువాత పనిచేయవని కావు ... కొద్దికొద్దిగా డల్ అవుతాయి. బ్రైట్నెస్ తగ్గుతూ వస్తుంది. కాబట్టి పెద్దగా ఇబ్బంది అనిపించదు. అయితే అవసరము లేనప్పుడు టి.వి.ని ఆఫ్ చేయడము ద్వారా జీవితకాలము లేదా బ్రైట్నెస్ కాపాడుకోవచ్చుని.

 • ========================

 visit My website > Dr.Seshagirirao - MBBS.- 

Monday, September 09, 2013

Meaning of Hindu marriage chantings?,హిందూ పెండ్లి మంత్రాల అర్దాలేమిటి? • ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
 •  
 Meaning of Hindu marriage chantings?,హిందూ పెండ్లి మంత్రాల అర్దాలేమిటి?
హిందూ వివాహము - ఆచారవ్యవహారాలు

వివాహ పద్ధతులు ఎన్ని, అవి ఏవి?--

 • కన్యను అలంకరించి వరునికి ఇచ్చి జరిపించే  వివాహం బ్రహ్మ వివాహం,  
 • యజ్ఞం చేయడం కోసం రుత్విక్కుకు కన్యని దక్షిణగా  ఇవ్వడం దైవవివాహం, 
 • ఆవు, ఎద్దు దానం చేసి ఆపై కన్యను ఇవ్వడం ఆర్ష వివాహం, 
 • మహానుభావునికి ప్రియురాలిగా సహధర్మచారిణి  గ ఉండమని ఆదేశించి కన్యను ఇవ్వడం ప్రాజాపత్య వివాహం, 
 • తల్లి, తండ్రి అనుమతి లేకుండా ఇరువురు చేసుకోవడం  గాంధర్వ  వివాహము,  
 • షరతు పెట్టి వివాహం చేసుకోవడం అసుర వివాహం,  
 • కన్యను బలాత్కారంగా తీసుకెళ్ళి వివాహం చేసుకోవడం రాక్షస వివాహం, 
 • కన్య నిదురపోతున్నప్పుడు, ఏమరు పాటుగా ఉన్నప్పుడు అనుభవించి ,చేసుకున్న వివాహం పైశాచిక వివాహం.

పెళ్ళిలో వధూవరులు ఒకరిపై ఒకరు  తలలపై జీలకర్ర, బెల్లం పెట్టేదేందుకు?--- మంత్రాలతో వధూవరుల నెత్తి మీద జీలకర్ర,బెల్లం పెట్టేది శుభాసూచికముతో  పాటు శరీరంలో ఉన్న దోషాలు పోవాలని,  జీలకర్ర, బెల్లంలా వారిరువురు కలసి మెలసి ఉండాలని.  జీలకర్ర, బెల్లం పెట్టె సమయమే వధూవరుల తొలిస్పర్శ .ఎప్పుడైతే ఒకరినిఒకరు తాకుతారో అప్పుడే పెల్లయిపోయినట్టు.

తలంబ్రాలు పోసుకునేదేందుకు?    ----  ప్రధమంగా నాలుగుసార్లు ఒకరిపై ఒకరు పోసుకొని ఆపై పోటిపడి ఒకరిపై ఒకరు సంతోషంగా పోసుకుంటారు.  ఆ సమయాన మంత్రాలకు అర్ధం సంతానం వృద్ధి చెందాలని మగవాడు, ధన ధాన్యాలు వృద్ధి చెందాలని వధువు ....ఇలా సమస్త సంపదలు, సుఖాలు కావాలని ఇరువురు భగవంతున్ని కోరుకోవడమే తలంబ్రాల ఉద్దేశము.

సప్తపది అనగా ఏంటి? ---- వరుడు వధువుని  ఏడడుగులు నడిపిస్తూ.... నన్నే సదా అనుసరించు, పరమేశ్వరుడు నీవు నాతో నడిచే అడుగుతో మనల్ని ఒకటిగా చేయాలి. ఇంకా అన్నాన్ని, శక్తిని, బుద్ధిని , సుఖాన్ని పశువ్రుద్ధిని, రుతు సంపదను, ఋత్విక్ సంపదను కలగచేయాలి.  ఇరువురము ధర్మ,మోక్ష, సుఖ కార్యాలను కలసి చేద్దాము.

పెళ్ళిలో మంగళసూత్రం కట్టడంలో పరమార్ధం ఏంటి?  --- పెల్లికోడుకైన నేను నీ మేడలో మాంగల్యం కడుతున్నాను,  నా, నీ జీవనం  ఈ క్షణం నుండి ప్రారంభం.  నిండు నూరేళ్ళు పూర్ణ ఆయుస్శుతో మనం కలసి ఉండాలి. రెండు తాళి బొట్లు గౌరీ శంకరులు.  పరస్పరం ఒక్కటై అత్తింటి వార్నీ,  పుట్టింటి వారిని రెండు తాలిబోట్ల వలె సదా కలిపి ఉంచి సుఖంగా జీవితాన్ని గడుపుదామని పరమార్ధం.  

పెళ్ళిలో అల్లుడి కాళ్ళు మామ గారెందుకు కడుగుతారు?  --- ఓ పెండ్లి కూమారుడా  పంచ భూతాల సాక్షిగా, అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసిన నా పుత్రికను , నా కన్యమనిని,  ధర్మ, అర్థ, కామ , మోక్షాలకై నీకు అర్పిస్తున్నాను, దానమిస్తున్నాను.  ఈ దానం వల్ల నాకు బ్రహ్మ లోక ప్రాప్తి కావాలని అడుగుతున్నాను....
"ఓ వరుడా......నీవు ఈ సమయాన సాక్షాత్తు శ్రీమన్నారయనుడవి,  నా బిడ్డ లక్ష్మి దేవి, కాబట్టి అంతటి నీకు కాళ్ళు కడుగుతున్నాను" అని వధువు తండ్రి వరుని కాళ్ళు కడుగుతాడు. అందుకే అంతా వారిపై అక్షితలు వేసి,  శ్రీ లక్ష్మి నారాయనులుగా భావించి నమస్కరిస్తారు.

  నల్ల పూసలు ధరించేది ఎందుకు? ---  మంగళ సూత్రంతో పాటు నల్ల పూసలు గొలుసుగా ధరించడం మన హిందూ సాంప్రదాయం.  దుష్ట శక్తులు తన మాంగల్యం మీద పడకుండా  ఉండటానికి ముక్యంగా ధరిస్తారు.  అంతే కాకుండా నల్లపూసలు సంతాన సాఫల్యానికి, దానానికి, సుఖానికి చిహ్నాలు.  నల్లపూసలు మంగళకరమైన, సౌభాగ్యమైన ఆభరణము.

భర్త, భార్యను ఎప్పుడు తాకాలి?  --- వివాహాది మంత్రాల ప్రకారమూ, సామాజిక ధర్మం ప్రకారం, భార్యకు కడుపు నిండా తిండి పెట్టి , కప్పుకోవడానికి, సిగ్గును దాచు కోవడానికి బట్టలివాలి. అన్ని వైపులా నుంచి రక్షణ, భద్రత ఇవ్వాలి. ఆ తర్వాతే స్త్రీని తాకాలి.  అట్టి వాడే స్త్రీకి అత్యంత దగ్గరిగా వెళ్ళడానికి అర్హుడు.

భార్య, భర్తకు ఏ వైపుగా  ఉండాలి? ---  సమస్త కార్యాలలోను ఎడమ పక్కనే ఉండాలన్న నియమాన్ని శాస్త్రం చెప్పడం లేదు. పూజాదికాలు నిర్వహించే టప్పుడు, దానాలు,ధర్మాలు చేసే సమయాన భార్య, భర్త ఎడమవైపున ఉండాలి.   కన్యాదాన సమయాన, విగ్రహ ప్రతిష్టలప్పుడు  కుడి వైపున ఉండాలి.
బ్రహ్మ దేవుడు మగవాడ్ని కుడి భాగం నుంచి, స్త్రీని ఎడమ భాగం నుంచి సృష్టించాడని శాస్త్రాలు చేపుతున్నంయి.   శ్రీ మహా విష్ణు శ్రీ మహా లక్ష్మిని ఎడమ స్థానంలో పదిలంగా ఉంచుకుంటాడు.

 • Courtesy with : https://sites.google.com/a/talapatras.com/hindu-sanskrti/our-company/vivahamu

 • ========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

షోడశ సంస్కారాలు తెలపండి ?
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...భారతీయ సంస్కృతిలో చెప్పబడినవన్నీ సమాజహితం కోసమే ఉద్దేశించబడినవి. సమాజం అంటే మనుష్యులు తప్ప వేరెవరో కాదు. అందుకే మన సంప్రదాయయలు మానవ వికాసానికై  ఋషులచే నిర్దేశించబడ్డాయి. ఈ సంప్రదాయలనే సంస్కారాలు అని చెబుతారు. మన జీవితాలు ఏదో ఒక దశలో ఈ సంప్రదాయలను అనుసరించే ముందుకు సాగుతుంటాయి.
  మనుస్మౄతి ఈ సంస్కారాలను 12 సంస్కారాలుగా గుర్తించింది. 1. వివాహాం, 2. గర్భాధానం, 3. పుంసవనం, 4. సీమంతం, 5. జాతకర్మ, 6. నామకరణం, 7. అన్నప్రాశనం, 8. చూడాకర్మ, 9. నిష్క్రమణం, 10. ఉపనయనం, 11. కేశాంతం, 12. సమావర్తనం. అయితే మరికొంతమంది సాంస్కృతికాకురులు ఈ సంస్కారలను షోడశ (16) సంస్కారాలుగా పేర్కొన్నారు. కర్ణభేధం, విద్యారంభం, వేదారంభం, అంత్యేష్టి అంటూ మనువు చెప్పిన 12 సంస్కారాలకు, ఈ నాలుగు సంస్కారాలను జోడించి షొడశ సంస్కారాలుగా గుర్తించారు.

   మనిషి పుట్టుకనుంచి చనిపోయేవరకు సంస్కారమయమే. ఇందులో అంత్యేష్టి తప్ప మిగిలిన 15 కర్మల ద్వారా జీవుడు సంస్కరింపబడుతూ మరణం తర్వాత ఉత్తమలోక ప్రాప్తిని పొందడం జరుగుతుంది. సంస్కారాల వలన జన్మాంతర దోషాలు కూడ తొలిగి మానవ జీవిత లక్ష్యమైన మోక్షప్రాప్తి సిధ్దిస్తుంది.

ప్ర :
 షోడశ సంస్కారాలు తెలపండి ?

జ :
షోడశ సంస్కారాలు అంటే పదహారు సంస్కారాలు . అవి ఏమనగా ............
 1. అధానము ,
 2. పుంసవనము , 
 3. సీమంతము ,
 4. జాతకర్మము , 
 5. నామకరణము , 
 6. అన్న ప్రాసనము ,
 7. చౌలము , 
 8. ఉపనయనము , 
 9. ప్రాజాపత్యము ,
 10. సౌమ్యము ,
 11. ఆగ్నేయము, 
 12. వైశ్వదేవము , 
 13. గోదానము ,
 14. సమావర్తనము ,
 15. వివాహము ,
 16. అంత్యకర్మ , 
పుంసవనం
 ఈ పుంసవనము వలన లోపల గర్భములో వున్నటువంటి గర్భస్థ శిశువునకు శుద్ధి జరుగుతుంది.  ఈ పుంసవము చేస్తే మగ పిల్లవాడు పుడతాడని అనుకుంటూ వుంటారు. ఇది కేవలం గర్భస్థ శిశువుకు శుద్ధి జరుగుతుంది.
 • ============================
 visit My website > Dr.Seshagirirao - MBBS.-

why do milk curdle ?,పాలు విరుగుతాయెందుకు?

 •  

 •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

 ప్రశ్న  :
 పాలు విరుగుతాయెందుకు?

జవాబు :
రసాయనశాస్త్రము ప్రకారము పాలు అష్తిరమైన కొల్లాయిడ్స్ రూపము . పాలలో పోషక పదార్ధాలైన ప్రోటీన్లు , విటమిన్లు తోపాటు మిక్రోమాలిక్యూల్స్ ఉంటాయి. ఇతువంటి కొల్లాయిడ్ పదార్ధాలను వేడిచేసినపుడు అందులోవున్న పెద్ద అణువులు దగ్గరకు చేరి పీలికల్లా గడ్డలా తయారవుతాయి . అలా యేర్పడడాన్ని విరగడం అంటాం .కొల్లాయిడ్  స్థితిలో ఉన్న పాలు విరగడానికి పులుపు వంటి పదార్ధములు జోడవడము ఒక కారణము . ఎక్కువ సమయము నిలువా ఉన్నా పాలు విరుగుతాయి.పాలు పి.ఎచ్ (ph) మారడము వలన ఇలా జరుగుతుంది . పాలు ఎసిడిక్ పి.ఎచ్ వైపు మారినపుడు వాటి అనువులు అమరిక తేడా అవడము మూలంగా పీలికల్లా గడ్డలు గా తయారవుతుండి
 • =======================
 visit My website > Dr.Seshagirirao - MBBS.-