Monday, May 13, 2013

Clouds are not droping down Why?,మేఘాలు కింద పడవా?

 •  
 •  

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...ప్రశ్న : మేఘాలు గాలి కన్నా బరువైనవి కదా? మరి కింద పడవెందుకు?

జవాబు : ఒక వస్తువు గాలిలో తేలుతుందా లేక పడిపోతుందా అన్న విషయం బరువును బట్టి ఆధారపడదు. శాస్త్రీయంగా బరువు అంటే భారం (Weight). దీని విలువ వస్తువు ద్రవ్యరాశి, గురుత్వ త్వరణాల (Acceleration due to gravity)లబ్దానికి సమానం. దీన్ని బట్టి కాకుండా వస్తువుల సాంద్రతను (Density) బట్టి వస్తువు తేలడం, కిందపడటం ఆధారపడుతుంది. గాలికన్నా మేఘాల సాంద్రత తక్కువ. మేఘాల్లో నీటి శాతం ఎక్కువ ఉన్నపుడు మేఘాల సాంద్రత కొంచెం పెరగడం వల్ల కిందకు రావడానికి ప్రయత్నిస్తాయి. ఆ క్రమంలో అవి తక్కువ ఉష్ణోగ్రత ప్రాంతానికి దిగడం వల్ల నీటి బిందువులు వర్షించి మేఘాల సాంద్రత తిరిగి తగ్గి అలాగే ఉండిపోతాయి. కాబట్టి మేఘాలు కింద పడవు.

మేఘాలు వాయు రూపంలోను, కొన్ని కొన్ని అణువులు బృందాలుగా కొల్లాయిడల్‌ రూపంలోను ఉన్న భౌతిక పదార్థాలు. భూమికి ఆకర్షణ ఉన్నంత మాత్రాన భూమ్మీద ఉన్నవన్నీ నేల మీదకు పడవు. ఆ మాటకొస్తే మేఘాలే కాదు. భూ వాతావరణంలో కొన్ని వందల కిలోమీటర్ల పైవరకు విస్తరించి ఉన్న ఆక్సిజన్‌ నైట్రోజన్‌ వంటి రూప పదార్థాలు కూడా భూమి మీద పడటం లేదు. అణువుల మధ్య పరస్పర తాడనాలు, వికర్షణలు ఎపుడూ ఉంటాయి.

భూమికి చేరువగా ఉన్న గాలి పొరల కన్నా కొంచెం పైనున్న పొరల సాంద్రత తక్కువగా ఉండటం వల్ల పైపొరల్లోని పదార్థాలు కింది పొర మీద తేలి ఉంటాయి. మేఘాల సాంద్రత, మేఘాల కింద ఉన్న గాలి సాంద్రత కన్నా తక్కువ కాబట్టి మేఘాలు గాల్లో పైపొరలో ఉంటాయి. మేఘాలలోని నీటి అణు బృందాల్లో అణువుల సంఖ్య పెరిగినా, వాతావరణ ఉష్ణోగ్రత తగ్గినా మేఘాల సాంద్రత పెరుగుతుంది. అపుడవి నేలకు మరింత దగ్గరవుతాయి. కొన్ని పర్వత ప్రాంతాల్లో మేఘాలు కొండల నేలల్ని తాకుతూ ప్రయాణిస్తుంటాయి. ఉష్ణోగ్రత మరీ తగ్గినట్లయితే ఆ మేఘాల్లో ఉన్న నీటి తుంపర్లే నీటి బిందువులుగా మారి వర్షపు చినుకుల్లా వాన కురుస్తుంది. అపుడిక మేఘాలు భూమి మీద రూపం మార్చుకుని పడ్డట్టే!


-ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్‌,వరంగల్‌; రాష్ట్ర కమిటీ, జనవిజ్ఞానవేదిక@ఈనాడు హాహ్ బుజ్జీ.
 • =====================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

What is rain and how it be measured?,వర్షం అంటే ఏమిటి?వర్ష తీవ్రత ఎలా తెలుస్తుంది?

 •  
 
 •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
ప్రశ్న: వర్షం అంటే ఆకాశం నుంచి నీరు మాత్రమే కురియడమేనా? వర్ష తీవ్రత ఎలా తెలుస్తుంది?

జవాబు: వాతావరణ శాస్త్రవేత్తలకు వర్షం అంటే ఆకాశం నుంచి భూమి పైకి కురిసే నీరు మాత్రమే కాదు. మామూలు వర్షంలో బిందువుల పరిమాణం 0.6 మిల్లీమీటర్ల నుంచి 3 మిల్లీమీటర్ల వరకు ఉంటుంది. శాస్త్రవేత్తలు 0.6 మి.మీ. కన్నా తక్కువ వ్యాసం ఉండే వర్షపు బిందువుల జల్లులను కూడా గుర్తించగలుగుతారు. భారీగా వర్షం కురుస్తున్నప్పు భూమిపై పడేది వట్టి నీరు మాత్రమే కాదు. ఆ వర్షంలో వాతావరణంలోని దుమ్ము, ధూళి కణాలతో పాటు ఆక్సిజన్‌, నైట్రోజన్‌ వాయువులు, కొన్ని రసాయనిక ద్రవాలు కలిసి ఉంటాయి. ఈ పదార్థాలు భూమిపై ఉండే రాళ్లను కోతకు గురి చేయడమే కాకుండా పంట పైరులకు ఎరువులుగా కూడా పనిచేస్తాయి.

ప్రత్యేకమైన రెయిన్‌గేజ్‌లు, వాతావరణ రాడార్లు వర్షం నీటితో పాటు మంచు, మంచుగడ్డలు కూడా పడుతున్నాయా అనే విషయాన్ని తెలియజేస్తాయి. రాడార్‌ వెలువరించే రేడియో తరంగాలు కురుస్తున్న వర్షపు బిందువులపై పతనమై పరావర్తనం(reflection) చెందుతాయి. అలా పరావర్తనం చెందిన రేడియో తరంగాల తీవ్రతను బట్టి మేఘాలలో నీటి బిందువులు ఎంత ఎక్కువగా ఉన్నాయో, వర్షం ఎంత తీవ్రతతో కురుస్తోందో తెలుసుకుంటారు. ఇలాంటి వివరాల ద్వారా విమానాల పైలట్లకు ఏ ప్రాంతం ప్రయాణానికి అనుకూలమైనదో తెలుస్తుంది.

- ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌@ఈనాడు హాయ్ బుజ్జి

   
 • ===================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Wednesday, May 08, 2013

How do make Bullet proof jackets?, బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్లు ఎలా తయారు చేస్తారు?

 •  

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...


ప్రశ్న: బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్లు అంటారు. తుపాకీతో పేల్చినా ప్రమాదం ఉండని విధంగా వాటిని ఎలా తయారు చేస్తారు?

జవాబు: తుపాకీ పేల్చినప్పుడు దూసుకు వచ్చే బుల్లెట్‌ విపరీతమైన వేగంతో ప్రయాణించి లక్ష్యాన్ని తాకుతుంది. ఆ వేగం వల్ల ఏర్పడే శక్తివిధ్వంసాన్ని సృష్టిస్తుంది. బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకట్టు ప్రత్యేకంగా తయారు చేయడం వల్ల దాన్ని తాకే తుపాకీగుండు యొక్క శక్తి ఒకే చోట కేంద్రీకృతమవకుండా నలుదిక్కులకు చెదిరిపోతుంది. అంతేకాకుండా ఆ జాకెట్‌కు తగలగానే తుపాకి గుండు ఆకారం కూడా మారిపోవడంతో ఒకవేళ ఆ తూటా ఆ కోటును దాటి దాన్ని ధరించిన వారికి తగిలినా లోతైన గాయం ఏర్పడదు.

బుల్లెట్‌ప్రూఫ్‌ జాకెట్‌ను దృఢమైన స్టీలు పలకలతో తయారు చేస్తారు. కొన్ని మందు గుండు సామాగ్రులు(Ammunition) స్టీలు గుండా కూడా చొచ్చుకొని పోయేలా ఉండడంతో బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకట్లను కూడా మరింత దృధమైన పదార్థాలతో రూపొందిస్తున్నారు. ఈ మధ్య కాలంలో పింగాణీ, టిటానియం లాంటి తెలిక పదార్థాలతో చేసే సన్నటి పొరలు ఒకదానిపై ఒకటి ఉండేలా వీటిని చేస్తున్నారు. ఇవి స్టీలు జాకెట్ల కన్నా ఎంతో ఎక్కువ సామర్థ్యం కలిగి ఉండటమే కాకుండా తేలికగా కూడా ఉంటున్నాయి. ఈ పదార్థాలతో పాటు కెవ్‌లార్‌(Kevlar) అనే పదార్థం నుంచి తీసిన దృఢమైన పోగులతో వలలాగా అల్లుకుని ఉండేలా ఈ జాకెట్లను చేస్తారు. దీన్ని తాకే తుపాకీగుండు ఈ వలలో చిక్కుకొని తన శక్తిని, ఆకారాన్ని కోల్పోంతుంది. అందువల్ల దీన్ని ధరించిన వ్యక్తికి ఎలాంటి ప్రమాదం జరగదు.


- ప్రొ||ఈ.వి.సుబ్బారావు, హైదరాబాద్‌

 • ====================
 visit My website > Dr.Seshagirirao - MBBS.-

Changing Tonic bottles for storing Why?,టానిక్‌ నిల్వ ఉంచే సీసాల్లో మార్పులేల?

 •  
 •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...ప్రశ్న: కొన్ని రకాల టానిక్కులు గాజు సీసాలలో, మరి కొన్ని ప్లాస్టిక్‌ సీసాల్లో వస్తున్నాయి. గాజు సీసాలలో ఉంచే వాటిని ప్లాస్టిక్‌ బాటిళ్లలో ఉంచకూడదా?

జవాబు: పదార్థాల రసాయనిక స్వభావాన్ని బట్టి నిల్వ ఉంచే పాత్రల్ని ఎన్నుకోవాలి. ఉదాహరణకు వూరగాయల్ని అల్యూమినియం, రాగి, ఇత్తడి, వంటి పాత్రల్లో నిల్వ ఉంచకూడదు. అందుకే వాటిని పింగాణీ పాత్రల్లో నిల్వ ఉంచుతారు. వూరగాయల్లో ఉన్న ఆమ్లత్వం(Acidity)పాత్రల లోహాల్ని ఆక్సీకరణం(Oxidation)చేయడం వల్ల ఏర్పడే లవణాలు(Salt) వూరగాయల్ని పాడయ్యేలా చేస్తాయి. అదే పింగాణీ మీద ఆమ్ల ప్రభావం దాదాపు శూన్యం.
అదే విధంగా ఆల్కహాలు, ఈథర్‌, క్లోరోఫాం వంటి సేంద్రియ ద్రవాల్ని ప్లాస్టిక్‌ బాటిళ్లలో నిల్వ ఉంచరు. ఎందుకంటే ఈ ద్రావణులు (solvents)ప్లాస్టిక్‌ పదార్థాల్ని కరిగించుకుంటాయి. అంటే పాత్ర ఖరాబు కావడంతో పాటు లోపలున్న పదార్థాలు కూడా చెడిపోతాయి. ఇలాంటి వాటిని గాజు పాత్రల్లోనే ఉంచాలి. అలాగే కొన్ని ద్రవాల్ని పారదర్శకంగా (Transparent)ఉండే గాజు పాత్రల్లో ఉంచరు. ఎందుకంటే అవి కాంతి సమక్షంలో చెడిపోయే లక్షణాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి దట్టమైన గోధుమ రంగు (Deep brown)గాజు పాత్రల్లో ఉంచుతారు. హైడ్రోఫ్లోరిక్‌ ఆమ్లాన్ని గాజు పాత్రల్లో ఉంచరు. ఇది గాజుని తినేస్తుంది. దీన్ని విధిగా ప్లాస్టిక్‌ సీసాలోనే నిల్వ ఉంచాలి. అందువల్ల రకరకాల టానిక్కులను వాటిలో ఉండే పదార్థాలకు అనుగుణంగా తగిన పాత్రల్లోనే ఉంచుతారు.

- ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్ర కమిటీ, జనవిజ్ఞానవేదిక
 • ======================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Paper foldings not cleared Why?,కాగితం ముడతలు పోవేం?

 •  
 •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !... 


ప్రశ్న: మడిచిన కాగితంపై పడే ముడతలను తొలగించలేము. ఎందువల్ల?

జవాబు: చదునుగా ఉన్న కాగితాన్ని రోలరులాగా చుట్టి వదిలితే, అది తిరిగి యధాస్థితికి వస్తుంది. అదే కాగితాన్ని మడత పెట్టి రుద్దితే, తిరిగి అది మునుపటి స్థితికి చేరుకోలేదు. కాగితం 'సెల్యులోజ్‌' పోగులతో కూడి ఉంటుంది. ఈ సెల్యులోజ్‌ కలప, గుడ్డ పేలికల గుజ్జు నుండి లభిస్తుంది. మెత్తగా, సున్నితంగా ఉండే ఈ పోగులను కొంచెంగా వంచవచ్చు. అందువల్లే కాగితాన్ని రోలర్‌లాగా చుడితే సెల్యులోజ్‌ పోగులు కొంచెం దగ్గరగా రావడం వల్ల
కాగితం వంగినా దాన్ని తిరిగి వెనుకకు చుట్టడం ద్వారా యధాస్థితికి వస్తుంది. అదే కాగితాన్ని మడతపెట్టినప్పుడు అందులోని సెల్యులోజ్‌ పోగులు విరగడమో, తెగిపోవడమో జరుగుతుంది. అందువల్ల మడత విప్పినా కాగితం యధాస్థితికి చేరుకోలేదు.

-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌
 • ====================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Tuesday, May 07, 2013

TubelightsGiveLightKeptUnderCurrentWiresHow?,ట్యూబ్‌లైట్లను కరెంట్‌ ప్రవహించే తీగల కింద వాటికి తగలకుండా పెడితే ఎలా వెలుగుతాయి?

 •  

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...


ప్రశ్న: ట్యూబ్‌లైట్లను కరెంట్‌ ప్రవహించే తీగల కింద వాటికి తగలకుండా పెడితే, వాటంతట అవి ఎలా వెలుగుతాయి?

జవాబు: ట్యూబ్‌లైట్లు లేక ఫ్లోరసెంట్‌ ట్యూబ్‌ల గుండా విద్యుత్‌ శక్తిని ప్రవహింప చేస్తే, వాటిలో ఉండే వాయువుల అణువులు ఉత్సర్గం చెంది కంటికి కనబడని అతినీలలోహిత కాంతిని వెలువరిస్తాయి. ఈ అతి లోహిత కిరణాలు ఆ ట్యూబ్‌ గోడల లోపలి వైపు పూయబడిన పదార్థపు అణువులను ఉత్తేజ పరచడంతో కంటికి కనబడే కాంతి వెలువడుతుంది.
ట్యూబ్‌లైట్లను ఎలాంటి విద్యుత్‌ శక్తిని సరఫరా చేసే వ్యవస్థకు అనుసంధానించకుండా విద్యుత్‌ ప్రవహించే తీగల కింద కొంత దూరంలో సమాంతరంగా ఉంచితే, ఆ ట్యూబ్‌లైట్లు వెలుగుతాయి. కారణం విద్యుత్‌ ప్రవహించే తీగల చుట్టూ ఉండే విద్యుదయస్కాంత క్షేత్రం వల్ల ట్యూబ్‌లైట్లలో ఉండే వాయువులు ఉత్తేజం(excite)పొంది ఆయనీకరణ(ionisation)ప్రక్రియ ద్వారా ఉత్సర్గం (dischange)చెందడంతో ఆ ట్యూబ్‌ల నుంచి కాంతి వెలువడుతుంది. అంటే ఆ ట్యూబ్‌లైట్లు వెలుగుతాయి


- ప్రొ|| ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌
 • ======================
 visit My website > Dr.Seshagirirao - MBBS.-

Ant not injured on falling from height Why? చీమ ఎంత ఎత్తు నుంచి పడినా దెబ్బ తగలదేమి ?

 •  
 •  

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...


ప్రశ్న: చీమ ఎంత ఎత్తు నుంచి పడినా దానికి దెబ్బ తగలదు. ఎందుకని?

జవాబు: ఏదైనా వస్తువు కింద పడినప్పుడు పగిలిపోవడానికి, జీవులకు దెబ్బ తగలడానికి కారణం ఒకటే. పడడానికి ముందు, పడిన తర్వాత వాటి ద్రవ్యవేగం(momentum)లో మార్పే. ద్రవ్యవేగం అంటే ఆ వస్తువులో ద్రవ్యరాశి, దాని వేగాలను గుణిస్తే వచ్చేదే. ఎత్తు నుంచి కిందకి పడే వస్తువు ద్రవ్యవేగం అంతకంతకు పెరిగిపోతూ ఉంటుంది. ఆ వస్తువు భూమిని తాకగానే అంతటి వేగమూ శూన్యం కావడం వల్ల, అంతే ద్రవ్యవేగంతో సమానమైన శక్తి ఏర్పడి ఆ వస్తువుపై వ్యతిరేక దిశలో పనిచేస్తుంది. ఉదాహరణకు ఒక వస్తువు 20 మీటర్ల ఎత్తు నుంచి పడిపోతూ 2 సెకన్లలో నేలను తాకిందనుకుందాం. ఈ ప్రయాణంలో అది సుమారు గంటకు 72 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఆ వేగాన్ని, దాని ద్రవ్యరాశితో గుణిస్తే దానిలో ఏర్పడే ద్రవ్యవేగం తెలుస్తుంది. చీమల ద్రవ్యరాశి చాలా తక్కువ కావడం వల్ల తక్కువ ద్రవ్యవేగంలోనే అవి కింద పడతాయి. అంటే కింద పడిన చీమపై కలిగే శక్తి ప్రభావం కూడా తక్కువే. మనుషుల్లాంటి బరువైన జీవులు కింద పడితే ద్రవ్యవేగం ప్రభావం ఎక్కువై గాయాలు ఏర్పడుతాయి.

Courtesy with -ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక@ ఈనాడు దినపత్రిక
 •  ===================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Who are the fiver mother in human life?, మానవులలో పంచమాతలు అంటే ఎవరు?

 •  

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

 పంచమాతలు

    రాజు భార్య
    అన్న భార్య
    గురుని భార్య
    భార్య తల్లి(అత్త)
    కన్న తల్లి

        ధరణీ నాయకు రాణియు
        గురు రాణియు నన్నరాణి కులకాంతను గ
        న్న రమణి దనుగన్నదియును
        ధరనేవురు తల్లులనుచు దలుపు కుమారా!

రాజుగారి భార్య, గురువుగారి భార్య, అన్నగారి భార్య, భార్యను కన్న తల్లి, తనను కన్న తల్లి - ఈ అయిదుగురిని తల్లులుగా భావింప వలెను.--- కుమార శతకము నుండి.
 • =========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Thursday, May 02, 2013

In vaccuum ball rotate like Earth?, బంతి శూన్యంలో భూమిలా గుండ్రంగా తిరుగుతుందా?

 •  
 •  

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...ప్రశ్న:శూన్యం(vacuum)లో బంతిని వేస్తే అది కూడా భూమిలా గుండ్రంగా తిరుగుతుందా?

జవాబు: కేవలం గాలి లేకపోవడాన్నే శూన్యమనుకుంటే చంద్రుడు కూడా శూన్యంలోనే ఉన్నాడు. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతున్నట్టే చంద్రుడు కూడా భూమి చుట్టూ తిరుగుతున్నాడు. కానీ సాధారణంగా శూన్యం (అంతరిక్షం, space) అంటే ఏ క్షేత్ర ప్రభావం(field effect)లేని ప్రాంతం. అక్కడ గురుత్వాక్షర్షణ(gravity)ఉండదు. అలాంటి చోట బంతిని కాదుకదా, ఏ వస్తువును ఉంచినా అది ఉంచిన చోటే ఉంటుంది. ఒకవేళ కొంత బలంతో విసిరేస్తే అది చేతి నుంచి వదిలినపుడు ఎంత వేగంతో బయట పడిందో అంతే వేగం(uniform valocity)తో అలా పోతూనే ఉంటుంది. (తిరిగి ఎక్కడయినా ఇతర క్షేత్రాల ప్రభావంతో పడేంత వరకు). అయితే భూమ్యాకర్షణ పరిధిలో ఉన్న ఉపగ్రహాలు(satelites),అంతరిక్ష ప్రయోగ శాలలు (space stations)వంటి చోట్ల బంతిని విసిరేస్తే తప్పకుండా అది తన చుట్టూ తాను తిరుగుతూ, భూమి చుట్టూ తిరుగుతుంది. కానీ బంతికి సరిపడా వేగాన్ని ఇవ్వాలి. ఇది భూమ్యాకర్షణ ఉన్న క్షేత్రంలో ఎంత ఎత్తున ఆ వస్తువు (బంతి) ఉందన్న దూరం మీద ఆధారపడి ఉంటుంది.

- ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్ర కమిటీ, జనవిజ్ఞానవేదిక


 • ====================
 visit My website > Dr.Seshagirirao - MBBS.-

Can Animals and birds Predict Disaster?,జంతువులు, పక్షులు-ప్రకృతి వైపరీత్యాలను ఎలా పసిగడతాయి?

 •  
 •  

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...ప్రశ్న: ప్రకృతి వైపరీత్యాలు వచ్చే ముందే కొన్ని జంతువులు, పక్షులు వాటిని తెలుసుకుంటాయంటారు. ఎలా పసిగడతాయి?

జవాబు : జీవులన్నింటికీ పరిశీలన శక్తి, సామర్థ్యాలు ఒకే విధంగా ఉండవు. ఉదాహరణకి మనం వంద అడుగుల దూరంలో ఉన్న ఈగను చూడలేం. కానీ గద్ద వేల అడుగుల దూరంలో ఉండే జంతువును కూడా చూడగలదు. భూకంపాలు, తుపాన్లు, సునామీలు మొదలైన ప్రకృతి వైపరీత్యాలు ఒక్క ఉదుటన ఏ విధమైన ముందస్తు సంకేతాలు లేకుండా రావు. అలాంటి సందర్భాల్లో ప్రకృతిలో చోటు చేసుకునే సున్నితమైన మార్పుల్ని కొన్ని పక్షులు, జంతువులు గ్రహించగలుగుతాయి. ఉదాహరణకు గాలిలో కలిగే మార్పులు, భూమిలో ఏర్పడే కంపనాల్ని, వాతావరణంలో హఠాత్తుగా మారే తేమ శాతం లాంటి వివరాలను అవి గుర్తించగలుగుతాయి. తద్వారా అవి ప్రకృతి వైపరీత్యాలను కొంత మేరకు ముందే పసిగట్టగలవు. అలాగని 2 సంవత్సరాల తర్వాతో, రెండు నెలల తర్వాతో రాబోయే వాటిని అవి కూడా గుర్తించలేవు.

- ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్ర కమిటీ, జనవిజ్ఞానవేదిక
 • =======================
 visit My website > Dr.Seshagirirao - MBBS.-

Wednesday, May 01, 2013

Why do not moon drop down to Earth?,చంద్రుడు కింద పడడేం?

 •  
 •  

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...


ప్రశ్న: చంద్రుణ్ణి భూమి ఆకర్షిస్తుంటే, మరి చంద్రుడు భూమిపై ఎందుకు పడడు?

జవాబు: చెట్టు నుంచి రాలిన పండు భూమిపై పడడానికి కారణం భూమికి ఉండే గురుత్వాకర్షణ బలం అని ప్రఖ్యాత భౌతిక శాస్త్రజ్ఞుడు ఐజాక్‌ న్యూటన్‌

17వ శతాబ్దంలో ప్రతిపాదించాడు. రాలే పండును భూమి ఆకర్షిస్తున్నట్లే చంద్రుణ్ణి కూడా భూమి ఆకర్షిస్తుందని న్యూటన్‌ ఆ రోజుల్లోనే సిద్ధాంతీకరించాడు. మరి భూమిపై చంద్రుడు ఎందుకు పడడం లేదన్న ప్రశ్నకు జవాబు కూడా ఆయనే చెప్పాడు. భూమి చంద్రుణ్ణి గురుత్వాకర్షణ బలంతో తనవైపుకు లాగుతుంటే, ఈ బలానికి లంబదిశలో చంద్రుడు కొంత వేగంతో పయనిస్తున్నాడు. ఈ చలనం వల్లే చంద్రుడు భూమిపై పడడం లేదు. ఒక వ్యక్తి కొంత నీరు ఉన్న బకెట్‌కు తాడుకట్టి తన చుట్టూ వృత్తాకార మార్గంలో కొంత వేగంతో తిప్పుతుంటే, అందులోని నీరు నేలపై పడదు. తిప్పేవేగం తగ్గించినా, తిప్పడం ఆపినా, నీటితోపాటు బకెట్‌ కిందపడుతుంది. రోదసిలో ఎలాంటి ఘర్షణ(friction) ఉండక పోవడంతో, చంద్రుని వేగంలో ఎలాంటి మార్పు ఉండదు.

అందువల్ల చంద్రుడు భూమిపై పడకుండా ఒక నిర్దిష్ట కక్ష్యలో భూమి చుట్టూ తిరుగుతూ నెలకోక పరిభ్రమణం చేస్తూ ఉన్నాడు.

-ప్రొ||ఈ.వి.సుబ్బారావు, హైదరాబాద్‌
 • ======================
 visit My website > Dr.Seshagirirao - MBBS.-