Wednesday, July 31, 2013

How does Flint stone give fire?-చెకుముకి రాయి నుంచి నిప్పు కణాలు ఎలా వస్తాయి?ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...


ప్రశ్న: చెకుముకి రాయి నుంచి నిప్పు కణాలు ఎలా వస్తాయి?

జవాబు: చెకుముకి రాయి (Flint stone) మెరిసే నిప్పు కణాలను ఉత్పన్నం చేయడానికి గల కారణం దాని దృఢత్వమే. చెకుముకి రాయి తీవ్రంగా కొట్టగల సాధనమే కానీ నిప్పుకణాలు వెలువడేది మాత్రం ఇనుము, గంధకాల సమ్మేళనంతో కూడిన పైరైట్‌ (Pyrite) లేక స్టీలు లాంటి పదార్థాల నుండే రాతి యుగంలో నిప్పును పుట్టించడానికి పైరైట్‌ ముద్దను, ఎండుటాకులు పీచులాంటి పదార్థాలను ఒకచోట ఉంచి దానిపై దృఢమైన చెకుముకి రాయిని తాటించేవారు. మధ్యయుగంలోని పిస్తోళ్లలో చెకుముకి రాయిని, ఇనుమును తాటించడం వల్ల నిప్పు కణాలు వెలువడేవి. సిగరెట్‌ లైటర్లను చెకుముకి రాయితో చేయబడిన ఒక చక్రం అక్కడి మిశ్రమ లోహంపై ఘర్షణ కలిగించడంతో స్పల్పమైన మెరుపుతో కూడిన నిప్పు కణాలు వెలువడతాయి. ఆ కణాలు అందులో ఉండే పెట్రోలు, భాష్పం నుండి చిన్న మంట వచ్చేటట్లు చేస్తుంది. ఖరీదైన లైటర్లలో స్పార్క్‌లను ఉత్పన్నం చేయడానికి పీజో ఎలక్ట్రిక్‌ క్వార్ట్జ్‌ స్ఫటికాలను (Pieza electric quartz crystals) ఉపయోగిస్తారు.

- ప్రొ|| ఈ. వి. సుబ్బారావు, హైదరాబాద్‌

 •  ==============================
 visit My website > Dr.Seshagirirao - MBBS.-

What is Junk food-జంక్‌ ఫుడ్ సంగతేంటి?

 •  

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...


ప్రశ్న: 'జంక్‌ ఫుడ్‌' అంటే ఏమిటి? ఇది ఏఏ పదార్థాలలో ఉంటుంది?

జవాబు: ఇంగ్లిషులో జంక్‌ అంటే చెత్త లేదా పనికిరాని కుప్ప అని అర్థం. ఈమెయిల్‌లో కూడా జంక్‌ అనే పదాన్ని విని ఉంటారు. పనికిరాని, ప్రమాదకరమైన మెయిల్స్‌ను జంక్‌ మెయిల్స్‌ అంటారు. అలాగే పోషక విలువల పరంగా అంతగా ఉపయుక్తం కానిది, ఎంతో కొంత ఆరోగ్యానికి హాని కలిగించేది లేదా రుచీపచీ లేని నానా చెత్త ఆహార పదార్థాలకు ఇచ్చిన సర్వసాధారణ నామధేయం 'జంక్‌ఫుడ్‌'. బజార్లో రోడ్లమీద అమ్మే ఆహార పదార్థాలను జిహ్వ చాపల్యాన్ని సంతృప్తిపరచడానికి రకరకాల మసాలాలు వేసి వేయిస్తారు. పనిలో పనిగా వీధుల్లోని దుమ్ము, ధూళి, ఈగలు, చెమట అందులో కలిసి ఆ చెత్త ఆహారం మరింత చెత్తగా తయారవుతుంది. దానికి తోడు వాడిన నూనెనే మళ్లీ మళ్లీ వాడడం వల్ల వేపుళ్లు మరింత నల్లగా ఉంటాయి. హోటళ్లలోను, బండల దగ్గర దొరికే ఐస్‌క్రీములు, గప్‌చిప్‌లు క్రిముల మయమవడం వల్ల అవి మన ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. ఇలాటి జంక్‌ఫుడ్‌ జోలికి పోకుండా ఉండడం మేలు.

-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌;-రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
 • =======================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

on Frozen water volume increase Why?,నీరు ఘనీభవిస్తే దాని ఘన పరిమాణం పెరుగుతుంది. ఎందువలన?

 •  ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

 ప్రశ్న: నీరు ఘనీభవిస్తే అణువులు దగ్గరకు చేరి దాని ఘన పరిమాణం తగ్గాలి కదా! కానీ పెరుగుతుంది. ఎందువలన?

జవాబు: నీరు h2o అనే మూడు పరమాణువులతో కూడిన అణువు. నీరు ద్రవ స్థితిలో ఉండడం అంటే అర్థం అందులోని అణువులన్నీ పరస్పరం విద్యుదాకర్షణ ద్వారా, హైడ్రోజన్‌ బంధాల ద్వారా దగ్గరగా ఉండడమనుకోవచ్చు. ఈ స్థితిలో ఈ అణువులకు దిశ, క్రమత్వం ఉండదు. చిందరవందరగా తిరుగుతూ ఉన్నా కూడా వాటి మధ్య ఉన్న పరస్పర సగటు దూరం తక్కువగానే ఉంటుంది. దీన్ని మనం బడిలో ఉన్న విద్యార్థులందరూ దగ్గరగా వచ్చి గుమిగూడినట్టు అనుకోవచ్చు. అప్పుడు తక్కువ వైశాల్యంలోనే ఎక్కువ మంది విద్యార్థులు ఉంటారు. నీరు ఘనీభవించినప్పుడు అణువుల మధ్య కేవలం దిశ, క్రమత్వం ఉన్న హైడ్రోజన్‌ బంధాలు అమల్లోకి వస్తాయి. కాబట్టి అణువుల మధ్య దూరం కొద్దిగా పెరుగుతుంది. దీన్ని మనం ఇంతకు ముందు అనుకున్న విద్యార్థుల గుంపే డ్రిల్లులో చేతులు చాచి ఒకరి చేతులు మరొకరు పట్టుకుని నిల్చున్నట్టు వూహించండి. అప్పుడు వాళ్లంతా ఎక్కువ వైశాల్యాన్ని ఆక్రమిస్తారు కదా? నీరు ద్రవస్థితిలో ఉన్నప్పుడు, ఘనీభవించినప్పుడు ఇలాంటి బంధాల వ్యత్యాసం వల్లే నీటి సాంద్రత మంచు గడ్డ సాంద్రత కన్నా ఎక్కువగా ఉంటుంది.

- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌, రాష్ట్రకమిటి, జనవిజ్ఞానవేదిక
 • =========================
 visit My website > Dr.Seshagirirao - MBBS.-

Tuesday, July 30, 2013

Rain fall at all places not equally.Why?,వర్షము అన్నిచోట్లా ఒకేలా పడదెందుకు?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...


 • =======================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Tuesday, July 23, 2013

What is Badri Art?,బద్రీ కళ అంటే ఏమిటి ?
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...ప్ర : What is Badri Art?,బద్రీ కళ అంటే ఏమిటి ?


జ : కొన్నాళ్ల క్రితం బిద్రీ వస్తువులు ఎక్కువగా కనపడేవి. వీటిని రాగి, జింక్‌ మిశ్రమంతో తయారుచేస్తారు. ఈ మూలకాల మిశ్రమాన్ని మూసల్లో పోసి కావాల్సిన ఆకారంలో తెస్తారు. వాటికి ఫిల్లింగ్‌ ఆక్సిడైజేషన్‌ చేసి భూసార వర్ణం లోకి తెస్తారు. ఆ తర్వాత వస్తువులను శుద్ధి చేస్తారు. ఆపై చక్కని నగీషీలను చెక్కుతారు. కాని ఈ బిద్రీ కళాకారులు ఇప్పుడు గుండీలు, చెవిపోగులు, ప్లవర్‌ వాజులు, గాజులు, షహనాయ్‌నాజ్‌, పెన్‌ ెల్డర్లు, తలపిన్నుల్లాంటివెన్నో తయారుచేస్తున్నారు. అసలు ఈ బిద్రీ కళ పర్షియా దేశం నుంచి బీదరుకు వలస వచ్చిందంటారు. నేడు హైద్రాబాదులో ఈ బిద్రీ వస్తువులను తయారు చేసేవారు స్థిరపడ్డారు. దానితో భాగ్యనగర వాసులకు అపురూపమైన కళాఖండాలుగా అలంకరణ సామగ్రిగా వీటిని వాడుతున్నారు. ఈ కళను ఆదరిస్తే ఆణిముత్యాల్లాంటి వస్తువులను ముందుతరాల వారికి అందించగలుగుతాం...


 • =========================

 visit My website > Dr.Seshagirirao - MBBS.- 

Tuesday, July 16, 2013

Orange juice ia bitter Why?,టూత్ పేస్ట్ తో పళ్ళు తోముకున్నతర్వాత ఆరెంజ్ జ్యూస్ చేదు ఎందుకు?

 •  ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

 ప్ర : టూత్ పేస్ట్ తో పళ్ళు తోముకున్న తర్వాత ఆరెంజ్ జ్యూస్ తాగితే దాని రుచి చేదుగా ఉంటుంది  ఎందుకు?.

జ : పదార్ధము రుచి దానిలోని అణువుల పైన , నాలుక మీద ఉండే గ్రాహకాల పైన ఆధారపడి ఉంటుంది . పదార్ధములో ఒక నిర్ధిష్టమైన ఆకారములో ఉండే అణువులు , ఆ ఆకారాలను అంగీకరించే గ్రాహకాలతో ప్రతిస్పందిస్తాయి . ఒకోసారి నాలుకపై గ్రాహకాలు చేసే పనిని మార్చే పరిస్థితులు ఉంటాయి. పేస్టుతో పళ్ళుతోముకుని ఆరెంజ్ జ్యూస్ త్రాగినప్పుడు ఇదే జతుగుతుంది . పేస్టులో ఉండే సోడియం లారైల్ సల్పేట్ అనే రసాయన పదార్ధము నోటిలోని లాలాజలము తలతన్యతను తగ్గించి బ్రష్ చేస్తున్నప్పు డు నురకవ్చ్చేలా చేస్తుంది. అందువల్ల తక్కువ పేస్టు కూడా నోరంతా వ్యాపిస్తుంది . పేస్ట్ లోని రసాయనము నాలుకపై తీయటి రుచికి స్పందించే గ్రాహకాల చర్యను అణచివేస్తుంది. అంతేకాకుండా చేదు రుచిని నిరోదించే  ఫాస్ఫోలిడ్స్ కొవ్వు మూలకాలను నాశనము చేస్తుంది. అందువల్లే బ్రష్ చేసుకున్న వెంటనే ఆరెంజ్ జ్యూస్ తాగితే తీపికి బదులు  చేదుగా ఉంటుంది.

-- ప్రొ ; ఈ.వి సుబ్బా రావు . హైదరాబాద్ .
 • ===================
 visit My website > Dr.Seshagirirao - MBBS.

Monday, July 15, 2013

How are caves forming?,గుహలు ఎలా ఏర్పడతాయి?

 •  ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
 ప్ర : గుహలు ఎలా ఏర్పడతాయి?.

జ : కొండ గుహలలు  అధిక శాతము భూగర్భజలాల కదలివల్ల ఏర్పడినవే. భూమిమీదపడిన నీరు లోపలికి ఇంకుతూ పోతుంది. . . ఆ ప్రయత్నములో ఏదో ఒక చోట రాయి తగిలితే ఆ రాతిని కరిగించి చిన్న రంధ్రము చేసి ఆ రంధ్రము గుండా ప్రయాణము చేస్తూ ఒక పెద్ద మార్గాన్ని ఏర్పరుస్తాయి.  గాలిలో ఉండే కార్బన్‌ డై ఆక్షైడ్ వలన నీరు ఆమ్లగుణము సంతరిందుకొని రాతిని తినివేస్తుంది .  . . క్రమముగా రాయి కరిగిపోయి పగుళు గా తయారవుతుంది  , ఆ పగుళ్ళను నీరు మరింత విశాలము చేసుకుంటూ పోతాయి. ఫలితము గా ఒక గుహ ఏర్పడుతుంది.కొండల పైన పడిన వాననీరు ఈవిధముగా గుహలు ఏర్పడడానికి కారణమవుతుంది.

ప్రపంచము లో ఎన్నో గుహలు ఉన్నాయి . అతి పెద్ద గుహ 530 కి.మీ. పొడవు కలిగినది అమెరికాలో ఉన్నది . మన తెలుగు రాస్ట్రములో అజెంతా-ఎల్లోరా గుహలు ప్రసిద్ధి చెందినవి. 

 • =====================
 visit My website > Dr.Seshagirirao - MBBS.-

Thursday, July 11, 2013

Why do oldage and death occur in life?,ముసలితనమూ, చావూ అసలు ఎందుకు వస్తాయి?
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

 Q : Why do oldage and death occur in life?,ముసలితనమూ, చావూ అసలు ఎందుకు వస్తాయి?

A : ముసలితనమూ, చావూ అసలు ఎందుకు వస్తాయి? ప్రారబ్ధం, పూర్వజన్మఫలం మొదలైన చాదస్తాలను పక్కనపెడితే ప్రకృతిలో ఇటువంటిది ఎందుకు జరుగుతుందో ఆలోచించవచ్చు. దీన్ని గురించిన వైజ్ఞానిక ప్రతిపాదనలు కొన్ని ఉన్నాయి. వీటిలో ఒకటి తరతరానికీ సంతతిలోని జన్యువుల్లో యాదృచ్ఛికంగా కలిగే మార్పులకు సంబంధించినది. ఇటువంటి మ్యుటేషన్ల వల్ల కొత్త తరం ప్రాణుల్లో కొన్ని కొత్త లక్షణాలతో పుట్టవచ్చు. అయితే వీటిలో బతికేవి పరిసరాల్లో భౌతికంగానూ, భౌగోళికంగానూ అప్పుడప్పుడూ కలిగే మార్పులకు అనుగుణంగా ఉన్న ప్రాణులే. కొన్నిశరీరలక్షణాలు కలిగిన ప్రాణి మరీ ప్రతికూలమైన పరిస్థితులు ఎదురైతే చచ్చిపోతుంది. దానికి పుట్టిన సంతానంలో ఏ ఒక్కదానికైనా అటువంటి పరిస్థితులకు తట్టుకోగలిగిన శారీరక లక్షణాలు ఉన్నట్టయితే కనీసం అదైనా బతుకుతుంది.

ఈ లెక్కన ముసలితనం అనేది ప్రాణి శరీరానికి పటుత్వం తప్పి, అంత్యదశకు చేరబోయే ముందు దశ. మనుషుల విషయంలో పెరిగే వయస్సును గురించిన అనేక భావావేశాలూ, ఉద్వేగాలూ కలగడం మామూలే కాని తక్కిన ప్రాణుల విషయంలో అటువంటి 'భేషజా'లేవీ కనబడవు. ప్రాణుల్లోని మూల జీవపదార్థం డీఎన్‌ఏ. ఇక్కడ ముఖ్యవిషయం ఏమిటంటే ప్రాణి బతికున్నన్నాళ్ళూ జీవకణాలలో ఉండే డీఎన్‌ఏ తన మనుగడను కొనసాగించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తూ ఉంటుంది. సంతానోత్పత్తి జరిగినప్పుడల్లా అది కొత్త శరీరంలోకి ప్రవేశిస్తుంది. ప్రకృతికి సంబంధించినంత వరకూ ఆ పదార్థం తల్లీ పిల్లల్లో దేని శరీరంలో ఉన్నా ఫరవాలేదు. పైగా ఒక ప్రాణి శరీరం యాంత్రికంగా కొన్ని సంవత్సరాలకు మించి "నడవదు". దాన్ని రిపేరు చేసుకుంటూ, ఎల్లకాలం నడపడంకన్నా దాని స్థానంలో అదే జన్యుపదార్థం కలిగిన మరొక ప్రాణిని పెంచి పెద్దచెయ్యడం ప్రకృతికి తక్కువ "ఖర్చు"తో కూడిన వ్యవహారం. ఇందులో ప్రత్యక్షంగా సృష్టికర్త ఎవడూ లేకపోయినా డార్విన్‌ చెప్పిన జీవపరిణామం "గుడ్డి"గా ఇదే మార్గాన్ని అనుసరిస్తుంది. ఏ "ఉద్దేశమూ" లేకుండా జీవపరిణామం వీలున్నంత సులువుగా ముందుకు సాగాలంటే ప్రాణులు కొంతకాలానికి చచ్చిపోవడమూ, వాటి స్థానంలో వాటి జన్యులక్షణాలను కొనసాగించగలిగిన కొత్తవి పుట్టుకురావడమే "తేలిక". దీన్నర్థం చేసుకుంటే ప్రకృతిలో ముసలితనమూ, చావూ ఎందుకు ఉన్నాయో తెలుస్తుంది. నాశనం కాకుండా ఎల్లకాలమూ నిలిచేది ఆత్మకాదు; మన డీఎన్‌ఏ. చావును ప్రకృతి 'ఎంపిక' చేసిందంటే అందుకు ముఖ్యమైన కారణం సంతానోత్పత్తిలో జన్యువైవిధ్యం సాధ్యమవుతుందనే. ఏ ప్రాణి ఐనా తన శరీరలక్షణాలను ప్రతికూల వాతావరణానికి తగినట్టుగా మార్చుకోలేదు గనక అటువంటి మార్పు దాని సంతానంలో తప్ప జరగడానికి లేదు. జీవపరిణామపు పోటీలో విజయం సాధించాలంటే 'పాత' జీవాలు చావడం, కొద్దిపాటి మార్పులతో కొత్త ప్రాణులు పుడుతూ ఉండడం తప్ప గత్యంతరం లేదు. ఇది ప్రయత్నపూర్వకంగా కాకపోయినా 'అంతిమవిజయం' పొందిన ఏర్పాటు కనక చావు అనేది డీఎన్ఏ వైవిధ్యానికీ, అది రకరకాల పరిస్థితుల్లో కొనసాగడానికీ దోహదపడింది. ఏ తరానికాతరం చచ్చిపోయి, కొత్త తరాలు పుట్టుకురావడమే ప్రాణుల 'సహజ' లక్షణంగా మిగిలిందనుకోవాలి.

మన వయస్సు పెరుగుతున్నకొద్దీ మతిమరుపూ, ఆలోచనావేగం మందగించడం వగైరాలు   మొదలౌతాయి. వీటిలో కొన్నిటికి కారణం  మామూలుగా వచ్చే రోగాలూ, ఒత్తిడులూ, పరిసరాల్లో కలిగే
మార్పులూ ఇలా మొత్తంమీద అనేకరకాల కారణాలు ముసలితనానికి దారితీస్తాయి. ఇవేకాక  యాదృచ్ఛికంగా జన్యువుల్లో కలిగే వినాశం చిన్న చిన్న తప్పులుగా మొదలై కొంతకాలానికి శరీరాన్నిపెద్దగా ప్రభావితం చేసే స్థితికి చేరుకుంటుంది. ఈ రోజుల్లో మనిషి సగటు ఆయుర్దాయం పెరిగిపోతోంది. దేవతల్లాగా ఎల్లకాలం యవ్వనులుగా బతకలేకపోయినా బతికిన్నన్నాళ్ళూ ఆరోగ్యంగా
ఉండాలనుకోవడంలో తప్పులేదు. ముసలితనం మనని ఎలా శిథిలం చేస్తుందో తెలుసుకుంటే  ఆరోగ్యానికి కీలకం తెలుసుకోవచ్చు. చాలామందికి ముసలితనంలో సమస్య శారీరక పటుత్వం తగ్గి,
రోగాలూ రొష్టుల పాలవడమే కాదు. మెదడుకు సంబంధించిన రుగ్మతలుకూడా కొన్ని కలగవచ్చు. వీటిలో ముఖ్యమైనవి జ్ఞాపకశక్తి క్రమంగా తగ్గిపోవడం, నరాల డీజెనరేటివ్‌ హీనసత్వ లక్షణాలవల్ల సంక్రమించే అల్జ్‌హైమర్స్‌ వ్యాధి, ప్రేరక నాడీకణాల మోటర్‌ న్యూరాన్‌ జబ్బులు, పార్కిన్సన్‌ వ్యాధి వగైరాలు. వయసు పైబడినప్పటికీ పూటగడవడానికో, ఇతర కారణాలవల్లనో వీరిలో కొందరైనా తమకూ సమాజానికీ పనికొచ్చే కొన్ని వృత్తులనూ, పనులనూ కొనసాగించక తప్పదు. అలాంటప్పుడు వీరిలో అనివార్యంగా కలిగే రుగ్మతలూ, అవసరమయే ప్రత్యేక సౌకర్యాలూ సమాజంపై ఎటువంటి ప్రభావం కలిగిస్తాయి? వణుకుతున్న అవయవాలతో, మందగిస్తున్న చూపుతో ఎంతమంది అప్లికేషన్లో, మరో దరఖాస్తో చదివి, నింపి, చేత పట్టుకుని క్యూలలో నిలబడాలి? వీరిని సమాజం ఎంతవరకూ భరించి, ఆదరించి, పోషించగలుగుతుంది? వయసుమళ్ళినవారికి ఆశ్రమాలూ, ఇతర సదుపాయాలూ ఏర్పాటు చేసి నిర్వహించడం ఇప్పటికే ఒక పెద్ద పరిశ్రమగా రూపొందుతోంది. వీరి హక్కులనూ, అధికారాలనూ పరిరక్షించి, న్యాయ, సామాజికపరంగా కాపాడటానికి ఎన్నో సంస్థలు ఏర్పడ్డాయి, ఏర్పడుతున్నాయి. కృషి చేస్తున్నాయి. వీటిని గురించి ప్రతివారూ పట్టించుకోక తప్పదు. ఎందుకంటే నేటి యువతీ యువకులే రేపటి వృద్ధులు!

ముసలితనం లోబోసినవ్వు తప్పదా?
ముసలితనం అనగానే మనకు బోసినవ్వు గుర్తుకొస్తుంది. పెద్దవయసులో పళ్లూడటం అనివార్యమా? కానేకాదంటోంది దంతవైద్యం! చక్కటి దంత సంరక్షణ జాగ్రత్తలు తీసుకునే వారికి.. ఎన్నేళ్లకైనా దంతాలు వూడిపోయే పరిస్థితి ఉండదు. నిజానికి దంతాలు వూడిపోవటమన్నది ఒక రకంగా చిగుళ్లవ్యాధిలో భాగం. చిగురు దెబ్బతిని, పంటిచుట్టూతా ఉండే ఎముక కూడా దెబ్బతిన్నప్పుడు.. పళ్లు కదులుతాయి, ఊడతాయి. కాబట్టి ఒకరకంగా చిగుళ్ల వ్యాధులు దరిజేరకుండా చూసుకుంటే చాలు.. మన పళ్లు జీవితాంతం సురక్షితం!

-- Dr.Kodavatiganti Rohini prasad(డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్‌ )
 • ========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-