Tuesday, December 25, 2012

What is Entaming and Grooming?,ఎంబామింగ్ మరియు గ్రూమింగ్ అంటే ఏమిటి ?

 •  

 •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

అందము గా లేని వారు అందమైన అలంకరణలు చేసుకోవడం, ఆకర్షణీయం గా కనిపించడం కోసము చేసే పక్రియలనే ఎంటామింగ్ మరియు గ్రూమింగ్ అంటారు . ఇదే పక్రయని  చనిపోయినవారి విషములో కడసారి చూపుకోసము మృతదేహానికి సజీవముగా కనిపించేందుకు చేసే మెరుగులు. ఎఫైర్ లలో పడ్డవారు , లేదా పెట్టుకుంటున్న వారు , తమ స్వంత  వేష  ధారణా , వ్యక్తిగత గ్రూమింగ్ అంటే పోషణా , అందం, ఆకర్షణా , ఇట్లాంటి విషయాల మీద , మునుపెన్నడూ లేని శ్రద్ధ  చూపుతారు. లేటెస్టు హెయిర్ స్టయిల్ లు చేయించుకోవడం, జిమ్  కు వెళ్ళడం ,మంచి ఖరీదైన బట్టలు వేసుకోవడానికి ఉత్సాహం చూపడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు.

వైద్యరంగము లో

ఎంబామింగ్ అంటే? కొన్ని సందర్భాల్లో మృతదేహాన్ని చాలా రోజులపాటు అంత్యక్రియలు నిర్వహించకుండా ఉంచాల్సి ఉంటుంది. అప్పుడు మృతదేహం కుళ్లిపోకుండా చూడాలి. శరీరం కొంతకాలంపాటు దెబ్బతినకుండా ఉండేందుకు ఎంబామింగ్ నిర్వహిస్తారు. ఈ ప్రక్రియలో కొన్ని రసాయనాలను ధమనుల ద్వారా శరీరంలోకి ఎక్కిస్తారు. ఈ ద్రావకాలనే 'ఎంబామింగ్ ఫ్లూయిడ్స్' అని పిలుస్తారు. ఫార్మాల్డిహైడ్, మెథనాల్, ఇథనాల్‌తోపాటు మరికొన్ని రకాల రసాయనాలను ఈ ప్రక్రియలో వాడతారు. అమెరికాలో ఏటా 2 కోట్ల టన్నుల ఎంబామింగ్ ద్రావకాలు వినియోగిస్తారని అంచనా.  అమెరికాలో ఇప్పుడు ఎంబామింగ్ పద్ధతిలో ఆత్మీయుల మృతదేహాలను వెనువెంటనే కుళ్లిపోకుండా చేయడంలో ముందంజవేశారు. అక్కడ ఏటా 2కోట్ల టన్నుల ఎంబామింగ్ ప్లూయిడ్స్, కెమికల్స్ అమ్ముడవుతున్నాయంటే, ఈ ప్రకియ అవసరం ఎంతగా గుర్తించారో అర్థంచేసుకోవచ్చు. ఎంబామింగ్ ప్లూయిడ్స్ ని ఎక్కించడం వల్ల బాక్టీరియా వంటి సూక్ష్మజీవులు చచ్చిపోతాయి. అంటే, ఈ ఫ్లూయిడ్ ఏరకంగానూ బాక్టీరియాకు న్యూట్రియంట్ ఫ్లూయిడ్స్ గా పనిచేయవు.

గ్రూమింగ్ అంటే...
తమ ఆత్మీయులు మరణించినప్పుడు వారి మృతదేహాన్ని కడసారి చూసిన రూపం చిరకాలం గుర్తుండిపోతుంది. ఆ 'తుది జ్ఞాపకం' ఇబ్బందికరంగా కాకుండా, ఎప్పట్లా ఆత్మీయంగానే  ఉండాలని చాలామంది కోరుకుంటారు. ఈ కోరికను బాడీ గ్రూమింగ్ తీరుస్తోంది. ఇది కూడా ఎంబామింగ్‌లో భాగమే. ఈ ప్రక్రియలో మరణించిన వ్యక్తి అంతకుముందు మంచి ఆరోగ్యంతో ఉన్నప్పుడు తీసిన ఫొటోను ఉపయోగిస్తారు. జననం ఎంత సహజమో, మరణం అంతే సహజం. కానీ ఈ రెంటినీ ఒకే మోస్తరుగా జీర్ణించుకోలేకపోవడమే సామాన్యుల నైజం. ఇంతకాలం తమమధ్యనే ఉంటూ తమకు వెన్నుదండుగా ఉండే ప్రియతమ వ్యక్తులు ఉన్నట్టుండి హఠాత్తుగా కనుమరుగైనప్పుడు వారి రూపాన్ని మనసులోనేకాకుండా, కళ్లెదుట కూడా ప్రశాంత
వదనంతో కనిపించాలని కోరుకోవడం తప్పేమీకాదు. ఈ తరహా మనోభావాలకు రూపకల్పం ఇస్తున్న `ఎంబామింగ్' ప్రక్రియ నిజంగానే ఓ ఊరట అనే చెప్పాలి

ఎంబామింగ్ నిపుణుడు ఈ ఫొటో ఆధారంగా మృతదేహానికి సాధ్యమైనంతగా మునుపటి రూపాన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తారు. బుగ్గలు బాగా లోపలికి వెళ్తే.. మైనపు పూతపూసి ఉబ్బినట్లు చేస్తారు. చాలారోజులపాటు అస్వస్థతకు గురైనవారి కనుగుడ్లు పీక్కుపోయి ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో ప్లాస్టిక్ కనుగుడ్లను సహజంగా అమర్చుతారు. శరీరంపై పడిన  ముడతలను తొలగిస్తారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత... మృతదేహానికి 'సజీవ' రూపం వస్తుంది. దీనినే 'ఫేస్ లిఫ్టింగ్' అని కూడా పిలుస్తారు. అమెరికాలాంటి దేశాల్లో మరణించిన భారతీయుల మృతదేహాలను స్వస్థలాలకు తీసుకు వచ్చేందుకు చాలా రోజులు పడుతుంది. ఈలోపు శరీరాలు కుళ్లిపోకుండా ఉండటంతోపాటు, ఆత్మీయుల బాధను కాసింతైనా తగ్గించేందుకు అమెరికా అధికారులు ఎంబామింగ్, గ్రూమింగ్ చేసిన తర్వాతే మృత దేహాలను తరలిస్తుంటారు.

అమెరికాలాంటి దేశాల్లో దీనికి ప్రత్యేకమైన కోర్సు ఉంది. మన దేశంలో అతి కొద్ది మంది ప్రముఖుల విషయంలో మాత్రమే ఇవి చేస్తున్నారు. మరణానంతరం కూడా సత్యసాయి భక్తులకు  ప్రశాంత చిత్తంతో దర్శనమిస్తున్నారంటే, అందుకు ఈ ప్రక్రియలే కారణం!

 • =============================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Tears flow in coryza why?-జలువు చేస్తే కన్నీళ్ళెందుకు కారతాయి?

 •  
 •  
 •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
 ప్ర : జలువు చేస్తే కన్నీళ్ళెందుకు కారతాయి?

జ : కంటిలో తేమను కాపాడేందుకు కంటిలో నీరు ఎల్లప్పుడూ ఉతపత్తి అవుతూ ఉంటాయి. ఆ నీరు అధికము గా ఉత్పత్తి అయితే ''లాక్రిమల్ డక్ట్ ''ద్వారా ముక్కులోనికి చేరుతుంది .అక్కడ తేమలో కలుస్తుంది . జలుబు చేసినప్పుడు ముక్కులోని సూక్ష్మరంధ్రాలు మూసుకుపోయి ఆ కన్నీరును ముక్కులోనికి రానీయవు . ఫలితము గా అదనము గా ఉప్తత్తి అయిన కన్నీరు కంటినుండి బయటకి వస్తుంది ... అదే కంటివెంట నీరు కారడము .
 • ========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Wednesday, December 19, 2012

Do have not camel thirsy?-ఒంటెలకు దాహమేయదా?

 •  
 • ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: ఒంటెలు ఎడారులలో చాలా కాలం నీరు తాగకుండా ఎలా ఉండగలుగుతాయి?

జవాబు: ఒంటెలు తమ వీపుపై ఉండే మూపురాల్లో నీటిని నిల్వ చేసుకుంటాయని చాలా మంది భావిస్తుంటారు. కానీ అది తప్పు. వాటి మూపురాల్లో ఉండేది కొవ్వు పదార్థమే. మండుటెండల్లో ఏమాత్రం తడిలేని ఎడారుల్లో కూడా ఒంటెలు అలసట లేకుండా ఎక్కువ దూరం ప్రయాణించగలవు. అందుకు తగిన శక్తిసామర్థ్యాలను అవి తమ మూపురాల్లో ఉండే కొవ్వు ద్వారానే పొందుతాయి. ఎక్కువ దూరం ప్రయాణించే ఒంటెల మూపురాలలో కొవ్వు కొంత కరిగిపోయి వదులవడానికి కారణం ఇదే. మొత్తం మీద ఒంటెలు ఎడారుల్లో నీరు తాగకుండా రెండు మూడు వారాల వరకు ప్రయాణించగలవు. వాటి ముక్కుల్లో ఉండే సన్నని వెంట్రుకల సాయంతో అవి గాలిలో ఉండే తేమను గ్రహిస్తూ, శరీరం నుంచి చెమట రూపంలో కోల్పోయే నీటిని భర్తీ చేసుకోగలవు. అలా ఒంటెలు తమ శరీర ఉష్ణోగ్రతను పది డిగ్రీల సెంటిగ్రేడు వరకు తగ్గించుకోగలవు. నీరు లభించినప్పుడు ఒంటెలు కేవలం కొన్ని నిముషాల్లోనే దాదాపు 100 లీటర్లు తాగగలవు. ఒంటెల రక్తంలోని ఎర్ర రక్తకణాలు గోళాకారంలో ఉండడం వల్ల ఎంత నీరు తాగినా ఆ నీరు విచ్ఛిన్నమయే ప్రమాదం లేదు. అందువల్ల వాటికి ఏ హానీ జరగదు.

- ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌

 • ====================
 visit My website > Dr.Seshagirirao - MBBS.-

Grow more if remove gray or white hair?-తెల్ల వెంట్రుకల్ని తీసేస్తే మరింత ఎక్కువగా వస్తాయా?

 •  
 •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: తెల్ల వెంట్రుకల్ని తీసేస్తే మరింత ఎక్కువగా వస్తాయంటారు. నిజమేనా?

జవాబు: ఈ అభిప్రాయంలో నిజం లేదనే చెప్పుకోవాలి. తెల్ల వెంట్రుకలకు, నల్ల వెంట్రుకలకు ఉన్న తేడా కేవలం వాటిలో ఉన్న మెలనిన్‌ అనే వర్ణరేణువుల శాతంలో తేడానే. తెల్ల వెంట్రుకలలో మెలనిన్‌ రేణువులు దాదాపు ఉండవనే చెప్పవచ్చు. గోధుమ రంగు వెంట్రుకల్లో ఇవి ఓ మోస్తరుగా ఉంటాయి. వెంట్రుకలు మన చర్మం కింద ఉండే రోమ కుదుళ్ల నుంచి మొలుస్తాయి. ఈ కుదుళ్లు ఉపరితల చర్మం (epidermis) కింద ఉన్న అంతశ్చర్మం (dermis)లో ఉంటాయి. అక్కడే మెలనిన్‌ రేణువులు ఉత్పత్తి అవుతూ వెంట్రుక అనే ప్రొటీన్‌ గొట్టంలో దట్టంగా పేరుకుంటూ వస్తాయి. తెల్లని వెంట్రుకలు వచ్చే కుదుళ్ల దగ్గర మెలనిన్‌ రేణువుల ఉత్పత్తి లేకపోవడం కానీ లేదా వృద్ధాప్యం వల్ల మందగించడం కానీ జరుగుతుంది. ఆ తెల్ల వెంట్రుకల్ని పదే పదే తీసేసినప్పుడు అవి మాత్రమే పెరిగేలా ఆ కుదుళ్లు ఉత్తేజం పొంది, తెల్ల వెంట్రుకల ఉత్పత్తి జోరుగా సాగవచ్చునన్నది ఓ సమాధానం. కానీ దీనికి ఉన్న సంభావ్యత తక్కువ.

-ప్రొ||ఎ. రామచంద్రయ్య, -నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక.
 • ====================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Sand seen at the banks of rivers and seas Why?-ఇసుక నదీగర్భాలలోను, సముద్ర తీరాలలోనే దొరుకుతుందేమి?

 •  

 •  
 • ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !... 

ప్రశ్న: ఇసుక నదీగర్భాలలోను, సముద్ర తీరాలలోనే ఎందుకు దొరుకుతుంది? వేరే ప్రాంతాల్లో ఎందుకు లభ్యం కాదు?

జవాబు: ప్రతి ఇసుక రేణువు ముక్కలు చెక్కలైన పెద్ద బండరాళ్ల అవశేషంగా భావించాలి. నదీ ప్రవాహంలోను, సముద్రపు అలల వల్లను రాళ్లు పగిలిపోయి మొదటగా గుండ్రాళ్లుగా మారతాయి. అవి మరింతగా పగిలి చిన్న రాళ్లవుతాయి. ఇవి నీటి ఒరవడిలో కొట్టుకుపోతూ క్రమేణా అరిగిపోతూ ఉంటాయి. ఇలా ఇక ఏమాత్రం పగలలేని స్థితికి చేరుకున్నాయంటే ఇసుక రేణువులే అవుతాయి. ఇలా రాళ్లు నిరంతరం నీటి కదలికలకు, రాపిడి గురవడం ఎక్కువగా నదులు, సముద్రాల దగ్గరే జరుగుతుంది కాబట్టి ఆయా తీరాల్లోనే ఇసుక ఎక్కువగా ఏర్పడుతుంది. అయితే అధిక ఉష్ణోగ్రతలు ఏర్పడే ప్రదేశాల్లో విపరీతంగా వీచే గాలుల (hot wind blows) వల్ల కూడా బండరాళ్లు నిరంతరం ఒరిపిడికి గురవుతూ ఉంటాయి. ఏళ్ల తరబడి సాగే ఈ ప్రక్రియ ఎడారుల్లో ఉంటుంది. అందుకే అక్కడ కూడా ఎటు చూసినా ఇసుకే కనిపిస్తుంది.

-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక

 • ======================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Saturday, December 15, 2012

What are the Eight Tourist places in India?-భారతదేశము లో అష్ట యాత్రాస్థలాలు ఏవి?

 •  
 • ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
 ప్ర : భారతదేశము లో అష్ట యాత్రాస్థలాలు ఏవో తెలుసా?

జ : ఇండియాలో చూడవలసిన యాత్రాస్థలాలు ఎన్నో ఉన్నా పురాణాలలో ఎనిమిది స్థలాలను పవిత్రముగాను , దర్శనీయము గాను, పుణ్యప్రదమైనవిగాను చెప్పబడ్డవి . అవి ->...
1.హరిద్వారము,
2. ద్వారక ,
3. మధుర ,
4. బృందావనము ,
5. గోకులం ,
6. పూరీ జగన్నాదక్షేత్రము ,
7. తిరుపతి ,
8. ఉడిపి .
 • ====================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Tuesday, December 11, 2012

Sound is morelouder in empty room why?-ఖాళీ గదిలో చప్పుడు ఎక్కువేల?

 • ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
ప్రశ్న: ఒక వస్తువు కింద పడినప్పుడు మామూలు గదిలో కన్నా, ఖాళీ గదిలో ఎక్కువ శబ్దం వస్తుంది. ఎందుకని?

జవాబు: శబ్దం గాలిలో తరంగాల రూపంలో వ్యాపిస్తుంది. గాలిలో పీడనం, ఉష్ణోగ్రత లాంటి ఎన్నో అంశాలపై శబ్దాల తీవ్రత, వేగం ఆధారపడి ఉంటాయి. గాలిలో అణువులు కదలడం వల్ల ఏర్పడే పీడన సాంద్రతలు (dense zones), విరళీకరణలు (rarifications) క్రమపద్ధతిలో తరంగ రూపాల్లో శబ్దం ప్రయాణిస్తుంది. ఖాళీ గదిలో ఏర్పడే శబ్ద తరంగాలు అన్ని వైపులకు విస్తరించి గోడలు, పైకప్పు లాంటి అవరోధాలను తాకి తిరిగి పరావర్తనం చెంది ప్రతిధ్వనిగా గదిలో పదే పదే తరంగాలను ఏర్పరుస్తాయి. అందువల్ల శబ్దం స్పష్టంగా, తీవ్రంగా వినిపిస్తుంది. అదే మంచాలు, కుర్చీలు లాంటి సామగ్రితో నిండి ఉంటే అవి గదిలో ఏర్పడిన శబ్ద తరంగాలను శోషించుకుంటాయి. కాబట్టి ప్రతిధ్వని రాదు. పైగా సామగ్రి ఉపరితలాలు వంకరటింకరగా ఉండడం వల్ల వాటిని తాకి పరావర్తనం చెందే శబ్ద తరంగాలు చెల్లాచెదరైపోతాయి. అందువల్ల శబ్దం అస్పస్టంగా ఉంటుంది.

-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌,-వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక

 • =======================

 visit My website > Dr.Seshagirirao - MBBS.- 

Monday, December 10, 2012

Where from those worms?-ఆ పురుగులు ఎక్కడివి?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: చిక్కుడు లాంటి కొన్ని కూరగాయలను వలిచినప్పుడు లోపల పొడవైన ఆకుపచ్చ పురుగులు కనిపిస్తాయి. అవి అక్కడకి ఎలా వెళ్లాయి?

జవాబు: పురుగులు కనిపించిన కాయగూరల పైభాగాన్ని నిశితంగా పరిశీలిస్తే కనీసం ఆవగింజంత రంధ్రాలైనా కనిపిస్తాయి.అలా ఏమాత్రం రంధ్రాల్లేని కాయలు, పండ్లలో పురుగులు ఉండవనే చెప్పవచ్చు. ఈ పురుగులు బయటి నుంచి లోపలికి ఈమధ్య వెళ్లినవి కావు. తల్లి పురుగు తన గుడ్లను ఆ కాయ మెత్తని ప్రదేశాల్లో, దాగుడు (hidden) ప్రాంతాల్లో పెడుతుంది. ఆ గుడ్లలోంచి వచ్చే పిల్లడింభకం(larva) మొదట్లో కొన్ని మిల్లీమీటర్ల పరిమాణంలోనే ఉంటుంది. అది తన వాడి పెదవులు(madibles)తో ఆ కాయకు రంధ్రం చేసి లోపలికి వెళ్లి అక్కడ సుష్టుగా భోంచేస్తూ శరీరాన్ని పెంచుకుంటుంది. ఆ చిన్న దారిలోంచి తన శ్వాసకు కావలసిన గాలి అందుతుంది. అక్కడే ప్యూపా దశ దాటుకుని కీటకంగా మారి బయటకి పోతుంది.

 • - ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక

 • ======================
 visit My website > Dr.Seshagirirao - MBBS.-

How can we use Lemons as battary?-నిమ్మకాయలను విద్యుత్‌ బ్యాటరీలుగా ఎలా సాధ్యం?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: నిమ్మకాయలను విద్యుత్‌ బ్యాటరీలుగా మార్చవచ్చంటారు. అది ఎలా సాధ్యం?

జవాబు: మామూలు బ్యాటరీ ఎలా తయారవుతుందో పాఠాల్లో చదువుకుని ఉంటారు. జింకు, రాగి లాంటి వేర్వేరు సన్నని లోహపు పలకలను (ఎలక్ట్రోడ్లు) సజల సల్ఫ్యూరిక్‌ ఆమ్లము (ఎలక్ట్రోలైట్‌) ఉండే పాత్రలో దూరదూరంగా ఉంచి, వాటి మధ్య చిన్న విద్యుత్‌ బల్బును రాగితీగతో అనుసంధానిస్తారు. దాన్నే విద్యుత్‌ ఘటము (electric cell) అంటారు. కొన్ని విద్యుత్‌ ఘటాల అనుసంధానమే బ్యాటరీ. ఇక్కడి సూత్రం రెండు వేర్వేరు లోహాల మధ్య విద్యుత్‌ శక్తి ప్రవహించడమే.
ఒక నిమ్మకాయలో ఒక ఇనుము లేదా జింకు మేకును, కొంత దూరంలో ఒక రాగి నాణాన్ని గుచ్చి వాటి మధ్య రాగి తీగ ద్వారా ఒక చిన్న బల్బును పెట్టి నిమ్మకాయను గట్టిగా పిండితే బల్బు వెలుగుతుంది. ఇక్కడ నిమ్మరసం ఎలక్ట్రోలైట్‌గా పనిచేస్తుంది. కానీ నిమ్మకాయ తగినంత విద్యుత్‌ ప్రవాహాన్ని కలుగజేయదు. కాబట్టి బల్బు వెలిగినా ప్రకాశవంతంగా ఉండదు. అదే ఐదో, ఆరో నిమ్మకాయలను రాగి తీగ ద్వారా కలిపితే బల్బు ప్రకాశవంతంగా వెలుగుతుంది. ఆ ఏర్పాటు ఎలక్ట్రిక్‌ బ్యాటరీలాగా పనిచేస్తుంది.

 • -ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌

 • ===================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Light rays travel very speed how?-కాంతి వేగంగా ప్రయాణించడానికి కారణం ఏమిటి?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: కాంతి వేగం సెకనుకు సుమారు 3 లక్షల కిలోమీటర్లు అని విన్నాను. కాంతి అంత వేగంగా ప్రయాణించడానికి కారణం ఏమిటి?

జవాబు: శక్తి ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి పలు మార్గాల్లో వెళుతుంది. శక్తి వహనం(conduction), శక్తి సంవహనం (convection), శక్తి వికిరణం (radiation) అనే పద్ధతుల్లో సాధారణంగా శక్తి అధిక ప్రాంతం నుంచి అల్ప ప్రాంతానికి స్వతఃసిద్ధం (spontaneous)గా ప్రవహించడానికి ప్రయత్నిస్తుంది. ఇందులో మొదటి రెండు పద్ధతుల్లో ప్రయాణించడానికి దానికి ఏదైనా మాధ్యమం (medium) అవసరం. పదార్థాలలోని ఎలక్ట్రాన్లు మధ్యవర్తులుగా శక్తి వహన ప్రక్రియలో ప్రయాణిస్తుంది. సంవహనంలో అణువులు, పరమాణువుల చిందరవందర (random)కదలికల ద్వారా శక్తిని బదలాయించుకుంటూ ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి శక్తిని చేరవేస్తాయి. కానీ వికిరణ ప్రక్రియలో శక్తి ప్రసారానికి మాధ్యమం అవసరం లేదు. కేవలం తనలో ఉన్న విద్యుత్‌ క్షేత్రాన్ని, అయస్కాంత క్షేత్రాన్ని ఒక క్రమపద్ధతిలో కాలానుగనుణంగా మార్చుకుంటూ శూన్యంలో సైతం వెళ్లగలదు. శూన్యంలో కూడా తిర్యక్‌ తరంగాల (transverse waves) రూపంలో విద్యుదయస్కాంత క్షేత్రాల్ని కొన్ని కోట్ల సార్లు మార్చుకుంటూ వెళ్లే శక్తి రూపాన్నే మనం కాంతి అంటాము. కాంతి ప్రయాణానికి పదార్థం అవసరం లేకపోవడం వల్ల అడ్డూఅదుపూ లేకుండా ప్రయాణించే కాంతి శూన్యంలో సెకనుకు 3 లక్షల పైచిలుకు వేగాన్ని సంతరించుకుంటుంది. ఇంత వేగంగా ప్రయాణించేది ఈ విశ్వంలో ఇంకేదీ లేదు.

- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌;  -రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
 • =====================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Tears without weaping?-ఏడవకుండా కన్నీళ్ళు వస్తాయా?

 • ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !... 

Q : ఏడవకుండా కన్నీళ్ళు వస్తాయా?

A : కంటిలోని పొరలను శుభ్రం చేయడానికి, వాటిని (lubricate చేసి) తడిగా ఉంచడానికి స్రవించే ద్రవాన్ని అశ్రువులు, కంటినీరు లేదా కన్నీరు అంటారు. ఇలా కన్నీరు స్రవించే ప్రక్రియను వైద్యశాస్త్ర పరిభాషలో lacrimation అంటారు. సాధారణ పదజాలంగా "ఏడవటం" అనే చర్యను ఇది సూచిస్తుంది. దుఃఖం, సంతోషం వంటి బలమైన భావోద్వేగాలు కలిగినపుడు ఇది జరుగుతుంది. చాలా జంతువులలో lacrimation కు అవుసరమైన వ్యవస్థ (శరీర భాగాలు, గ్రంధులు) ఉన్నాయి. అయితే భావోద్వేగాల కారణంగా ఇలా కన్నీరు కార్చే క్షీరదం జాతి జీవి... మానవుడే అని భావిస్తున్నారు.

కనురెప్పలు  కొట్టకుండా టెలివిజన్‌  లేదా కంఫ్యూటర్  తెరవైపు చూస్తే కన్నీళ్ళు వస్తాయి. ఇవి ఏడుపుకు సంబంధించి నవి కావు . కనుగుడ్డు తేమకోసము కంటి నీరు ఉత్పత్తి అవుతుంది.  కనురెప్పలు వేయడం ద్వారా ఆనీరు ఒక పలుచని పొరలాగా కనుగుడ్డు పైన విస్తరిస్తుంది . సాధారనము గా నిమిషానికి 10-12 సార్లు మూసి తెరిచే కనురెప్పలు దీక్షగా చూస్తున్నప్పుడు 3-4  సార్లే కొట్టుకోవడము వల్ల కనుగుడ్డు మీద తేమ విస్తరించక కన్నీళ్లుగా కిందికి కారుతాయి.
 • ========================
 visit My website > Dr.Seshagirirao - MBBS.-

Who are apsarasas?-అప్సరసలు ఎవరు

 • ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
స్వర్గంలో దేవతలను నాట్యగానాలతో అలరించేందుకు నియనించబడీనవారు అప్సరసలు. వీరు సప్త గణాలలో ఒక వర్గము. ఆ సప్తగణాలు: 1. ఋషులు. 2. గంధర్వులు. 3. నాగులు. 4. అప్సరసలు. 5. యక్షులు. 6. రాక్షసులు. 7. దేవతలు. స్వర్గం: ఇది ఎక్కడో ఆకాశంలో ఉందట, దేవుని నమ్మి జీవితమంతా మతాన్ని పాటిస్తూ పాపకార్యాలు చెయ్యకుండా ఉండి, చనిపోయినవారికి మాత్రమే స్వర్గం దొరుకుతుంది. స్వర్గంలో ఆకలి, దప్పులు, ముసలితనము, మరణమూ ఉండవు. వావి, వరుస లాంటి బంధాలు ఉండవు, నిత్య యౌవనంతో అమృత తాగుతూ, రంభ, ఊర్వశి,మేనకా లాంటి, అప్సరసల పొందుతో హాయిగా గడపవచ్చు.

మొత్తము అప్సరసలు ఎంతమందో నాకు తెలియదు గాని పురాణాలలో అందము గా ఉన్న స్వర్గలోక  స్త్రీలను ఇంద్రుడు అప్సరసలు గా బావించే వాడని అంటారు. ఇక్కడ కొంతమంది పేర్లు వ్రాయడము జరిగినది.
 1.     రంభ 
 2.     ఊర్వశి
 3.     మేనక
 4.     తిలోత్తమ
 5.     ఘృతాచి
 6.     సహజన్య
 7.     నిమ్లోచ
 8.     వామన
 9.     మండోదరి
 10.     సుభోగ
 11.     విశ్వాచి
 12.     విపులానన
 13.     భద్రాంగి
 14.     చిత్రసేన
 15.     ప్రమోచన
 16.     ప్రమ్లోద
 17.     మనోహరి
 18.     మనోమోహిని
 19.     రామ
 20.     చిత్రమధ్య
 21.     శుభానన
 22.     సుకేశి
 23.     నీలకుంతల
 24.     మన్మదోద్దపిని
 25.     అలంబుష
 26.     మిశ్రకేశి
 27.     ముంజికస్థల
 28.     క్రతుస్థల
 29.     వలాంగి
 30.     పరావతి
 31.     మహారూప
 32.     శశిరేఖ
తప్పులుంటే సరిచేయండి -- email. . seshagirirao_vandana@yahoo.com

 • మూలము : వికీపెడియా తెలుగు .
 • ======================
 visit My website > Dr.Seshagirirao - MBBS.-

Sunday, December 09, 2012

Why do stars sparkling?-ఆకాశంలోని నక్షత్రాలు మిలమిలా మెరుస్తుంటాయెందుకు?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: ఆకాశంలోని నక్షత్రాలు మిలమిలా మెరుస్తుంటాయి. ఎందుకు?

జవాబు: రాత్రిపూట నక్షత్రాలు స్థిరముగా కాక మినుకు మినుకు మంటూ మెరుస్తూఉంటాయి. చంద్రుడు స్పస్టము గా కనిపిస్తున్నప్పుడు నక్షత్రాలు మాత్రము మెరవడానికి కారణము అవి చంద్రుడుకన్నా దూరములో ఉండడమే .     'ట్వింకిల్‌ ట్వింకిల్‌ లిటిల్‌ స్టార్‌...' అని పాడినట్టే ఆకాశంలో నక్షత్రాల కేసి చూస్తే అవి మినుకు మినుకుమని మెరుస్తుంటాయి. అయితే భూమి నుంచి చూసినప్పుడే వాటి మిలమిలలు కనిపిస్తాయి. అదే భూవాతావరణాన్ని దాటి అంతరిక్షం నుంచో లేక వాతావరణం లేని చంద్రుడి మీద నుంచో చూస్తే నక్షత్రాలు మెరవవు. అంటే నక్షత్రాల మెరుపులకు కారణం వాతావరణంలో జరిగే మార్పులే.
ఎంతో దూరంలో ఉన్న నక్షత్రాల నుంచి వెలువడే కాంతి కిరణాలు మన కంటిని చేరుకోవడం వల్లనే అవి మనకు కనిపిస్తున్నాయనేది తెలిసిందే. అయితే ఈలోగా అవి మన భూమి వాతావరణంలోని అనేక పొరలను దాటుకుని రావలసి ఉంటుంది. ఈ వాతావరణ పొరలు వివిధ ఉష్ణోగ్రతలు కలిగి ఉండడమే కాకుండా అల్లకల్లోలమైన కదలికలు కలిగి ఉంటాయి. ఆ పొరల గుండా ప్రయాణించే కిరణాలు వికృతీకరణం (distortion) చెందడంతో మన కంటికి మిలమిల లాడుతూ కనిపిస్తాయి.

- ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌
 • =====================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

What is induction stove?-ఇండక్షన్‌ స్టౌ అంటే ఏమిటి?

 • ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !... 

ప్రశ్న: ఇండక్షన్‌ స్టౌ అంటే ఏమిటి? అది ఎలా పనిచేస్తుంది?

జవాబు: విద్యుత్‌, అయస్కాంత తత్వాల గురించి పాఠాల్లో చదువుకుని ఉంటారు. ఏదైనా ఇనుప ముక్క చుట్టూ అమర్చిన తీగల్లోకి విద్యుత్‌ను ప్రవహింపజేస్తే ఆ ఇనుప ముక్క అయస్కాంత తత్వాన్ని సంతరించుకుంటుంది. ఇలా అయస్కాంత తత్వాన్ని పొందిన ఇనుప ముక్కపై మరో చోట రాగి తీగను చుట్టినట్లయితే అందులో విద్యుత్‌ క్షేత్రం ప్రేరేపితం అవుతుంది. మరోలా చెప్పాలంటే మారే విద్యుత్‌ ప్రవాహం అయస్కాంత క్షేత్రాన్ని, మారే అయస్కాంత క్షేత్రం విద్యుత్‌ క్షేత్రాన్ని ఏర్పరుస్తాయి. దీన్నే విద్యుదయస్కాంత ప్రేరణ (Electro magnetic Induction) అంటారు. ఈ సూత్రం ఆధారంగానే మన ఇళ్లలో ఫ్యాన్లు, పంటపొలాల్లో మోటార్లు పని చేస్తున్నాయి. ఇండక్షన్‌ స్టవ్‌ కూడా ఇదే సూత్రంపై పనిచేస్తుంది. స్టవ్‌ లోపల విద్యుత్‌ వలయం ఉన్న ఓ ఇనుప కోర్‌ (ఇనుప ప్లేట్ల సముదాయం) ఉంటుంది. విద్యుత్‌ ప్రవహించినప్పుడు ఆ కోర్‌ చుట్టూ అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది. స్టవ్‌ మీద పాత్ర పెట్టే ప్లాట్‌ఫారం మీద కూడా ఈ క్షేత్రం ఏర్పడుతుంది. ఇప్పుడు ఇనుప పాత్రను స్టౌ పై పెడితే అందులో విద్యుత్‌ ప్రవాహం ఏర్పడుతుంది. అయితే ఈ పాత్రకు నిరోధం (resistance) ఉండడం వల్ల అందులో విద్యుత్‌ ప్రవాహం ఉష్ణంగా మారుతుంది. అందువల్ల పాత్ర వేడెక్కి అందులోని పదార్థాలు ఉడుకుతాయి. ఈ స్టౌ మీద కేవలం స్టీలు లేదా ఇనుప పాత్రలనే ఉపయోగించాలి.

- ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; -రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక.
 • ======================
 visit My website > Dr.Seshagirirao - MBBS.-

Friday, December 07, 2012

What is Panchagavyala Treatment?-పంచగవ్యలు చికిత్స అంటే ఏమిటి ?

 • ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...ర్
 ప్ర : పంచగవ్యలు చికిత్స అంటే ఏమిటి ?

జ : ఆయుర్వే ఔషదులలో పంచగవ్యలను విరివిగా ఉపయోగిస్తారు . పంచ అనగా ఐదు (5)
1.పాలు ,
2.పెరుగు,
3.నెయ్యి ,
4.గోవు మూత్రము ,
5.గోవు  పేడ ,
భారతీయులు  గోవును  మాతృభావము తో " గోమాత" గా ఆరాధిస్తారు. గోవు నుండి వచ్చే ఈ 5 ను  ఆయుర్వేద గ్రంధాలు .. " చరక సంహిత " , " సుశ్రుత సంహిత " , "వాగ్బట సంహిత "  లలో కొన్ని చర్మ వ్యాధులు , బొల్లి , మూత్రవ్యాధులు , కీళ్ళవ్యాధులు , కడుపు మంట  వంటి పలురకాల వ్యాధుల నివారణకు పంచగవ్య  చికిత్స గా చెప్పబడి ఉంది. నవీన వైద్యులు , శాస్త్రజ్ఞులు దీనిని అంతగా నమ్మరు.
 • ==================
visit My website > Dr.Seshagirirao - MBBS.-