Monday, December 10, 2012

Who are apsarasas?-అప్సరసలు ఎవరు

  • ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...




స్వర్గంలో దేవతలను నాట్యగానాలతో అలరించేందుకు నియనించబడీనవారు అప్సరసలు. వీరు సప్త గణాలలో ఒక వర్గము. ఆ సప్తగణాలు: 1. ఋషులు. 2. గంధర్వులు. 3. నాగులు. 4. అప్సరసలు. 5. యక్షులు. 6. రాక్షసులు. 7. దేవతలు. స్వర్గం: ఇది ఎక్కడో ఆకాశంలో ఉందట, దేవుని నమ్మి జీవితమంతా మతాన్ని పాటిస్తూ పాపకార్యాలు చెయ్యకుండా ఉండి, చనిపోయినవారికి మాత్రమే స్వర్గం దొరుకుతుంది. స్వర్గంలో ఆకలి, దప్పులు, ముసలితనము, మరణమూ ఉండవు. వావి, వరుస లాంటి బంధాలు ఉండవు, నిత్య యౌవనంతో అమృత తాగుతూ, రంభ, ఊర్వశి,మేనకా లాంటి, అప్సరసల పొందుతో హాయిగా గడపవచ్చు.

మొత్తము అప్సరసలు ఎంతమందో నాకు తెలియదు గాని పురాణాలలో అందము గా ఉన్న స్వర్గలోక  స్త్రీలను ఇంద్రుడు అప్సరసలు గా బావించే వాడని అంటారు. ఇక్కడ కొంతమంది పేర్లు వ్రాయడము జరిగినది.
  1.     రంభ 
  2.     ఊర్వశి
  3.     మేనక
  4.     తిలోత్తమ
  5.     ఘృతాచి
  6.     సహజన్య
  7.     నిమ్లోచ
  8.     వామన
  9.     మండోదరి
  10.     సుభోగ
  11.     విశ్వాచి
  12.     విపులానన
  13.     భద్రాంగి
  14.     చిత్రసేన
  15.     ప్రమోచన
  16.     ప్రమ్లోద
  17.     మనోహరి
  18.     మనోమోహిని
  19.     రామ
  20.     చిత్రమధ్య
  21.     శుభానన
  22.     సుకేశి
  23.     నీలకుంతల
  24.     మన్మదోద్దపిని
  25.     అలంబుష
  26.     మిశ్రకేశి
  27.     ముంజికస్థల
  28.     క్రతుస్థల
  29.     వలాంగి
  30.     పరావతి
  31.     మహారూప
  32.     శశిరేఖ
తప్పులుంటే సరిచేయండి -- email. . seshagirirao_vandana@yahoo.com

  • మూలము : వికీపెడియా తెలుగు .
  • ======================
 visit My website > Dr.Seshagirirao - MBBS.-

No comments:

Post a Comment

your comment is important to improve this blog...