Wednesday, November 30, 2011

శీతల రక్త జంతువులు అంటే ఏమిటి ?, What is Coldblooded Animals?
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

Q : శీతల రక్త జంతువులు అంటే ఏమిటి ?.

A : శీతల రక్త జంతువు లంటే ఆ జంతువుల రక్తము ఐస్ లాగా చల్లగా ఉంటుందని కాదు . .. ఆ జంతువులకు శరీర ఉష్ణోగ్రతను నియంత్రించుకునే శక్తి ఉండదు . వాతావరణములో ఉష్ణోగ్రత మార్పును బట్టి వాటి శరీర ఉష్ణోగ్రత మారుతుంది . చేపలు ,కప్పలు , పాములు , బల్లులు వంటివి ఈ తరహా జీవులు .

కప్పలు శీతల రక్త జంతువులు. అంటే వాతావరణంలో ఎంత ఉష్ణోగ్రత ఉంటే వాటి శరీరంలో అంతే ఉష్ణోగ్రత ఉంటుంది.

పాము శీతల జంతువు. అంటే, చల్లని వాతావరణంలో శరీర ఉష్ణోగ్రత తక్కువగాను, వేడివాతావరణంలో శరీర ఉష్ణోగ్రత ఎక్కువగాను, ఉంటుంది. శరీర ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ జీర్ణక్రియలోవేగం పెరుగుతుందని మనకు తెలిసిందే. ఈ విషయం పాముకు తెలుసు. అందుకే అది ఆహారం తీసుకున్న తరువాత వేడిఎక్కువ తగిలే ప్రాంతాలకు వెళ్లి విశ్రాంతి తీసుకుంటాయి శీతల రక్త జంతువుకదా అందుకని జీర్ణం కావలసిన ఆహారం వున్న భాగాన్ని మాత్రమే వేడితగిలే విధంగా వుంచి మిగిలిన భాగాన్ని బొరియలో వుంచుకుంటుంది.

సైక్లోస్టొమేటా (Cyclostomata) కార్డేటా వర్గానికి చెందిన జీవులు శీతల రక్త జంతువులు. రక్తములో తెల్ల రక్తకణాలు మరియు కేంద్రక సహిత ఎర్ర రక్తకణాలు ఉంటాయి.

పక్షులు , క్షీరదాలకు తమ శరీర ఉష్ణోగ్రత నియంత్రించుకునె శక్తి ఉంటుంది . ఉష్ణోగ్రగ మారినా ఈ జీవుల శరీర ఉష్ణోగ్రత స్థిరముగా ఉంటుంది .అందువల్ల వీటిని ఉష్ణ రక్త జంతువులు అంటారు. మానవులు ఉష్ణరక్త జీవులు .
 • =============================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Wednesday, November 23, 2011

గుర్రం కూర్చోదేం? , Why do horse sit?ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...


ప్రశ్న: మిగతా జంతువుల్లాగా గుర్రం ఎందుకు నేల మీద కూర్చోదు?

జవాబు: మామూలుగా ఆవు, మేక, గేదెలాంటి జంతువులు నేల మీద నాలుగు కాళ్లని ముడుచుకుని కూర్చుని సేద తీరడం చూస్తుంటాం. ఏనుగు, ఒంటెలాంటి పెద్ద జంతువులు కూడా అలాగే నేలపై కూర్చుంటాయి. అలా కూర్చోవడం ద్వారా అవి తమ కాళ్ల కండరాలకు విశ్రాంతిని ఇస్తాయి. కానీ గుర్రం అలా కనిపించదు. అది అతి వేగంగా పరిగెత్తగల జంతువు. వేగంతో పాటు అనేక కిలోమీటర్ల దూరం పరుగెత్తినా అలసిపోని శక్తి దాని సొంతం. దానికి కారణం దాని కాళ్లలోని కండరాలు చాలా బలంగా, దృఢంగా ఉండడమే. గుర్రం నులుచుని ఉన్నప్పుడు మూడు కాళ్లపైనే ఒకదాని తర్వాత ఒకటి మారుస్తూ దేహాన్ని నిలదొక్కుకోగల సామర్థ్యం ఉంది. అందువల్ల అది మిగతా జంతువుల లాగా తన కాళ్లను ముడుచుకుని కూర్చోవలసిన అవసరం లేదు. అంతేకాదు అది నిలబడి నిద్రపోగలదు కూడా. ఒకోసారి నేలపై పూర్తిగా ఒక పక్కకు ఒరిగి పడుకుంటుంది.

- ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌.
 • ================================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

మిరప తింటే కారమేల?, Why chilli hot on eating?
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...


ప్రశ్న: పచ్చి మిరపకాయను కానీ, ఎండు మిరపకాయను కానీ నమిలితే కారంగా ఎందుకు అనిపిస్తుంది?


జవాబు: మన దేశంలో ఉండే మిరపను కాప్సికమ్‌ ఫ్రూటిసెన్స్‌ అంటారు. ఇది బంగాళా దుంపలు, వంకాయలు వంటి మొక్కలకు చెందిన పొలనేసీ కుటుంబానికి చెందినది. మిరపకాయల్లో కారానికి కారణం వాటి తోలు (peel), గింజలు, గుజ్జులో ఉండే కాప్సాసిన్‌ (capsaicin) అనే రసాయన ధాతువు. దీనితో పాటు మరికొన్ని రసాయనాలు కూడా జతకలవడం వల్ల మొత్తం మీద మిరప పచ్చిదైనా, ఎండుదైనా విపరీతమైన కారాన్ని రుచి చూపిస్తుంది. మిరపకాయలో బి-విటమిన్‌, సి-విటమిన్‌, ఇనుము, మెగ్నీషియం, పొటాషియం లవణాలు కూడా కొద్ది మోతాదులో ఉంటాయి. ఎక్కువగా తీసుకుంటే పొట్టలో ఆమ్లత్వం, నోటి పుండ్లు రావడానికి ఆస్కారమున్నా, తగినంతగా వాడితే శరీరానికి ఔషధగుణాలు లభిస్తాయి. పచ్చిమిరపలో నీటి శాతం బాగా ఉండడం వల్ల కాప్సాసిన్‌ కరిగి అది వెంటనే నోటిలోని లాలాజలంతో కలవడంతో వెంటనే ఘాటు తెలిసిపోతుంది. ఎండు మిరప కాయలో నీటి శాతం తక్కువగా ఉండడం వల్ల కాప్సాసిన్‌ ప్రభావం కొన్ని సెకన్ల తర్వాతే తెలుస్తుంది.

-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక

---------------------------------------------------------

కారానికి మంటేల?/-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌,-వరంగల్‌; రాష్ట్ర కమిటీ, జనవిజ్ఞానవేదిక


ప్రశ్న: కారం కళ్లలో పడితే కళ్లు మండి నీరు ఎందుకు కారుతుంది? కారం రసాయనిక నామం ఏమిటి?

జవాబు: మిరప కాయల్లోను, కారంగా రుచించే ఇతర కూరగాయల్లోను ఆ ఘాటును కలిగించే ప్రధాన రసాయనం పేరు 'క్యాప్సాయిసిన్‌' (capsaicin). దీన్ని శాస్త్రీయంగా '8-మిథైల్‌-ఎన్‌-వ్యానిలైల్‌- 6- నోనీనమైడ్‌' (8-methyl-N- vanillyl-6-nonenamide) అంటారు. నిజానికి పచ్చిమిరపకాయలో కారాన్ని కలిగించే ఈ రసాయనం కన్నా, మన రుచికి ఇంపైన చక్కెరలు, పిండి పదార్థాలతో పాటు విటమిన్లు, లవణాలు కూడా సమృద్ధిగా ఉంటాయి. ప్రతి వంద గ్రాముల కారంలో రకాన్ని బట్టి ఈ రసాయనం నాలుగైదు గ్రాములకు మించకపోయినా, పిట్టకొంచెం కూత ఘనం అన్నట్టు దీని ప్రభావమే కళ్లు, చర్మం, ఇతర కణజాలంపై తీవ్రంగా ఉంటుంది. ఈ రసాయనం నాలుక మీద పడినా, కళ్లలాంటి మృదు చర్మ భాగాల మీద పడినా అక్కడున్న నాడీతంత్రులు తీవ్రంగా స్పందించి మెదడుకు సంకేతాల్ని పంపుతాయి. తద్వారా కంటిలో నీరు అసంకల్పిత ప్రతీకార చర్య (involuntary reaction) వల్ల స్రవిస్తుంది.

 • =============================================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Tuesday, November 22, 2011

మురికి గుంటల్లో మందులెందుకు చల్లుతారు ? , Why do we sprinkle medical lotions in wastewater pits?ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
ప్ర : మురికి గుంటల్లో మందులెందుకు చల్లుతారు ?

జ : వర్షాకాలము లో మున్సిపాలిటీ సిబ్బంది మురికికాలువలు , గుంటలలో మందు చల్లి వెళుతుంటారు . అది దోమలను నివారించే చర్య . దోమల గుడ్లు , లార్వాలు నీటిపైన ఉంటాయి. లార్వాలు నీటిపొరను ఆధారం చేసుకుని లోపల వేలాడుతున్నా దాని గాలిగొట్టము పైకి తెరుచుకుని ఉంటుంది. మందు చల్లినపుడు అది నీటిమీద ఒక పొర మాదిరిగా ఏర్పడి లార్వాలకు గాలి అందకుండా చేస్తాయి. ఫలితముగా లార్వాలు చినిపోతాయి. చల్లే ఫినైల్ వాసనకు దోమలు మురికి గుంటలను చేరవు .
 • ====================================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Sunday, November 20, 2011

రుద్దితే బాధ తగ్గుతుంది ఎందుకు ?, Rubbing lessen pain How?ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్ర : ఏధైనా దెబ్బతగిగి నొప్పి పెట్టగానే ఆ భాగాన్ని నెమందిగా రుద్దుతాం .ఆయింట్ మెంట్ రాసి రుద్దుతాం ... అలాచేయడం వల్ల బాధ కొంతవరకు తగ్గుతుంది .ఏలా?

జ : దెబ్బ తగిలిన విషయము వెన్నెముక ద్వారా మెదడు కు చేరవేయబడుతుంది . తీనితో బాధ మొదలవుతుంది . ఆయింట్మెంట్ రుద్దినప్పుడు దీనిలోని పదార్దము మెదడుకు చేరవేయబడుతున్న బాధసంకేతకాలను అడ్డుకుంటాయి. అదేవిధముగా దెబ్బతగిలినచోట బిగుసుకున్న కండరాలను మర్దనతో రిలాక్స్ చేయగలుగుతాము . ఫలితంగా బాధతగ్గినట్లు అనిపిస్తుంది .
 • =================================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Monday, November 14, 2011

అయస్కాంత ఫ్లక్స్‌ అంటే ఏమిటి?, What is Magnetic Flus?ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న:అయస్కాంత ఫ్లక్స్‌ అంటే ఏమిటి?,

- సిహెచ్‌. సాయికుమార్‌

జవాబు: ఒక వస్తువును మరో వస్తువు ప్రభావితం చేసేందుకు రెండే పద్ధతులు ఉన్నాయి. ఒకటి ప్రత్యక్షంగా యాంత్రిక బంధాన్ని ఏర్పరుచుకోవడం. రెండు అవి ప్రదర్శించే క్షేత్ర ఫలితాల (field effects) ద్వారా ప్రభావితం కావడం. మనం సైకిల్‌ తొక్కినా, కలం పట్టుకుని రాసినా అది యాంత్రిక బంధమే అవుతుంది. కానీ ఎక్కడో 15 కోట్ల కిలోమీటర్లకు పైగా దూరంలో ఉండే సూర్యుడు తన చుట్టూ భూమిని తిప్పుకునేలా ప్రభావం కలిగించడం యాంత్రిక బంధం కాదు. అది గురుత్వ క్షేత్ర ఫలితం. అలాగే ఒక అయస్కాంతం మరో అయస్కాంతాలన్ని తాకకుండానే ప్రభావం చూపగలదు. ఇది అయస్కాంత క్షేత్ర బలం. యాంత్రిక బంధం లేకుండా ఒక వస్తువు మరో దానిపై ప్రభావం చూపుతోందంటే గురుత్వ, అయస్కాంత, విద్యుత్‌ క్షేత్రాల ప్రభావం ఉన్నట్టే. క్షేత్ర తీవ్రతను బలరేఖల (lines of force) ద్వారా పరిగణిస్తారు. నిర్ణీత వైశాల్యం నుంచి నిర్దిష్ట దిశలో ప్రసరించే క్షేత్ర బలరేఖల సంఖ్యను ఆ క్షేత్రపు ఫ్లక్స్‌ (flux) అంటారు.

- ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
 • ====================================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

గద్ద విన్యాసం ఎలా సాధ్యం?,How do eagle fly in the sky with out moving wings?ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...


ప్రశ్న: ఆకాశంలో అంత ఎత్తులో గద్ద రెక్కలాడించకుండా ఎలా ఎగరగలుగుతుంది?జవాబు: ఎండుటాకులు, దూదిపింజెలు, వెంట్రుకల లాంటి తేలికైన వస్తువులు గాలిలో తేలుతూ చాలా సేపు కింద పడకుండా ఉండడం తెలిసిందే. అదే రాయిలాంటి వస్తువులు పైనుంచి కిందకి తటాలున పడిపోవడం కూడా మనకు తెలుసు. ఎత్తు నుంచి కిందకి పడే వస్తువుపై గాలి వల్ల ఏర్పడే నిరోధక బలం పని చేస్తూ ఉంటుంది. దీని ప్రభావం ఆయా వస్తువుల సాంద్రత, పరిమాణం, బరువులాంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. గద్ద విషయానికి వస్తే దాని రెక్కలు చాలా విశాలంగా ఉంటాయి. గద్ద పరిమాణం దాని బరువుతో పోలిస్తే చాలా ఎక్కువ. ప్యారాచూట్‌ కట్టుకున్నప్పుడు, గ్త్లెడర్‌ పట్టుకున్నప్పుడు మనుషులు ఎలాగైతే గాలిలో తేలుతూ ప్రయాణించగలరో గద్దకూడా అలా చేయగలదు. గద్ద ఆకాశంలోకి ఎగరడానికి మామూలుగానే రెక్కలు ఆడించినా, పైకి వెళ్లాక రెక్కలను విశాలంగా చాపి గాలి నిరోధాన్ని, గాలి వేగాన్ని ఉపయోగించుకుని బ్యాలన్స్‌ చేసుకుంటూ తన శక్తిని ఆదా చేసుకుంటుంది. మరింత ఎత్తుకు ఎగరాలంటే మాత్రం రెక్కలు అల్లల్లాడించవలసిందే.

-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌
 • ===================================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Wednesday, November 09, 2011

How is Cyclone forming ?, తుఫాన్‌ ఎలా ఏర్పడుతుంది?ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.

ప్ర : తుఫాన్‌ ఎలా ఏర్పడుతుంది? How is Cyclone forming ?, తుఫాన్‌ ఎలా ఏర్పడుతుంది?

జ : అక్టోబరు - నవంబరు నెలలు వచ్చే సరికి తుఫాన్లు వస్తాయేమోనన్న భయం మన రాస్ట్రములో ఉంటుంది . అతి వేగముతో గాలులు , భారీ వర్షాలు తీవ్రనస్టాన్ని కలిగిస్తాయి. ఇది ప్రతిఏటా జరుగుతునే ఉంటుంది .

భూగోళము మీద అన్నిప్రాంతాలూ ఒకేలా ఉండక ఎత్తుపల్లాలు కల్గిఉన్నట్లే గాలిలో పీడనపరంగా అక్కడక్కడా అల్పపీడనము గల ప్రాంతాలు ఏర్పడతాయి. పల్లపు ప్రాంతాలలోకి నీరు ప్రవహించినట్లే అల్పపీడనము ప్రాంతాలాలోకి అన్నిదిక్కుల నుండి గాలి అతివేగంగా వీస్తుంది . అలా ఏర్పడిన వాయుగుండము సుడులు తురుగుతూ వేగం పుంజుకుని తీరము వైపు పయనిస్తుంది . వాతారణములోని తేమ భూమిపైనున్న చల్లని ప్రదేశాలకు తాకి వర్షముగా కురుస్తుంది . వేగము గా వీచే గాలితోకూడిన వర్షమే తుఫాను (cyclone).
 • ============================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

బావి నీరు వెచ్చనేల?, Well water is warm-Why?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.


ప్రశ్న: చలికాలంలో కూడా బావిలో నీరు వెచ్చగా ఎలా ఉంటుంది?

- నీలిశెట్టి సుబ్బారావు,

7వ తరగతి, కనిగిరి (ప్రకాశం)
జవాబు: వేడిని గ్రహించడంలో రకరకాల పదార్థాలు వేర్వేరు లక్షణాలను చూపిస్తాయి. అలా చూసినప్పుడు నీరు భూమి కన్నా నిదానంగా వేడెక్కుతుంది. అలాగే నిదానంగా చల్లారుతుంది. ఏదైనా ఒక గ్రాము పదార్థం, ఒక డిగ్రీ సెంటిగ్రేడు ఉష్ణోగ్రత పెరగడానికి కావలసిన వేడిని విశిష్టోష్ణము అంటారు. ఇది నీటికి ఎక్కువ. చలికాలంలో మన చుట్టూ పరిసరాలలో ఉండే గాలి చల్లగా ఉంటుంది. ఇందువల్ల బావి ఉపరితలంలోని నీరు తనలోని ఉష్ణాన్ని పరిసరాలకు ఇవ్వడం ద్వారా చల్లబడుతుంది. అలా చల్లబడిన నీటి సాంద్రత పెరుగుతుంది. అందువల్ల చల్లబడిన నీరు బావి కింది వైపు చేరుతుంది. అదే సమయంలో బావిలోపలి పొరల్లో ఉండే వెచ్చని నీటి సాంద్రత తక్కువ కాబట్టి అది పైకి చేరుకుంటుంది. ఈ ప్రక్రియనే ఉష్ణ సంవహన (convection) క్రియ అంటారు. బావిలో నీరు ఎక్కువగా ఉండడం, ఈ ప్రక్రియ చాలా నిదానంగా జరగడం వల్ల బావిలోని నీరంతా పూర్తిగా చల్లబడిపోయే పరిస్థితి ఉండదు. అందువల్లనే బావి నీరు చలికాలంలో వెచ్చగాను, వేసవిలో చల్లగాను ఉంటుంది.

- ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌
 • =========================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Sunday, November 06, 2011

భూమి వేగానికి పడిపోమేం?,Why donot we fall due to Earth speed?

 • ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.

ప్రశ్న: భూమి గుండ్రంగా ఉండి పడమర నుంచి తూర్పునకు వేగంగా తిరుగుతోంది కదా! మరి మనం పడిపోమెందుకు?


జవాబు: భూమి తన చుట్టూ తాను గంటకు 1620 కిలోమీటర్ల వేగంతో తిరుగుతోంది. కానీ ఆ చలనం మనకు కొంచెం కూడా తెలియదు.కారణంభూమిసమవేగంతో(uniform)తిరగడమే. మనం సమవేగంతో సరళమార్గంలో వెళుతున్న రైలుబండిలో ఉన్నామనుకోండి. బయటి దృశ్యాలు కనిపించకుండా బోగీల తలుపులు, కిటికీలు మూసేసి కూర్చుంటే అది కదులుతోందో లేదో కనిపెట్టలేము. ఆగి ఉన్న రైలుకు, సమవేగంతో గంటకు వంద కిలోమీటర్ల వేగంతో వెళుతున్న రైలుకు తేడా ఏమీ ఉండదు. అయితే రైలు సరళమార్గం నుంచి మలుపు తిరిగితే మాత్రం మన శరీరం పక్కకు ఒరగడం వల్ల రైలు గమనాన్ని అనుభూతి చెందగలం.

తన చుట్టూ తాను తిరిగే భూమి కదలిక సమంగా, ఒడిదుడుకులు లేకుండా నిరంతరాయంగా ఉండడం వల్ల మనకు దాని చలనం మనకు అనుభవంలోకి రాదు. భూమి సమవేగంతో పయనిస్తున్నా, సరళమార్గంలో కాకుండా వంపుగా ఉన్న మార్గంలో తిరుగుతున్న విషయం తెలిసిందే. ఆ కారణంగా మనం ఆ వంపుగా ఉండే కేంద్రం నుంచి దూరంగా పడాలి కానీ అలా జరగడం లేదు. దానికి కారణం భూమి పరిమాణమే. భూమి ఎంత పెద్దగా ఉంటుందంటే, దాని పరిభ్రమణంలోని వంపు ఒక్కసారిగా, తటాలున మారకుండా క్రమేపీ కొంచెం కొంచెంగా మారుతుంది. ఆ మలుపు చాలా వరకు సరళ మార్గంలోనే ఉంటుంది. అందువల్ల మనపై పనిచేసే బాహ్యబలం అత్యంత స్వల్పంగా ఉంటుంది. కాబట్టే భూమి పరిభ్రమిస్తున్నా, మనం కిందపడం.

-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌
 • ========================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

ఎమెమ్మెస్‌ అంటే ఏమిటి?,What is ment by M.M.S ?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.ప్రశ్న: సెల్‌ఫోన్లకు సంబంధించి తరచు ఎమ్‌.ఎమ్‌.ఎస్‌. అనే మాటను వింటాము. ఏమిటి దానర్థం?

-అను, రేపల్లె (గుంటూరు)

జవాబు : సెల్‌ఫోన్‌ ద్వారా సమాచారాన్ని క్లుప్తంగా పంపే విధానాన్ని ఎస్‌.ఎమ్‌.ఎస్‌. అంటారు. అంటే షార్ట్‌ మెస్సేజ్‌ సర్వీస్‌ అని అర్థం. కేవలం టెక్ట్స్‌ సమాచారమే కాకుండా బొమ్మలు, ఫొటోలు, పాటల్ని, వీడియోలతో కలిపేలా సందేశాన్ని పంపడాన్నే ఎమ్‌.ఎమ్‌.ఎస్‌. అంటారు. కంప్యూటర్‌ పరిభాషలో దీన్ని మల్టీమీడియా మెస్సేజ్‌ సర్వీస్‌ అంటారు. అయితే ఎమెమ్మెస్‌ పంపాలంటే సెల్‌ఫోన్లలో ప్రత్యేక సదుపాయం ఉండాలి. ఇలాంటి సందేశాలను పంపినందుకు సెల్‌ఫోన్‌ కంపెనీలు కొంత రుసుమును వసూలు చేస్తాయి. ఎసెమ్మెస్‌, ఎమెమ్మెస్‌ల పేర్లలోనే కాకుండా సెల్‌ఫోన్లలో సమాచారం సంకేతాలుగా మారే ప్రక్రియలో కూడా తేడా ఉంటుంది.

-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌,-వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక.
 • ==================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

భావాలు కలగడమేల?,Why do we get feelings in Life?ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.ప్రశ్న: మనకు బాధ, కోపం వంటి భావనలు ఎందుకు కలుగుతాయి?,Why do we get feelings of angry and laughter?

-జానపాటి శ్రీనివాస్‌, మిర్యాలగూడ (నల్గొండ)

జవాబు: జీవికి ఆహారం, గాలి, నీరు ప్రధాన అవసరాలు. పరిణతి చెందిన మానవులు లాంటి కొన్ని జీవులు సమూహాలుగా నివసిస్తాయి. మానవ సమూహాన్ని సమాజం అంటాము. మానవుడికి ప్రకృతి సహజమైన ప్రాథమిక అవసరాలతో పాటు స్నేహం, బృందభావన, పరిశీలన, పరిశోధన, ఆలోచన వంటి భావ పరమైన అంశాలు కూడా ఉన్నాయి. సంఘజీవిగా మనిషి ఎదిగే క్రమంలో తనకు ఇష్టమైన, ఇష్టం లేని సంఘటనలను గుర్తించాడు. వాటికి అనుగుణంగా శరీరంలో మార్పులు కలగడం గమనించాడు. శరీరంలో అవాంఛనీయ నాడీ ప్రకంపనలను కలిగించేది దుఃఖంగాను, ఆరోగ్య ప్రకంపనలను బలోపేతం చేసే భావాలను సంతోషంగాను వైద్యశాస్త్రం చెబుతుంది. భావాలు కలగడానికి కారణం మెదడులో ఉత్పన్నమయ్యే కొన్ని రకాల రసాయనాలేనని శాస్త్రవేత్తలు గుర్తించారు. వాటికి అనుగుణంగా నవ్వు, ఏడుపు, చెమటలు పట్టడం, శరీరం వణకడం, గొంతు గాద్గదికం కావడం లాంటి బాహ్య ప్రకటనలు కలుగుతాయి. ఒంటరిగా అడవిలో పెరిగే వ్యక్తికి కోపం, నవ్వువంటి భావాలు కలగవని రుజువైంది. సామాజిక జీవనమే భావప్రకటనలను శరీరానికి అలవాటు చేస్తుంది.

-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌,--వరంగల్‌; రాష్ట్ర కమిటీ, జనవిజ్ఞానవేదిక.
 • ===================================
visit My website > Dr.Seshagirirao - MBBS.