Wednesday, March 30, 2011

చీకట్లో అవెలా మెరుస్తాయి?,How do they shine in darkness?



ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.



ప్రశ్న: ఈ మధ్య కొన్ని టార్చిలైట్లు చీకట్లో మెరుస్తున్నట్టు మనకి కనిపిస్తాయి. ఈ కాంతి ఎక్కడిది?

-కె. హయగ్రీవాచారి, కాజీపేట

జవాబు: ఉన్నట్టుండి కరెంటు పోతే ఆ చీకట్లో టార్చిలైటు ఎక్కడుందో గుర్తించేందుకు వీలుగా ఈమధ్య వాటిని ఓ ప్రత్యేకమైన పదార్థంతో తయారు చేస్తున్నారు. ఇవి చీకట్లో మంద్రస్థాయిలో వెలుగులీనుతూ కనిపిస్తాయి. కాంతికీ, పదార్థాలకూ మధ్య చాలా విధాలైన భౌతిక, రసాయనిక సంబంధాలున్నాయి. వాటిలో ఒకటి ఫాస్ఫారిసెన్స్‌(Phosphorescence) అనే ధర్మం. ఈ ధర్మాన్ని ప్రదర్శించే పదార్థాలు కొన్ని ఉన్నాయి. ఉదాహరణకు జింకు సల్ఫైడు, స్ట్రాన్షియం అల్యూమినేట్‌ మొదలైన ఇలాంటి పదార్థాల అణువులు కాంతి సమక్షంలో ఉత్తేజం (exitation) పొందుతాయి. ఇవి ఈ ఉత్తేజ స్థాయిలోనే చాలా సేపు ఉంటూ మెల్లమెల్లగా సాధారణ స్థితికి చేరుకుంటాయి. అకస్మాత్తుగా కాంతి పడడం ఆగిపోయినప్పుడు కూడా ఇవి ఇలాంటి స్థితిలోనే ఉండడం వల్ల వాటి నుంచి ప్రత్యేకమైన కాంతి వెలుగులీనుతూ కనిపిస్తుంది. దీన్నే ఫాస్ఫారిసెన్స్‌(Phosphorescence) అంటారు. టార్చిలైట్లతో పాటు గదుల సీలింగ్‌కు అతికించే నక్షత్రాలు, గ్రహాల లాంటి చిన్న చిన్న పరికరాలను కూడా ఇలాంటి పదార్థాలతోనే చేస్తారు. గదిని చీకటి చేసినప్పుడు ఇవి వెలుగు చిమ్ముతూ ఆకట్టుకోవడాన్ని గమనించే ఉంటారు. అయితే కాసేపటిలోనే వాటి కాంతి ఆగిపోతుంది.

-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక

  • =====================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Sunday, March 27, 2011

సి.సి.కెమేరా లో దృశ్యం సరిగా ఉండదేం?,Why do the picture not clear in c.c cameras?



ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.


ప్రశ్న: సీసీ కెమేరాలతో తీసిన బొమ్మ స్పష్టంగా ఉండదు. ఎందుకని?

-పి. మార్టిన్‌, సెయింట్‌ మేరీ పాఠశాల, పాలకొల్లు

జవాబు: సి.సి. (క్లోజ్‌డ్‌ సర్క్యూట్‌) కెమేరాలను సాధారణంగా పెద్ద వ్యాపార సంస్థలు, కార్యాలయాల్లో వాడుతుంటారు. వీటి ఉద్దేశం ఆయా ప్రదేశాల్లో ఏం జరుగుతోందో నిరంతరం గమనించడానికి వీలైన నిఘా ఏర్పాటు చేసుకోవడమే తప్ప అద్భుతమైన దృశ్యాలు కనిపించడానికి కాదు. పైగా వీటిని చాలావరకూ రహస్యంగా ఏర్పాటు చేస్తారు కాబట్టి వీటి కెమేరాలు చిన్నగా ఉంటాయి. అందువల్ల వీటి అంతర్భాగాలు కూడా సూక్ష్మంగానే ఉంటాయి. ఇక దృశ్యం బాగా కనిపించాలంటే పిక్చర్‌ ఎలిమెంట్స్‌ (వీటినే సంక్షిప్తంగా పిక్సల్స్‌ అంటారు) అనే కాంతి విద్యుద్వయ ధ్రువాలు (ఫొటో డయోడ్స్‌) ఎక్కువగా ఉండాలి. సీసీ కెమేరాలో ఇవి తక్కువగా ఉంటాయి కాబట్టి దృశ్యం కూడా అంత స్పష్టంగా ఉండదు.

- ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక

  • ========================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

మొక్కలు విశ్రాంతి తీసుకోవా?, Do plants and trees take Rest?



ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.

ప్రశ్న: రాత్రి వేళల్లో మొక్కలు ఏం చేస్తుంటాయి?

-ఎ. హరిప్రియ, 8వ తరగతి, నూజివీడు

జవాబు: రాత్రివేళల్లో మొక్కల్లో చాలా వరకు పూలు ముడుచుకుని పోయినా అవి విశ్రాంతి తీసుకోవు సరికదా, వాటిలోని జీవ ప్రక్రియ (metabolism) చాలా తీవ్ర స్థాయిలో జరుగుతూ ఉంటుంది. రాత్రి వేళల్లో మొక్కలు కోల్పోయే నీటి పరిమాణం చాలా తక్కువ కావడంతో, అవి వాటి ఆకుల అడుగు భాగంలో ఉండే సన్నని రంధ్రాలను (stomata) విశాలంగా తెరుచుకునేటట్లు చేసి వాతావరణంలోని కార్బన్‌డయాక్సైడ్‌ను ఎక్కువగా శోషించుకుంటాయి. తెల్లవారిన తరువాత చీకటి ఉండగానే తొలి సూర్యకిరణాల సాయంతో కిరణజన్య సంయోగ క్రియను ప్రారంభించడానికి సర్వ సిద్ధంగా ఉంటాయి.

-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌

  • =====================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

పితోహి పక్షి సంగతేమిటి?,What about Pithohi bird?



ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.

చిన్న పక్షి... తీయగా పాడుతుంది... రంగులతో ఆకట్టుకుంటుంది... అలాగని పట్టుకుందామనిపిస్తోందా? ప్రమాదం కొని తెచ్చుకున్నట్టే!

ఆ పిట్ట చెట్టు కొమ్మ మీద ఉంటే చూసి ఆనందించడమే మంచిది. పట్టుకున్నారో ప్రమాదమే. ఎందుకంటే అది విషపూరితం. నలుపు, నారింజ రంగుల్లో ముద్దుగా ఉన్న దాన్ని తాకితే చాలు, దాని ఈకలు, శరీరంపై ఉండే విషం ఎక్కేస్తుంది. తోటి జీవులకే కాదు, మనుషులకి కూడా అది ప్రమాదమే. ఒళ్లంతా తిమ్మిరి పట్టడం, తల తిరగడం వంటిలక్షణాలు కలిగి ఒకోసారి పక్షవాతం రావడం, మరణించడం కూడా జరిగే ప్రమాదముంది. అందుకే ఇది ప్రపంచంలో ఉన్న పక్షులన్నింటిలో విషపూరితమైనదిగా పేరు తెచ్చుకుంది. తోక నుంచి ముక్కు దాకా ఎక్కడ తాకినా అంతా విషమయమే.

న్యూగినియా అడవుల్లో కనిపించే ఈ పక్షి పేరు పితోహి. చర్మం, ఈకలపై ఒకరకమైన విషరసాయనం ఉంటుంది. ఇదే దానికి రక్షణ కవచం కూడా. పాములు, ఇతర జంతువుల నుండి రక్షించుకోడానికి ఉపయోగపడుతుంది. విచిత్రమేమిటంటే ఈ విషం దాని శరీరంలో ఉత్పత్తి కాదు. మరెక్కడి నుంచి వస్తుంది? అది తినే ఆహారం ద్వారా ఏర్పడుతుంది. ఇవి ఎక్కువగా కోరెసైన్‌ అనే కీటకాలను ఆరగిస్తూ ఉంటాయి. వాటిలో ఉండే విషాన్నే దీని చర్మం, ఈకలు స్రవిస్తూ ఉంటాయి. జీవులన్నింటిలో అత్యంత ప్రమాదకరమైన జీవిగా 'పాయిజన్‌ డాట్‌ కప్ప'ని పేర్కొంటారు. దాని శరీరంపై ఉండే విషరసాయనమే దీనిపై కూడా ఉంటుందని కనుగొన్నారు. వీటిపై 1989 నుంచి పరిశోధనలు జరుగుతున్నాయి.

న్యూగినియా గిరిజనులకు వీటి గురించి ముందే తెలుసు. వీటిని వాళ్లు 'గార్బేజ్‌ బర్డ్స్‌' అంటారు. అంటే చెత్త పక్షులన్నమాట. వీటి శరీరం నుంచి దుర్వాసన వస్తుంటుంది. అందుకే ఆ పేరు. చాలా మంది వీటి జోలికి పోకపోయినా, కొందరు మాత్రం వీటి మాంసాన్ని వండుకుని తింటారు. చర్మాన్ని, ఈకల్ని తొలగించి బొగ్గుపొడిలో దొర్లించి కాల్చుకు తింటారు. అలా తిన్నాక ఒకోసారి అనారోగ్యాల బారిన పడుతుంటారు కూడా. వీటిలో ఆరు జాతులుంటే, మూడు విషపూరితమైనవే.
  • ==================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

ఆడవారు సుకుమారులా?,Are women smooth in bodystrength?



ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును. అలా తలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం!.



ప్రశ్న: మగవారితో పోలిస్తే ఆడవారు తక్కువ బలంతో ఉంటారు. ఆహారం కూడా తక్కువ తీసుకుంటారు. ఎందుకిలా?

-ఎ. భాస్కర్‌,
5వ తరగతి, మదర్‌ థెరిసా విద్యాలయం, గుబ్బగుర్తి (ఖమ్మం)

జవాబు: ప్రకృతి సహజంగా మగవారికి, ఆడవారికి కొన్ని తేడాలున్నా బలాబలాల్లోను, దృఢత్వంలోనూ పెద్ద తేడా ఉండదు. కానీ లక్షలాది సంవత్సరాలుగా ప్రకృతి సిద్ధమైన సహజ లక్షణాలకి తోడుగా సామాజికాంశాలు ప్రభావం చూపడం వల్ల ఆడవారి శరీర పరిమాణం మగవారి కన్నా చిన్నగా, నాజూకుగా తయారైంది. ఆ మేరకు ఆహార అవసరం కొంత తగ్గినా శ్రమ విషయంలో ఆడవారు తక్కువేమీ కాదు.

ప్రపంచవ్యాప్తంగా మానవాళి చేసే అన్ని రకాల సామాజిక, ఉత్పత్తి సంబంధ శ్రమలో ఆడవారి పాత్రే అరవై శాతంగా ఉందని సామాజిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అలా చూస్తే ఆహారపు అవసరం ఆడవారికే అధికం. కానీ సమకాలీన సామాజిక, సంస్కృతిక నేపథ్యం ఆడవారిని సన్నగా, నాజూగ్గా ఉండాలని ప్రేరేపిస్తోంది. ఇది ఫ్యాషన్‌ కాదు. ఏమైనా ఆడవారు మగవారి కన్నా దేహదారుఢ్యంలో అబలలు కారు.

-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక

  • =======================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

ఆహారము తీసుకునేముందు దైవప్రార్ధన చెయ్యడం ఎందుకు ?,Why some pray God before meals?



ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.

ఫ్ర : ఆహారము తీసుకునేముందు దైవప్రార్ధన చెయ్యడం ఎందుకు ?.
జ : ధ్యాన మంత్రాలకు , మంత్రాక్షరాలకు అపూర్వమైన శక్తి ఉందని మన పూర్వీకుల నమ్మకం . హిందువులైతే " అన్నమో పరబ్రహ్మ: " అనేవారు . ఆహారము మన శరీరానికి శక్తి నిస్తుంది . దేవుడనగానే 'సుచి ,శుబ్రత' పాటిస్తాము . కలుషిత ఆహారము అయినా మంచి ఆహారము అయినా ... దైవ ప్రసాదము గా భావించి ప్రార్ధన అనే ఆచార నియమము ద్వారా శుబ్రం చేయడం జరుగుతుంది . కొంతైనా ఆహారాన్ని అమృతమయం చేసేందుకే ఈ ప్రార్ధన. ప్రార్ధన మూలాన ఇంటిల్ల పాది ఒకేసారి కలిసి బుజించడం జరుగుతూ ఉంటుంది . ఇది ఆరోగ్యానికి చాలా మంచిది .
  • ====================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

శరీరము లో అతి పెద్ద అంగమేది ?, What is the biggest Organ in the body?



ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.

ప్ర : శరీరము లో అతి పెద్ద అంగమేది ?.
జ : శరీరములో అతిపెద్ద అంగం ఏది అనగానే అందరూ లోపలి అంగాల గురించి ఆలోచిస్తారు ... కాని వాస్తవం లో అతి పెద్ద అంగం చర్మము . చర్మము అంగమని చాలా మందికి తెలియదు . మనిషి బరువులో16 శాతము బరువు చర్మానిదే . సాధారణ మానవుడి చర్మము మొత్తము బయటకు తీసి కొలిస్తే 1.85 చదరపు మీటర్లు ఉంటుంది . అమ్మయిల శరీరములో కన్నా అబ్బయిల శరీరములొ చర్మము అధిక విస్తీర్ణము కలిగి ఉంటుంది .
చర్మము రక్షణ అవయవము ,
చర్మము విసర్జక అవయవము ,
శరీర ఉష్ణోగ్రతను సమతుల్యము చేస్తుంది .
  • ===================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Saturday, March 19, 2011

పాలు ఎలా పెరుగు అవుతుంది ?, How do milk become curd?




ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.

ప్ర : పాలు ఎలా పెరుగు అవుతుంది ?
జ : ఇది ఒక రకమైన సూక్ష్మజీవులు చర్య . పాలలోని కెసిన్‌(Casin) అనే ప్రోటీన్‌ తో లాక్టోబాసిల్లస్ (Lactobacillus) అనే బ్యాక్టీరియా జరిపే చర్య . ఈ బ్యాక్టీరియా ఉప్తత్తిచేసే ఆమ్లము - లాక్టిక్ ఆమలము లోని హైడ్రోజన్‌ అయాన్లు జరిపే చర్య తో పాలు అలా బిగుసుకొని పెరుగు అవుతాయి. ఇలా పెరుగు అవ్వాలంటే పాలను కొద్దిగా వేడి చేయాలి . మరీ వేడి పాలలో తోడు వేస్తే బ్యాక్టీరియాలు చనిపోతాయి.
  • ======================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Thursday, March 17, 2011

పట్టుబట్టలు ఎలా తయారు అవుతాయి?,How do silk clothes mannufacture?




ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.

పట్టు దారం తో పట్టు బట్టలు నేస్తారు. అయితే పత్తిలాగా పట్టు ఒక చెట్టుకాదు. పట్టు పురుగు అనే ఒక రకం కీటకం ఉంటుంది. ఇది రక్షణ కోసం తన చుట్టూ గూడు అల్లుకుంటుంది. ఈ గూడు బలమైన సన్నని దారాలు దారాలుగా వుంటుంది. ఈ సన్నని దారాలే పట్టుదారాలు. ఈ దారాలనే సాగదీసి మగ్గం మీద బట్టలుగా నేస్తారు.మన దేశంలో పట్టుతో బట్టలు నేయడం ఈనాటిది కాదు! 4,5 వేల ఏళ్ళ పై నుంచే అమలులో వుంది. రెండో ప్రపంచ యుద్ధంలో పారాచూట్‌ల తయారీలో పట్టును వాడారు. ఇవి సన్నగా గట్టిగా వుండడమే కారణం. మన దేశమే యితర దేశాలకు పట్టును సరఫరా చేసేది. తర్వాత పట్టుకు గిరాకీ పెరిగింది.ఆ గిరాకీ తట్టుకోవడం కోసం పట్టును ఎక్కువగా తయారు చేయాలి. అందుకు పట్టు పురుగుల్ని పెంచడం ఎక్కువ చేశారు. ఇదే పరిశ్రమగా ఎదిగింది.

పట్టు పురుగు నుండి దారం ఎలా వస్తుంది?

పట్టు పురుగు గుడ్డు చీల్చుకుని బయటికి వస్తుంది. ఇది తన చుట్టూ గూడు అల్లడం మొదలుపెడుతుంది.ఇది ఎంత చిక్కగా గూడు అల్లితే అంత మంచి దారం తయారు అవుతుంది. గూడు పూర్తి కాకుండానే చాలా పురుగులు చచ్చిపోతాయి. ఈ గూళ్ళు కూడా అంత మంచివి కాకపోవచ్చు. ఇరవై కిలోల గూళ్ళ నుండి ఒక కిలో దారం మాత్రం వస్తుంది. పట్టులో చాలా రకాలు వున్నాయి.

* మల్బరీ పట్టు
* టస్సర్
* ఈరి
* మూగా

మూగా అనే పట్టుదారం మనదేశంలోనే దొరుకుతుంది.'ఈరి'అనే పట్టుదారం తయారుచేయడంలో మన దేశం ముందు వుంది. టస్సర్ పట్టుదారం తయారీలో మనది 2వ స్ధానం. మల్బరీ తయారీలో 5స్ధానం.
కొత్త రకం పట్టు పురుగులు:
విదేశీ పట్టు పురుగులను మన వాటితో కలిపారు. సంకర జాతి పట్టు పురుగులు పుట్టాయి. నాణ్యత బాగా పెరిగింది. విదేశీ పట్టు పురుగుల్ని యిక్కడే పెంచుతున్నారు. దీని వల్ల నాణ్యత పెరిగింది. పట్టు తయారీ 15 వేల టన్నులు పెరిగింది. పట్టు పురుగుల్ని చక్కగా పెంచడం ఒక పద్ధతి.పట్టు పురుగులు మల్బరీ చెట్ల ఆకులు తింటాయి. వీటికి మంచి ఆహారాన్ని అందించాలి. అప్పుడే చిక్కని గూడు కడుతుంది. అందువల్ల మల్బరీ తోటలను బాగా ఎక్కువ సంఖ్యలో పుట్టించాలి. మల్బరీ ఆకులు ఏపుగా ఆరోగ్యంగా వుండాలి. ఈ ఆకులను కత్తిరించి వీటికి ఆహారంగా వేస్తారు. ఇలాంటి ఆకులు తిని పట్టు పురుగులు బాగా పెరుగుతాయి. మంచి గూళ్ళు కడతాయి.

  • ====================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

చల్లని ఏసీ ఎలా పుట్టిందో?,How A.C.machine inveted?



ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు . చిన్న విషయమైనా , అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.

ప్ర : చల్లని ఏసీ ఎలా పుట్టిందో? ఏసీని ఎవరు కనిపెట్టారు?, ఎందుకు పనికి వస్తుందో?.

జ :చల్లటి గాలిని ఇచ్చే ఏసీ (కండిషనర్ )అంటే ఇష్టం ఉండనిది ఎవరికి? కానీ, ఈ ఏసీ మొదట్లో కేవలం పరిశ్రమల కోసమే పుట్టిందంటే నమ్ముతారా? ఏసీ మొదట్లో ఒక ముద్రణ (ప్రింటింగ్) పరిశ్రమ కోసమే పుట్టింది. అమెరికాలోని బ్రూక్‌లీన్ ప్రింటింగ్ సంస్థలో వేడి, తేమల మూలంగా చాలా ఇబ్బందులు ఏర్పడేవి. ముద్రించిన తర్వాత రంగులు అల్లుకుపోవడం లాంటివి జరిగేవి. దీనిని అప్పుడే కొత్తగా ఉద్యోగంలోకి చేరిన ఒక యువకుడు గమనించాడు. గాలిని చల్లబరిచే ఒక పరికరాన్ని చేసి యజమానికి చూపించాడు దాంతో ప్రింటింగ్ త్వరగా పూర్తి కావడమే కాదు నాణ్యత కూడా పెరగడంతో ఆయన బోలెడు సంతోషించాడు. అదే మన మొట్టమొదటి ఏసీ అన్నమాట. ఆ ఉద్యోగి పేరు విల్లిస్ హావిల్యాండ్ క్యారియర్. 'ఫాదర్ ఆఫ్ ఏసీ'గా పేరు తెచ్చుకున్న క్యారియర్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ పూర్తి చేసి, ఉద్యోగంలో చేరిన ఏడాదిలోనే ఏసీని కనిపెట్టాడు. అప్పట్లో ఆయన జీతం వారానికి 10 డాలర్లు మాత్రమే!

క్యారియర్ 1906లో ఏసీ మీద పేటెంట్ సాధించాడు. అప్పటి నుంచి రకరకాల పరిశోధనలు చేసి మరింత మెరుగు పరచాలని చూస్తుండేవాడు. రేషనల్ సైక్రోమెట్రిక్ అనే ఒక కొత్త సూత్రాన్ని రూపొందించి 1911 లో అమెరికాలోని ఇంజనీరింగ్ సొసైటీకి అందించాడు. ఇప్పటికీ ఈ సూత్రమే ఏసీల తయారీకి ప్రధానమైన ఆధారం. ఈ ఆలోచన ఆయన చాలా చిత్రంగా వచ్చింది. క్యారియర్ ఒకసారి రాత్రిపూట రైలు కోసం చూస్తున్నాడు. అప్పుడు బాగా మంచు కురుస్తుంది. ఇంతలో రైలు రావడంతో మంచు స్థానాన్ని వేడిగాలి ఆక్రమించింది. వేడి, తేమ, మంచుల మధ్య ఉండే సంబంధాన్ని గుర్తించాడు. వేడిగాలి మూలంగా మంచు చెదిరినప్పుడు. చల్లగాలిని వేగంగా పంపిస్తే వేడిని తగ్గించవచ్చని గ్రహించాడు. అదే ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది.

పరిశ్రమల్లో ఏసీ బాగా ప్రాచుర్యం పొందడంతో క్యారియర్ ఒక కంపెనీని ఏర్పాటుచేశాడు. రకరకాల పరిశోధనలు చేసి ఆరోగ్యానికి హాని కలిగించని 'సెంట్రిప్యుగల్ రిఫ్రిజిరేషన్' యంత్రాన్ని తయారుచేశాడు. దీంతో విశాలమైన ప్రాంతాల్లో కూడా చల్లదనాన్ని కలిగించడానికి అవకాశం ఏర్పడింది. దాంతో వాణిజ్య సముదాయాలు, థియేటర్లలో వాడకం మొదలైంది. ఆతర్వాత చిన్న చిన్న ఏసీల తయారీకి గిరాకి పెరగడంతో 1928 లో ఇంట్లో వాడుకునే 'వెదర్ మేకర్ ' ని సృష్టించాడు. అదే ఇప్పుడు రకరకాల మార్పులతో ప్రపంచమంతా వ్యాపించింది అన్నమాట.

courtesy with Eenadu Telugu daily news paper
  • ================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

హిప్నాటిజం అంటే ఏమిటి?,What is Hypnotism?



ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు . చిన్న విషయమైనా , అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.



ప్ర : హిప్నాటిజం అంటే ఏమిటి, దీనిని ఎవరు కల్పించారు, ఎలా పని చేస్తుంది, ఎందుకు ఉపయోగిస్తారు ?

జ : హిప్నాటిజం అంటే సమ్మోహనపరిచే విద్య. ఇంగ్లాండ్ దేశపు డాక్టర్ జేమ్స్ బ్రెయిడ్ దీనికి శాస్త్రీయస్థాయిని కల్పించాడు. మాటల ద్వారా, కంఠస్వరం ద్వారా, ఎదుటివారి మనస్సుపై ప్రభావాన్ని కలుగజేసి, వారి మనస్సులపైన శరీరంపైన వారికి ఆధీనం తప్పింపజేయడమే హిప్నాటిజం అంటే. అలా ఆదీనం తప్పిన వ్యక్తులు నిద్రావస్థలోకి వెళ్ళి తమకు తెలియకుండానే హిప్నాటిస్ట్ ఏం చేయమంటే అది చేస్తారు. హిప్నాటిజం ద్వారా వ్యాధులను నయం చేసే పద్దతిని జర్మన్ దేశస్తుడైన 'ఫెడరిక్ ఆంటోన్ మెస్మర్' కనిపెట్టాడు. దీన్నే 'మెస్మరిజం' అంటారు. శారీరక, మానసిక వ్యాధులను నయం చేయడానికి 'హిప్నోథెరఫీ' ఎక్కువగా వాడుకలోకి వచ్చింది.

డాక్టర్ ఎన్ డైలే అనే ఆంగ్లవైద్యుడు భారతదేశంలో హిప్నాటిజం వ్యాప్తికి కృషిచేశాడు. ఆయన 19వ శతాబ్దంలో మత్తుమందు ఇచ్చి ఆపరేషన్ చేసే విధానం కనిపెట్టని సమయంలో రోగులను హిప్నాటైజ్ చేసి, వారికి ఏమాత్రం నొప్పిలేని విధంగా శస్త్ర చికిత్సలు, అంటే ఆపరేషన్‌లు చేసేవాడు. ఆపరేషన్ పూర్తయిన తరువాత రోగులను ప్రశ్నించగా, వారు తమకు ఏ నొప్పి కలుగలేదని చెప్పారట. ఆ పద్దతిలో డా.ఎన్ ‌డైలే ఆకాలంలో ప్రపంచవ్యాప్తంగా 300 ఆపరేషన్లు నొప్పి తెలియకుండా చేసి సంచలనం సృష్టించాడు. హిప్నాటిస్ట్ నేరాలు చేయదలచుకుంటే వశీకరణకు లోబడిన వారిని దీర్ఘసుషుప్తిలోకి తీసుకుపోయి తన ఇష్టం వచ్చినట్లు చేయించగలడు. అందుకే బ్రిటీష్ ప్రభుత్వం 1952లో హిప్నాటిజం చట్టం రూపొందించింది. దీని ప్రకారం శాస్త్రీయ ప్రయోజనాలకోసమో, లేక రోగులకు వైద్యం చేయడానికో తప్ప హిప్నాటిజాన్ని వాడకూడదు. ప్రస్తుతం అనేకమంది హిప్నాటిజాన్ని వృత్తిగా స్వీకరించి, అనేక మ్యాజిక్కులు చేసి ప్రేక్షకులకు వినోదం అందిస్తున్నారు.

  • =======================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

బార్ కోడ్స్ఎందుకు ఉపయోగిస్తారు?,What is the use of Barcode?



ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు . చిన్న విషయమైనా , అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.


ఫ్ర : మనం నిత్యం వాడుకొనే రకరకాల ఫ్యాన్సీ, స్టేషనరీ వస్తువుల నుండి పచారీ సరుకుల వరకు అన్నింటి ప్యాకింగ్ లపై ఈ మధ్య కనిపిస్తున్న నల్లని గీతలను చూస్తూ ఉంటాం. ఆ నల్లని గీతలు ఏంటి, ఎలా వస్తాయి, ఎందుకు ఉపయోగిస్తారు ?

జ : రకరకాల ఫ్యాన్సీ, స్టేషనరీ వస్తువుల నుండి పచారీ సరుకుల వరకు అన్నింటి ప్యాకింగ్‌లపై ఈ మధ్య కనిపిస్తున్న నల్లని గీతలను 'బార్ కోడ్స్' అంటారు.
* వీటిలో ఆయా వస్తువులకు సంబంధించిన వివరాలు నిక్షిప్తమై ఉంటాయి. బార్ కోడ్‌లోని వివరాలను స్కానర్ లేదా రీడర్ అనే యంత్రం సాయంతో తెలుసుకోవచ్చు. కంప్యూటర్‌తో అనుసంధానించి ఉండే ఈ స్కానర్ ద్వారా వివరాలు 0,1 సంఖ్యలు ఉండే బైనరీకోడ్ రూపంలో తెరపై పడతాయి.
* ఈ కోడ్‌తో సరితూగే సమాచారాన్ని కంప్యూటర్ అందిస్తుంది. వస్తువులపై ఉండే బార్‌కోడ్‌ను స్కానర్ ఎదుట పెట్టగానే, స్కానర్ నుంచి వచ్చే లేజర్ కిరణాలు దానిపై పడి పరావర్తనం చెందుతాయి. స్కానర్‌లోని దర్పణం ఆ సంకేతాలను కంప్యూటర్‌కు పంపుతుంది. కంప్యూటర్‌లో ఇవి విద్యుత్‌సంకేతాలుగా మారి తెరపై 0,1 సంఖ్యల రూపంలో కనిపిస్తాయి.
* బార్ కోడ్‌లో ఆ వస్తువు ఏ దేశంలో ఎప్పుడు తయారైనదో, ఎవరు దానిని ఉత్పత్తి చేశారో, ధర ఎంతో లాంటి వివరాలు ఉంటాయి. బార్ కోడ్‌లలో అనేక రకాలు ఉంటాయి. కోడ్‌లలో గీతలకింద సంఖ్యలతో సూచిస్తారు. ఉదాహరణకు సాధారణంగా మార్కెట్లో కనిపించే వస్తువులకు చెందిన కోడ్ (యూనివర్సల్ ప్రోడక్ట్ కోడ్) 12 అంకెల్లో ఉంటుంది.
* ఇందులో మొదటి అంకె ఆ వస్తువు తయారైన దేశపు కోడ్‌ను, తర్వాత అయిదు అంకెలు ఉత్పత్తిదారు కోడ్‌ను, ఆ తర్వాత అయిదు అంకెలు వస్తువు వివరాలను తెలుపుతాయి. చివరి అంకె ఆ కోడ్ కచ్చితత్వాన్ని చెబుతుంది. కంప్యూటర్‌లోకి ముందుగానే ఎక్కించిన వివరాలన్నీ ఈ కోడ్‌ను స్కానర్ చదవగానే తెరపై కనిపిస్తాయి.
* ఈ విధానం వల్ల ఒక్కో వస్తువు ధరను వేరువేరుగా చూసుకోవడం, వాటి ధరలను విడివిడిగా రాయడం వంటి పనులు తప్పి సమయం ఆదా అవుతుంది. రోజు మొత్తం మీద ఏయే వస్తువులు అమ్ముడయ్యాయో, ఆదాయమెంతో లాంటి వివరాలు కూడా కచ్చితంగా క్షణాలమీద తెలుస్తుంది.

  • ============================
visit My website > Dr.Seshagirirao - MBBS.

కరాటే విద్య అంటే ఏమిటి?,What is Karate fighting

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు . చిన్న విషయమైనా , అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.


పూర్వం చదువుల్లో యుద్ద విద్యలు కూడా ఒక భాగంగా ఉండేవి. కేవలం టెక్స్ట్ బుక్కులను బట్టీ కొట్టడమే కాకుండా, శరీర ధారుఢ్యం పెంచుకోవడానికి, శత్రువు నుంచి కాపాడుకోవడానికి కూడా యుద్ద విద్యలు అక్కరకొచ్చేవి. కర్రసాము, కత్తిసాము, మల్లయుద్దము, విలువిద్య... ఇవన్నీ మన యుద్దవిద్యలు, అయితే కాలక్రమంలో ఈ 'కరాటే' విద్య మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందింది. నిరాయుధంగా శత్రువు ఎదిరించడంలో కరాటే మించింది లేదు. 'కరాటే' అనే మాటకు అర్థమే 'ఖాళీ చేతులు' అని అర్థం.

జపాన్ దేశంలో పుట్టి చైనాలో విస్తృతంగా అభివృద్ధి చెందిన ఈ యుద్ధ విద్యను మొదటగా సాధన చేసింది బౌద్ధభిక్షవులు అహింసను ఆచరించే ఈ భిక్షవులు, బౌద్ధ ప్రచారం కోసం అడవుల్లో ప్రయాణించే సమయాన దొంగలను ఎదిరించడానికి ఈ యుద్ధకళను నేర్చుకున్నారు. కరాటేలో అనేక స్టయిల్స్ ఉన్నాయి. ఒక్కో ‌స్టయిల్‌కు ఒక్కో విధమైన సాధన అవసరం. అలాగే కరాటే వీరులకు ర్యాంకులు ఉంటాయి. ఒక్కో ర్యాంకును ఒక్కో బెల్టుతో సూచిస్తాయి. ప్రాథమిక స్థాయిలో వైట్ బెల్ట్, ద్వితీయ స్థాయిలో బ్రౌన్ బెల్ట్, సర్వోన్నత స్థాయిలో బ్లాక్ బెల్ట్ ఇస్తారు. బ్లాక్ బెల్ట్ నడుముకు చుట్టుకొని గోదాలో దిగాడంటే అతడు మాస్టర్ కింద లెక్క.

కరాటేలో జగమంతా తెలిసిన వీరుడు బ్రూస్-లీ. చైనాలో జన్మించిన బ్రూస్-లీ ఖాళీ చేతులతో ముప్పై, నలభై మందిని సులభంగా మట్టి కరిపించే సత్తా కలిగి ఉండేవాడు. ఆయన నటించిన 'ఎంటర్ ది డ్రాగన్' సినిమా ఇప్పటికీ టీవీలో ఆబాలగోపాలాన్ని అలరిస్తుంది. కుంగ్‌ఫూ వంటి మార్షల్ ఆర్ట్స్ ప్రాచుర్యం కలిగించిన వ్యక్తి జాకీ చాన్. మనుషుల్లో తొంభై శాతం మంచివాళ్ళే ఉన్నా పది శాతం దుష్టులు, దుర్మార్గులు ఉంటారు. ఎదుటివాళ్ళకు హాని చేయడానికి ప్రయత్నిస్తుంటారు. అటుమంటి వాళ్ళకు బుద్ది చెప్పాలంటే మనల్ని మనం కాపాడుకోవాలంటే కరాటే వంటి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం ఉత్తమం. చిన్నప్పటి నుండి కరాటే నేర్చుకుంటే సులభంగా వంటపడుతుందని అంటారు. మన రాష్ట్రంలో అనేక ముఖ్యపట్టణాల్లో కరాటే అకాడెమీలు ఉన్నాయి.
  • ==========================
visit My website > Dr.Seshagirirao - MBBS.

పాము తనని తాము కాటు వేసుకుంటే అది చనిపోతుందా?,Do snakes die by self bite or biting another snake?





ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు . చిన్న విషయమైనా , అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.

ప్రశ్న : పాము తనని తాము కాటు వేసుకుంటే అది చనిపోతుందా?

జవాబు: పాము తనను తాను కాటు వేసుకున్నా,లేక అది వేరే పామును కాటు వేసినా ఏమీ కాదు.కాని ఇతర ప్రాణులపై(ముంగిస మినహాయింపు) మాత్రం దాని ప్రభావం ఉంటుంది.పాము విషం అనేది సక్లిష్టమైన పాలీపెప్టైడు లతో మరియు ఎంజైములతో కూడిన ఒక ప్రోటీన్.ఈ విషం మూడు రకాలు.సైటో టాక్సిన్-ఇది కణాలను నేరుగా చంపేస్తుంది,హీమోటాక్సిన్-ఇది రక్తం గడ్డకట్టే వ్యవస్థను నాశనం చేస్తుంది,న్యూరో టాక్సిన్-శరీర కండరాలలో ఉండే అసిటైల్ కోలిన్ అనే రసానాన్ని నిరోధిస్తుంది,తద్వారా కండరాలన్ని చచ్చుబడి (Paralysis) పోతాయి.ఈ విధంగా పాము విషం శరీరంపై పనిచేయడం వల్ల జీవులు మరణిస్తాయి.ఐతే విచిత్రంగా పాము,ముంగిస లాంటి వాటి శరీరంలో ప్రత్యేకమైన వ్యవస్థ నిర్మితమై ఉంటుంది.వాటిలో విషప్రభావంకు గురయ్యే Receptors లేకపోవడం వలన ఆ విషం ఏమీ చేయదు.
  • =================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

చతుర్విధ పురుషార్ధాలు అంటే ఏమిటి?,What are the four desires of man?



ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు . చిన్న విషయమైనా , అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.


మానవుడు జీవితంలో వేటిని ప్రార్ధిస్తాడో వాటిని పురుషార్ధములు అంటారు. ప్రతివాడు కొన్ని కోరికలు కోరతాడు. అంటే ఒక లిస్ట్ ఇస్తాడు. ఎంత లిస్ట్ ఇచ్చినా సరే మొత్తం లిస్టంతా కాటగరైజ్ చేస్తే అవి అన్నీ సంపదలకి సంబంధించిన కోరికలు కొన్ని,సుఖాలకి సంబంధించినవి కొన్ని, వీటికి సాధనగా మంచి పనిచెయ్యాలి అనేటటువంటివి కొన్ని. తెలివి పెరిగిన కొద్దీ నేను శాశ్వతమైన సుఖంలో వుండిపోవాలి అనేటటువంటి కోరిక కొంత. ఈ రకంగా మన కోరికలు నాలుగు రకాలుగా విభాగం చేసినప్పుడు
ధర్మ సంబంధమైన కోరికలు కొన్ని--ధర్మము ,
అర్ధ సంబంధమైన కోరికలు కొన్ని--అర్ధము ,
కామ సంబంధమైన కోరికలు కొన్ని--కామము ,
మోక్ష సంబంధమైన కోరికలు కొన్ని--మోక్షము , ఉంటాయి... ఇవన్నీ పురుషుడు అర్ధించేవి కనుక పురుషార్ధములు.
  • ===========================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Wednesday, March 16, 2011

సముద్రపు నీటిలో బంగారం కరిగి ఉందా?,Gold is disloved in Sea water.Is it ?



ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు . చిన్న విషయమైనా , అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.

ప్రశ్న : సముద్రపు నీటిలో బంగారం కరిగి ఉంటుందట!.నిజమేనా?,Gold is disloved in Sea water.Is it true?

జవాబు: అవును.నిజమే.సముద్రాపు నీటిలో ప్రతి 10 ఘనపు కిలోమీటర్ నీటిలో 1 కిలో బంగారం కరిగి ఉంటుంది.భూమి మీద ఉన్న మొత్తం సముద్రపు నీటి నుండి బంగారాన్ని వేరు చేస్తే ఆ వచ్చే బంగారం ఎంత ఉంటుందో తెలుసా !ప్రపంచ జనాభా అందరికి ఒక్కొక్కరికి 10 కిలొల బంగారం ఇవ్వవచ్చు.ఐతే సముద్రపు నీటి నుండి బంగారాన్ని తయారు చేయడం అంత తేలికైన పని కాదు.ఎందుకంటే అంత నీటి నుండి దాన్ని రసాయన ప్రక్రియ ద్వారా వేరు చేయడమంటే దానికి చాలా వ్యయం అవుతుంది.అంటే 1 కిలో బంగారం కావాలంటె దానికి ఖర్చు కొట్ల రూపాయలలో ఉంటుంది.
  • =================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

హార్లిక్స్ చరిత్ర ఏమిటి?, What is the History of Horlicks?




హార్లిక్స్‌ను కనిపెట్టింది ఇద్దరు అన్నదమ్ములు. వాళ్ళ పేర్లు విలియం హార్లిక్స్, జేమ్స్ హార్లిక్స్. విలియం పెద్దవాడు. జేమ్స్ చిన్నవాడు. వీళ్ళది ఇంగ్లాండ్. కానీ పని వెతుక్కుంటూ అమెరికా వెళ్ళారు. ఇద్దరూ ఆహారపదార్థాల తయారీలో ప్రయోగాలు చేసేవారే. 1873 ప్రాంతంలో విలియం హార్లిక్స్ చంటిపాపల కోసం హార్లిక్స్ ను తయారుచేశాడు. అప్పట్లో వాళ్ళూ దానికి మాలెడ్ మిల్క్ అనే పేరు పెట్టారు. వేడి నీళ్ళలో ఈ పొడి కలుపుకొని తాగితే బాగుంటుంది. అని ప్రచారం చేశారు. ఆ ప్రచారం, హార్లిక్స్ రుచి అందరికీ నచ్చింది. అన్నదమ్ములు వెంటనే చికాగోలో ఫ్యాక్టరీ స్థాపించారు. 1908లో అమెరికా నుంచి తిరిగి స్వదేశానికి చేరుకొని హార్లిక్స్ వ్యాపారాన్ని మొదలెట్టారు. పసిపిల్లలే కాదు పర్వతారోహకులు కూడా హార్లిక్స్ తమ వెంట ఉంచుకొని దానికి ప్రచారం కల్పించడంతో హార్లిక్స్ అమ్మకాలు ఊపందుకున్నాయి. 1960లో హార్లిక్స్ పంజాబ్‌లో ఫ్యాక్టరీ పెట్టడం ద్వారా భారత్‌లో ఉత్పత్తి ప్రారంభించింది. ప్రస్తుతం ప్రపంచంలో హార్లిక్స్ అత్యధికంగా అమ్ముడు పోయేది ఇంగ్లాండ్, ఇండియా.

  • ==============================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Tuesday, March 15, 2011

జీవరాశి కేవలం భూమిమీదనే ఉందా?, Life is only on the Earth?



ప్రశ్న: ఈ అనంత విశ్వంలొ జీవరాశి కేవలం భూమిమీదనే ఉందా? వేరె ఇతర గ్రహాల మీద(గ్రహాంతర వాసులు) కూడా ఉన్నారా?

జవాబు: జీవం పుట్టుకకు మరియు దాని మనుగడకు కావలసిన వాతావరణం మనకు తెలిసి కేవలం ఈ భూమి మీదనే ఉంది.మిగతా గ్రహాలమీద నీరు లేకపోవడము,అధిక వేడిమి లేదా అతి శీతలం,ప్రాణ వాయువు లేకపోడము వంటి తీవ్ర ప్రతికూల పరిస్థితుల కారణంగా జీవం ఉండదనే చెప్పాలి.కాని....ఈ భూమి మీద లాగానే ఏ సుదూర గ్రహం మీదో అనుకూల పరిస్థితులు ఉంటే తప్పకుండా జీవం ఉండే అవకాశాలు కొట్టిపారేయలేం.


  • ==============================
visit My website > Dr.Seshagirirao - MBBS.

What is the history of Robo?,రోబో పుట్టుక చరిత్ర ఏమిటి ?




దేవుడు తన సృష్టి ద్వారా మనిషిని పుట్టిస్తే, మనిషి తన ప్రతి సృష్టి ద్వారా 'మరమనిషి' ని పుట్టించాడు. ఆ మరమనిషినే ఇంగ్లీషులో 'రోబో' అంటున్నారు. 1948 లో ఇంగ్లాండుకు చెందిన గ్రేవాల్టర్ తొలి "ఎలక్ట్రానిక్ ఆటోనామస్ రోబోట్" ను తయారు చేసినా అంతకు ముందే అనేక మంది ఈ మరమనిషి ఊహను చేశారు. క్రీ.పూ 450 సంవత్సరంలోనే గ్రీకు గణితవేత్త ఆర్కిటస్ ఒక 'మరపక్షి' ని తయారుచేసి (ఆవిరి ద్వారా) ఎగరేశాడట. ఆ తర్వాత సాహిత్యంలో, సైన్సు ఫిక్షన్‌లో కూడా రోబో ప్రత్యక్షమయింది. మొదట 'రోబో' అనే మాట 'కారెట్ లేపెక్' అనే 'చెక్ రచయిత' ఉపయోగించాడు. 'చెక్' భాషలో 'రోబో' అంటే బానిస అని అర్థం. అతడికి ఈ పదాన్ని అందించింది అతని తమ్ముడైన జోసఫ్ లేపెక్ అట. ఏమైనా 1950ల తర్వాత ఊపందుకున్న రోబోల తయారీ కాలక్రమంలో అమెరికా, జపాన్ దేశాల శాస్త్రజ్ఞుల ద్వారా రోజు రోజుకూ పరిణితి చెందింది. రోబోల తయారీ కోసమే రోబోటిక్స్ అనే సైన్సు పుట్టింది. మనిషి చేయలేని ప్రమాదకరమైన పనులకు (బాంబ్ డిప్యూజింగ్), లేదంటే మనిషితో అవసరం లేని పనులకు (ఫ్యాక్టరీల్లో కార్మికుల్లా) రోబోలను ఉపయోగించసాగారు. కాలక్రమంలో డొమెస్టిక్ రోబోలు వచ్చాయి. అభివృద్ది చెందిన దేశాల్లో పని మనుషులను పెట్టుకోవడం కంటే ఒక రోబోను కొనుక్కోవడం సులభం కనుక ఇంటి పనులు చేయడానికి డొమెస్టిక్ రోబోల అవసరం ఏర్పడి ప్రస్తుతం వాటి గిరాకీ ఎక్కువగా ఉంది. కాని రోబోల వల్ల జరుగుతున్న ఉపయోగకరమైన పనుల్లో అవి ఆపరేషన్లో సాయపడటం ఒకటి. డాక్టర్లకు సహాయంగా సూక్ష్మ భాగాల సర్జరీ కోసం అతి చిన్న రోబోలు తయారయ్యాయి. వీటిని "టినీ రోబోట్స్" అంటున్నారు. ఆపరేషన్ల సమయంలో మనిషి ద్వారా రోగికి ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఎక్కువ. కాని టినీ రోబోట్స్ ద్వారా ఆ ప్రమాదం పూర్తిగా తొలగిపోయి, ఆపరేషన్ అనంతరం రోగి త్వరగా కోలుకుంటున్నాడట. మొత్తం మీద 2020 నాటికి ఇంచుమించు మనిషిలాంటి రోబోలు తయారవుతాయని ఒక అంచనా. ప్రస్తుతం తాకడం ద్వారా అది ఏ వస్తువో గ్రహించే స్పెన్సర్లను తయారు చేసి వాటిని రోబోల చేతికి అమరుస్తున్నారు శాస్త్రవేత్తలు. ఈ ప్రయోగం సఫలం అయితే రోబోలకు స్పర్శాజ్ఞానం వచ్చేస్తుంది. అవి ఇంకా మెరుగైన సేవలు అందిస్తాయి. రోదసిలో, సముద్ర గర్భంలో... ఇంకా ప్రమాదకరమైన అనేక చోట్ల మనిషికి బదులు రోబో ఎంతో సహాయకారిగా పని చేస్తున్నా రోబోల వల్ల ప్రమాదాలు కూడా ఉండే అవకాశం ఉంది. కొంత కాలానికి రోబోలే మనిషి మీద పూర్తి ఆధిపత్యం సాధించవచ్చు. లేదంటే కొన్ని సైన్స్ ఫిక్షన్‌లలో జరిగినట్టుగా మనిషి అదుపు తప్పిన రోబోలు సర్వనాశనానికి ఒడిగట్టవచ్చు సైన్స్ వల్ల మంచి ఉంటుంది చెడు ఉంటుంది. రోబోల వల్ల మంచే జరగాలని కోరుకుందాం

మూలం : 8-7-2006, ఆంధ్రజ్యోతి, లిటిల్స్
  • =================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

అత్యదిక విద్యుత్తు ప్రవహిస్తున్న కరెంటు తీగ అనుకొకండా తెగి సముద్రంలొ పడితె సముద్రం మొత్తం షాక్ వస్తుందా?



ప్ర :అత్యదిక విద్యుత్తు ప్రవహిస్తున్న కరెంటు తీగ అనుకొకండా తెగి సముద్రంలొ పడితె సముద్రం మొత్తం షాక్ వస్తుందా?

జ : ఎంత విద్యుత్తు అయినా,ఎక్కడి విద్యుత్తైనా చివరికి ప్రవహించెది భూమిలొకే . విద్యుత్పత్తి కెంద్రాల్లో జనరెటర్ల లొ ఉత్పత్తి అయ్యె విద్యుత్ ఫేజ్ , న్యూట్రల్ అనే రెండు తీగల గుండా వెళ్తుంది. వీటిలొ ఫేజ్ లొ మాత్రం విద్యుత్తు ఉంటుంది. న్యూట్రల్ అంటె విద్యుత్ వలయాన్ని పూర్తి చెయాడానికి వాడే సింక్ లాంటిదన్నమాట. ఈ న్యుట్రల్ అంటె భూమె! భూమిలొ అత్యదిక బాగాన్ని అక్రమించి ఉన్న సముద్రంలొకి అదిక విద్యుత్తు ఉన్న తీగ తెగిపడినా ఆ విద్యుత్తు మొత్తం సముద్రంలొకి ఇంకిపొతుంది. సముద్రానికి కాని సముద్ర జల చరాలకు కాని ఎ మాత్రం షాక్ కొట్టదు. సముద్రం మొత్తం భూమికి అంటుకొకుండా విడిగా ఉన్నట్లైతె అప్పుడు మనం ఒక చెయ్యి సముద్రం లోను, మరో చెయ్యి భూమి మీద పెడితె మనకు షాక్ కొడుతుంది. కాని సముద్రాన్ని భూమి నుండి విడదీయలెం కదా.

  • ==================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Monday, March 14, 2011

పాలకూర, టమాటా రెండూ కలిస్తేరాళ్లవుతాయా?,DoTheMixerTomatoAndPaalakuuraProduceKidneyStones?




ప్రశ్న: పాలకూర, టమాటా కలిపి వండితే కిడ్నీల్లో రాళ్లు ఏర్పడతాయంటారు, నిజమేనా?

-జానపాటి శ్రీనివాస్‌, మిర్యాలగూడ

జవాబు: పాలకూర, టమాటా కలిపి వండుకుని తింటే చాలు రాళ్లు ఏర్పడతాయనేంత తీవ్ర స్థాయిలో దీన్ని నమ్మక్కర్లేదు. అయితే ఇలా చెప్పడానికి కొంత వరకూ కారణం కూడా లేకపోలేదు. పాలకూరతో పాటు ఏ కూరలోనైనా, నీళ్లలో అయినా కాల్షియం, మెగ్నీషియం లవణాలుంటాయి. టమాట, చింతపండు వంటి వాటి రసాల్లో టార్టారిక్‌, ఆక్టాలిక్‌ ఆమ్ల లవణాలు ఉంటాయి. కాల్షియం, మెగ్నీషియం అయాన్లు, టార్టరేట్‌ లేదా ఆక్సలేట్‌ అయాన్లు కలిసినప్పుడు వాటి గాఢత ఎక్కువ మోతాదులో ఉంటే అవి కాల్షియం టార్టరేట్‌ లేదా కాల్షియం ఆక్సిలేట్‌గా అవక్షేపం (precipitate) అవుతాయి. వీటి ద్రావణీయత (solubility) తక్కువ. అయితే కిడ్నీలు వడబోయలేనంత అధికమోతాదులో ఈ లవణాలను కూరగాయల్లో ఉండవు. కాబట్టి పరిమిత స్థాయిలో వాడితే ప్రమాదం లేదు.

-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్ర కమిటీ, జనవిజ్ఞాన వేదిక



  • =====================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

భూమిపై లాగే ఇతర గ్రహాలపై కూడా రుతువులు ఏర్పడుతాయా?


ప్రశ్న: భూమిపై లాగే ఇతర గ్రహాలపై కూడా రుతువులు ఏర్పడుతాయా?

-ఇ.వి. స్వామినాయుడు, పిడుగురాళ్ల (గుంటూరు)

జవాబు: మన భూమిపై రుతువులు ఏర్పడడానికి కారణం ముందుగా తెలుసుకోవాలి. తన చుట్టూ తాను బొంగరంలా తిరుగుతున్న భూమికి మధ్యలో నిట్టనిలువుగా ఒక రేఖను వూహించుకుంటే అదే దాని అక్షం అవుతుంది. భూపరిభ్రమణ అక్షం అనే ఈ వూహారేఖ ఏటవాలుగా ఉండి, భూమి సూర్యుని చుట్టూ తిరిగే కక్ష్యను సూచించే వలయాకారపు రేఖతో కొంత కోణాన్ని (23.5 డిగ్రీలు) చేస్తూ ఉంటుంది. ఇలా వంగి ఉండడం వల్ల సూర్యుడి కాంతి సంవత్సరంలో సగం కాలం ఉత్తరార్థ గోళంపైన, మిగతా కాలం దక్షిణార్థ గోళంపైన ఎక్కువగా ప్రతిఫలిస్తూ ఉంటుంది. అందువల్లనే రుతువులు ఏర్పడుతాయి. ఇతర గ్రహాల అక్షాలు, వాటి కక్ష్యా మార్గాలతో కూడా ఇలాంటి కోణాలు ఏర్పరచే పరిస్థితులు ఉంటే వాటిపైనా రుతువులు ఉంటాయి. ఉదాహరణకు అంగారకుడు (మార్స్‌) అక్షం, దాని కక్ష్యతో 25 డిగ్రీల కోణం చేస్తుండడంతో అక్కడ రుతువుల కాలాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఆ గ్రహం కక్ష్య అసాధారణంగా ఉండడంతో దాని ధ్రువాల వద్ద ఘనీభవించిన మంచుగడ్డలుండే ప్రదేశాలలో హెచ్చుతగ్గులు ఏర్పడుతూ ఉంటాయి.

అలాగే వరుణగ్రహం (యురేనస్‌)పై పరిస్థితులు మరీ విపరీతంగా ఉంటాయి. దాని అక్షం, దాని కక్ష్యతో 90 డిగ్రీల కోణం చేస్తుండడంతో సూర్యకాంతి దాని ఒక ధ్రువంపై పడినప్పుడు మరో ధ్రువం పూర్తిగా చీకటిగా ఉంటుంది. అది సూర్యుడి చుట్టూ తిరిగే కాలం భూమితో పోలిస్తే 84 సంవత్సరాలు కాబట్టి, సూర్యకాంతి దాని ఒక ధ్రువంపై 42 ఏళ్లు, మరో ధ్రువంపై మరో 42 ఏళ్లు ప్రసరిస్తూ ఉంటుంది. ఇలా గ్రహాల్లో రుతువులు ఏర్పడే పరిస్థితులు వాటి అక్షాల కోణాలు, కక్ష్యలను బట్టిమారుతూ ఉంటాయి.

-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌



  • ==============================
visit My website > Dr.Seshagirirao - MBBS.

నరికిన తర్వాత కొన్ని చెట్లెందుకు చిగురించవు?.Why some trees re-germinate after cut





ప్రశ్న: కొన్ని చెట్లను నరికినా తిరిగి చిగురువేసి జీవిస్తాయి. కానీ కొబ్బరి, తాటి, ఈతవంటి చెట్లను నరికితే మరణిస్తాయి. ఎందువల్ల?

-బి. రామకృష్ణ, 5వ తరగతి, మదర్‌ థెరిసా పాఠశాల, గుబ్బగుర్తి (ఖమ్మం)

జవాబు: జీవుల జీవన విధానాన్ని వాటి జన్యు నిర్మాణం (జెనెటిక్స్‌) నిర్ణయిస్తుంది. మొక్కల్లో వివిధ రకాల కుటుంబాలు, జాతులు ఉన్నాయి. కొబ్బరి, తాటి, ఈత వంటి చెట్లు ఏకదళ బీజ (monocotyledons)మొక్కలు. ద్విదళ బీజ మొక్కల్లోనే నరికినా చిగురించే లక్షణం ఉంటుంది. ఒక మొక్క లేదా జీవిలో కొంత భాగాన్ని కత్తిరించినా తిరిగి ఎదగాలంటే ఆయా భాగాల్లో స్టెమ్‌ సెల్స్‌ ఉండాలి. వీటి ఆధారంగానే నరికిన చెట్టు చిగురిస్తుంది. దీన్నే పునరుత్పత్తి (regeneration) అంటారు. తాటి, ఈత, కొబ్బరి వంటి మొక్కల కాండాల్లో ఈ కణాలు ఉండవు. కేవలం వృక్ష అగ్ర భాగంలోనే ఉంటాయి. కానీ మర్రి, జామ, వేప వంటి చెట్ల కాండాల్లో స్టెమ్‌సెల్స్‌ ఉంటాయి. వీటిలో కూడా తిరిగి చిగురించడం వాటి కాండాన్ని నరికిన ప్రదేశాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది.

-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక



  • ==================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Sunday, March 13, 2011

ఆకాశములో కాంతిపుంజాల కథేంటి?,Waht is the story of that light in the sky?





ప్రశ్న: వాతావరణంలో ఒకోసారి ఉన్నట్టుండి వెలుతురుతో కూడిన కాంతిపుంజాలు కనబడుతూ ఉంటాయి. దీనికి కారణం దైవమహిమా? మరేదైనా కారణమా?


జవాబు: ఉన్నట్టుండి ఇలా కాంతి వెలువడే సందర్భాలు రకరకాల కారణాల వల్ల ఏర్పడుతాయి. ఉదాహరణకి జనవరి నుంచి మార్చి వరకు భూమిపై ఏటవాలుగా పడే సూర్యకాంతిలో అతినీల లోహిత కిరణాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇవి సోకినప్పుడు గాలి కణాలలోని పరమాణువులు అయినీకరణం (Ionisation) చెందుతాయి. అంటే ఈ పరమాణువులు ఉత్తేజితమై ఎలక్ట్రాన్లను విడుదల చేస్తాయి. ఈ ప్రక్రియలో కాంతి వెలువడుతుంది. అవే కాంతి పుంజాలుగా కనిపిస్తాయి. తగిన పరిస్థితుల్లో ఇది పగటి వేళల్లో జరిగే భౌతిక చర్యే. అలాగే ఒకోసారి శ్మశానాల్లో మంటలు ఎగురుతూ కనిపిస్తే వాటిని కొరివిదెయ్యాలుగా చెబుతుంటారు. నిజానికి అక్కడి ఎముకల్లో ఉండే భాస్వరం (Phosphorus), గాలిలోని ఆక్సిజన్‌తో రసాయనిక చర్య జరపడం వల్ల ఏర్పడిన మంటలే అవి. ఈ ప్రక్రియనే 'స్ఫురద్దీప్తి' (Phosphorescence) అంటారు. అలాగే ప్రార్థనా మందిరాల్లో నేలపై పడిన కొబ్బరి నీళ్లలో, పూజాసామగ్రిలో ఉండే భాస్వరం, ఇంకా కోళ్లఫారాలు, పశువుల పాకల్లోని అవశేషాల్లో ఉండే భాస్వరం కూడా పగలంతా సూర్యరశ్మికి ఆవిరై రాత్రి వేళల్లో గాలిలోని ఆక్సిజన్‌తో సంయోగం చెంది కాంతి పుంజాలుగా మారవచ్చు. ఇలా వెలుతురుతో కూడిన మేఘాలను దైవమహిమగా భావించక్కర్లేదు. బిగ్‌బ్యాంగ్‌ వంటి అద్భుతం ద్వారా ఏర్పడిన విశ్వాన్ని ఇప్పటికీ సమగ్రరూపంలో ఉంచుతున్న అలౌకిక శక్తికి ఇలాంటి లీలలు చూపించాల్సిన అగత్యం ఏమాత్రం లేదు.

-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌


=======================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

పప్పు లో ఆ పురుగులు ఎక్కడివి?, We see worms in dall of corked bottle-How?



ప్రశ్న: కుంకుమ, పసుపు, రవ్వ, పప్పు గింజలు ఉండే డబ్బాలను మూతపెట్టి ఉంచినా కొంతకాలానికి పురుగులు వస్తాయి. ఎలా?


జవాబు: వాతావరణంలో మనకు కనిపించకుండా ఎన్నో సూక్ష్మజీవులు ఉన్నాయి. అలాగే కొన్ని జీవుల గుడ్లు కంటికి కనిపించనంత సూక్ష్మస్థాయిలో ఉండి గాలిలో తిరుగుతూ ఉంటాయి. మనం ఇంటికి తెచ్చుకునే దినుసుల్లో ఇలాంటి గుడ్లు చేరి ఉండే అవకాశం ఉంది. మూతపెట్టి ఉంచినా అనుకూల సమయం రాగానే ఆ గుడ్ల లోంచి పురుగులు బయటకి వస్తాయి. ఇంటికి తెచ్చుకోక ముందు కొన్ని దినుసులు తాజాగా ఉన్నప్పటికీ ఆయా డబ్బాలను తరచు తీసి వాడుతున్న సమయంలో సూక్ష్మజీవులు, గుడ్లు చేరే అవకాశం ఉంటుంది. అందువల్లనే దినుసులను వండుకునేప్పుడు మాత్రమే కాకుండా తరచు బాగు చేయడం, ఎండలో పెట్టడం వంటివి చేస్తుంటారు పెద్దలు.

-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక



  • ================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

ఇన్‌స్టెంట్‌ కాఫీని ఎలా తయారు చేస్తారు?, How do we get instnat coffee





ప్రశ్న: ఇన్‌స్టెంట్‌ కాఫీని ఎలా తయారు చేస్తారు?

-కె. సిద్ధార్థ, 9వ తరగతి, నిజామాబాద్‌

జవాబు: మనం ఒక కప్పు ఇన్‌స్టెంట్‌ కాఫీని తయారు చేస్తున్నామంటే ఆ కాఫీని రెండవ సారి మరిగిస్తున్నామన్నమాటే. ఎందుకంటే కాఫీ తయారీతోనే ఈ పొడి ఉత్పాదన మొదలవుతుంది. ముందుగా కాఫీ గింజలను వేయించి, పొడి చేసి, ఆ పొడిని నీటిలో కలిపి అధిక ఉష్ణోగ్రత వద్ద సలసలా మరగబెడతారు. ఈ ప్రక్రియలో నీరు చాలా వరకూ ఆవిరైపోయిన తర్వాత గింజల భాగాలను తొలగించగా మిగిలిన చిక్కని ద్రవాన్ని ఒక సన్నని నాజిల్‌ ద్వారా స్ప్రే రూపంలో వేడిగా, పొడిగా ఉండే గాలి ప్రవహిస్తున్న ఒక డ్రయింగ్‌ టవర్‌ లోకి పంపిస్తారు. ఇందులో కాఫీలో ఉన్న తేమంతా ఆవిరైపోయి పొడిగా ఉండే ఇన్‌స్టెంట్‌ కాఫీ పౌడర్‌ మిగులుతుంది. మార్కెట్లో దొరికే ఈ పొడిని వేడి పాలలో కానీ, నీటిలో కానీ కలిపితే తక్షణ కాఫీ సిద్ధం.

-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌


  • ==================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

ఎంత కోపములో కూడా ఆడవారు చెయ్యకూడని పనులు ఏమిటి?




ప్ర : ఎంత కోపములో కూడా ఆడవారు చెయ్యకూడని పనులు ఏమిటి?

జ : ఇది ఒక అద్యాత్మిక నియమ నిబందన . స్త్రీలు సహనానికి మారుపేరు . ఎంతకోపము వచ్చిన చేయకూడని పనులు చేయరారు . అమ్మ బిడ్డలకు ఆదర్శము .. అమ్మ చేసే ప్రతి పనిని బిడ్డ అనుకరిస్తుంది . అందుకే మన పురాణాలు ఎన్నో నీతిబోదనలు చేస్తున్నాయి. అందులోని భాగమే ఇది .
ధనాన్ని , అనగా భర్తపై కోపముతో నగలు విసిరేయడం భర్తకు హాని (ఉదా: కైకేయి ఈ పనిచేసినందునే భర్త ధశరదుడు చనిపోయాడని అంటారు ),
పనివాళ్ళ పై కోపము తో వంటపాత్రలు , చీపురు వంటివి విసిరేయకూడదు . అటువంటి చర్యవల్ల శ్రీ మహాలక్ష్మిని వద్దని .. ఆమె అక్క 'జేష్టాదేవి'ని ఆహ్వానించడమే , అని అంటారు.

  • ============================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

ధ్వజస్తంభము లేదా దేవాలయపు గోపురం నీడ పడిన ప్రదేశములో ఎందుకు కాపురముండకూడదు ?



ప్ర : ధ్వజస్తంభము లేదా దేవాలయపు గోపురం నీడ పడిన ప్రదేశములో ఎందుకు కాపురముండకూడదు ?

జ : ధ్వజస్తంభము లేదా దేవాలయపు గోపురం నీడ పడిన ప్రదేశము నకు సూర్యరశ్మి సరిగా పడాల్సినంత పడదు . తగినంత సూర్యరశ్మి లేనిచో అనారోగ్యా నికి గురికావచ్చును. నీడ పడిన ప్రదేశము పరమాత్మ ఆవహించిన ప్రదేశము అంటే .. ఆలయము లో జరిగే గుడి గంటల శబ్దాలు(శబ్దకాలుష్యము) , దూపదీపాలనుండి వచ్చే పొగ(వాయుకాలుష్యము) , రోజూ గుడికొచ్చే భక్తుల రద్దీ , వారి ఉశ్వాస -నిశ్వాసానుండి వెలువడే సూక్ష్మక్రిముల దాడి(వైరల్ ఇన్‌ఫెక్షన్‌) నుండి మానవ ఆరోగ్యము పాడయ్యే అవకాశము ఉన్నందున కనీసము గోపురం నీడ పడిన దూరము వరకైనా నివాసము కూడదని ఈ ఆద్యాత్మిక నియమనిబందనలు పెట్టేరు మన పూర్వీకులు. తాను ఉన్న ప్రదేశములో ప్రజల అనారోగ్యము స్వామికి ఎంతమాత్రము ఇస్టముండదు కదా... అని సర్ది చెప్పినట్లు భావించాలి .

  • ==========================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

స్త్రీలు కాలి బొటన వేలిని నేలకు రాయకూడదని అంటారు ఎందుకని ?




ప్ర : స్త్రీ కాలు బొటన వేలిని నేలకు రాయకూడదని అంటారు ఎందుకని ?
జ : స్త్రీ కి సిగ్గే అందము . అయితే కొంతమంది తమ కాలు యొక్క బొటనవేలిని నేలకు రాస్తూ సిగ్గుపడతారు . అది ఆరోగ్యరీత్యామంచిది కాదు . ఆక్యుపంచర్ వైద్యవిధానము ప్రకారము అక్కడ ఉన్న నరాలు గర్భానికీ , హృదయానికీ సంభందించినవి అయి ఉంటాయి . వాటిపై ఒత్తిడి తేవడం ఆరోగ్యరీత్యా మంచిదికాదని ... సంతానము కలుగదని ఆ శాస్త్రము వల్ల తెలుస్తుంది .

  • =========================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

గృహము లో దేవతా విగ్రహాల ఎత్తు ఎంత ఉండ వచ్చును ?




ప్ర : గృహము లో దేవతా విగ్రహాల ఎత్తు ఉండ వచ్చును ?
జ : గృహము లో దేవతా విగ్రహం రెండు అంగుళాలు మించి ఉండకపోతే మంచిది . ఆ ఎత్తు దాటితే స్వామికి మనము చేసే పూజ తృప్తినివ్వదు . దానివల్ల అనవసర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని పురాణాలు చెపుతున్నాయి. ఇది ఒక నమ్మకమేనని నా అభిప్రాయము . అలాగే కుంకుమ పూజ చేసేటపుడు అమ్మవారు ముఖము మీద కుంకుమ పడేలా పూజ చేయకూడదు.
  • ==============================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Saturday, March 12, 2011

పతియే దైవమని తెలిసినా భర్త ని కాదని గుడిలో దేవుని పూజిస్తారెందుకు?



ప్ర: అహర్ణిశలు తన కుటుంబ క్షేమము కోసం పాటు పడే భర్తని కాదని గుడులు , ఆశ్రమాల వెంట తిరిగే భార్యలనేమనాలి?
జ : ప్రత్యక్ష దైవము కంటే పరోక్ష దైవమే కాపాడు తాడనే బరోసా కలిగే వారని అనాలి . పొరిగింటి పుల్లకూర రుచి అనే సామెత నిజమని రుజువు చేసేవారు . ఆడది అహంకారము తో కూడికొని జన్మించినది . తన అంకెకు రాని మహాబలాడ్యు వేబంగులమాయలొడ్డి చెరుపన్‌ తలపెట్టు . అందుకె " అంగను నమ్మరాదు " అని ఒక మహాకవి అన్నాడు . భర్తను కాల్చుకుతినేవాళ్లు భర్త ఆయుర్ధాయం కోసం పూజలు చేస్తారు . ఈ ప్రవృత్తి మనకర్ధము కాదు .

  • ======================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Friday, March 11, 2011

దీపాన్ని ఏ నూనెతో వెలిగించాలి?,Which oil good to lit the Lamp at God




ప్ర : దీపాన్ని ఏ నూనెతో వెలిగించాలి?,Which oil good to lit the Lamp at God

జ : దీపారాధనకు హైందవ సంప్రదాయంలో అత్యంత ప్రాధాన్యముంది. సకల సిరులను, సంపదలను ప్రసాదించే లక్ష్మీదేవి జ్యోతి స్వరూపిణి. ఏ శుభకార్యం ఆరంభించినా, ముందుగా దీపప్రజ్వలనం చేయడం మన ఆచారం. దీపం వెలిగించేముందు 'దీపం జ్యోతిపరబ్రహ్మ దీపం సర్వతమోపహరమ్‌' అన్న శ్లోకం పఠిస్తారు. పర్వదినాలు, పండగలు, శుభకార్యాలు, పుష్కరాలు, వ్రతాలు, ఉద్యాపనలు, సభలు, సమావేశాలు, ప్రవచనాలు, భజనలు, సత్సంగం- దీపసమర్పణకు అనుకూల సమయాలు. శివరాత్రి, పూర్ణిమ, సోమవారం, దీపావళి, కార్తీకమాసంలోని ముప్ఫై రోజులూ, జ్వాలాతోరణ దీపాలు అత్యంత ప్రశస్తమైనవి. దానాలన్నిటికన్న దీపదానం శ్రేష్ఠమైనదని పురాణ కథనం.

  • ఆవునెయ్యి ఉత్తమం.
  • మంచి(నువ్వుల ) నూనె మధ్యమము.
  • ఇప్ప నూనె అధమము.
  • వేరుశనగ నూనెతో దీపాన్ని దేవుని ముందు పెట్టరాదు.

ఆవు నెయ్యితో వెలి గించిన దీపం ఫలం అనంతము. అష్టైశ్వ ర్యాలూ, అష్టభోగాలు లభిస్తాయి. వెండి లేదా పంచలోహాలతోనూ, మట్టితో చేసిన ప్రమిదలు శ్రేష్టము. ఆముదంతో వెలిగించిన దాంతపత్యసుఖమూ, జీవిత సౌఖ్యమూ లభిస్తాయి.

శ్రీ మహాలక్ష్మికి ఆవునెయ్యి దీపమూ, గణపతికి నువ్వుల నూనెతో వెలిగించిన దీపమూ అన్నా ప్రీతి.



  • ==========================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

కొత్త బట్టలకు నలువైపులా పసుపు ఎందుకు రాస్తారు?,Why do corners of new clothes paste with Turmeric



ప్ర : కొత్త బట్టలకు నలువైపులా పసుపు ఎందుకు రాస్తారు?,Why do corners of new clothes paste with Turmeric?

జ : -ఈ ఆచారాన్ని మన పూర్వీకులు ఆరోగ్యం కోసం పెట్టారు. బట్టలను మగ్గాలపై నేస్తారు. నేసే ముందు నూలుకు పిండితో తయారయిన గంజి పెడతారు. అలా గంజి పెట్టి నేయటం వల్ల అనేక రోగక్రిములు వస్త్రాల్లో చేరతాయి. అలాంటి వస్త్రాలను ధరిస్తే చర్మ సంబంధిత రోగాలొస్తాయి. అందుకే క్రిములను దూరం చేసే పసుపును నలువైపులా రాసి ఆపై ధరించమని చెబుతారు. పసుపు మంగళకరానికి కూడా గుర్తు. అందానికి ప్రతీక . స్త్రీలకు పసుపు కుంకుమే అందము . కావున అందాన్ని ... ఆరోగ్యాన్ని ఇచ్చే పవుపు కొత్త బట్టలకు నాలుగు మూలలా రాస్తారు .


  • ============================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Thursday, March 10, 2011

గడ్డం-గత వైభవం ఏమిటి?, What was Beard importance in history?






--ప్రాచీన కాలపు బాబిలోన్‌లో గడ్డాలకు గొప్ప గౌరవం ఉండేది. నిజం చెప్పాలంటే అన్ని ప్రమాణాలూ గడ్డం సాక్షిగా జరిగేవి. మనిషి గడ్డాన్ని పట్టుకోవడం అన్నది క్రీ.పూ. 2వ సహస్రాబ్దిలో సన్నిహిత స్నేహానికి గుర్తుగా పరిగణించే వారు. గడ్డాన్ని పట్టుకొని లాగడం అన్నది మొరటైన పనిగా మాత్రం కాదు అతి అవమానకరమైన పనిగా గుర్తింపబడేది. కొంత మంది గడ్డాన్ని వివేకపు చిహ్నం గా పరిగణిస్తారు. ప్రాచీన కాలపు ఈజిప్టువారి సంఘంలో గడ్డం ఒక హోదాను సూచించేది. గడ్డం ఎంత పొడవుగా ఉంటే వారు అంత గొప్ప హోదాకలవారిగా గుర్తింపబడేవారు.

ఎక్కడ వారి గడ్డాలలో ఒకే ఒక వ్యత్యాసం ఉండేది. క్రీ.పూ. 3000 సంవత్సరాల క్రితం ఉన్న ఈజిప్టువారు కృత్రిమ గడ్డాలను ధరించేవారు. అలెగ్జాండర్‌ (క్రీ.పూ.356-323) తన సైనికులకు గడ్డం పెంచేందుకు అనుమతి ఇవ్వలేదు. గడ్డాలు కొంతమంది ముఖానికి అందాన్ని చేకూరుస్తున్నాయి. అప్పుడప్పుడు గడ్డాలు మనిషి ముఖంపై ఉన్న మచ్చలనూ, దెబ్బల గుర్తును కప్పిపుచ్చుకునేందుకు కూడా ఉపయోగపడుతాయి. తన ముఖంపై ఉన్న గాయపు మచ్చలను కప్పిపుచ్చుకోడానికి రోమన్‌ చక్రవర్తి హాడ్రియన్‌ (క్రీ.శ.117-138) గడ్డాన్ని పెంచాడు. అది ఒక ఫ్యాషన్‌గా తయారయ్యింది. గడ్డాలను పెంచుకోవడం అన్నది 400 సంవత్సరాల తరువాత తిరిగి ప్రారంభమయ్యింది. దీనికి ముందు ఉత్తమ తరగతి రోమన్లు తమ బానిసలకు శుభ్రంగా క్షవరం చేయించేవారు. ప్రాచీన కాలపు గ్రీకులలో మగవారు గడ్డాలు క్షవరం చేయించుకోవడానికి మంగలి షాపులకు వెళ్లేవారు. ఇలా క్షవరం చేయించుకోవడం వల్ల మంగలి వారి ఆదాయం విపరీతంగా పెరిగిపోయింది.

ప్రాచీన కాలపు గ్రీకులలో మొదటిసారి పెరిగిన గడ్డాన్ని ఆనవాయితీ ప్రకారం అపోలో దేవతకు సమర్పించుకునేవారు. అపోలో దేవుడు సూర్యరశ్మి, సంగీతం, కవిత్వానికి సంబంధించిన దేవుడిగా ఉండేవాడు. రోమ్‌లో కూడా ఇలాంటి ఆనవాయితీ ఉండేది. ప్రాచీన కాలంలో ప్రజలు వెంట్రుకలను జీవితంగా, జీవితపు శక్తిగా పరిగణించారు. 6వ ఎడ్వర్డ్‌ చక్రవర్తి (1547-1553) కాలంలో ఇంగ్లాండులోని సామాన్యులకు గడ్డం పెంచుకునే అధికారం ఉండేదికాదు. వారు 3 వారాల గడ్డాన్ని మాత్రం కలిగి ఉండవచ్చు. అంతకు మించి కాదు. కొంతమంది రాజులు పెంచిన గడ్డాలపై సుంకం విధించి తద్వారా దేశ ఆర్ధిక పరిస్థితిని మెరుగుపరచేందుకు కష్టపడ్డారు.

-1558లో మొదటి క్వీన్‌ ఎలి జబెత్‌ గడ్డాలపై సుంకాన్ని విధించింది. ఇది చాలా అప్రతిష్టపాలు కావడంతో ఆపై సంవత్సరం ఇది వాపసు తీసుకోబడింది. మొదటి ఎలిజబెత్‌ రాణి చేసిన నేరాన్నే రష్యా దేశపు చక్రవర్తి పీటర్‌ చేశాడు. 1968లో గడ్డం పెంచుకున్న వారిపై 100 రూబుల్స్‌ పన్ను విధించాడు. ఆ రోజుల్లో గడ్డం పెంచుకునేందుకు లైసెన్స్‌ పొందవలసి వుండేది. ఒక రాతి తట్ట రూపంలో సుంకం కట్టాల్సి వచ్చింది. లైసెన్స్‌ను పొందకుండా గడ్డం పెంచడం అన్నది ఒక నేరంగా ఒక అపరాధంగా పరిగణించబడేది. మొగలాయి చక్రవర్తులలో చక్రవర్తి అయిన ఔరంగజేబు (1618-1707)కు గడ్డాల వెర్రి కాస్త ఉండేది. గడ్డం అన్నది నిజంగానే వివేకానికి చిహ్నం అని రష్యా దేశపు చక్రవర్తి పీటర్‌ ది గ్రేట్‌ (1682- 1725) భావించాడు. గడ్డం నున్నగా గీయించుకున్న రాజదూత తన పరి చయ పత్రాన్ని సమర్పించడానికి వస్తే దాన్ని స్వీకరించడానికి రష్యా దేశపు పీటర్‌ నిరాక రించాడు. గడ్డం పెంచడం ద్వారా అబ్రహాం లింకన్‌ ప్రత్యేకమైన సౌందర్యాన్ని పొందాడు.
  • ====================================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

దానము అంటే ఏమిటి?, What is Donation?




దయతో ఇచ్చేది దానము. దీన్ని ఇంగ్లిష్ లో డొనేషన్‌ అంటాము. దానము అనేది అవతలి వారు అడినది ... వారికి ఉపయోగపడేది ఇచ్చే వస్తువు . మనకి పనికిరాని పుస్తకాలు , దుస్తులు , మెడిసిన్స్ , ఆహారపదార్దాలు డొనేట్ చేస్తూ ఉంటాము . మన ఆత్యాద్మిక శాస్తాలలో చెప్పిన దానము వేరు ...నీకు పనికి రానిది ఇవ్వవడం దానము కాదు . అవతలవ్యక్తికి పనికివచ్చే వస్తువునే దానము చేయాలి . . , అదే నిజమైన దానము ఫలితముంటుంది . దానము అందుకునే వారు దీవించే దీవెనలే గృహస్తులకు మేలుచేస్తాయి. దానము చే్స్తే పుణ్యము వస్తుందంటారు . అసలు పుణ్యమంటే ఏమిటి? . ఈ విశ్వములో 80 లక్షల రకాల జీవులు ఉన్నాయని అంచనా .
పుణ్యము : ఇతత జీవులకు కస్ట , ఇస్ట , నస్టము కానివి ఏదైనా ... కస్టము కలిగించని , ఇస్టమైనది , నస్టము కానిది చేసే కార్యాలే (పనులే)పుణ్యము. నస్టమైనవి , ఇస్టము లేనివి , కస్టము కలిగించేవి .. పాపము .(పాపకార్యాలు )


దానాని సంబంధిత పదాలు

1. వస్త్రదానము.
2. అన్నదానము.
3. భూదానము.
4. విద్యాదానము.
5. గుప్తదానము.
6. కన్యాదానము.
7.సాలగ్రామ దానము .
8.హిరణ్య దానము

దశవిధ దానములు :- 1.స్వర్ణ దానము, 2.రజిత దానము, 3.గో దానము, 4.అన్న దానము, 5.వస్త్ర దానము, 6.విద్యాదానము.7.రక్త దానము ,8.భూ దానము ,9.గుప్త దానము ,10.కన్యా దానము ,

  • ===============================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Tuesday, March 08, 2011

ద్వైతం అద్వైతం విశిస్టాద్వైతం అంటే ఏమిటి?,Waht are Dwaitham- Adwaitam- VisTaAdwitam ?



ద్వైతం : నీవు దైవం ; నేను జీవున్ని ..... నీవు గురువు , నేను శిష్యుణ్ణీ అన్నది ద్వైతం .
మధ్వాచార్యులు ప్రవచించిన మతం. జీవాత్మ, పరమాత్మలు రెండూ వేర్వేరుగా ఉంటాయని చెబుతుంది.

సృష్టిలో కంటికి కనిపించే ప్రతిదీ.... కంటికి కనిపించని పరమాత్మ వాసుదేవుడి మీద ఆధారపడి ఉంటుందని, ఆయనే ఈ సృష్టికి మూలకారకుడని తెలుపుతుంది.
  • ---------------------------------------------------------------------
అద్వైతం : నీవు -నేను ఒక్కటే అన్నది అద్వైతం .



అద్వైతం అనగా భాషాపరంగా అర్థం "ద్వైతం"కానిది, జీవాత్మ, పరమాత్మల ఏకత్వ భావనే అద్వైత సిద్ధాంతానికి ప్రాతిపదిక. ఆది శంకరాచార్యులు ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. శంకరుడు బోధించిన తత్వం "అద్వైతం" - అనగా రెండు కానిది. ఆత్మ, బ్రహ్మము (పరమాత్మ) ఒకటే అనేది అద్వైతం మూల సూత్రం.


చారిత్రకంగా దీని ప్రతిపాదకుడు గౌడపాదాచార్యుడు. ఇతడు శంకరుని గురువైన గోవింద భగవత్పాదునకు గురువు. అయితే మనకు లభించిన సాహిత్యం ప్రకారం ఈ తత్వానికి మూలగ్రంధాలు ప్రస్థానాత్రయం (Prasthanatrayi) — అనగా ఉపనిషత్తులు, భగవద్గీత మరియు బ్రహ్మసూత్రాలకు శంకరుడు రచించిన భాష్యాలు.
  • -----------------------------------------------------------------------------------------------
విశిష్టాద్వైతం : నీవు(దేవుడు) -నేను(జీవి) -ప్రకృతి(పంచభూతాలు) అన్నవి వేర్వేరు అయినా ఒకదానిలో ఒకటి మిలితమై అంతటా వ్యాపించి ఉంటాయి .
విశిష్టాద్వైతం అనేది 11వ శతాబ్దిలో రామానుజాచార్యుడు ప్రతిపాదించిన వేదాంత దర్శనము.


జీవుడు, ప్రకృతి, ఈశ్వరుడు - మూడూ సత్యములని విశిష్టాద్వైతము అంగీకరిస్తున్నది. 'చిత్' అనబడే జీవునితోను, 'అచిత్' అనబడే ప్రకృతితోను కూడియే ఈశ్వరుడుండును. శరీరములో జీవుడున్నట్లే, జీవునిలో అంతర్యామిగా శ్రీమన్నారాయణుడు ఉండును. ఆజ్ఞానవశమున జీవుల సంసారబంధమున చిక్కుకొందురు. భగవదనుగ్రహమువలన, సద్గురుకృప వలన, భగవంతునకు శరణాగతులైనవారు అజ్ఞానమునుండి విముక్తులై, మరణానంతరము మోక్షము పొందుదురు. అలా నారాయణ సాన్నిధ్యము పొందినవారికి మరుజన్మలేదు.


  • ======================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Monday, March 07, 2011

Telugu old writers and their books, ప్రాచీన తెలుగు కవులు వారి గ్రంధాలు పేర్లు ఏమిటి?



  1. వేములవాడ భీమకవి -- కవిజనాశ్రయం ,
  2. మారన --మార్కండేయ పురాణము ,భాష్కర శతకం .
  3. కేతన ---దశకుమార చరిత్ర ,
  4. మంచన --- కేయూరబాహు చరిత్ర ,
  5. బద్దెన --- సుమతీ శతకం ,
  6. నాచన సోమన --- ఉత్తర హరివంశం ,
  7. జక్కన --- విక్రమార్క చరిత్ర ,
  8. అనంతామాత్యుడు --- భోజరాకీయము , అనంతుని చందము ;
  9. దగ్గుపల్లి దుగ్గన --- నాసికేతోపాఖ్యానం ;
  10. పిల్లలమర్రి పినవీరభద్రుడు --- శృంగార శాకుతలం , జెమినీ భారతం ;
  11. దూబగుంట నారాయణకవి ---పంచతంత్రము ,;
  12. కొరవి గోపరాజు --సింహాసనా ద్వాత్రింశిక ,;
  13. తిరుపతి వెంకట కవులు -- పాండవోగ్యోగ విజయములు , దేవీ భాగవతం ;
  14. నంది మల్లయ, ఘంటసింగన(జంటకవులు) ప్రబోధ చంద్రోదయం , వరాహ పురాణం ;
  15. చేమకూర వేంకటకవి -- విజ విలాసం .;
  16. సువవరం ప్రతాపరెడ్డి --- ఆంధ్రుల సాంఘిక చరిత్ర ;
  17. చిలకమర్తి లక్ష్మీనరసింగం --- గయోపాఖ్యానం ;
  18. రాజశేఖర శతావధాని -- రాణాప్రతాప్ సింహ చరిత్ర , ;
  19. తుమ్మల సీత్రారమమూర్తి చౌదరి -- రాస్ట్రగానం , బాపూజీ ఆత్మకధ ;
  20. ఆరుద్ర -- సమగ్ర ఆంధ్ర సాహిత్యం ;
  21. గడియారం వేందట శేషశాస్త్రి --- శివబారతం ,;
  22. దాశరధి --- తిమిరంతో సమరం ;
  23. శ్రీపాద కృష్ణమూర్తి -- బొబ్బిలియుద్ధం , రామాయణ భారత భాగవతాలు ;
  24. దువ్వూరి రామిరెడ్డి --- పానశాల ,
  25. ఏనుగు లక్ష్మణ కవి --- భర్తృహరి సుభాషితాలు ,
  26. కంచర్ల గోపన్న ----దాశరధీ శతకం ,
  27. వేమన ---- వేమన పద్యాలు ,
  28. నృసింహ కవి ----కృష్ణ శతకం , .
  29. శేషప్ప కవి ---- నృసింహ శతకం .
  30. అన్నమయ్య --- శ్రీ వెంకటేశుని కీర్తనలు .
  31. త్యాగయ్య ----- త్యాగరాజ కీరతనలు .

  • ========================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Friday, March 04, 2011

రాత్రులు హాయిగా నిద్ర పోవడం ఎలా?, How to get good sleep at night?


ప్ర :
రాత్రి హాయిగా నిద్ర పోవాలంటే ఏమి చేయాలి?.

జ : నిద్ర లేదా నిదుర (Sleep) ఒక శరీరానికి సంబంధించిన విశ్రాంతి స్థితి. ఇది జంతువులలోనే కాకుండా పక్షులు, సరీసృపాలు, ఉభయచరాలు మరియు చేపలలో కూడా కనిపిస్తుంది. మనుషులు, ఇతర జంతువులలో దైనందిక నిద్ర బ్రతకడానికి అవసరం. 8 గంటల కంటే తక్కువ నిద్రపోయిన వారిలో శరీర సామర్ధ్యం తగ్గినట్లుగా గుర్తించారు. అయితే నిద్ర యొక్క ప్రాముఖ్యత గురించి ఇంకా పూర్తిగా అర్ధం కాలేదు. విస్తృతమైన పరిశోధనలు జరుగుతున్నాయి. గాలి ,నీరు , ఆహారము లాగే నిద్ర కూడా ఒక సహజ శారీరక అవసరము . ఎవరెన్ని గంటలు నిద్రపోవాలన్న అంశం పైన భిన్నాబిప్రాయాలు ఉన్నా వేళకు తిని , వేళకు పడుకుంటే ఆరోగ్యాము నిక్షిప్తం గా ఉంటుంది . అలసిన మనసుకు , తనువుకు నిద్ర ఒక వరము .

మంచి నిద్ర రావడానికి ఈ క్రింది చూచనలు పాటించాలి :
  • * రాత్రి 9 గంటలు దాటిన తరువాత ఆల్కహాలు తీసుకోడదు . ఆల్కహాలు మధ్యలో నిద్రను చెడగొడుతుంది .
  • * రాత్రి 7 గంటలు తరువాత తీ , కాఫీ , కెఫీన్ ఉన్న పానీయాలు తీసుకోకూడదు ,
  • * రాత్రి ఆలస్యము (చాలా పొద్దుపోయిన తర్వాత) గా ఆహారం తినకూడదు.
  • * రాత్రులు ఎక్కువగా ఆహారము (full meal) తినకూడదు ,డిన్నర్‌లో తేలిగ్గా జీర్ణమయ్యే ఆహార పదార్థాలను మాత్రమే తీసుకోవాలి.
  • * పడుకునే ముందు వ్యాయామము చేయకూడదు ,
  • * పడక గదిని ... పనిచేసే ఆఫీస్ గది గా మార్చకూడదు ,
  • * పడుకునే ముందు వేడిపాలు తాగితే మంచి నిద్ర వస్తుంది .
  • పదుకునే సమయానికి గంట ముందు టెలివిజన్‌ ఆపెయ్యాలి -టి.వి , కంప్యూటర్ లో వచ్చే వెలుగు , రంగులు కళ్ళను , మెదడును ఇబ్బంది పెడతాయి , మెదడు ఉత్తేజ పడడం , ఎడ్రినల్ హార్మోను ఉప్ప్తత్తి దీనికి కారణము ,
  • * నిద్ర రానపుడు ఏదైనా మంచి పుస్తమును చదవాలి - సెక్ష్ నవలలు , డిటెక్తివ్ పుస్తకాలు చదువరాదు .. ఇవి మెదడును ఉత్తేజపరచి ఎడ్రినాలిన్‌ , నార్ ఎడ్రినాలిన్‌ ఉప్పత్తి అయి నిద్ర రానివ్వవు ,
  • * నిద్రపోయేముందు వేడినీళ్ళ స్నానము చేస్తే మంచి నిద్ర పడుతుంది ,
  • * సుఖ నిద్ర పోవటానికి ఆహారం, పానీయాలు తోడ్పడతాయి . మంచి ఆహారం, సుఖనిద్ర ఆరోగ్యానికి చాలా అవసరం.
  • * శరీరంలో షుగర్‌ సమస్థితిలో ఉండేలా చూసుకోవాలి. బ్లడ్‌షుగర్‌ తక్కువగా ఉన్నట్లయితే నిద్రపట్టదు. కలత నిద్ర కలుగుతుంది.
  • * ఆహారం తీసుకున్న వెంటనే మత్తుగా అనిపించి కునుకు పట్టొచ్చు. ఆహారం తీసుకున్న వెంటనే నిద్రపోవటం ఆరోగ్యకరం కాదు కొంతసేపటికి నిద్రా భంగం కలిగి, తర్వాత నిద్ర పట్టకపోవచ్చు. ఆహారం తీసుకున్నాక కొంత సమయం తర్వాతనే పడకచేరాలి.
  • * పడక చేరబోయేముందు ఎక్కువ నీరు తాగకూడదు.
  • * మూత్ర విసర్జన చేసి పడకచేరాలి.

  • ====================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

దగ్గు ఎందుకు వస్తుంది ? , Why do we get cough?


  • Cough Syrup - Coughing
  • దగ్గు మందు ------------------------------దగ్గు .

ప్ర : ప్రతి ఒక్కరూ ఎదో ఒక సందర్భములో దగ్గుతారు ఎందుకు?
జ : పలు సందర్భాలలో దగ్గుతో భాద పడడం మన అందరికీ అనుభవమే. దీనికి కారణము గొంతులో గాని , వాయునాళములో గాని చేరిన సూక్ష్మక్రిములు , సూక్ష్మపదార్ధములు , కఫమును బయటకు పంపేందుకు శరీరం చేసే ప్రయత్నమే దగ్గు . దగ్గినపుడు ఊపిరితిత్తుల్లోని గాలి వేగంగా బయటకు వస్తుంది . దీని వల్ల ఏర్పడే ఒత్తిడి గొంతు , శ్వాసనాళాల్లోని పదార్ధములను బయటకు పంపుతుంది . కావున శ్వాసనాళాల్లోని , ఊపిరిత్తులల్లోని కఫాన్ని క్లియర్ చేసేందుకే దగ్గు వస్తుంది .
మన డయాప్రమ్‌ బలముగా సంకోచము (Diaphrgm ) చెందడము , ప్రక్కటెముకలు మధ్యఉన్న కండరాలు(inter costal muscles) ఒక్కసారిగా సంకోచము అవడం మూలాన ఈ పక్రియ జరుగుతూ ఉంటుంది .

  • ==================================
visit My website > Dr.Seshagirirao - MBBS.