Sunday, March 27, 2011

సి.సి.కెమేరా లో దృశ్యం సరిగా ఉండదేం?,Why do the picture not clear in c.c cameras?



ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.


ప్రశ్న: సీసీ కెమేరాలతో తీసిన బొమ్మ స్పష్టంగా ఉండదు. ఎందుకని?

-పి. మార్టిన్‌, సెయింట్‌ మేరీ పాఠశాల, పాలకొల్లు

జవాబు: సి.సి. (క్లోజ్‌డ్‌ సర్క్యూట్‌) కెమేరాలను సాధారణంగా పెద్ద వ్యాపార సంస్థలు, కార్యాలయాల్లో వాడుతుంటారు. వీటి ఉద్దేశం ఆయా ప్రదేశాల్లో ఏం జరుగుతోందో నిరంతరం గమనించడానికి వీలైన నిఘా ఏర్పాటు చేసుకోవడమే తప్ప అద్భుతమైన దృశ్యాలు కనిపించడానికి కాదు. పైగా వీటిని చాలావరకూ రహస్యంగా ఏర్పాటు చేస్తారు కాబట్టి వీటి కెమేరాలు చిన్నగా ఉంటాయి. అందువల్ల వీటి అంతర్భాగాలు కూడా సూక్ష్మంగానే ఉంటాయి. ఇక దృశ్యం బాగా కనిపించాలంటే పిక్చర్‌ ఎలిమెంట్స్‌ (వీటినే సంక్షిప్తంగా పిక్సల్స్‌ అంటారు) అనే కాంతి విద్యుద్వయ ధ్రువాలు (ఫొటో డయోడ్స్‌) ఎక్కువగా ఉండాలి. సీసీ కెమేరాలో ఇవి తక్కువగా ఉంటాయి కాబట్టి దృశ్యం కూడా అంత స్పష్టంగా ఉండదు.

- ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక

  • ========================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

your comment is important to improve this blog...