Thursday, October 22, 2015

భారీ వర్షం వచ్చే ముందు మనకు చెమట ఎక్కువగా పడుతుంది. ఎందుకని?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
  •  


  •  
ప్రశ్న: భారీ వర్షం వచ్చే ముందు మనకు చెమట ఎక్కువగా పడుతుంది. ఎందుకని?జవాబు: చెమట పట్టడం అనేది చర్మం ఉపరితలంలో నిర్విరామంగా జరిగే ప్రక్రియ. చర్మం కింద ఉండే స్వేద గ్రంధులు చెమటను స్రవింపచేస్తూ ఉంటాయి. అలా చర్మం పైకి వచ్చే చెమట వాతావరణంలోని ఉష్ణాన్ని గ్రహించి ఎప్పటికప్పుడు గాలిలోకి ఆవిరైపోతూ ఉంటుంది. ఇలా ఆవిరవడం గాలిలోని నీటి శాతంపై అంటే తేమపై ఆధారపడి ఉంటుంది. తేమ శాతం తక్కువగా ఉంటే ఆవిరయ్యే ప్రక్రియ త్వరగా జరుగుతుంది. అదే వర్షం వచ్చే ముందు గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉంటుంది. ఆ గాలిలో అప్పటికే బోలెడు తేమ ఉండటం వల్ల ఇక ఏ మాత్రం తేమను అది ఇముడ్చుకోలేదు. అందువల్ల శరీరంపైకి చేరే చెమట ఆవిరి కాకుండా అక్కడే ఉండిపోతుంది. అపుడే మనకు ఉక్కపోస్తున్నట్లు అనిపించి చెమటలు కారిపోతాయన్నమాట.

- ప్రొ|| ఈ.వి.సుబ్బారావు,-హైదరాబాద్‌
  • ======================

Tuesday, October 20, 2015

What is Anti-matter?-విరుద్ధ ద్రవ్యము అంటే ఏమిటి?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...






ప్రశ్న: విరుద్ధ ద్రవ్యము అంటే ఏమిటి?

జవాబు: విరుద్ధ ద్రవ్యము (యాంటీ మేటర్‌) అంటే విరుద్ధ కణాలతో కూడిన ద్రవ్యం. ఉదాహరణకు హైడ్రోజన్‌ పరమాణువు కేంద్రకంలో ధనావేశం గల ఒక ప్రోటాన్‌ ఉంటే దాని చుట్టూ రుణావేశం గల ఒక ఎలక్ట్రాన్‌ పరిభ్రమిస్తూ ఉంటుంది. అదే విరుద్ధ హైడ్రోజన్‌ పరమాణువు కేంద్రకంలో రుణావేశముండే విరుద్ధ ప్రోటాన్‌ ఉంటే దాని చుట్టూ ధనావేశముండే పాజిట్రాన్‌ పరిభ్రమిస్తూ ఉంటుంది. విరుద్ధ హైడ్రోజన్‌ను కృత్రిమంగా లాబొరెటరీలో సృష్టించారు. విరుద్ధ ద్రవ్యంలోని కణాల ఉనికిని relativistic quantum mechanics అనే భౌతిక శాస్త్రవిభాగం శాస్త్రవేత్త పాల్‌డిరాక్‌ ఊహించి సిద్ధాంతీకరించాడు. ఒక ద్రవ్య కణము, విరుద్ధ ద్రవ్యకణము ఢీ కొన్నాయంటే సంభవించేది సర్వనాశనమే. దాంతో ఎంతో శక్తి విడుదలవుతుంది.

- ప్రొ|| ఈ.వి.సుబ్బారావు,-హైదరాబాద్‌

  • ====================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

The number of forces in the universe?-విశ్వంలో శక్తులు ఎన్ని?

  •  
  • ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !... 
  •  


  •  
ప్రశ్న: విశ్వంలోని మొత్తం శక్తులు ఎన్ని?
జవాబు: ఈ విశ్వంలో శాస్త్రజ్ఞులు అన్వేషించి నాలుగు శక్తులున్నాయని నిర్ధరించారు.

1. గురుత్వాకర్షణ శక్తి: అన్ని శక్తులకన్నా బలహీనమైనది కానీ దీని అవధి అనంత దూరాలకు వ్యాపించి ఉంటుంది. ద్రవ్యంలోని కణాల మధ్య ఆకర్షణ మూలంగా కుర్చీలు నేలకు అంటుకొని ఉండడానికి, మనం నేలపై నిలబడడానికి ఉపయోగ పడుతుంది. చెట్ల నుంచి పండ్లు నేలపై రాలడానికి, నక్షత్రాలు, గ్రహాలు ఏర్పడడానికి అవి కక్ష్యలో తిరిగేందుకు కూడా ఈ శక్తే కారణం. ఈ శక్తి ఆవిష్కర్త సర్‌ ఐజాక్‌ న్యూటన్‌.

2. విద్యుదయస్కాంత శక్తి: విద్యుదావేశాల మధ్య ఆకర్షణ వికర్షణలకు, పరమాణు నిర్మాణానికి, కాంతి వెలువడేందుకు ఈ శక్తే కారణం. విద్యుత్‌ బల్బులు వెలిగేందుకు, లిఫ్టులు, టీవీలు, కంప్యూటర్లు పనిచేయడానికి ఇదే మూలాధారం. దీని అవధి అనంతం.

3. దుర్బల కేంద్రక శక్తి: ఇది పరమాణు కేంద్రకానికి చెందిన శక్తి. యురేనియం లాంటి రేడియో ధార్మిక మూలకాల కేంద్రకం విచ్ఛిన్నమవుతున్నపుడు ప్రాథమిక కణాలను వెలువరించేందుకు ఈ శక్తి ఉపయోగపడుతుంది. దీని అవధి 10-14 మీటర్లు మాత్రమే.

4. ప్రబల కేంద్రక శక్తి: పరమాణువులోని కేంద్రకాలను ఒకటిగా నిలకడగా ఉంచే శక్తి ఇది. ప్రోటాన్లు, న్యూట్రాన్లు వీటిలో ఉండే 'క్వార్కులు' ఇలా పరమాణు కేంద్రకంలో ఉన్నవాటినన్నిటినీ బంధించి ఉంచేందుకు ప్రబల కేంద్రకశక్తి ఉపయోగ పడుతుంది. ఈ శక్తి అవధి 10-11 మీటర్లు మాత్రమే.

కేంద్రక శక్తుల వల్లే సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. మూలకాలు ఏర్పడుతున్నాయి. మన శరీరంలో ఉన్న కార్బన్‌, ఆక్సిజన్‌లకు కూడా కేంద్రక శక్తులే కారణం. ప్రబల కేంద్రక శక్తి, విద్యుదయస్కాంత శక్తి కన్నా వందరెట్లు ఎక్కువ. విద్యుదయస్కాంత శక్తి గురుత్వాకర్షణ శక్తి

కంటే 1036 రెట్లు ఎక్కువ. దుర్బల కేంద్రక శక్తి గురుత్వాకర్షణ శక్తి కన్నా 1025 రెట్లు ఎక్కువ.


- ప్రొ|| ఈ.వి.సుబ్బారావు, హైదరాబాద్‌



  • =======================

Is there waterfalls in Sea?-సముద్రాల్లో జలపాతాలు ఉన్నాయా?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
  •  

  •  
ప్రశ్న: సముద్రాల లోపల అగ్ని పర్వతాలు ఉన్నట్టే జలపాతాలు కూడా ఉన్నాయంటారు నిజమేనా?


జవాబు: సముద్రాలు చాలా లోతైనవి. ఇందులో ఉన్నవి కేవలం ఉప్పునీరు. సాధారణంగా సముద్రపు నీరు సముద్రంలో పడడం అంటూ ఉండదు. అక్కడక్కడా నదులు, సముద్రాన్ని కలిసేచోట సముద్రపు మట్టం కన్నా నదిలో నుంచి పడే నీరు చాలా ఎత్తు నుంచి పడినట్టయితే ఆ జలధార పడ్డచోటే సముద్రపు నేలలో ఏదైనా నెర్రెలు, ఉన్నట్లయితే ఆ నెర్రెల్లోకి నీరు కిందికి జారినట్లు అనిపిస్తుంది. సముద్రపు జలపాతాలు కావు. మామూలు జలపాతాలే. మారిషస్‌ ద్వీపాల్లో అక్కడక్కడా కొన్ని చోట్ల ఇసుక మేటలతోపాటు సాంద్ర తరమైన కాల్షియం సల్ఫేటు పదార్థపు రేణువులు సముద్రపు నేల ఎగుడుదిగుడుల్లో చారికల్లాగా పేరుకుపోవడం వల్ల సముద్రంలోనే జలపాతం ఉన్నట్లు భ్రమ కల్గుతుంది. నిజానికి సముద్రాల్లో ఎక్కడా జలపాతాలు లేవు.

- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌, కన్వీనర్‌,-శాస్త్రప్రచారవిభాగం, జనవిజ్ఞానవేదిక (తెలంగాణ


  • ======================