Wednesday, July 30, 2014

దోమల బ్యాట్లు కీటకాలను , దోమలను ఎలా చంపగలవు ?
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
 Q : దోమల బ్యాట్లు కీటకాలను , దోమలను ఎలా చంపగలవు ?

Ans : ఇటీవల్ ప్రతి ఇంట్లో దోమ దెబ్బకు భయపడి ప్రత్యేకంగా బ్యాడ్మింటన్‌ బ్యాట్ ల వంటివి విసురుతూ వాడుతున్నారు. వాటిలో సన్నని తీగలు అతిదగ్గరగా అమర్చబడి ఉంటాయి. బ్యాటరీ ద్వారా విద్యుత్ ఆ వైర్లకు సరఫరా అవుతుంది. దోమగాని , ఇతర కీటకాలు గాని ఆ తీగలకు తగలగానే విద్యుత్ షాక్ కొట్టి మరణిస్తాయి. పక్కపక్క నే ఉన్న రెండు తీగలను  కలిపి కీటకము శరీరం తాకితేనే ఆ షాక్ సాధ్యమవుతుంది . తీగెలకు తగలకుంటా మధ్యనుండి కీటకం వెళ్ళినా ఏ ఒక్క తీగకు తగిలి వెళ్ళినా... ఏమీ అవదు .  
 • ============================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Monday, July 28, 2014

Camel milk donot turn to curd easily.why?,ఒంటె పాలు తొందరగా పెరుగు కాదేం?

 •  

 •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: ఒంటె పాలతో పెరుగు తయారవదు అంటారు. ఎందుకని?

జవాబు: పాలు పెరుగు కావడం అంటే అర్థం ఆ పాలలో ఉన్న లాక్టోజ్‌ అనే పిండి పదార్థం మీద ఈస్ట్‌ అనే బ్యాక్టీరియా దాడిచేయడమే. లాక్టోజ్‌ తన సమూహాల్ని పెంచుకునే క్రమంలో విడుదలైన ఆమ్ల గుణ లక్షణాలున్న రసాయనాల సమక్షంలో పాలు గడ్డకడతాయి. కాబట్టి పాలు పెరుగు కావడంలో ప్రధాన భూమిక లాక్టోజ్‌ది. ఒంటె పాలలో లాక్టోజ్‌ పరిమాణం తక్కువ ఉంటుంది. ఆమ్లగుణమున్న పదార్థాలమీద ఈస్ట్‌ ప్రభావం తక్కువ. మామూలు గేదెలు, ఆవులు, గొర్రెల పాలలో కన్నా ఒంటె పాలలో ఆమ్ల లక్షణమున్న c- విటమిన్‌ ఎక్కువ. పైగా ఖనిజ లవణాలు పాలూ ఒంటె పాలలో ఎక్కువ. ఇలాంటి పరిస్థితుల్లో ఈస్ట్‌ చేష్టలకు కష్టం కావడం వల్ల ఒంటె పాలు అంత తొందరగా పెరుగుగా మారవు. ఇందువల్లే దూరప్రయాణం చేసేవారు ఒంటెపాలు తమవెంట తీసుకెళతారు.

- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌;--రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
 • ==========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Friday, July 25, 2014

రామాయణము లో కాండములు తెలపండి?

 •  

 •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
 రామాయణము, మహాభారతము, భాగవతము మొదలైన సాంస్కృతిక సంపదలు మనకు మన పూర్వీకులైన మహుఋషుల నుండి లభించాయి. ‘‘రామాయణం’’ ఒక మహా కావ్యం. దీనిని ఆది కవి అయిన శ్రీ వాల్మీకి రచించారు. ఈ కావ్యం ద్వారా మనం మన కుటుంబీకులైన తండ్రి, తల్లి, కుమారులు, అన్నదమ్ములు, భార్య, సేవకుడు వంటి వారితో ఆదర్శంగా ఎలా వుండాలోనన్నది క్లుప్తంగా విశ్లేషించడమైనది. ‘‘రామాయణం’’ అంటే ‘‘రామ’’, ‘‘అయనము’’ అనే రెండు పదాలు కలిసి రామాయణము అయింది. అయనము అంటే మార్గము. అంటే.. రాముడు అనుసరించిన మార్గము అని అర్థం. ఈ రామాయణంలో రాముడు తన ధర్మాన్ని అనుసరిస్తూ.. తాను నడిచిన ధర్మ మార్గాన్ని మనకు చూపించాడు. అదే రామాయణం యొక్క గొప్పతనము.

రామాయణంలో మొత్తం 24వేల శ్లోకాలు వున్నాయి. అవి 7 కాండములు, 500 సర్గలుగా విభజింపబడి వున్నాయి. రామాయణంలోని శ్లోకాలు అనుష్టుప్ ఛందస్సులో (అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలుంటాయి) రాయబడ్డాయి.

రామాయణ మహాకావ్యము ఆరు కాండములు (భాగములు)గా విభజింప బడినది. మొత్తము 24వేల శ్లోకములు (శతకోటి అక్షరములని కూడా చెబుతారు). కాండము అనగా చెరకుగడ కణుపు అని అర్ధము. రామాయణ కథనము చెరకు వలె మధురమైనది గనుక ఈ పేరు సమంజసమని పండితులు వివరిస్తారు. ఒక్కొక్క కాండములోను ఉప భాగములు "సర్గ"లు.

    1.బాల కాండము (77 సర్గలు): కథా ప్రారంభము, రాముని జననము, బాల్యము, విశ్వామిత్రునితో ప్రయాణము, యాగపరిరక్షణ, సీతా స్వయంవరము, సీతారామ కల్యాణము

    2.అయోధ్యా కాండము (119 సర్గలు): కైకేయి కోరిక, దశరథుని దుఃఖము, సీతారామ లక్ష్మణుల వనవాస వ్రతారంభము

    3.అరణ్య కాండము (75 సర్గలు): వనవాస కాలము, మునిజన సందర్శనము, రాక్షస సంహారము, శూర్పణఖ భంగము, సీతాపహరణము

    4.కిష్కింధ కాండము (67 సర్గలు): రాముని దుఃఖము, హనుమంతుడు రామునకు సుగ్రీవునకు స్నేహము గూర్చుట, వాలి వధ, సీతాన్వేషణ ఆరంభము

   5. సుందర కాండము (68 సర్గలు): హనుమంతుడు సాగరమును లంఘించుట, సీతాన్వేషణము, లంకాదహనము, సీత జాడను రామునకు తెలియజెప్పుట

    6.యుధ్ధ కాండము (131 సర్గలు): సాగరమునకు వారధి నిర్మించుట, యుద్ధము, రావణ సంహారము, సీత అగ్ని ప్రవేశము, అయోధ్యకు రాక, పట్టాభిషేకము

    7.ఉత్తర కాండము: సీత అడవులకు పంపబడుట, కుశ లవుల వృత్తాంతము, సీత భూమిలో కలసిపోవుట, రామావతార సమాప్తి - (కాని ఇది మూలకావ్యములోనిది కాదని, తరువాత జతచేయబడినదని కొందరి అభిప్రాయము.)

రామాయణం మొత్తం ఒక కథలా నడుస్తుంది. ఇందులో వున్న రాముడు, లక్ష్మణుడు, భరతుడు, సీత, హనుమంతుడు మొదలైన పాత్రలు మన సంస్కృతీకి ప్రతీకలు. రామాయణం హిందూ మతంలోనే కాదు... బౌద్ధ, జైన మతములలో కూడా ప్రచారంలో వుంది. మన దేశంలోనే కాక ఇండోనేషియా, ఫిలిప్పైన్స్, థాయిలాండ్, లావోస్, బర్మా వంటి మొదలైన దేశాలలో కూడా అమలులో వుంది. రామాయణం కూడా మహాభారతంలాగే అనేక దశలలో అభివృద్ధి చెందుతూ వచ్చింది. రామాయణము అత్యంత పురాతనమైన ప్రతి క్రీ.పూ.11వ శతాబ్దమునకు చెందిందని చరిత్రకారుల అభిప్రాయం. తరువాత అది కాలక్రమేణా అభివృద్ధి చెందింది. క్రీ.పూ.4, 5 శతాబ్దాలకు చెందిన రామాయణం ప్రస్తుత రూపంలోకి వచ్చింది.

 • ======================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

నోటిలో లాలాజలము ఎందుకు ?

 •  

 •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

 ప్ర : నోటిలో లాలాజలము ఎందుకు ?
జ : నీళ్ళలా ఉండి, జిగటగా ఉండే రంగులేని పదార్ధమే లాలాజలము. ఆహారం జీర్ణం కావడానికిది అత్యంతవసరం. దీనిలో 98% నీరు, 2% ఎంజైములు ఉంటాయి. ఎంజైములలో కెల్లా ముఖ్యమైనది 'టైలిన్‌'. ఇది నమిలిన ఆహారాన్ని పంచదారగా మారుస్తుంది. దీన్నే 'మాల్టోస్‌' అంటారు. దీని మరో ఎంజైమ్‌ 'లిసోజిమ్‌'. ఇది నోటి ద్వారా శరీరంలో ప్రవేశించే బాక్టీరియాను నాశనం చేస్తుంది. ఆహారాన్ని బాగా నమిలితే నోటిలో లాలాజలం బాగా ఊరుతుంది. అన్న నాళం గుండా ఆహారం ఉదరంలోకి సులువుగా చేరడానికి సహాయపడుతుంది. నోటిని తడిగా ఉంచుతుంది. ఆహారాన్ని చూడగానే నరాలు లాలాజల గ్రంధులకు సంకేతాన్నిస్తాయి. అప్పుడు గ్రంధుల నుంచి 'లాలాజలం' స్రవించనారంభిస్తుంది. ప్రతిరోజూ మన నోటి నుండి 1.5 లీటర్ల లాలాజలం ఊరుతుంది...!మన జీవిత కాలములో ఒక వ్యక్తి లో ఊరే లాలాజము సుమారు 2 స్విమ్మింగ్ ఫూల్స్  నిండేంత ఉంటుంది.

నోటిలో లాలాజలము నిరంతరము ఊరడము వలన నోరు , నాలుక ఎండిపోకుండా ఉంటాయి.
పెదవులు పగిలి పోకుండా ఉంటాయి,
నాలుకను రచించేది లాలాజలమే ,
మనము తిన్న ఆహారానికి తేమను కలిపి సులువుగా గొంతులొనికు జారవేస్తుందీ లాలాజలమే.
లాలాజలము ఉండబట్టే ఆహారము రుచులు తెలుసుకోవడము వీలవుతుంది .
 • =======================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Thursday, July 24, 2014

క్రికెట్‌లో బౌలింగ్‌ చేశాక బంతి పిచ్‌పై పడే ముందుకన్నా-పిచ్‌ను తాకిన తర్వాత దాని వేగం ఎక్కువగా ఉంటుంది. ఎందువల్ల?
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: క్రికెట్‌లో బౌలింగ్‌ చేశాక బంతి పిచ్‌పై పడే ముందుకన్నా, పిచ్‌ను తాకిన తర్వాత దాని వేగం ఎక్కువగా ఉంటుంది. ఎందువల్ల?

జవాబు: చలనంలో ఉన్న ప్రతీ వస్తువుకు కొంత శక్తి ఉంటుంది. వేగంగా ప్రవహిస్తున్న నీటికి, వేగంగా వీస్తున్న గాలికి ఉన్న శక్తి మనకు తెలిసిందే. ఈ శక్తిని గతిజ శక్తి అంటారు. బొంగరంలాంటి వస్తువు వేగంగా తన చుట్టూ తాను తిరుగుతుంటే ఆ భ్రమణ వేగం వల్ల కలిగే శక్తిని భ్రమణ గతిజ శక్తి అంటారు. ఇప్పుడు క్రికెట్‌ బంతి విషయానికి వద్దాం. ఈ బంతి వేగంతో ముందుకు వెళ్లడం వల్ల గతిజ శక్తి కలిగి ఉంటుంది. బౌలర్‌ బంతిని తిప్పుతూ విసరడం వల్ల అది తన చుట్టూ తాను తిరుగుతూ ముందుకు వెళుతుంది. అందువల్ల దానికి భ్రమణ గతిజ శక్తి కూడా ఉంటుంది. ఈ రెండు గతిజ శక్తులతో బంతి పిచ్‌పై పడుతుంది. అపుడు బంతికి పిచ్‌కు మధ్య కలిగిన ఘర్షణవల్ల భ్రమణ గతిజ శక్తిలోని స్వల్పభాగం ఉష్ణశక్తి రూపంలోకి మారినా మిగతాదంతా గతిజశక్తిగా మారి బంతికి అంతకుముందున్న గతిజ శక్తికి తోడవుతుంది. ఇలా గతిజ శక్తి పెరగడం వల్ల పిచ్‌పై పడే వేగంకన్నా ఎక్కువ వేగాన్ని సంతరించుకుని బంతి వికెట్‌లవైపు దూసుకుపోతుంది.

- ప్రొ|| ఈ.వి.సుబ్బారావు,--హైదరాబాద్‌
 • ===============================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

నేలలో దొరికే బొగ్గుతో విద్యుత్‌ ఎలా తయారుచేస్తారు?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...ప్రశ్న: నేలలో దొరికే బొగ్గుతో విద్యుత్‌ ఎలా తయారుచేస్తారు?

జవాబు: బొగ్గు ఒక ఇంధన మూలకం (elemental fuel). అంటే అందులో చాలా అధిక మోతాదులో రసాయనిక శక్తి దాగుంది. ఆ రసాయనిక శక్తిని విద్యుచ్ఛక్తిగా మార్చే ప్రక్రియ ఉష్ణ విద్యుత్‌ కేంద్రాల్లో (thermal power station) జరుగుతుంది.
గనుల్లో దొరికే మలిన బొగ్గును కర్బనీకరణం అనే ప్రక్రియలో శుద్ధి చేసిన తర్వాత బాగా ఎండబెట్టి థర్మల్‌ స్టేషన్‌లలో గాలి సమక్షంలో మండిస్తారు. ఆ మంటలో వెలువడిన ఉష్ణంలో నుంచి నీటని ఆవిరి అయ్యేలా చేస్తారు. అధిక పీడనంలో ఈ వేడినీటి ఆవిరిని గొట్టాల ద్వారా పంపి గొట్టాల చివర ఉన్న టర్బైనులను తిప్పే ఏర్పాటు ఉంటుంది. ఈ టర్బైనులో ఒక విద్యుదయస్కాంత స్తూపం సెకనుకు 50 సార్లు తిరిగేలా నిర్మాణం ఉంటుంది. అయస్కాంత క్షేత్రంలో ఓ విద్యుత్తీగ కదిల్తే ఆ తీగలో ప్రేరణ విద్యుత్తు పుడుతుందనే ఫారడ్‌ నియమానుసారం అక్కడి విద్యుత్తీగల్లో ఆల్టర్నేటింగ్‌ కరెంట్‌ (ac)పుడుతుంది. టర్బైను బ్లేడులను యాంత్రిక శక్తిలో తిప్పిన తర్వాత శక్తిని కోల్పోయిన నీటి ఆవిరిని తిరిగి పునర్వినియోగం ద్వారా వాడుకుంటారు. కొంత వృథా అవుతుంది కూడా.

మొత్తమ్మీద బొగ్గులో ఉన్న రసాయనిక శక్తిని మొదట టర్బైనులకు యాంత్రిక శక్తిగా మార్చి ఆ యాంత్రిక శక్తిని విద్యుచ్ఛక్తిగా మార్చే ప్రక్రియ ద్వారా ఉష్ణ విద్యుత్‌ కేంద్రాల్లో విద్యుత్‌ పుడుతుంది.

- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
 • ===========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

అగ్ని పర్వతం పేలుడు, అంతరిక్షం నుంచి ఉల్కల తాకిడి, ఈ రెండింటిలో ఏది ఎక్కువ ప్రమాదకారి?

 •  

 •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: అగ్ని పర్వతం పేలుడు, అంతరిక్షం నుంచి ఉల్కల తాకిడి, ఈ రెండింటిలో ఏది ఎక్కువ ప్రమాదకారి?

జవాబు: భూమిపై ప్రభావశీలమైన అగ్ని పర్వతాలు 600 వరకూ ఉన్నాయి. అవి విస్ఫోటనం చెందినపుడు వెదజల్లే అత్యధిక ఉష్ణోగ్రతగల లావా ప్రవాహం, భగభగమండే శిలలు ఆ పర్వత ప్రాంతాలనే కాకుండా వాటికి దూరంగా ఉండే ప్రదేశాలకు కూడా హాని కలిగిస్తాయి. అగ్ని పర్వత పేలుళ్లలో వాతావరణంలోకి టన్నుల కొలదీ గంధకం, బూడిద వెదజల్లినట్టవుతుంది. ఈ పదార్థాలు గాలుల ద్వారా భూగోళమంతా వ్యాపించి సూర్యకిరణాలు ప్రసరించకుండా అడ్డుపడడంతో అగ్ని పర్వతం పేలిన చాలా సంవత్సరాల వరకూ భూమిపై చల్లని వాతావరణం అలుముకొంటుంది.
ఇక రోదసీ నుంచి భూమిపైకి పడే ఉల్కల వల్ల ప్రమాదం ఆ ఉల్క (meteorite)పరిమాణంపై ఆధారపడి ఉంటుంది. ఉల్కాపాతం, అగ్ని పర్వత పేలుడు ఈ రెండింటివల్ల భూవాతావరణంలో దుమ్ము, ధూళి, గాలి తుంపరలు అలుముకోవడంతో 'భౌగోళిక చల్లదనం' అనేక సంవత్సరాల పాటు కొనసాగుతుంది. ఎటొచ్చీ ఎక్కువ పరిమాణంగల ఉల్క భూమిని ఢీకొంటే కలిగే ప్రమాదం అగ్ని పర్వత పేలుడు కన్నా ఎక్కువ. అతి పెద్ద ఉల్కాపాతం భూమిని ఢీకొనడం వల్లే డైనోసార్ల సంతతి భూమిపై అంతమయ్యింది. కానీ ఉల్కాపాతం అరుదుగా జరుగుతుంది. అదే తరచూ జరిగే అగ్ని పర్వత పేలుళ్లు ఎప్పుడూ భూవాతావరణానికి ప్రమాదకరమే.

- ప్రొ|| ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌
 • ==========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

పాలకూర, టమాటా కలిపి తింటే కిడ్నీల్లో రాళ్లు ఏర్పడతాయంటారు. నిజమేనా?

 •  

 •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: పాలకూర, టమాటా కలిపి తింటే కిడ్నీల్లో రాళ్లు ఏర్పడతాయంటారు. నిజమేనా?

జవాబు: అనేక విటమిన్లు, ఖనిజ లవణాలతో పాటు కాల్షియం, పొటాషియం, సి-విటమిన్‌ వంటివి పాలకూరలో అధిక మోతాదులో ఉంటాయి. పాలకూర పప్పును చాలా ఇష్టంగా మనం తింటుంటాం. పాలకూరలో ఆక్జలేటు అనే సేంద్రీయ కారకం అధికంగా ఉంటుంది. ఇది ఇనుము లవణాలలోనూ కాల్షియం లవణాలలోనూ కలిసి ఐరన్‌ ఆక్జలేటు, కాల్షియం ఆక్జలేటులను ఏర్పరచే స్వభావం ఉంది. అలాగే టమాటాలో కూడా ఎన్నో విలువైన ఖనిజ లవణాలు, విటమిన్లతోపాటుగా ఆక్జలేటులు ఉంటాయి. ఇందులో కూడా పొటాషియం పరిమాణం బాగానే ఉంటుంది. అందువల్ల టమాటా కూడా ఆరోగ్యరీత్యా అద్భుతమైన కూరగాయ.

పాలకూర టమాటాలలో అధిక మోతాదులో ఉన్న ఆక్జలేటులు మన రక్తంలో ఉన్న కాల్షియం, ఇనుము లవణాలను ఆయా ఆక్జలేటులుగా మార్చే పరిస్థితి ఉంది. కిడ్నీల్లో రాళ్లు ఏర్పడ్డం వింటున్నాం. ఆ రాళ్లలో ఉండేవి ప్రధానంగా కాల్షియం సిట్రెట్‌లు, కాల్షియం ఫాస్పేట్‌లు, కాల్షియం ఆక్జలేటులు. రక్తంలోనూ, మూత్రంలోనూ సరైన మోతాదులో నీటి శాతం లేనట్త్లెతే రసాయనికంగా ఆక్జలేట్ల పరిమాణం, ఫాస్పేట్ల పరిమాణం మోతాదును మించి ఉంటే అవాంఛనీయంగా కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది. మోతాదును మించితేనే ప్రమాదం. పరిమితస్థాయిలో పాలకూర టమాటాలను కలిపి తిన్నంత మాత్రాన కిడ్నీల్లో రాళ్లు ఏర్పడవు. అయితే రోజూ నీళ్లు ఎక్కువగా తాగితే ఈ ప్రమాదం ఉండదు.

- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
 • =================================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

How do animals know the directions,జంతువులకు దిశ తెలిసేదెలా?

 •  

 •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: పక్షులు, జంతువులు అవి పయనించే దిశల విషయంలో భూ అయస్కాంత క్షేత్రాన్ని ఉపయోగించుకుంటాయని అంటారు. నిజమేనా?

జవాబు: వలస పక్షులు, పావురాలు, తాబేళ్లు, సొరచేపలు, తిమింగలాలు వంటివి పయనించే దిశ విషయంలో భూ అయస్కాంత క్షేత్రం (earth magnetic field) సహాయాన్ని తీసుకుంటాయి. ఈ ప్రాణులన్నీ అయస్కాంత కణాలు ఉండే ప్రత్యేకమైన జ్ఞానేంద్రియాలు కలిగి ఉంటాయి. ఈ కణాలు అతి చిన్న ఇనుము లేక నికెల్‌ లోహ కణాల మయం. ఇవి అయస్కాంత సూచి (magnetic compass)లాగా పనిచేస్తాయి. ఏ ప్రాణిలోని ఏ జ్ఞానేంద్రియంలో ఈ అయస్కాంత కణాలు ఉంటాయో అనే విషయం ఇంకా కనిపెట్టవలసి ఉంది. ఆ జ్ఞానేంద్రియంలో జరిగే జీవరసాయన చర్యలను అవగాహన చేసుకొనే దిశలో పరిశోధనలు జరుగుతున్నాయి.

వలసపోయే పక్షుల విషయంలో ఈ అయస్కాంత సంబంధిత జ్ఞానం వాటి కుడికంటిలో ఉన్నట్లు అధ్యయనం ద్వారా తెలిసింది. కుడికన్ను గ్రహించిన సమాచారం మెదడులోని ఎడమభాగంలో క్రమబద్ధీకరింపబడి, ఆ ఆలోచనతో కాంతి గ్రాహకాల (light sensors) ను ప్రేరేపించడం ద్వారా పక్షులు అయస్కాంత క్షేత్రాలను పసిగట్టగలుగుతాయి.

సొరచేపలలో ఈ అయస్కాంత ఇంద్రియం వాటి ముక్కులలో ఉంటుంది. ఇది విద్యుదయస్కాంత క్షేత్రాలను కనిపెట్టే అతి సున్నితమైన 'ఏరియల్‌'లాగా పనిచేస్తుంది. సొరచేపలు ఒక 'వోల్ట్‌' లోని పదిలక్షలవ వంతు విద్యుత్‌ పొటన్షియల్‌ను కూడా కనిపెట్టగలవన్నమాట. ఈ విధంగా పక్షులు, జంతువులు భూ అయస్కాంత క్షేత్ర ఉనికిని కనిపెట్టి దిశానిర్దేశం చేసుకోగలవు.

- ప్రొ|| ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌
 • =========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Bats feed milk to babies Why?,గబ్బిలాలు పాలిస్తాయేం?

 •  

 •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: అన్ని పక్షులు వాటి పిల్లలకు పాలు ఇవ్వవు. కానీ గబ్బిలం మాత్రం పిల్లలకు పాలు ఇస్తుంది. ఇది కూడా పక్షే కదా?

జవాబు: గబ్డిలం పక్షి కాదు. పక్షిలాగా రెక్కలున్న ఓ క్షీరదం(mammal) . ఇది కైరాప్టెరా అనే క్రమానికి చెందిన పాలిచ్చే జంతువు. ముందు వెనక కాళ్లవేళ్ల మధ్య బాతు కాళ్లకున్నట్టు చర్మపైపొర ఉండడం వల్ల ఇది పక్షిలాగా ఎగరగలదు. పదునైన కొక్కెంలా ఉన్న గోళ్లసాయంతో చెట్ల కొమ్మలకు తలకిందులుగా వేలాడుతుంది. దీనికి కళ్లున్నా గుడ్డిది. తన నోటితో తానే అతి ధ్వనులను (ultrasonic sounds) చేస్తూ ఆ ధ్వనుల ప్రతిధ్వనుల (echos)ను వినడం ద్వారా పరిసరాలను, వస్తువులను ఆహారాన్ని చూస్తుంది. మిగిలిన క్షీరదాలలోలాగానే ఆడ, మగ లైంగికత ఉంది. ఆడ గబ్బిలం గర్భం ధరించి పశువులు, మనుషులలాగానే పిల్లల్ని కంటుంది. తడవకు ఒకే బిడ్డను కంటుంది. ఆడమగ గబ్బిలాలు కలుసుకున్నా ఆహారం సమృద్ధిగా దొరికే వరకు ఫలదీకరణం జరగకుండా శుక్రకణాల్ని, అండాన్ని విడివిడిగా తన శరీరంలోనే ఉంచుకోగల అద్భుత సామర్థ్యం ఆడగబ్బిలాలకు ఉంది. బిడ్డ గబ్బిలం తనలాగే ఎగిరే వరకు తల్లి పాలిచ్చి పోషిస్తుంది.

- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
 • ============================
 visit My website > Dr.Seshagirirao - MBBS.-

What did tell by 4 directions in Science Architecture?,వాస్తు శాస్త్రములోనాలుగు దిశలు చెప్పేదేమిటి?.

 •  

 •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

 What did tell by 4 directions in Science Architecture?,వాస్తు శాస్త్రములోనాలుగు దిశలు చెప్పేదేమిటి?.
    మన పూర్వీకులు తమ అపారమైన జ్ఞాన సంపద, అనుభవం.. సృష్టి పట్ల అవగాహనతో పలు శాస్త్రాలు రూపొందించారు. వాటిని సామాన్యులకు అపోసన పట్టడం సాధ్యం కాదు. అందుకే, వాటి సారాంశాన్ని క్లుప్లంగా, అందరికీ అర్థమయ్యే రీతిలో సామెతల రూపంలో వివరించారు.  అదేవిధంగా, నాలుగు దిశల గురించి క్రమబద్ధంగా తెలిపారు.

ఈశాన్య దిశలో గుంట అన్నారు. అంటే బావి లేక బోరు అన్నమాట. కొన్ని అవసరాల దృష్ట్యా నీటిని నిల్వ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. ప్రధానంగా వేసవిలో నీటి కొరత అధికంగా ఉంటుంది. అలాంటప్పుడు ఈ దిశలో సంపులు, నీటి నిల్వ కోసం భూమి లోపల ట్యాంకులను ఏర్పాటు చేసుకుంటే ఎలాంటి సమస్య ఉండదు. ఈ దిశలో శాస్త్రీయరీత్యా ఎక్కువ స్థలం వదలడం, ఇతర కట్టడాలు లేకపోవడం వలన.. కావాల్సినంత సూర్మరశ్మీ వీటిపై పడి నీరు కాలుష్యం కాకుండా ఉంచుతుంది. నేల కూడా పొడిగా ఉంటుంది.

ఆగ్నేయ దిశలో మంట అంటే వంటావార్పు అన్నమాట. వంట చేసేటప్పుడు పొయ్యి నుంచి వెలువడే ప్రమాదకరమైన వాయువులు, మసాల ఘాటు వంటివి బయటికి వెళ్లడానికి అనువుగా.. అటు దక్షిణ ఆగ్నేయంలోనూ ఇటు తూర్పు ఆగ్నేయంలోనూ కిటికీలు ఏర్పాటు చేసుకుంటే క్రాస్‌ వెంటిలేషన్‌ సజావుగా జరిగి ఇంటి ఇల్లాలికి, వంట చేసేవారికి ఆరోగ్య సమస్యలు తలెత్తవు.

వాయువ్య దిశలో పెంట పశువులను పెంచడం, కాలకృత్యాలు, స్నానాలు చేయడం, మరుగుదొడ్ల ఏర్పాటు వంటివి అన్నమాట. ఇక్కడ్నుంచి వెలువడే దుర్వాసనలు ఇంట్లోకి ప్రవేశించకుండా.. అట్నుంచి అటే బయటికి వెళ్లడానికి వీలుండేలా ఏర్పాట్లు చేసుకోవడానికి అనువుగా ఉండాలని ఇలా చెప్పారు.

నైరుతి దిశలో గుట్ట ఈ దిశలో మనక్కావాల్సిన వస్తువుల్ని భద్రపర్చుకోవాలని చెప్పారు. శాస్త్రీయరీత్యా ఇంటి యజమాని ఈ దిశలో ఉండాలని చెబుతుంటారు. కారణం.. దక్షిణం నుంచి వెలువడే గాలి ఆరోగ్యదాయకమని.. విలువైన సామాగ్రి, పత్రాలు వగైరా ఆ ఇంటి యజమానికి అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు ఉండాలని చెప్పారు. మనిషికి ముఖ్యమైన వాటిలో నీటి తర్వాత గాలి అత్యంత అవసరం. అందుకే, పడమర నైరుతి, దక్షిణ నైరుతి పరిశుభ్రమైన గాలీ, వెలుతురు రావడానికి ఏర్పాటు చేసుకోవాలి. భద్రతపరంగా కూడా శాస్త్రీయరీత్యా అత్యంత జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. పైగా ఈ గదిలోకి అందరికి ప్రవేశముండదు. ఈ దిశలో బరువు ఉండాలని వాస్తు శాస్త్రం చెబుతోంది కాబట్టి.. చాలామంది నీటి నిల్వ చేసుకునే ఓవర్‌హెడ్‌ ట్యాంకును ఇక్కడే ఏర్పాటు చేస్తుంటారు.
 • - పి.కృష్ణాదిశేషు,--వాస్తు ఇంజినీరు@eenadu news paper
 • =======================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Wednesday, July 23, 2014

What is Dating?-what are the complications?,డేటింగ్ అంటే ఏమిటి-వాటి వల్ల కస్టాలేమిటి?.

 •  

 •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...ఎక్కడో పాశ్చాత్య దేశాల్లోని సంస్క్ర్రతి మన సినిమా వాళ్ళతో క్రీడాకారులతో మొదలై మద్య తరగతివారి దాకా వ్యాపించింది. బాద్యతలు లేని ప్రేమ అని నిర్వచనం చెబుతున్నారు. ఈ మద్య సహజీవనానికి సుప్రీం కోర్ట్ కూడా ఆమోదం తెలిపిందట.  డేటింగ్ అంటే ఏకాంతం! భార్యా-భర్తా ఏకాంతంలో ఎలా గడుపుతారో అలా గడపొచ్చు అని , మానసికము గాను , శారీరకం గాను కలిసి బ్రతకడము . మనిషి తన కోర్కెలు తీర్చుకోవడం కోసము తాత్కాలికము గా చేసుకునే సహజీవన ఒప్పందము . ఇక్కడ డేటింగ్ లో కామరూపేనా చేసుకునే ఒడంబడిక . కొందరు డబ్బులుకోసము డేటింగ్ చేస్తే కొందరు ఇస్టముకొద్దీ డేటింగ్ చేస్తారు.

నేటి సమాజంలో ఆధునిక విజ్ఞానంతో పాటు పాశ్చాత్య సంస్కృతి కూడా చోటుచేసుకుంది. ఆ క్రమంలో నేడు డేటింగ్ అనే ఒక ఒప్పంద అనుబంధం చాలా మంది యువతీ యువకుల మధ్య కన్పిస్తోంది. కానీ, డేటింగ్ పేరుతో కలిసి మెలిసి తిరిగే కుర్రకారులో ముఖ్యంగా ఆడపిల్లలు గర్భం రాకుండా ఉండేందుకు తక్షణ చర్యగా అందుబాటులో ఉండే గర్భ నిరోధక మాత్రలను వాడుతుంటారు. ఆ మాత్రలు అప్పటికి ప్రయోజనకరంగా ఉంటాయి. కానీ, భవిష్యత్తులో కేన్సర్ కారకాలుగా మారి జీవితాన్ని అంధకారంగా మారుస్తాయని పరిశోధనలు వివరిస్తున్నాయి. డేటింగ్ ఒక వ్యసనము లాంటిది. సంసారిక (సెక్షువల్ ) సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశమూ ఉంటుంది. డేటింగ్ లో చిక్కుకొని ఇబ్బందు పడేవారు ఉన్నారు. పెళ్ళై సంసారాలు కూలి పోయే సందర్భాలూ  మనకు కనిపిస్తాయి.

 • అభిప్రాయాలను పంచుకోవటానికి, అభిమానాన్ని పెంపొందించుకోవటానికి తోడ్పడాల్సిన డేటింగ్‌ కొందరిలో హింసకూ దారితీస్తోందని అమెరికా పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. అత్యవసర చికిత్స విభాగానికి వస్తున్న ప్రతి ఆరు మంది యుక్తవయసు పిల్లల్లో సగటున ఒకరు డేటింగ్‌ హింస బారినపడుతున్నవారేనని తేలటమే దీనికి కారణం. అమెరికాలోని ఒక ఆసుపత్రిలో అత్యవసర చికిత్స కోసం వచ్చిన 14-20 ఏళ్ల వారిపై పరిశోధకులు ఇటీవల ఒక అధ్యయనం చేశారు. వీరిలో ప్రతి ఐదుగురు అమ్మాయిల్లో ఒకరు, ప్రతి ఎనిమిది మంది అబ్బాయిల్లో ఒకరు గత ఏడాదిలో డేటింగ్‌ హింసను ఎదుర్కొన్నవారేనని వెల్లడైంది. డేటింగ్‌ సమయంలో హింసకు పాల్పడే ధోరణి ప్రభావం పెద్దయ్యాకా కొనసాగుతుందని, అందువల్ల ఇలాంటి వారిని గుర్తించి అడ్డుకట్ట వేయాల్సిన అవసరముందని అధ్యయన నేత, మిచిగన్‌ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్‌ విజయ్‌సింగ్‌ సూచిస్తున్నారు. మద్యం, మాదకద్రవ్యాలు, కుంగుబాటు వంటివి డేటింగ్‌ సమయంలో హింసకు పాల్పడటానికి దోహదం చేస్తున్నాయని పేర్కొంటున్నారు. పాశ్చాత్య దేశాల అలవాట్లు, ధోరణులు మనదేశంలోనూ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో దీనిపై ఓ కన్నేసి ఉంచటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

 • =======================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Monday, July 21, 2014

ఫ్రూట్ షేక్ అంటే ఏమిటి ?

 •  

 •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్ర : ఫ్రూట్ షేక్ అంటే ఏమిటి ?
జ : ఫ్రూట్ షేక్ : పాలు లేదా పెరుగు తో పండ్ల ముక్కలు లేదా పండ్ల రసము కలిపి పంచదార + ఐష్ ముక్కలతో తయారు చేసిన ఒక మందపాటి మిశ్రిత పానీయము . 
ఉదా : బ్లూబెర్రీ మిల్క్ షేక్ , మిక్స్ డ్ ఫ్రూట్స్ షేక్ , స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ , మ్యాంగో షేక్ .

 • =============================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Thursday, July 17, 2014

సాలగ్రామము అంటే ఏమిటి?.సాలగ్రామం ఏ దేవుని రూపము?

 •  

 •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

 ప్ర : సాలగ్రామము అంటే ఏమిటి?.సాలగ్రామం ఏ దేవుని రూపము?

జ : సాలగ్రామము విష్ణుప్రతీకమైన , విశిష్ట ప్రాముఖ్యం కలిగిన ఒక శిలా విశేషము. కలికాలంలో భక్తుల అర్చనాదుల సౌలభ్యం కోసం నారాయణుడు సాలగ్రామ రూపం ధరించాడని దేవీభాగవతం చెబుతుంది. అందుచేతే గృహదేవతార్చనలలోగానీ, దేవాలయాలలోగానీ సాలగ్రామము (మూర్తి) లేకుండా పూజలు కొనసాగవు. ద్వైతులు, విశిష్టాద్వైతులు, అద్వైతులు తమతమ దేవతార్చనలలో సాలగ్రామములను పూజకు ఉపయోగిస్తారు. భారతదేశంలో సాలగ్రామ పూజ బహు పురాతనమైనది. క్రీస్తు కంటే ప్రాచీనుడైన అపస్తంబుడు సాలగ్రామ పూజను పేర్కొన్నాడు. త్రిమతాచార్యులు తమతమ భాష్యాలలో సాలగ్రామాలు విష్ణురూపాలని వివరించారు. దేవాలయాలలో పంచాయతన మూర్తులకు శిలా ప్రతిమలు ఉంటే గృహస్థులకు మణి, స్వర్ణ నిర్మితమైన మూర్తులు, సాలగ్రామములు ఉంటాయి. సాధారణంగా ప్రతిమలకు నిత్య పూజా సమయంలో ఆవాహనాది షోడశోపచారాలు చేయాలి. సాలగ్రామాలలో దేవత నిత్యం సన్నిహితమై ఉండడం వల్ల వాటికి పూజా సమయంలో అవాహనాది ఉపచారాలు అవసరం లేదు.

సాలగ్రామాలు గండకీ నదిలో లభిస్తాయి
 • =========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

మన శరీరములో కొత్త కణాలు పుడుతూ ఉంటాయా?.

 •  
 •  

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

 ప్ర : మన శరీరములో కొత్త కణాలు పుడుతూ ఉంటాయా?.

జ : శరీరమంటేనే కణాల సముదాయము .ఇందులో ప్రతి కణానికీ మరణము ఉంటుంది. ఒక్కొక్క రకము కణానిది ఒక రకమైన ఆయుర్ధాయము . మనకు తెలియకుండానే మన శరీరములో కణాలు మరణించడము , వాటి స్థానము లో కొత్త కణాలు పుట్టుకురావడము జరుగుతుంటుంది . శరీరము లో దెబ్బతిన్న నాడీకణాల స్థానములో కొత్తవి రావడమే కస్థము . శరీరములోని ప్రతి కణానికీ నిర్ధిస్టమైన ఆయుర్ధాయము ఉంటుంది. ఆ కణము ఎలా ప్రవర్తించాలి , ఎటువంటి విధిని నిర్వర్తించాలి. ఎప్పుడు మరణించాలి అన్నది కణకేంద్రకము లో నమోదైవుంటుంది. కేంద్రకము లో ఉన్నటువంటి డి.ఎన్‌.ఎ . లోని సమాచారము ప్రకారమే కణ జీవితం అనేది నడుస్తూవుంటుంది.

    పేగు పైపొర కణాలు ప్రతి 5 రోజులకు పాత వాటిస్థానములో కొత్తవి వస్తుంటాయి.
    తెల్ల రక్తకణాలు 2 నుండి 4 సం.లు ,
    ఎర్ర రక్త కణాలు 90-120 రోజులు లలో మృతిచెందుతాయి.,
    మన చర్మము మీద ఉన్న కణాలు ప్రతి 15 నుండి 20 రోజులకొకసారి కొత్తవి వస్తుంటాయి.

 • ==============================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Sunday, July 13, 2014

Mountains formed.How?-పర్వతాలు ఏర్పడేదెలా? •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: భూమ్మీద పెద్ద పెద్ద పర్వతాలు ఎలా ఏర్పడ్డాయి?

జవాబు: పర్వతాలు ఏర్పడడానికి ముఖ్యంగా రెండు కారణాలు చెప్పుకోవచ్చు. భూమి మొదట్లో భగభగమండే అగ్ని గోళం లాగా ఉండేది. దీనిలోని పదార్థాలన్నీ ద్రవరూపంలోనో, వాయు రూపంలోనో ఉండేవి. ఈ గోళం సుమారు 200 కోట్ల సంవత్సరాల క్రితం కొంత వరకు చల్లబడి, భూమి పైపొర గట్టిపడడం ప్రారంభించింది. భూమిపై ఏర్పడిన ఈ గట్టిపొర సుమారు 20 కిలోమీటర్ల మందం ఉంటుంది. దాని కన్నా భూమిలో లోతుకు పోయేకొలదీ అత్యంత ఉష్ణోగ్రత గల ద్రవం ఉంటుంది. భూమిపై భాగం మొదట్లో గట్టిపడినప్పుడు అందులో ఎత్తు పల్లాలు లేవు. కానీ పై పొర చల్లబడి భూమి కుంచించుకు పోయిన కొలదీ ఆ పొరలో ముడతలు ఏర్పడ్డాయి. భూమి పైపొరలో గ్రానైట్‌, దాని అడుగున బసాల్ట్‌ అనే రెండు రకాల శిలలు ఉన్నాయి. ఇవి దృఢంగా, ఫలకాల రూపంలో ఉంటాయి. ఈ గ్రానైట్‌ ఫలకాలపైనే ఖండాలు ఏర్పడ్డాయి. భూమి చల్లబడి కుంచించుకుపోయే ప్రక్రియలో ఈ గ్రానైట్‌ ఫలకాలు ధనస్సుల్లాగా వంగి అక్కడక్కడ భూభాగం పైకి లేచింది. ఈ ఫలకాలు ముడుచుకు పోయే క్రమంలో పగిలి, నెర్రెల రూపంలో విచ్చిపోయింది. ఇలా వంగి, విరిగిన శిలాభాగం భూమిపైకి పొడుచుకు రావడం వల్ల పర్వతాలు ఏర్పడ్డాయి.

ఇంకో రకంగా చెప్పాలంటే భూమి అంతర్భాగంలో అత్యంత ఉష్ణోగ్రతతో ద్రవరూపంలో 'లావా' అనే పదార్థం ఉంటుంది. భూమి మీద ఉన్న ఫలకాలకు కొన్ని చోట్ల నెర్రెలు ఏర్పడి లోపల ఉన్న లావా బయటకు ఎగదన్నుకుని వస్తుంది. ఈ లావా గట్టిపడడం వల్ల కూడా పర్వతాలు ఏర్పడతాయి.

 • - ప్రొ|| ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌ 
 • ==========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Breathing out air is hot Why?,ఊపిరి తీసుకుని వదిలే గాలి వేడిగా ఉంటుందేం?

 •  
 •  

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: మనం ఊపిరి తీసుకుని బయటికి వదిలినపుడు ముక్కు నుంచి వేడిగాలి ఎందుకు వస్తుంది?

జవాబు: మనం తీసుకున్న ఆహారం జీర్ణక్రియకు లోనవగానే పిండి పదార్థాల నుంచి గ్లూకోజ్‌ అనే శక్తిమంతమైన అణువులు రక్తంలో కలుస్తాయి. ఒక్కోసారి చాలా కాలం పాటు ఆహారం తిననట్లయితే శరీరంలో ఉన్న కొవ్వు నిల్వల నుంచి కూడా గ్లూకోజ్‌ ఏర్పడుతుంది. శరీరంలో ఉన్న గ్లూకోజ్‌ ప్రతి జీవన కార్యకలాపాలకు కావలసిన శక్తికి ఆధారమని మనం గుర్తించాలి. అయితే ఆ గ్లూకోజ్‌ నుంచి శక్తిని రాబట్టాలంటే దాన్ని రసాయనికంగా ఆక్సీకరణం చెందించాలి. అందుకు మనం గాలిలో ఉన్న ఆక్సిజన్‌ను శ్వాస క్రియలో ఉచ్ఛ్వాసం ద్వారా రక్తంలోకి పంపుతాం. ఆక్సిజన్‌ సమక్షంలో ఆక్సీకరణం చెందిన గ్లూకోజ్‌ కార్బన్‌డైఆక్సైడ్‌, నీటి ఆవిరిగా విఘటనం చెందే క్రమంలో ఉష్ణశక్తి కూడా పుడుతుంది. ఇందులో చాలా భాగం ADPఅనే అణువు, ATPఅనే శక్తియుత అణువుగా మారడానికి ఉపయోగపడగా కొంత భాగం రక్తంలోనే కలిసిపోతుంది.

రక్తపు ఉష్ణోగ్రత, దేహ ఉష్ణోగ్రత క్రమబద్ధీకరించబడతాయి. రక్తంలో కలిసిన కార్బన్‌డైఆక్సైడ్‌, నీటి ఆవిరి దేహ ఉష్ణోగ్రత (సుమారు 37 డిగ్రీల సెల్సియస్‌) వద్దే ఉంటాయి. అవి నిశ్వాసంలో బయట పడేప్పుడు దేహ ఉష్ణోగ్రత వద్దే బయటికి వస్తాయి. సాధారణంగా సంవత్సర కాలంలో బయట ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెల్సియస్‌ కన్నా తక్కువే ఉంటుంది. బయట 37 డిగ్రీల సెల్సియస్‌ కన్నా తక్కువ ఉష్ణోగ్రత నుంచి గాలి లోనికి వెళ్తున్నా నిశ్వాసంలో విడుదలయ్యే కార్బన్‌డైఆక్సైడ్‌, నీటి ఆవిరి కనీసం 37 డిగ్రీల సెల్సియస్‌ దగ్గర ఉండటం వల్ల నిశ్వాసంలో వేడి గాలి బయటికి వస్తున్నట్టు ఉంటుంది.

 • - ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక­ 
 • =======================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

టీ కెటిల్‌లో నీళ్లు కాస్తున్నపుడు 'హిస్‌' మనే శబ్దం వస్తుంది ఎందుకు?

 •  
 •  

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: టీ కెటిల్‌లో నీళ్లు కాస్తున్నపుడు 'హిస్‌' మనే శబ్దం వస్తుంది ఎందుకు?

జవాబు : కెటిల్‌లో నీరు పోసి స్టవ్‌ మీద పెడితే నీరు వేడెక్కేకొలదీ కెటిల్‌ కూని రాగాలు తీస్తుంది. స్టవ్‌ వెలిగించగానే మొదటగా కెటిల్‌ అట్టడుగు భాగంలో ఉన్న నీటి పొర వేడెక్కి నీటి ఆవిరిగా మారుతుంది. ఆ నీటి ఆవిరి బుడగల సాంద్రత, నీటి సాంద్రత కంటే తక్కువగా ఉండటంతో అవి పైకి లేస్తాయి. కింది పొరలో ఏర్పడిన బుడగలు పై పొరలలోని చల్లని నీటిని తాకడంతో సంకోచం చెంది చివరకు పూర్తిగా ముడుచుకుని పోతాయి. ఈ విధంగా ముడుచుకుపోయే అనేక నీటి ఆవిరి బుడగలు చేసే శబ్దమే కెటిల్‌ నుంచి వినిపించే 'హిస్‌' శబ్దం. ఈ బుడగల సంఖ్య పెరిగే కొలదీ శబ్దం కూడా ఎక్కువవుతుంది. కెటిల్‌లోని నీరంతా పూర్తిగా వేడెక్కి ఉష్ణోగ్రత బాష్ఫీభవన స్థానం చేరేటప్పటికి కెటిల్‌లో చల్లని పొరలు లేకపోవడంతో నీటి ఆవిరి బుడగలు సంకోచించడం ఆగిపోతుంది. దాంతో శబ్దం కూడా ఆగిపోతుంది. ఈ దశ తర్వాత కెటిల్‌లోని నీరు మొత్తం మరగడం ప్రారంభమవుతుంది.

 • - ప్రొ|| ఈ.వి.సుబ్బారావు,--హైదరాబాద్‌
 • =========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

భూగర్భంలో ఖనిజాలు, వాయువులు సహజ వనరులను ఎలా కనుగొనేవారు?

 •  

 •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: ప్రాచీన కాలంలో భూగర్భంలో ఖనిజాలు, వాయువులు సహజ వనరులను ఎలా కనుగొనేవారు?

జవాబు: నేడు విద్యుద్రసాయనిక పరికరాలు (electro chemical devices), అతి శబ్ద తరంగ సాధనాలు (ultra sonic wave devices) రేడియోధార్మిక డేటింగ్‌ గ్రాహకాలు మొదలైన ఆధునిక పరికరాలతో భూగర్భంలో ఉన్న సహజ వాయువుల నిక్షేపాలు, ఖనిజ సంపద, నీటి నిల్వలు, ప్రాచీన కట్టడాల ఆనవాళ్లు తెలుసుకోగలుగుతున్నాం.

కానీ ప్రాచీన కాలంలో ఈ విధమైన సాధనాలు, అవకాశాలు ఉండేవి కావు. కేవలం వర్షపు నీరు ఎండిపోయే విధానాన్ని బట్టి నేలలోని భౌతిక రసాయనిక ధర్మాల్ని ఉజ్జాయింపుగా గుర్తించేవారు. అలాగే ఏవైనా భూకంపాలు సంభవించినపుడు ఆ నేల పగుళ్ల నుంచి వచ్చే వాయువుల వాసనల్ని, ద్రవాల ధర్మాల్ని బట్టి కొద్దో గొప్పో నేలలోని నిక్షేపాల్ని అవగాహన చేసుకునేవారు. స్వానుభవం ద్వారా, తరతరాల వైజ్ఞానిక పరిజ్ఞానపు పరంపర ద్వారా వనరుల్ని తెలుసుకునేవారు. మైదాన ప్రాంతాలు, నదీ తీరాలు, అటవీ, పర్వత ప్రాంతాలు రాతి నేలలు మొదలైన బాహ్య రూపాల వల్ల ఆయా నేలల్లో ఉన్న వనరుల గురించి అవగాహన ఉండేది. విజ్ఞానం ఎప్పుడూ ఉన్నఫళంగా రాదు. నేటి ఆధునిక విజ్ఞాన వృక్షానికి మానవ సమాజంలో ప్రాచీన కాలంలో కూడా బీజాలున్నాయని మనం అర్థం చేసుకోవాలి.

 • - ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్‌,--వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
 • ==============================
 visit My website > Dr.Seshagirirao - MBBS.-

How did Cannons work?,. నాటి ఫిరంగులు ఎలా పనిచేసేవి?

 •  

 •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...ప్రశ్న: రాజుల కాలంలో వాడిన ఫిరంగులు ఎలా పనిచేసేవి? అందులో నుంచి లోహపు గుండ్లు ఎలా వదిలేవారు?

జవాబు: నాటి ఫిరంగులైనా, నేటివైనా, తుపాకులైనా, రివాల్వరులైనా సూత్రం ఒకటే. పేలుడు పదార్థం, గుండు లేదా బుల్లెట్‌సైజు, గుండు బయటకొచ్చే ద్వారం అడ్డుకోత వైశాల్యం, పేల్చే విధానం మొదలైన విషయాల్లోనే తేడా.

ఫిరంగి ఓ వైపు మూసుకొని మరోవైపు తెరచుకొని ఉండే దళసరి లోహపు గోడలున్న ఓ గొట్టం. మూసుకుని ఉన్న చివర అంటిస్తే ఉన్నఫళాన పేలే రసాయనిక పేలుడు పదార్థం ఉంటుంది. మనం దీపావళి సమయంలో అంటిస్తే పేలినట్టే ఇది కూడా పేలుతుంది. ఈ పేలుడు పదార్థాన్ని తెరచి ఉన్న చివరి నుంచే బాగా లోపలికి దట్టిస్తారు. ఆ తర్వాత గుండును ఆ రంధ్రంలోకి జొప్పుతారు. గొట్టం మూసి ఉన్న చివర వత్తి మాత్రమే లోపలికి వెళ్లేలా సన్నని రంధ్రం ఉంటుంది. దాన్ని వెలిగిస్తే కాలుతూ లోపలికి వెళ్లి పేలుడు పదార్థాన్ని పేలుస్తుంది. ఒక్క ఉదుటున పేలుడు వాయువులు విడుదలవుతాయి. అవి అటూ ఇటూ పోవడానికి దారిలేకపోవడం వల్ల గుండును అతివేగంగా నెడుతూ బయటికి రావడానికి ప్రయత్నిస్తాయి. ఆ క్రమంలో గుండు విపరీతమైన శక్తితో బయటకు దూసుకు వస్తుంది. పొడవైన గొట్టం సరళమార్గంలో ఉండడం వల్ల గుండు కూడా బయటకు నేరుగా వేగంగా వస్తుంది. గుండు గమ్యాన్ని బట్టి అది ఉన్న దూరాన్ని బట్టి ఫిరంగి గొట్టపు వాలు కోణాన్ని మార్చేలా ఫిరంగిలో యంత్రాంగం ఉంటుంది.

 • - ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
 • =================================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

లై డిటెక్టర్‌ ఎలా పనిచేస్తుంది?ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: నిందితులను లై డిటెక్టర్‌తో పరీక్షిస్తుంటారు కదా! మరి అది ఎలా పనిచేస్తుంది?

జవాబు: వ్యక్తులు అబద్ధం చెప్పేటప్పుడు తమకు తెలియకుండానే ఉద్వేగానికి, భావావేశానికి లోనవుతారని అపుడు ఆ వ్యక్తి శరీరంలో కూడా కొన్ని సున్నితమైన మార్పులు చోటుచేసుకుంటాయనే సిద్ధాంతం ఆధారంగా లై డిటెక్టర్‌ను రూపొందించారు.

ఈ పరికరం మానవ శరీరంలోని రక్తపోటు, గుండెచప్పుడు శ్వాసక్రియ, చెమట పట్టడం లాంటి శారీరక ధర్మాలను రికార్డు చేస్తుంది. దీనిలో ఉండే న్యూమోగ్రాఫ్‌ట్యూబ్‌ అనే సన్నని రబ్బరు గొట్టాన్ని నిందితుని ఛాతీచుట్టూ గట్టిగా కడతారు. రక్తపుపోటు కొలవడానికి ఒక పట్టీని జబ్బకు కడతారు. చర్మంలోని ప్రకంపనలను కొలవడానికి శరీర భాగాలలో కొద్ది మోతాదులో విద్యుత్‌ను ప్రవహింపచేసి అందులోని మార్పులను గ్రహించే ఏర్పాట్లు కూడా ఇందులో ఉంటాయి. శరీరంలో కలిగే ప్రేరేపణలను, ఉద్వేగాలను సున్నితమైన ఎలక్ట్రోడుల ద్వారా గ్రహించి గ్రాఫుద్వారా నమోదు చేస్తారు. ఈ పరిశీలనల ద్వారా ఒక వ్యక్తి చెప్పే నిజానిజాలను కనుగొంటారు.

ఈ పరికరాన్ని 1921లో కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలోని జాన్‌లాగూన్‌ అనే విద్యార్థి ఒక పోలీసు ఆఫీసరు సాయంతో కనిపెట్టాడు. లైడిటెక్టర్‌ను నేరవిచారణలో ఒక సాధనంగానే న్యాయవ్యవస్థ గుర్తిస్తుంది. కేవలం ఇదిచ్చే సమాచారం ఆధారంగానే నేర నిర్ధరణ చేయరు.

 • - ప్రొ|| ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌

 • ====================================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Saturday, July 12, 2014

తీరాల్లోనే ఇంధనాలు ఎక్కువేల ?

 •  
 •  

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...ప్రశ్న: Fuel available more on costal area Why?ఇంధనాలు సముద్ర తీరాల్లోనే ఎక్కువగా ఎందుకు లభిస్తాయి?

జవాబు: సముద్రాలు చాలా లోతుగానే ఉన్నా సముద్రపు అడుగు నేల మీద, ఆ నీళ్లలోను చాలా వృక్ష జాతులు నివసిస్తూ ఉంటాయి. అనేక జాతుల జల చరాలు అందులో జీవిస్తాయి. ఈ వృక్ష, జంతు జలచరాలు చనిపోయాక వాటి అవశేషాలు భూమ్యాకర్షణ వల్ల నేల అడుక్కు చేరతాయి. దాని వల్ల, సముద్రపు నీటి ఒత్తిడి వల్ల, ఆయా శరీరాలు చిన్నాభిన్నమై సన్నని ముక్కలుగా మారతాయి.అవి సముద్రపు అడుగు నుంచి తీరం వైపు ఉన్న నేల చరియల ద్వారా తీర ప్రాంతాలకు చేరుకుంటాయి. అక్కడున్న భూగర్భంలో రసాయనిక విఘటనం చెంది పెట్రోలియం ద్రవంగా, సహజ వాయువుగా మారతాయి. ఇందువల్లే సముద్ర తీరాల్లో, ముఖ్యంగా నదులు సముద్రాల్లో కలిసే తీర ప్రాంతాల్లో పెట్రోలియం ఉత్పత్తుల నిల్వలు బాగా విస్తారంగా ఉంటాయి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సముద్ర తీరంలో కృష్ణా, గోదావరి నదులు బంగాళాఖాతంలో కలిసే భాగంలో చాలా నిక్షేపాలున్నాయి.

-ప్రొ|| ఎ.రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
 • ===========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Living possible on Mars?,అంగారకుడిపై ఆవాసం సాధ్యమేనా?

 •  ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...ప్రశ్న: అంగారక గ్రహంపై ఇప్పుడు పరిశోధనలు జరుగుతున్నాయి కదా! అక్కడ భవిష్యత్తులో మనుషుల ఆవాసానికి ఏర్పరచుకోవడానికి వీలుందా?

జవాబు: అంగారకుడు (మార్స్‌) భూమికి దగ్గరగా ఉన్న ఓ గ్రహం. సూర్యునివైపు శుక్రగ్రహం, సూర్యునికి వ్యతిరేక దిశలో మార్స్‌ మన భూమికి సమీప గ్రహాలు. ఘనపరిమాణంలోనూ, ద్రవ్యరాశిపరంగానూ మన భూమిలో దాదాపు ఎనిమిదవ వంతు ఉన్న గ్రహం ఇది. ఆ గ్రహపు ఉపరితల పరిశోధనలలో అక్కడ గతంలో నదులు ఉన్న ఆనవాళ్లు కనబడ్డాయి. 1970 సంవత్సరంలో వైకింగ్‌, 2001లో ఆపర్ట్యూనిటీ రోవర్‌, 2012 క్యూరియాసిటీ రోవర్‌లతో ఎన్నో పరిశోధనలు చేశారు. మన ఇస్రో వారు కూడా 2013లో మంగళ్‌యాన్‌ పేరుతో MOM (mars orbiter mission)శకటాన్ని పంపి ఉన్నారు.

మార్స్‌ పరిభ్రమణ కాలం దాదాపు రెండు సంవత్సరాలు. దాని భ్రమణ కాలం దాదాపు 25 గంటలు. దాని వాతావరణంలో 96 శాతం కార్బన్‌డై ఆక్సైడ్‌ ఉన్నా, కొద్ది మోతాదులో నైట్రోజన్‌, ఆక్సిజన్లు ఉన్నాయి.

అంగారక గ్రహానికి రెండు ఉపగ్రహాలు (చంద్రుళ్లు) ఉన్నాయి. భూ వాతావరణానికి, భూగమన రాశులకు ఉష్ణోగ్రత స్థితులు అంగారక గ్రహంకన్నా దగ్గరగా మరే గ్రహానికి లేవు. కాబట్టి సౌరకుటుంబంలో గతంలోగానీ, భవిష్యత్తులోగానీ జీవానికి అనువైన గ్రహంగా ఏమాత్రం అవకాశం ఉన్నా అది అంగారకుడిపైనేనని శాస్త్రవేత్తల అభిప్రాయం.

 • - ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్‌,--వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
 • ==========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Who comes under youth?,యువత అంటే ఎవరు?

 •  

 •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్ర : Who comes under youth?,యువత అంటే ఎవరు?

జ : యువత అంటే -- 15 నుండి 24 ఏళ్ల మధ్యవారిని యువతగా పేర్కొంది ఐక్య రాజ్య సమితి. యువత వయస్సుని ఒక్కో ప్రాంతం ఒక్కోలాగా పేర్కొంది. మన దేశంలో15 - 35 ఏళ్ల లోపు వారిని మన రాజ్యాంగం యువతగా చెపుతోంది. భారత జనాభాలో దాదాపు 60 శాతం ఆ వయస్సులో వారే. 2020 నాటికి 64% యువత కానుంది. అంటే ప్రతి ముగ్గురిలో ఒకరు యువతే. మన దేశం ప్రపంచంలోనే యువత అధికంగా ఉన్న దేశంగా మారుతుంది .

 • ======================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Wednesday, July 09, 2014

What are the six-tastes in food?,షడ్రుచులు అంటే ఏమిటి?
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

 Q : What are the six-tastes in food?,షడ్రుచులు అంటే ఏమిటి?

Ans : తినడానికి బతకకూడదు ... బతకడానికి తినాలి... అని పూర్వము ఒక నానుడి. ఆహారము తినడము జీవించడానికి ఒక ఇంధనము అంటారు. . . ఆధునికులు . జీవించడానికే కాదు వ్యాధి రాకుండా ఉండడానికి ఆహారము అవసరము కనుక దానిని బ్రహ్మపదార్ధము తో సంధానించి " అన్నం పరబ్రహ్మం" అన్నారు పెద్దలు. ఆహారమునుండే ఆరోగ్యము , అనారోగ్యము పుడుతుంటాయి అని వైద్యులు అంటారు . జీవరాసులన్నింటికీ ఏదోవిధమైన ఆహారము వాటి జీవనానికి అవసరము .. ఈ ఆహారము లో ఆరు రుచులు అని ఆయుర్వేదము చెపుతుంది. నిజానికి రుచులు అనేక రకాలు. జీవి-జీవికీ రుచి గ్రహణలో తేడాలు ఉంటాయి.

    షడ్రుచులు ,Six-tastes

 •     తీపి-------Sweet. ఉదా: పంచదార , తేనె ,
 •     పులుపు---Sour. ఉదా : నారింజ , నిమ్మకాయ ,
 •     చేదు------Bitterness. ఉదా : వేప , పసుపు , మెంతులు ,
 •     కారం-----Recompence(chili). ఉదా : మిరప , మిరియాలు ,
 •     వగరు-----Acrid. ఉదా : చిక్కుడు , కాలీఫ్లవర్ , మినప పప్పు ,
 •     ఉప్పు-----Salt. ఉదా : సముద్రపు నీరు , సైందవ లవణము ,
      
 • ==========================
 visit My website > Dr.Seshagirirao - MBBS.-

Friday, July 04, 2014

అష్ట సిద్ధులు అంటే ఏమిటో తెలపండి?

 •  
 •  

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...ప్ర : అష్ట సిద్ధులు అంటే ఏమిటో తెలపండి?
జ : యోగసాస్త్రంలో ఎనిమిది సంఖ్యను ‘ మాయ ‘ కు సంకేతంగా చెబుతారు. తొమ్మిది సంఖ్యను పరమాత్మకు ప్రతీకక్గా చెబుతారు. భగవద్గీతలో  అష్టవిధమాయల ప్రస్తావన కనిపిస్తుంది. పంచభూతాలు, మనసు, బుద్ధి, అహంకారం కలిస్తే ఎనిమిది అవుతాయి. పంచభూతాలకు పంచేంద్రియాలు ప్రతీక  గనుక మన శరీరమే ఒక  ‘ మాయామహలు ‘ గా గ్రహించాలి.

అష్టమాయల వల్లనే అష్టకష్టాలు సంప్రాప్తిస్తాయి.  అష్టమాయల్ని  జయించాలంటే – ” ఓం నమోనారాయణాయ” అనే అష్టాక్షరీ మంత్రాన్ని ఆశ్రయించాలని పెద్దల మాట.  అలా ఆశ్రయించిన ప్రహ్లాదుడు, ద్రువుడు, గజేంద్రుడు, అంబరీషుడు, ద్రౌపతి, అర్జునుడు – ఇలా ఎందరో భక్తులు సదా గట్టేక్కారు.

శ్రీదత్తాత్రేయ మహాగురువులు అష్టసిద్ధుల్ని తమ బిడ్డలుగా చెప్పారు. తమ భక్తులకు వారి అనుగ్రహం ఉంటుందన్నారు.

“విభూతిర్భూతి  హేతుత్వాద్భసితం తత్త్వ భాస్యత్”  – అష్ట ఐశ్వర్యాలుగా చెప్పే అష్టసిద్ధుల్ని విభూతులని కూడా అంటారు. ఇంతకీ ఏమిటీ అష్టసిద్ధులు?

అణిమ, మహిమ, గరిమ, లషిమ, ప్రాప్తి, ప్రాకమ్యం, ఈశిత్వం , వశిత్వం – అనే ఎనిమిదీ అష్టసిద్ధులు.

మోక్షమార్గాన ప్రయాణించే సాధకుణ్ని ప్రలోభ పెట్టి, పక్కదోవపట్టించి, ఒక్కోసారి పతనావస్థకు గురి చేసే ప్రమాదకర శక్తులే అష్టసిద్ధులని కొందరు మహాయోగులు చెబుతారు.

సిద్ధులు లభించగానే బుద్ధులు మారిపోతాయి. అహంకారం ఆవహిస్తుంది. విచక్షణ నశిస్తుంది. నిగ్రహం నీరుకారిపోతుంది. ఇలాంటి దుస్థితి కలగరాదని కోరుకునే వారు అష్టసిద్ధుల్ని తిరస్కరిస్తారు. లేదా వాటిని కేవలం సిద్ధులకోసమే యోగం అభ్యసిస్తారు. వాటిని ప్రదర్శిస్తూ ప్రజల్ని మభ్యపెడుతుంటారు. ఇవన్నీ మొక్షప్రాప్తికి ఆటంకాలే!

దేవభూమిగా వినుతించే హిమలయాల్లో అక్కడ క్కడ మంచు గుహల్లో తపస్సులో నిమగ్నులైన ఋషులు కనిపిస్తుంటారు. ఒక గుహలో జీవానందుడు, సత్యానందుడనే ఇద్దరు ఋషులు బహుకాలం తప్పస్సు చెయ్యగా, అప్రయత్నంగా ఇద్దరికీ అష్టసిద్ధులు లభించాయి. జీవానందుడు  తనకు లభించిన సిద్ధులతో తబ్బిబ్బై, వాటిని ప్రదర్శించాడానికి జనసీమల్లోకి వెళ్ళాడు. సత్యానందుడు తన సిద్ధుల్ని శివార్పణంచేసి తన తపస్సు కొనసాగించాడు.

జీవానందుడు అష్టసిద్ధుల ప్రదర్శనతో ప్రజలచేత బ్రహ్మరథం పట్టించుకున్నాడు. ఒక పెద్ద ఆశ్రమం, అనేకమంది శిష్యులతో ఆడంబర జీవితం గడపసాగాడు. అతని దగ్గరకు రాజు, రాజోద్యోగులు, రాణి, ఆమె సఖులు ఇట్లా ఉన్నత వర్గాలవారు వస్తూపోతుండటంతో జీవానందుడు తనను తానే భగవత్స్వరూపుడిగా  ప్రకటించుకుని అనేక పూజలు, సేవా సపర్యలు సాగించుకుంటూ విలాసమయ జీవితానికి అలవాటుపడ్డాడు. ఇలా ఉండగా మహారాణి వచ్చిన సమయంలో జీవానండుడి శిష్యవర్గం లోని ఒక పూర్వాశ్రమ చోరుడు, ఆమె మెడలోని విలువైన హారం దొంగిలించాడు. ఇంకేముంది? గందరగోళం, రాజభటులు తనిఖీలు చేయ్యటం, ఆభరణం ఆశ్రమంలోనే దొరకడంతో, జీవానందుడి సహితంగా అందరికీ కారాగా శిక్షపడింది. జీవానందుడి ఆశ్రమం మూతపడింది. శిక్ష పూర్తిచేసుకున్న జీవానందుడు నేరుగా హిమలయాల్లో ఉన్న తన గుహకుచేరుకున్నాడు. అక్కడ సత్యానందుడు దివ్యతేజస్సుతో వెలిగిపోతున్నాడు. అతని సమీపంలో ఒక సహజ హిమలింగం కనిపించింది. గుహనిండా పరిమళాలు గుబాళిస్తున్నాయి. జీవానందుడు తన అనుభవాలు చెప్పి, సత్యానందుడి అనుభవాలు అడిగాడు.

“నేను నాకు లభించిన అష్టసిద్ధుల్ని ఈశ్వరార్పణ చేశాను. నా తపస్సు కొనసాగించాను. ఇదుగో ఈ శివలింగం ఉన్నచోటనే పరమశివుడు ప్రత్యక్షమై సాయుజ్యభక్తిని ప్రసాదించాడు. నేనిప్పుడు కనులు తెరిచినా, మూసినా, సర్వత్రా శివరూపాన్నే చూస్తున్నాను” అన్నాడు సత్యానందుడు.

జీవానందుడు పశ్చాత్తాపపడి, సత్యానందుణ్ని తన గురువుగా స్వీకరించి, తానుకూడా ఈశ్వర సాక్షాత్కారం కోసం తీవ్రంగా తపస్సు చెయ్యసాగాడు. మరెన్నడూ అష్టసిద్ధుల ప్రలోభాలకు జీవానందుడు లోనుకాలేదు.

- by నాగవరపు రవీంద్ర@http://sampradayam.wordpress.com/
 •  ==========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Wednesday, July 02, 2014

నూనె మీద కాలు వేస్తే జారుతుందెందుకు ?.

 •  

 •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్ర : నూనె మీద కాలు వేస్తే  జారుతుందెందుకు ?.
జ : ఇంట్లో పొరపాటున నూనె ఒలికితే . . అది తుడిచి శుభ్రం చేసేవరకు పిల్లలను అటు రానివ్వరు. కారణము నూనెలో కాలు వేస్తే జారి పడతారు. దీనికి కారణము నూనెలోని మూలకాల నిర్మాణము . వీటి వలన అది పడిన నేలమీద ఒక తేలియాడే పొరలా ఏర్పడతాయి.  మనము నడెచేటప్పుడు మన పాదము నేలకు అంటిపెట్టుకుంటుంది. ఇంట్లో గచ్చు లేదా ఫ్లోర్ టైల్స్ ఏదైనా .. కంటికి కనిపించేంత నున్నగా ఉండవు. సూక్ష్మఎత్తుపల్లాలు ఉంటాయి. అవి మన పాదంలోని ముడతలలో ఇమిడి నడిచేటప్పుడు పట్టునిస్తాయి. అ లాంటి ఫ్లోరింగ్ మీద నూనెపడి ఆ గతుకులను ఆక్రమించుకోవడము వల్ల పాదము పట్టు కోల్పోయి జారేలా చేస్తాయి. జెడ్డు తనము కాలును జారేటట్లు చేస్తుంది.
 • ======================
visit My website > Dr.Seshagirirao - MBBS.-