Saturday, July 12, 2014

Living possible on Mars?,అంగారకుడిపై ఆవాసం సాధ్యమేనా?

  •  



ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...



ప్రశ్న: అంగారక గ్రహంపై ఇప్పుడు పరిశోధనలు జరుగుతున్నాయి కదా! అక్కడ భవిష్యత్తులో మనుషుల ఆవాసానికి ఏర్పరచుకోవడానికి వీలుందా?

జవాబు: అంగారకుడు (మార్స్‌) భూమికి దగ్గరగా ఉన్న ఓ గ్రహం. సూర్యునివైపు శుక్రగ్రహం, సూర్యునికి వ్యతిరేక దిశలో మార్స్‌ మన భూమికి సమీప గ్రహాలు. ఘనపరిమాణంలోనూ, ద్రవ్యరాశిపరంగానూ మన భూమిలో దాదాపు ఎనిమిదవ వంతు ఉన్న గ్రహం ఇది. ఆ గ్రహపు ఉపరితల పరిశోధనలలో అక్కడ గతంలో నదులు ఉన్న ఆనవాళ్లు కనబడ్డాయి. 1970 సంవత్సరంలో వైకింగ్‌, 2001లో ఆపర్ట్యూనిటీ రోవర్‌, 2012 క్యూరియాసిటీ రోవర్‌లతో ఎన్నో పరిశోధనలు చేశారు. మన ఇస్రో వారు కూడా 2013లో మంగళ్‌యాన్‌ పేరుతో MOM (mars orbiter mission)శకటాన్ని పంపి ఉన్నారు.

మార్స్‌ పరిభ్రమణ కాలం దాదాపు రెండు సంవత్సరాలు. దాని భ్రమణ కాలం దాదాపు 25 గంటలు. దాని వాతావరణంలో 96 శాతం కార్బన్‌డై ఆక్సైడ్‌ ఉన్నా, కొద్ది మోతాదులో నైట్రోజన్‌, ఆక్సిజన్లు ఉన్నాయి.

అంగారక గ్రహానికి రెండు ఉపగ్రహాలు (చంద్రుళ్లు) ఉన్నాయి. భూ వాతావరణానికి, భూగమన రాశులకు ఉష్ణోగ్రత స్థితులు అంగారక గ్రహంకన్నా దగ్గరగా మరే గ్రహానికి లేవు. కాబట్టి సౌరకుటుంబంలో గతంలోగానీ, భవిష్యత్తులోగానీ జీవానికి అనువైన గ్రహంగా ఏమాత్రం అవకాశం ఉన్నా అది అంగారకుడిపైనేనని శాస్త్రవేత్తల అభిప్రాయం.

  • - ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్‌,--వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
  • ==========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

No comments:

Post a Comment

your comment is important to improve this blog...