Sunday, July 13, 2014

Breathing out air is hot Why?,ఊపిరి తీసుకుని వదిలే గాలి వేడిగా ఉంటుందేం?

  •  
  •  

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...


ప్రశ్న: మనం ఊపిరి తీసుకుని బయటికి వదిలినపుడు ముక్కు నుంచి వేడిగాలి ఎందుకు వస్తుంది?

జవాబు: మనం తీసుకున్న ఆహారం జీర్ణక్రియకు లోనవగానే పిండి పదార్థాల నుంచి గ్లూకోజ్‌ అనే శక్తిమంతమైన అణువులు రక్తంలో కలుస్తాయి. ఒక్కోసారి చాలా కాలం పాటు ఆహారం తిననట్లయితే శరీరంలో ఉన్న కొవ్వు నిల్వల నుంచి కూడా గ్లూకోజ్‌ ఏర్పడుతుంది. శరీరంలో ఉన్న గ్లూకోజ్‌ ప్రతి జీవన కార్యకలాపాలకు కావలసిన శక్తికి ఆధారమని మనం గుర్తించాలి. అయితే ఆ గ్లూకోజ్‌ నుంచి శక్తిని రాబట్టాలంటే దాన్ని రసాయనికంగా ఆక్సీకరణం చెందించాలి. అందుకు మనం గాలిలో ఉన్న ఆక్సిజన్‌ను శ్వాస క్రియలో ఉచ్ఛ్వాసం ద్వారా రక్తంలోకి పంపుతాం. ఆక్సిజన్‌ సమక్షంలో ఆక్సీకరణం చెందిన గ్లూకోజ్‌ కార్బన్‌డైఆక్సైడ్‌, నీటి ఆవిరిగా విఘటనం చెందే క్రమంలో ఉష్ణశక్తి కూడా పుడుతుంది. ఇందులో చాలా భాగం ADPఅనే అణువు, ATPఅనే శక్తియుత అణువుగా మారడానికి ఉపయోగపడగా కొంత భాగం రక్తంలోనే కలిసిపోతుంది.

రక్తపు ఉష్ణోగ్రత, దేహ ఉష్ణోగ్రత క్రమబద్ధీకరించబడతాయి. రక్తంలో కలిసిన కార్బన్‌డైఆక్సైడ్‌, నీటి ఆవిరి దేహ ఉష్ణోగ్రత (సుమారు 37 డిగ్రీల సెల్సియస్‌) వద్దే ఉంటాయి. అవి నిశ్వాసంలో బయట పడేప్పుడు దేహ ఉష్ణోగ్రత వద్దే బయటికి వస్తాయి. సాధారణంగా సంవత్సర కాలంలో బయట ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెల్సియస్‌ కన్నా తక్కువే ఉంటుంది. బయట 37 డిగ్రీల సెల్సియస్‌ కన్నా తక్కువ ఉష్ణోగ్రత నుంచి గాలి లోనికి వెళ్తున్నా నిశ్వాసంలో విడుదలయ్యే కార్బన్‌డైఆక్సైడ్‌, నీటి ఆవిరి కనీసం 37 డిగ్రీల సెల్సియస్‌ దగ్గర ఉండటం వల్ల నిశ్వాసంలో వేడి గాలి బయటికి వస్తున్నట్టు ఉంటుంది.

  • - ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక­ 
  • =======================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

No comments:

Post a Comment

your comment is important to improve this blog...