ఎక్కడో పాశ్చాత్య దేశాల్లోని సంస్క్ర్రతి మన సినిమా వాళ్ళతో క్రీడాకారులతో మొదలై మద్య తరగతివారి దాకా వ్యాపించింది. బాద్యతలు లేని ప్రేమ అని నిర్వచనం చెబుతున్నారు. ఈ మద్య సహజీవనానికి సుప్రీం కోర్ట్ కూడా ఆమోదం తెలిపిందట. డేటింగ్ అంటే ఏకాంతం! భార్యా-భర్తా ఏకాంతంలో ఎలా గడుపుతారో అలా గడపొచ్చు అని , మానసికము గాను , శారీరకం గాను కలిసి బ్రతకడము . మనిషి తన కోర్కెలు తీర్చుకోవడం కోసము తాత్కాలికము గా చేసుకునే సహజీవన ఒప్పందము . ఇక్కడ డేటింగ్ లో కామరూపేనా చేసుకునే ఒడంబడిక . కొందరు డబ్బులుకోసము డేటింగ్ చేస్తే కొందరు ఇస్టముకొద్దీ డేటింగ్ చేస్తారు.
నేటి సమాజంలో ఆధునిక విజ్ఞానంతో పాటు పాశ్చాత్య సంస్కృతి కూడా చోటుచేసుకుంది. ఆ క్రమంలో నేడు డేటింగ్ అనే ఒక ఒప్పంద అనుబంధం చాలా మంది యువతీ యువకుల మధ్య కన్పిస్తోంది. కానీ, డేటింగ్ పేరుతో కలిసి మెలిసి తిరిగే కుర్రకారులో ముఖ్యంగా ఆడపిల్లలు గర్భం రాకుండా ఉండేందుకు తక్షణ చర్యగా అందుబాటులో ఉండే గర్భ నిరోధక మాత్రలను వాడుతుంటారు. ఆ మాత్రలు అప్పటికి ప్రయోజనకరంగా ఉంటాయి. కానీ, భవిష్యత్తులో కేన్సర్ కారకాలుగా మారి జీవితాన్ని అంధకారంగా మారుస్తాయని పరిశోధనలు వివరిస్తున్నాయి. డేటింగ్ ఒక వ్యసనము లాంటిది. సంసారిక (సెక్షువల్ ) సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశమూ ఉంటుంది. డేటింగ్ లో చిక్కుకొని ఇబ్బందు పడేవారు ఉన్నారు. పెళ్ళై సంసారాలు కూలి పోయే సందర్భాలూ మనకు కనిపిస్తాయి.
- అభిప్రాయాలను పంచుకోవటానికి, అభిమానాన్ని పెంపొందించుకోవటానికి తోడ్పడాల్సిన డేటింగ్ కొందరిలో హింసకూ దారితీస్తోందని అమెరికా పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. అత్యవసర చికిత్స విభాగానికి వస్తున్న ప్రతి ఆరు మంది యుక్తవయసు పిల్లల్లో సగటున ఒకరు డేటింగ్ హింస బారినపడుతున్నవారేనని తేలటమే దీనికి కారణం. అమెరికాలోని ఒక ఆసుపత్రిలో అత్యవసర చికిత్స కోసం వచ్చిన 14-20 ఏళ్ల వారిపై పరిశోధకులు ఇటీవల ఒక అధ్యయనం చేశారు. వీరిలో ప్రతి ఐదుగురు అమ్మాయిల్లో ఒకరు, ప్రతి ఎనిమిది మంది అబ్బాయిల్లో ఒకరు గత ఏడాదిలో డేటింగ్ హింసను ఎదుర్కొన్నవారేనని వెల్లడైంది. డేటింగ్ సమయంలో హింసకు పాల్పడే ధోరణి ప్రభావం పెద్దయ్యాకా కొనసాగుతుందని, అందువల్ల ఇలాంటి వారిని గుర్తించి అడ్డుకట్ట వేయాల్సిన అవసరముందని అధ్యయన నేత, మిచిగన్ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ విజయ్‌సింగ్ సూచిస్తున్నారు. మద్యం, మాదకద్రవ్యాలు, కుంగుబాటు వంటివి డేటింగ్ సమయంలో హింసకు పాల్పడటానికి దోహదం చేస్తున్నాయని పేర్కొంటున్నారు. పాశ్చాత్య దేశాల అలవాట్లు, ధోరణులు మనదేశంలోనూ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో దీనిపై ఓ కన్నేసి ఉంచటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
- =======================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...