ప్ర : నూనె మీద కాలు వేస్తే జారుతుందెందుకు ?.
జ : ఇంట్లో పొరపాటున నూనె ఒలికితే . . అది తుడిచి శుభ్రం చేసేవరకు పిల్లలను అటు రానివ్వరు. కారణము నూనెలో కాలు వేస్తే జారి పడతారు. దీనికి కారణము నూనెలోని మూలకాల నిర్మాణము . వీటి వలన అది పడిన నేలమీద ఒక తేలియాడే పొరలా ఏర్పడతాయి. మనము నడెచేటప్పుడు మన పాదము నేలకు అంటిపెట్టుకుంటుంది. ఇంట్లో గచ్చు లేదా ఫ్లోర్ టైల్స్ ఏదైనా .. కంటికి కనిపించేంత నున్నగా ఉండవు. సూక్ష్మఎత్తుపల్లాలు ఉంటాయి. అవి మన పాదంలోని ముడతలలో ఇమిడి నడిచేటప్పుడు పట్టునిస్తాయి. అ లాంటి ఫ్లోరింగ్ మీద నూనెపడి ఆ గతుకులను ఆక్రమించుకోవడము వల్ల పాదము పట్టు కోల్పోయి జారేలా చేస్తాయి. జెడ్డు తనము కాలును జారేటట్లు చేస్తుంది.
- ======================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...