Wednesday, July 30, 2014

దోమల బ్యాట్లు కీటకాలను , దోమలను ఎలా చంపగలవు ?




ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
 Q : దోమల బ్యాట్లు కీటకాలను , దోమలను ఎలా చంపగలవు ?

Ans : ఇటీవల్ ప్రతి ఇంట్లో దోమ దెబ్బకు భయపడి ప్రత్యేకంగా బ్యాడ్మింటన్‌ బ్యాట్ ల వంటివి విసురుతూ వాడుతున్నారు. వాటిలో సన్నని తీగలు అతిదగ్గరగా అమర్చబడి ఉంటాయి. బ్యాటరీ ద్వారా విద్యుత్ ఆ వైర్లకు సరఫరా అవుతుంది. దోమగాని , ఇతర కీటకాలు గాని ఆ తీగలకు తగలగానే విద్యుత్ షాక్ కొట్టి మరణిస్తాయి. పక్కపక్క నే ఉన్న రెండు తీగలను  కలిపి కీటకము శరీరం తాకితేనే ఆ షాక్ సాధ్యమవుతుంది . తీగెలకు తగలకుంటా మధ్యనుండి కీటకం వెళ్ళినా ఏ ఒక్క తీగకు తగిలి వెళ్ళినా... ఏమీ అవదు .  
  • ============================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

No comments:

Post a Comment

your comment is important to improve this blog...