ప్ర : ఆల్ట్రావయొలెట్ కిరణాలు ప్రమాదమా?
జ : వేసవిలో మీ చర్మానికి రక్షణ కల్పించడం చాలా అవసరం. ఎందుకంటే సూర్యరశ్మి నుండి వెలువడే ఆల్ట్రావయొలెట్ కిరణాలు చర్మానికి హాని కలిగిస్తాయి. సమ్మర్ సీజన్ లో సూర్యుని నుండి వెలువడే యూవీ కిరణాల వల్ల చర్మాన్ని రక్షించుకోవడానికి వివిధ సన్ స్ర్కీన్ లోషన్లవాడాలి . మధ్యాహ్నపు ఎండలో ''ఆల్ట్రావయొలెట్ కిరణాలు ఎక్కువ ఉంటాయి. సాధారణంగా సూర్యుని నుంచి హీలియం, ఆల్ట్రావయొలెట్ కిరణాలు భూమిపైకి ప్రసారమవుతాయి. ఇవి శరీరంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. అదే సూర్యోదయం వేళలో కిరణాలనుంచి ‘డి’ విటమిన్ సమృద్ధిగా లభిస్తుంది. ఇది ఆరోగ్యానికి ఎంతో ఉపకరిస్తుంది.
సూర్యకాంతి నుండి తప్పిందుకునేందుకు వేసవిలో రక్షణగా టోపి , కళ్ళ అద్దాలు తాడుతుంటారు. . . కాని యు.వి. కిరణాలు మిగిలిన రంగు కిరణల కన్నా తక్కువ వేవ్ లెంగ్త్ కలిగి ఉంటాయి. ఇవి సులభము గా చర్మములోనికి చొచ్చుకొని పోగలవు . నాడులను చేరుతాయి. . కాబట్టి వీటివలన ప్రమాదము ఎక్కువ . ఇవి అతిగా కంటిలో పడితే కంటిచూపే మందగిస్తుంది. ఈ కిరణాలు భూమికి చేరకుండా రక్షించే ప్రకృతి విధానము ఉంది అదే . . . భూమిని ఆవరించి ఉన్న " ఓజోన్ పొర " .
- =========================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...