ప్రశ్న: సిగ్గుపడుతున్నపుడు ముఖంలో మార్పులు వస్తాయి. ఎందుకు?
జవాబు: దేహ ఉష్ణోగ్రతను నియంత్రించే 'హైపోథాలమస్' అనే కేంద్రం మన మెదడులో ఒక స్థిర ఉష్ణోగ్రత వద్ద ఉంటుంది. ఈ ఉష్ణోగ్రతను 'సెట్ పాయింట్' అంటారు. మనం ఏదైనా మనసుకు ఉల్లాసాన్ని కలిగించే సంఘటనను చూసినపుడు, పొగడ్తలను విన్నప్పుడు, మనకు ఇష్టమైన వ్యక్తిని కలిసినపుడు మన మనసులో ఉత్తేజం కలిగి, దేహం కొంతమేర వేడెక్కుతుంది. దాంతో సెట్ పాయింట్ విలువ కూడా పెరుగుతుంది. వెంటనే మెదడు ఈ ఉష్ణోగ్రత ఇంకా పెరిగిపోతుందనే ఉద్దేశంతో దేహంలో చర్మానికి అతి దగ్గరగా ఉండే రక్తనాళాలను విస్తరింపజేస్తుంది. రక్తనాళాలు విస్తరించినపుడు రక్తం చర్మంలో ఒక ప్రవాహ రూపంలో వ్యాపిస్తుంది. ఈ ప్రభావం మెదడుకు దగ్గరగా ఉండే ముఖం, చెవులు, మెడభాగాలలో ఎక్కువగా కనిపించడం వల్ల ఆయా భాగాలు ఎర్రబడి, ముఖకవళికలు మారి ఎదుటి వారికి సిగ్గు పడుతున్నట్టుగా కనిపిస్తాయి.
-
ప్రొ|| ఈ.వి. సుబ్బారావు,--హైదరాబాద్
- =========================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...